3
 

అర్హ‌త గ‌ల వారికే అధికారం

ప‌ద్మావతి మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్‌తో ముఖాముఖి

సుమారు రెండు మూడు ద‌శాబ్దాల క్రితం స్త్రీల‌కు విద్య అవ‌స‌ర‌మా అనే చ‌ర్చ‌లు విరివిగా జ‌రిగేవి. వ్యాస‌ర‌చ‌న‌ల పోటీల‌లోను వ‌క్తృత్వ‌పు పోటీల‌లోను ఈ అంశ‌మే ముఖ్యంగా ఉంటూ ఉండేది. అప్పుడు ఆడవారు చదువుకున్న వారు ఉండ‌డం అరుదుగా ఉండేవారు. ఇంట్లోనే టీచ‌ర్ ని పెట్టి భార‌త భాగ‌వ‌త రామాయ‌ణాది పురాణాల‌ను చెప్పించేవారు. కొంత‌మంది హైస్కూలు చ‌దువుల‌తో సంతృప్తిప‌డితే మరికొంత మంది కాలేజీల‌కు కూడా వెళ్ళేవారు. కాలేజీకి వెళ్ళిన ఆడ‌పిల్ల‌ని గొప్ప దైర్య‌స్థురాలిగా చెప్పుకొంటే యూనివ‌ర్సిటీకి వెళ్ళిన స్త్రీని తిరుగుబాటు దారుగా కూడా చూసే వార‌న‌డం ఈనాటి ఆడ‌పిల్ల‌ల‌కి అతిశ‌యోక్తిగా క‌న్పించ‌వచ్చు.

కొంత‌కాలం గ‌డిచాక ఆడ‌పిల్లా మ‌గ‌పిల్లవాడూ అన్న భేదం లేకుండా పిల్ల‌లంద‌ర్నీ పాఠ‌శాల‌ల‌కు పంపిస్తున్నారు. స్త్రీల‌కు విద్య అవ‌స‌ర‌మా అన‌వ‌స‌ర‌మా అన్న చ‌ర్చ‌ను అంద‌రూ మ‌ర‌చిపోయారు. డిగ్రీలూ, ధ‌న‌మూ సంపాదించ‌డంలో ఆడ‌పిల్ల‌లు మ‌గ‌పిల్ల‌ల‌తో స‌మానంగా ముందుకు వ‌స్తున్నారు.

గ‌రల్స్ హైస్కూల్స్‌లోనూ విమెన్స్ కాలేజీల్లోను చ‌దివిన బాలిక‌లు యూనివ‌ర్శిటికి వ‌చ్చేట‌ప్ప‌టికి త‌ప్ప‌నిస‌రిగా కో ఎడ్యుకేష‌న్‌తో పాల్గొనాల్సిందే ?  అటు చిన్న‌ప్ప‌టి నుండీ బాలిక‌ల ప్ర‌త్యేక పాఠ‌శాల‌ల్లో చ‌దువు కొని ఒక వాతావ‌ర‌ణానికి అలవాటు ప‌డ్డ యువ‌తులు విశ్వ‌విద్యాల‌యంలో నూత‌న వాతావ‌ర‌ణాన్ని ఎదుర్కోలేక‌పోవ‌డం కూడా క‌ద్దు.

 

మ‌న రాష్ట్రం ఇలాంటి స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కి ప్ర‌త్యేకించి విశ్వ‌విద్యాల‌యాన్ని స్థాపించ‌డం నిజంగా గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే. బోంబేలో ఎస్‌.ఎస్‌.డి.టి. మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం త‌రువాత తిరుప‌తి లోని మ‌హిళా విశ్వ‌విద్యాల‌యం స్త్రీల విద్యావ‌స‌రాల‌ను తీర్చేందుకు అవ‌త‌రించింది.

