92
 

శ్యామ‌ల‌

సోద‌రీ ప్రేమ‌కు ప్ర‌తీక‌గా ప‌రీక్ష న‌వ‌ల‌లోని శ్యామ‌ల‌కూడ నొక మ‌చ్చుతునక‌. శ్యామ‌ల గోవిందు సూర్య‌ము అనునిరువురు సోదరుల‌కు చెల్లెలు. గోవిందు సద్గుణ‌ము వివేక‌ము క‌లిగియు పాఠ‌శాల ప‌రీక్ష‌ల‌లో న‌నేక‌ప‌ర్యాయ‌ములు ప‌రీక్ష‌త‌ప్పుట‌, అత‌డు బోధించిన పాఠముల‌ను విని శ్యామ‌ల ప్ర‌థ‌మ ప‌ర్యాయ‌మే యుత్తీర్ణ‌య‌గుట‌, చ‌దువులో విఫ‌లుడైన గోవిందుజీవిత‌మున కూడ నోటువ‌డు స‌మ‌య‌మున శ్యామ‌ల‌సోద‌ర ప్రేమ‌తో వానిక‌నేక విధ‌ములుగ స‌హాయ‌ప‌డుట ప‌రీక్ష న‌వ‌ల‌లోని ముఖ్యాంశ‌ము.

శ్యామ‌ల‌లోనున్న వివేక‌ముగాని స‌ద్గుణ‌ములుగాని యామెకు ప‌దహారెండ్ల వ‌చ్చువ‌ర‌కు బహిర్గ‌త‌మ‌గుట‌కు గాని త‌గిన స‌మ‌య‌మురాక య‌ణ‌గియున్న‌వి. శ్యామ‌ల జీవిత‌ములో గాయ‌ప‌డిన త‌రువాత‌నే ఆమెవివేక‌కుసుమ‌ము గుబాళించిన‌ది. గృహ‌మున త‌న‌కుండిన స్థాన‌బాధ్య‌త లెట్టివో గ‌త్యంత‌ర‌మెద్దియోకూడ క్ష‌ణ‌ముల‌లో నామె గ్ర‌హించుకొనిన‌ది. ఒక‌వ్య‌క్తిలోవివేక‌ము మేల్కొనుట‌కుగాని యంత‌ర్గ‌త గుణ‌ములు బ‌హిర్గ‌త‌మ‌గుట‌కు గాని హృద‌య‌మున కేదియోనొక తాకిడియుండ‌వ‌లెన‌న్న విష‌య‌ము. శ్యామ‌ల‌ప‌ట్ల య‌థార్థ‌మైన‌ది.

శ్యామ‌ల‌కున్న దిరువురు సోద‌రుల‌యిన‌ప్ప‌టికిని ఆమె ప్రేమ‌కాస్ప‌ద‌మైన‌వాడు గోవిందు మాత్ర‌మే. గోవిందు సుకుమార హృద‌యుడు. జీవిత‌ములోని క‌ష్టముల‌కు స్రుక్కిపోవు దుర్భ‌లుడు. అస‌త్య‌మాడ‌లేనివాడు. లౌక్య‌మెరుగ‌నివాడు. త‌ల్లిదండ్రుల బాధ్య‌త‌ను వారిచే చేయ‌బ‌డిన బుణ‌విముక్తి కొర‌కు కుటుంబ‌ము యొక్క ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కొర‌కు క‌ష్ట‌ముల‌ను భ‌రించుట‌కు త‌ల‌వంచి, భ‌రించుట‌కు శ‌క్తి లేనివాడై కృంగికృశించిపోవున‌ట్టి బేల‌మ‌న‌స్సువాడు. అత‌ని తమ్ముడేయైన సూర్య‌ము ఇందుల‌కు పూర్తిగ వ్య‌తిరేక‌మ‌యిన‌వాడు. స్వార్థ‌ప‌రుడు త‌న‌సుఖ‌ము త‌న‌బాగోగులు చూచుకొని తండ్రి వ్యాధిగ్ర‌స్తుడైన‌పుడు వైద్య‌మున‌కైన ధ‌న‌స‌హాయ‌ముచేయ‌క చెల్లెకి పెండ్లిగూర్చియోచింప‌క మిగిలిన రెండెక‌ర‌ముల‌ను పంప‌క‌ము చేయ‌మ‌ని ప‌ట్టుబ‌ట్టిన‌సంకుచిత హృద‌యుడు.

