వసుంధరకీ ప్రతయ్నమంతయు తెలియుచునే యున్నది. ధిక్కరించుట కామెకు ధైర్యము లేదని చెప్పుట కంటె, ఆమెకూడ వ్యామోహములో పడినదునుట కంటె నామె నీపిశాచమొక భ్రమలో నుండి నిశ్శక్తురాలిని చేసి తన యభిప్రాయమున కనుగుణముగ నడిపించెననుట యుక్తము. వసుంధరను సంసారము చేయకుండ చేయుటవలన తానామెను రక్షించితి ననెను. ఆమెకు సంతానము కల్గినచో నా సంతానము కర్మచేయుట కయోగ్యమైన దుగనని పిశాచము చెప్పినది. కాని వసుంధర పిశాచము మాటవినక వామదేవునాహ్వానించినది. వసుంధర జీవితము వామదేవునిరాకతో మరియొక రేవున కీడ్వబడినది.
ఆ ప్రభావమిట్లున్నది. వసుంధర హృదయము మిదికి మనస్సు మీదికి నాత్మమీదికి జీవితము మీదికి నొక పట్టరాని యొకానొకశక్తి ప్రవాహ తరంగము విరుచుకొని పడెను. ఈ వచ్చినది పిశాచముకన్న శక్తిమంతుడనియు తన స్వాతంత్ర్యమును పూర్తిగ హరించివేయుననియు వసుంధరకు తెలిసినది. భర్త పిశాచమునకు తనయందు ప్రేమ యున్నదని కూడనప్పుడే తెలిసినది. వామదేవుడు పూర్తిగ స్వలాభ పరుడు. తన మనస్సును ఆత్మను తనకు కాకుండ చేయగలవాడు. ఇన్ని విషయములామె యోచింప గలిగినది. కాని వామదేవునికై తలుపు తీయకుండనుండ లేకపోయినది. వామదేవుని యాకర్షణాశక్తి యంతకంతకు బలీయమై ఆమె కొడలు స్వాధీనములో లేకుండా పోయినది. తానేమి మాటలాడుచున్నదో కూడ వసుంధరకు తెలియదు. వామదేవుడు నవ్వుచు వసుంధరతో నిట్లనెను. అతడు వేరు. నేను వేరు. వాడు పిశాచము. నేను బ్రహ్మర్షిని. కావున వంచనా శిల్పములో నఖండులైన పిశాచము, వామదేవుడు ఒకరినొకరెరుగుదురు. వసుంధర అంతరంగము పై నధికారము నిరువురును సంపాదించుకొలగలిగిరి. ఇట్లు జరుగుటకు కారణము వసుంధరలోనున్న లోపమా ఆత్మస్థైర్యము లేక పోవుట చేతనా ? లేక మానసిక బలహీనతయా ? అని ప్రశ్నించుచో సమాధానములేదు. వసుంధర యామాయకరయే గాని దుర్గుణారాలు కాదు. ఆమె చేసిన దెల్ల రెండవ వివాహము చేసికొనుటయే ! అదియే ధర్మచ్యుతియని ధ్వని. ధర్మచ్యుతియే వసుంధరకు సుఖములనకు శాంతికిని దూరము చేసినది. లేకున్నచో వసుంధర రెండవ పెండ్లి చేసికొననంత వరకా ఛాయలకు రాని పిశాచము పెండ్లి కాగానే యడుగు పెట్టగలిగెను. పిశాచగ్రస్తయైన వసుంధరనంత కన్న బ్రహ్మ రాక్షసుని వంటి వామ దేవుడు మరింత వశము చేసికొనగలిగినాడు. జడివానలో మిక్కిలి దువ్వున నున్న కొండపై కెక్కి నడుచున్న వామదేవుడు వసుంధరకు రామాయణ పురుషుడైన వాలివలెనో వేదములను దొంగిలించు కొనిపోవు సోమకాసురుని వలెనో దోచెను. ఆమెకతని గమన వ్యవహారము కంటికి ప్రత్యక్ష చర్యవలె భాసించెను. మందాకినీ చూడునివె నతని జటాజూటము దట్టముగనైనది. సప్త మహర్షులతో పరివేష్టితుడైనట్లు తోచెను. వసుంధర వివశయై పడిపోయినది. ఇట్లు వాసుదేవుడామె జీవితమున నొక ముద్రవేయగలిగినాడు.
