93
 

ల‌లిత‌

దంత‌పు దువ్వెన య‌న్న న‌వ‌ల యందు ల‌లిత‌కూడ విమ‌ల శ్యామ‌ల మించిన సోద‌ర ప్రేమ‌ను జూసిన‌ది. ల‌లిత‌సోద‌రుని పేరుగ‌స్తి. రామ‌మ‌నోహ‌రుడ‌ను యువ‌కుడు ల‌లిత‌ను ప్రేమించెను. కాని ల‌లిత రామ‌మ‌నోహ‌రుని వ‌రించునా వ‌రింప‌రాయ‌నిన విష‌య‌మ‌త‌ని సోద‌రుని యంగీకార‌ముపై నాధార‌ప‌డి యుండెను. ల‌లిత త‌న‌వ్య‌క్తిగ‌త‌మైన యిష్టాయిష్ట‌మ‌ల‌ను, ప్రేమ‌వ్య‌వ‌హార‌ముల‌ను స‌హిత‌ము అన్న‌గారి యిచ్ఛ‌కే వ‌ద‌లి మరింత‌పై మెట్టుపై నిల‌బ‌డిన‌ది. రామ‌మ‌నోహ‌రునితో ల‌లిత యొక్క సోద‌ర ప్రేమ‌ను తెలియ‌జేయుచు గోపాల‌మ‌న్న‌వాడు యిట్ల‌నెను. అత‌నూ అత‌ని చెల్లెలు ల‌లితా ఒక‌త్రాటిమీద న‌డుస్తారు. ఒక‌వేళ ల‌లిత‌తాను గాఢ‌ముగా ఎవ‌రినైనా ప్రేమించినా గ‌స్తి వ‌ద్దంటే జీవితాంత‌ము బ్ర‌మ్మ‌చారిణిగా ఉండిపోతుంది. ల‌లిత‌కు అన్న‌పైనున్న ప్రేమ‌య‌ట్టిది. త‌న భావ‌ములు, సుఖ‌ములు అన్న మాట‌పై త్రోసిరాజున‌గ‌లంత సోద‌ర ప్రేమ‌గ‌ల్గిన స్త్రీ. ఆమె మ‌న‌స్సు న‌వ‌నీత‌ము వంటిది. కాని అన్న హృద‌య‌ముతో క‌లివెడివ‌ర‌క‌ది రాయివ‌లెనైన‌ది. అంటుక‌పోయిన‌ది. ఎల్లా అంటుకు ఉన్న‌దంటే అదిఒక రాయీ ఇదిఒక రాయీ గొడ్డ‌ళ్ళు వెళ్ళి ప‌గుల గొట్ట‌వ‌ల‌సిన‌దే గాని విడివ‌డ‌వు . రెండు రాళ్ళు అంటుకొనిన‌ప్పుడు గొడ్డ‌లిచేత కొట్ట‌బ‌డి విడ‌వ‌డుట స‌హ‌జ‌ముకాని ల‌లిత యొక్క గస్తి యొక్ గాఢ‌మైన ఐక్య‌భావ‌ముల‌చేత నా హృద‌య‌ములు రెండు న‌భేద్య‌ములైయున్న‌వి. గొడ్డ‌ళ్ళ చేత కొట్ట‌బ‌డిన‌చో ముక్క‌లుగునేగాని విడ‌పోవ‌ని భావ‌ము. ల‌లిత సోద‌ర ప్రేమ యెంత‌గాఢ‌మైన‌ట్టిదో నీభావ‌గాఢ‌త్వ‌మువ‌ల‌న వెల్ల‌డియ‌గుచున్న‌ది.

రూప‌ల‌త‌

కవ‌ల‌లు అనునీన‌వ‌ల కితివృత్త‌ము రాజ‌తరంగిణి లో నాల్గ‌వ త‌రంగ‌మున‌కు సంబంధించిన గాథ‌నుండి స్వీక‌రింపబ‌డిన‌ది. రూప‌ల‌త‌, ఆమె క‌వ‌ల సోద‌రి రూప‌ములోనొకే విధ‌ముగ నుండియు స్వ‌భావ‌ములో సంబంధ‌ములేదు. రూప‌ల‌త త‌న‌చెల్లిలిని గురించి య‌నేక‌స‌మ‌స్య‌ల‌కు లోన‌గుట‌యు ఆమెపై ప్రేమ‌తో న‌నేక క‌ష్ట‌ముల పాల‌గుట‌యు తుద‌కంద‌రును సంతోష‌ముతో జీవిత‌మును గడుపుట‌యు నింద‌లి ముఖ్యాంశ‌ము.

ఇందుమూల క‌ధ‌కులేని కొన్ని యంద‌ముల‌ను విశ్వ‌నాథ‌వారు సంత‌రింప‌ద‌ల‌చి కొన్ని మార్పుల‌ను త‌మ‌న‌వ‌ల‌లో ప్రవేశ‌పెట్టినారు. ప్ర‌తాపాదిత్య‌డ‌ను క‌ర్కోట‌క వంశ‌పురాజు