సూర్య‌ము నాట‌క‌ముల‌లో వేష‌ములు వేయుచు నిల్లుప‌ట్ట‌కుండ తిర‌గెడివాడు. అత‌నికి ప్రేమ‌లు మ‌మ‌కార‌ముల‌క్క‌ర‌లేదు. ఇంటిప‌ట్టునే యుండి క‌ష్ట‌ముల‌కు కృంగికృశించిపోవు గోవిందున‌కే శ్యామ‌ల త‌న ప్రేమ‌ను ధారాద‌త్త‌ముచేసిన‌ది. ప‌ద‌హారేండ్లు నిండ‌క‌మునుపే శ్యామ‌ల‌విగ‌త‌భ‌ర్తృత‌యైన‌ది. ఆమెకు త‌న న‌గ‌ల‌మ్ముట‌కు స్వ‌తంత్ర‌మువచ్చినిది. న‌గ‌ల‌న‌మ్మి  సోద‌రునికిచ్చి అత‌ని బాధ్య‌త‌లో పాలుపంచుకొనిన‌ది. అత‌డు చెల్లెలి ధ‌న‌మునుప‌యోగించుట‌కు బాధ‌ప‌డినాడు. శ్యామ‌ల య‌తినిధ‌న‌మును తీసికొనమ‌ని బ్ర‌తిమాలియిచ్చిన‌ది.

సోద‌రునిపై య‌నంత‌మైన‌ప్రేమ జాలిగ‌ల శ్యామ‌ల‌కు త‌న‌ధ‌న‌ము వ్య‌య‌మైన‌చో త‌న‌భావిజీవిత‌మెట్లు గడువ‌లెన‌న్న యోచ‌న‌కూడ లేదు. అన్న మెట్రిక్ ప‌రీక్ష నెన్నిమారులో త‌ప్పెను. కాని యాత‌ప్పుచున్న అన్న చెప్పిన చ‌దువునే వ్రాసిన శ్యామ‌ల మెట్రిక్ ప‌రిక్ష‌లో నుత్తీర్ణురాలైన‌ది. త‌రువాత‌నామె న‌ర్స్ ట్రైనింగ్ పూర్తి చేసి యుద్యోగ‌ము సంపాదించుకొనిన‌ది. అన్న‌మాత్ర‌ముద్యోగ‌ములేక ప‌రీక్ష‌లోనుత్తీర్ణుడుగాలేక జీవితములో నోటువ‌డి భ‌విష్య‌దాశ‌లేనివాడై ఆత్మహ‌త్య‌చేసికొనెను.