వామదేవుని క్షుద్ర విద్యలిన్నని చెప్పశక్యముకాదు. ఇంద్రజాలములు మనస్సును వశముచేసికొనుటలు ఎదుటివారి మనస్సుల నెరుంగుటయు తనకు వలసినట్లుగ వారి భావములనుకూలమగు నట్లుగను చేయగల సమర్థుడు. ఇందుచేత భర్తృపిశాచము అను వ్యక్తిని కూడ వామదేవుని మాయాసృష్టియనుటకు వీలున్నది. ఏలయనగా వామదేవుడు వచ్చుచున్నాడు వానిని రానీయకుము అని భర్తృపిశాచము చెప్పగా, వాడొక పిశాచము వానిని నమ్మకుము, నేను బ్రహ్మర్షినని వామదేవుడు వసుంధరకు చెప్పును. ఇరువురికినొకరి భావము లొకరికెట్లు తెలియును ? పిశాచము కంటికి కనుపించనిది. వామదేవుడేదో మాయాజాలమున వసుంధర హృదయములో నొకవిధమైన సంచలనము రేకెత్తించి రెండవ వివాహము తప్పన్న భావమును కలిగించి పిశాచమును ప్రవేశపెట్టి తదుపరి తాను వచ్చియుండవచ్చును. భర్తృపిశాచము వచ్చుచున్నట్లుగ ఒకేరకమైన పద్ధతి యుండుట గమనార్హము. కేవలము కిటికీలు దడ దడ కొట్టుకొనుట గాలికి వస్తువులు చెల్లాచెదరగుట సన్నని ఈలల వంటి మాటలు మాటాడుట, పిశాచ కృత్యములు. అదియును గాక పిశాచము మాటలాడుచున్నప్పటి యీలలవంటి ధ్వని ఉమాకాంతము, మరికొందరును విలనగలిగిరి. మరియు కళాధరరావు పిశాచము మాటలను అనుకరించి వసుంధరను పిశాచము వచ్చెనన్న భ్రమ కల్గింపగల్గినాడు. కావున నీ మోనము మనుష్యకృతమువలె నున్నది. విశ్వనాథవారు హేమ్లెట్ నాటకమున పిశాచముతో మాటలాడు మాటలు ప్రక్క వారికి కూడ వినిపించుట నుదహరించియున్నారు. ధనవ్యామోహ మీ నాటకమునకు మూలకారణము గావున ధనలాభము గాని స్త్రీలాభముగాని వామదేవునకే కల్గునుగాని పిశాచమున కిందు మూలముగ నొరిగిపడెడిదేమియును లేదు. సింగరవేలును శశియును కూడ నిట్లే మెసగింపబడి యుండవచ్చును. ఇందుచేత పిశాచ విషయము మనుష్యకృతముగనే కన్పించుచున్న దనుట సహేతుకము.