ఈ మహిళా విశ్వ‌విద్యాల‌యం పేరు వేంక‌టేశ్వ‌రుని దేవేరి ప‌ద్మావ‌తీదేవి పేరు మీద‌నే నెల‌కొన‌డం మ‌రొక విశేషం. దేశ దేశాల‌లో ఉన్న అది గొప్ప ధ‌న‌వంతుల‌లో ధ‌న‌వంతుడు ఏడుకొండ‌ల వెంక‌న్న ఆయ‌న త‌న పేరుమీద ఎన్నెన్నో సంస్థ‌ల‌ను స్థాపించుకుని నిరాటంకంగా కొన‌సాగించుకుంటున్నాడు. ప్ర‌త్యేకంగా ఒక విశ్వ‌విద్యాల‌యాన్నే న‌డుపుకుంటున్నాడు. ఇక ఆయ‌న స‌తీమ‌ణి మాత్రం ఎందుకు త‌గ్గి ఉండాలి ?  ఆమె కూడా త‌న పేరు మీద ఇంకొక యూనివ‌ర్సిటీని స్థాపించుకోగ‌ల్గింది ! అదే ప‌ద్మావ‌తీ విశ్వ‌విద్యాల‌యం !

వైస్‌చాన్స‌ల‌ర్ గురుపీఠాన్ని శ్రీ‌మ‌తి డాక్ట‌ర్ రాజ్య‌ల‌క్ష్మిగారు అధిరోహించారు. డాక్ట‌ర్ రాజ్య‌ల‌క్ష్మిగారితో సంభాషించిన‌ప్పుడు ఆమె ప్ర‌తిభాపాట‌వాల‌కు ముగ్ధురాలినై ఆ విశేషాల‌ను నలుగురికీ చెప్పాల‌ని ఆశించాను. అదే ఈ ప్ర‌య‌త్నం.

కొంత మందికి డాక్ట‌ర్ రాజ్య‌ల‌క్ష్మిగారు విశ్వ‌విద్యాల‌యానికి వైస్ ఛాన్స‌ల‌ర్‌గా విధి నిర్వ‌హణ‌ను ఎలా నిర్వ‌హించ‌గ‌ల‌రు అని సంశ‌యించారు. డాక్ట‌ర్ గా పెథాల‌జిస్ట్‌గా, మైక్రోబ‌యాల‌జిస్ట్‌గా అనుభ‌వాన్ని పండించుకున్న ఈమె విద్యారంగంలో ఒక యూనివ‌ర్శిటీకి అధికార‌ణిగా ఎలా రాణించ‌గ‌ల‌రు ?  అనిన్నీ అనుకొన్నారు. నేనూ అదే ప్ర‌శ్న‌ను డాక్ట‌ర్ రాజ్య‌ల‌క్ష్మి గార్ని అడిగాను. ఆమె చిన్న‌గా న‌వ్వి త‌మ‌కు విద్యార్థుల‌తోనూ ఇన్‌స్టిట్యూష‌న్స్‌తోనూ పాల‌నా విభాగంలోనూ ఉన్న అనుభ‌వాన్ని గురించి వివ‌రించారు.

ప్రొఫెస‌ర్‌గా ఉన్న‌ప్పుడు స్టూడెంట్స్ ప్రోబ్లెమ్స్‌ను గురించి, చాలా వ‌ర‌కు తెలుసుకున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో డైరెక్ట‌ర్‌గా ఉన్న‌పుడు పాల‌నాను భ‌వాన్ని సాక‌ల్యంగా గ‌డించారు.

ఎమ్‌.బి.బి.ఎస్‌. డిగ్రీని 1954లో తీసికొన్న శ్రీ‌మ‌తి రాజ్య‌ల‌క్ష్మిగారు అండ‌ర్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ విద్యార్థుల‌కు మైక్రోబ‌యాల‌జీ విభాగాన్ని బోధించే ట్యూట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. ఆ త‌రువాత 1961లో మైక్రోబ‌యాల‌జీలో ఎమ్‌.డి. ఈ రెండు డిగ్రీలూ ఆమె ఆంధ్రా యూనివ‌ర్శిటీ నుండే అందుకొన్నారు. డిగ్రీని తీసుకున్నారు. ఎమ్‌.డి. వ‌చ్చాక అండ‌ర్ గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ స్టూడెంట్స్‌కి న‌ర్సింగ్ స్టూడెంట్స్‌కి, డెంట‌ల్ స్టూడెంట్స్‌కి కూడా మైక్రోబ‌యాల‌జీ పెథాల‌జీ, ప‌బ్లిక్ హెల్త్‌. ఫోర్సెనిక‌ఖ మెడిసినూ బోధించేవారు.