శ్యామ‌ల చ‌దువులో పైకివ‌చ్చుట‌కు కార‌ణ‌మామెలోని ప‌ట్టుద‌ల ధీశ‌క్తియేగాక సోద‌రుని బాధ్య‌త‌లోనే కొంచ‌మైన‌నుపాలు పంచుకొని య‌త‌ని బాధ‌లోనే కొంచ‌మైన‌ను తీర్పువ‌లెన‌న్న సుహృద్భావ‌మే న‌న‌వ‌లెను. ధ‌న‌ము నిచ్చుట‌యేగాక అన్న‌పాల‌వ్యాపార‌ము చేయుచుండ‌గా శ‌రీర శ్ర‌మ‌నుకూడ చేసిన‌ది. త‌న‌జీవిత‌మున‌కు త‌గిలిన దెబ్బ సామాన్య‌మైన‌దికాక‌పోయిన‌ను తాను దుఃఖ‌మును హృద‌య‌ములో న‌ణ‌చుకొనియన్న దుఃఖ‌మును మాన్చుట‌కు పాటుప‌డిన‌ది. కాని శ్యామ‌ల ప్రేమఅన్న యెడ‌ల వ‌ర్ధ‌మ‌యిన‌ది. ఆమెక‌ష్ట‌మున‌కు త్యాగ‌మున‌కు తగిన ప్ర‌తిఫ‌ల‌ము పొంద‌లేక‌పోయిన‌ది. అన్న జీవిత‌ములో నిల‌ద్రొక్కుకొనుట‌యేగాక శ్యామ‌ల‌వాంచిన ప్ర‌తిఫ‌ల‌ము. గోవిందు అధీరాన‌య‌కునివ‌లెనే వ్య‌వ‌హ‌రించెను. శ్యామ‌ల‌ధ‌న‌మును తీసికొని ఆమెకొక య‌ప్పుప‌త్ర‌మును వ్రాసినప్పుడు శ్యామ‌ల ఆప‌త్ర‌మును చింపివేసిన‌ది. శ్యామ‌ల ఆయ‌ప్పుప‌త్ర‌మును చింపివేసెను. నీచేతిలోనికి వ‌చ్చిన‌ప్పుడు నాకీయ‌వచ్చును... నేన‌ప్పిచ్చెడిదాన‌ను. నీవుదీసికొనెడి వాడ‌వునా ?  అని మంచిత‌న‌మును వెలార్చిన‌ది. లోక‌ములోన‌నేకుల త‌న‌సోద‌రునితో గూడి ధ‌న‌మున‌కు నాస్తికినెంత ప్రాముఖ్య‌మునిచ్చి బాంధ‌వ్య‌ముల‌నుస‌హిత‌మును  ధ‌నాదుల‌కొర‌కు త్రెంచుకొనుట‌కు సిద్ధ‌ప‌డుచుందురో గోవిందున‌కు తెలియును. అటువంటిది శ్యామ‌ల సోద‌రుని క్షేమ‌మును ఆనంద‌మును కోరి ధ‌న‌మును ఆస్తిని తృణ‌ప్రాయ‌ముగ నెంచిన‌ది. కానిసోద‌రుడు దానిని వృథ‌ప‌ర‌చినాడు. శ్యామ‌ల స‌హృద‌య‌మున‌కు త‌గిని ప్ర‌తిఫ‌ల‌ము ల‌భింప‌లేదు.

సూర్య‌ముప‌ట్ల‌కూడ శ్యామ‌ల సుహృద్భావ‌ము తోడ‌నేయున్న‌ద‌ద‌న‌వ‌లెను. నీచ‌ప్ర‌కృతిక‌లిగి స్వార్ధ‌పూరితుడై యున్న‌ప్ప‌టికి సూర్య‌మును ప‌న్నెత్తి దూషించియెరుగ‌దు. ధ‌న‌మును సంపాదించుచుకూడ కుటుంబ‌మున‌కు సాయ‌ప‌డనందుకు సూర్య‌ముపై ద్వేష‌భావ‌ము నేర్ప‌ర‌చుకొన‌దు. ధ‌న‌ము లౌక్య‌ముగ‌ల‌య‌న్న‌కు సాయ‌ప‌డ‌వ‌లెన‌న్న హృద‌య‌ములేదు. ఇట్లుఇరువురు అన్న‌లుండికూడ య‌నాధ‌యైన శ్యామ‌ల‌నుప‌ట్టించుకొన‌క‌పోయిన‌ను శ్యామ‌ల స్వ‌యంకృషిచేత త‌న‌కాళ్ళ‌మీద తాను నిల‌బ‌డ గ‌ల్గున‌ట్లుగ ఉద్యోగ‌ము సంపాదించుకొనిన‌ది. శ్యామ‌ల హృద‌య‌ము స‌హృద‌యుడైన‌య‌న్న వంక‌కే యొర‌గుచుండుట వ‌ల‌న‌నామె ప్రేమ త్యాగ‌ము  అపాత్ర‌దాన‌ములు కాలేదు.