కొంతకాలమునకు వసుంధర దగ్గర ధనము కూడినది. భూషణము యొక్క యాస్తిగాక లక్షరూప్యములపైన పోగుపడినది. కొండపై నొక దేవాలయము కట్టించి కొండదిగువన నున్న రాతిమయమైన పొలమును తక్కువధరకు కొని ఇళ్ళస్థలముల క్రింద విభజించి యెక్కువ ధరకు అమ్మింప భర్తృపిశాచము తలపెట్టెను. అసలు శరీరమే లేనివానికి ధరమెందులకు లాభమెందులకు ? వంచనలెందుకు ? వాని గతజన్మంలో పట్టి పీడించిన ధనాశ పిశాచమై వానిని పీడించుచుండగా నాతడు వసుంధరను పీడించుచుండెను. వట్టిగాలికే ధనాశయున్నచో శరీరయైన వామదేవునకు కూడ నాశయుండుటలో నాశ్చర్యములేదు. ఎకరము పదివేల చొప్పున ఏబది యెకరములు ఐదులక్షల రూపాయలు. ఈ ధనముతో నిచ్చట నాకు దమ్మిడీ యక్కరలేదు అని వామదేవుడనెను. పిశాచము కూడ వసుంధరచేత స్వర్గమునకు నిచ్చెనలను గట్టింతునన్నాడు.
వసుంధరలో లోపము లేదనరాదు. ఆమె పిశాచము నెదిరింపలేక పోవచ్చును గాని తన యనుభములను గూర్చి భర్తకు గాని సోదరునకుగాని చెప్పలేదు. పిశాచము చెప్పనీయ లేదనుటకు వీలున్నది కాని పూర్తిగ నామెకు వారి వంచనలో పాలులేదనరాదు. అన్ని విషయములు చెప్పి నాటకములు ముగించి యుమాకాంతునితో నుండమని పిశాచము చెప్పినప్పుడు వసుంధర నాటకము నేమైనను సరే చివరిదాకా నడిపింప వలెనని నిశ్చయించుకొనినది. ఇందులకు కారణము సర్వజీవులను పట్టిపీడించుయాశయే.. ఆశ సర్వజీవకోటి హృదయముల నావరించి యున్నది. ఇది జగత్తు. ప్రవర్తించుట యందలి రహస్యము. ఈ రహస్యమే వివృద్ధమై గిడసబారి పరిణామము నతిక్రమించి యనంత పరిణాహసముపేతమై కొందరు కొందరు జీవులను భూతమువోలె నావేశించును. ఆశయే వసుంధర యెడ పిశాచమైనది. మధ్య ముగియవలసిననాటకమును వసుంధర పట్టుదలతో కొనవరకు సాగదీసినది. ఇందువలన వామదేవుని రాకనుండి మోసములకు వసుంధరకు ప్రత్యక్షముగ బాధ్యత లేకున్నను పరోక్షముగనైన లేదనరాదు.
కొందరికి వ్యాధులు తగ్గుట కూడ వారివారి మానసిక విశ్వాసముపైననే యాధారపడియుండెను. వసుంధర దేవత యని ప్రజలు విశ్వసించినన్నినాళ్ళు వారి వ్యాధులు నెమ్మదించినవి. ఆమె దేవతకాదు దయ్యమా వేసించినదని తలచిని తరువాత వ్యాధులు తగ్గుటమానినవి కావున విశ్వాసము వలన కొన్ని వ్యాధులు నమ్మెదించుటయును, కొన్ని కాలక్రమమున నవియే తగ్గుటయును జరిగినది.