టీచింగ్ హాస్పిట‌ల్స్‌లో లేబొరేట‌రీ స‌ర్వీసిస్‌ను ఎలా అభివృద్ధి ప‌ర‌చాలి ఎలా తీర్చిదిద్ధాలి అనే అంశాన్ని ప్రత్యేకంగా స్ట‌డీ చేశారు.

మైక్రోబ‌యాల‌జీ, మైకాల‌జీ, వైరాల‌జీ విభాగాల్లో వ్యాధి నిరూప‌ణ విధానాన్ని మ‌రింత నిశితంగా తీర్చిదిద్దారు. (డ‌యాగ్నిస్టిక్ వ‌ర్క్‌)

ఇలాగ శ్రీ‌మ‌తి రాజ్య‌ల‌క్ష్మిగారు ప‌రిశోధ‌నా విభాగంలో కృషి చేస్తూ నూత్నాంశాల‌ను గుర్తించుకుంటూ పోతూ అటు విద్యార్ధుల్లో ర‌క‌ర‌కాల మ‌న‌స్త‌త్వాలుగ‌ల విద్యార్థినీ విద్యార్థుల‌ను ప‌రిశీలించే సూక్ష్మ దృష్టిని అల‌వ‌ర‌చుకున్నారు. విద్యార్థులూ వారి స‌మ‌స్య‌లూ ఉపాధ్యాయులూ వారి ప్ర‌వ‌ర్త‌నా విద్యార్థుల ఉపాధ్యాయుల ప‌ర‌స్ప‌ర సంబంధ భాంద‌వ్యాలూ వారిలో ఉండే కోప‌తాపాలూ కాంప్లెక్సులూ గ‌మ‌నించే వారు.

విద్యార్థుల న‌ర్థం చేసి కోవడం శాంత శ్ర‌మ‌తో కూడిన ప‌నైనా అర్థ‌మైన త‌రువాత వారితో క‌లిసి పోవ‌డం చాలా తేలికైన పని అనేది వీరు గ్ర‌హించారు.

శ్రీ‌మ‌తి రాజ్య‌ల‌క్ష్మి గారి నేతృత్వంలో ఎంతో మందికి పి.హెచ్‌.డి, ఎమ్‌.డి డిగ్రీలు పొంది వైద్య‌శాస్త్రానికి అపారంగా కృషిచేసి అవ‌కాశం ల‌భించింది.

వీరు ఆ స‌మ‌యంలో సంపాదించిన అనుభ‌వ‌మే ఇప్పుడు విశ్వ‌విద్యాల‌య పాల‌నా స‌మ‌యంలో అక్క‌ర‌కు వ‌స్తుంది.

1980లో ఇండియ‌న్ ప‌బ్లిక్ హెల్త్ అసోసియేష‌న్ కి, ఇండియ‌న్ సొసైటీ ఆఫ్ క‌మ్యూనిక‌బుల్ డిసీజెస్ అండ్ మ‌లేరియాల‌జీ కి ఫెలో గా ఎన్నుకోబ‌డ్డారు. ఇండియ‌న్ అసోసియేష‌న్ ఆఫ్ మెడిక‌ల్ మైక్రోబ‌యాల‌జిస్ట్స్ కి ప్రెసిడెంట్‌గా 1984-85 లో ఎన్నిక‌య్యారు. 1982లో ఇండియ‌న్ వాట‌ర్ వ‌ర్క్స్ ఎసోసియేష‌న్ వారు శ్రీ‌మ‌తి రాజ్య‌ల‌క్ష్మిగారు ఫ్లోరోసిస్‌పై ప‌రిశోధించి ఐ.డ‌బ్ల్యు.డ‌బ్ల్యు వి. వార్షిక స‌మావేశంలో చ‌దివిన వ్యాసానికి అవార్డును బ‌హుక‌రించారు. ఇండోనేషియా బాండంగ్‌లో ప్ర‌పంచ ఆరోగ్య సంచాల‌కులు ఏర్పాటు చేసిన డి.పి.టి వాక్సిన్ గుణాల‌ను ప‌రిశీలించే స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే అదృష్టం శ్రీ‌మ‌తి రాజ్య‌ల‌క్ష్మిగారికి ల‌భించింది.

జ‌పాన్‌లో మ‌రియోకాకి  వెళ్ళి ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఫ‌ర్ రిసెర్చ్ కాన్ఫ‌రెస్స్‌లో పాల్గొన్నారు.