కొన్ని దినములు వసుంధర కడకు భర్త గాని వామదేవుడుగాని రాకపోవుటచే నామె వ్యాకుల చిత్తయైనది. భర్త కొరకు ప్రతీక్ష చేయును. వామదేవుని కొరకు కూడా నిరీక్షించుచుండును. ఆమె వారిరువురిలో నెవరిని ఆశ్రయించపవలెనో నిశ్చితము చేసికొనలేకపోయినది. విధివశమున నెవరు ముందువచ్చిన వారి నాశ్రయించు విధమున నామె మనస్సు సిద్ధమైనది. వారిరువురు కూడ ఒకరి ఎత్తులొకరికి తెలిసినవారు. ఒకరిని మించినవారొకరు. ఇంతలో వసుంధరకు ఉమాకాంతుడు వచ్చుట తెలిసినది. ఆమె మనసు చలించినది. అతడు సామాన్య మానవుడు తాను సాధారణ మానవి. అలౌకిక శక్తులతోడి సాంగత్యమును మాని శారీరక సుఖమునేల పొందరాదన్న తలంపామెకు కలిగినది. మరలనతడు తన ధనము కొరకు వచ్చెను. గాని తనకొరకు రాలేదనుకొన్నది. ఒకనాడు భార్యను హటాత్తుగా వదలి వెళ్ళిపోయిన వానిని గూర్చి యాశలేల యను కొన్నది. ఈ యుమా కాంతుడు తన్నొకనాటి యుదయమున హటాత్తుగా వదలి పోయెను. అయ్యో భార్య యేమైనదని తాననుకొలేదు. ఇపుడు తాను ధనవంతు రాలగుటచేత దన్ను ధనము యాచించుటకు వచ్చెను. వసుంధరకు వ్యక్తుల యొక్క ప్రవర్తనను గణింపగల నేర్పు వచ్చినది. ఉమాకాంతునితో సంసార జీవితమును గడపవలెనన్న యూహ మరల అతని స్వార్థమును గూర్చి విచారించుటలో వెనుదిరిగిపోయినది. వసుంధరకు తనను మోసగించినవారిపై నేవగింపేగాక ప్రపంచము పైని కూడ నొక విధమగు కసి బయలు దేరినది. తననుమోసగించి, స్వార్థమునకుపయోగించుకొనిన వారు మువ్వురు. అందులో నొకడు వాయుసంచారి. సంకల్ప మాత్రుడు. రెండవవాడు తనను ప్రజలను కూడ మోసగింపగల యధిక శక్తి మంతుడు. ఈ ఇరువురుని సాధించుట వసుంధర శక్యము కాదు. కావున తాను ప్రజలను ప్రతారింప దలచినది. మూర్ఖలైన, బలహీనులైన ప్రజలకు యథార్ధము చెప్పుటకు తగినంత అవకాశము భర్త పిశాచము యొక్క నిష్క్రమణము వామదేవుని యొక్క ప్రవేశములో గల సంధి కాలమున వసుంధరకు లభించినది. ఆమె నిజముగా తాను యోగినని గాని దేవతను గాని కాననియు పిశాచమే తన ప్రభావముతో నాడించెననియు చెప్పవలెనన్నచో నామెకింత కన్న సదవకాశములేదు. వసుంధర అప్పటికి ధనము కీర్తి మొదలైన వానికి మోహపడినది. వాని ననుభవించిన తరువాత త్యజింప వలెనన్నచో నిజమైన యోగులకే సంభవము కాని వసుంధర వంటి సామాన్యులకు సాధ్యము కాదు.
వసుంధర తన సోదరుడైన నరహారి దగ్గరనుండి వచ్చు ఆంగ్లలేఖలను చదువుటకు కళాధరుడన్న వానిని జీతమిచ్చి పెట్టుకొన్నది. అతనికి వసుంధర యోగినీత్వముపై నమ్మకము లేకపోవుటయేగాక, నామె ధన సౌందర్యములపై మోహముకూడ కలిగినది. ఆమెను వశముచేసికొని ఆమె కట్టిన నిచ్చెనల నెక్కి తత్స్వర్గాధిపత్వము చేయవాంఛించినాడు. ఇతని రాకతో వసుంధరను వంచింపదలచిన వారి సంఖ్య నాలుగైనది. ఇతడు భర్తృపిశాచముచేయు ధ్వనులను శబ్ధములను అభ్యాసముచేసి తలుపు వెనుక దాగొని పిశాచమువలె మాటాడి యామెను మోసముచేసెను. ఆమె కనులలో దోచు యుమాకాంతునిపై ప్రేమను లాలసను గ్రహించి యామె కామక్రోధాదుల కతీతురాలు కాదనియు పిశాచావిష్టయనియు తెలిసికొని యామెను ప్రతారింపదలపెట్టెను.
|