10
 


 

 

దుష్యంతుడు త‌న సౌధానికి వ‌చ్చిన శ‌కుంత‌ల‌నూ, కొడుకునూ చూశాడు. కానీ ఎవ‌రో తెలియ‌న‌ట్లు న‌టించాడు. ప్రేమ‌త‌డిలేని ఆ చూపుల‌ను చూసి శ‌కుంత‌ల స‌ర్వం గ్ర‌హించుకుంది. మ‌రచిపోయాడా ?  మ‌ర‌చిపోతే జ్ఞాప‌కం చేయ‌వ‌చ్చా ?  కాని తెలిసీ తెలీన‌ట్లు న‌టించేవారికి ఎలా తెలియ‌జెప్ప‌టం అనుకొన్న‌ది. ఇక్క‌డ కూడా న‌న్న‌య దుష్యంతుని స్వ‌భావాన్ని స్ప‌ష్టంగా ఎత్తి చూపాడు.  మ‌రి యెరిగి యెరుగ‌నొల్ల‌నిక‌ర‌టిం దిలుపంగ‌...క‌మ‌ల‌గ‌ర్భుని వశం కూడా కాద‌ని, శ‌కుంతుల తెల్సుకుంది.

అయినా ఆమె ఆశాజీవి !  క‌ర్త‌వ్యం గ్ర‌హించుకొని అత‌డు వేట‌కు వ‌చ్చి త‌న‌ను గాంధ‌ర్వ వివాహం చేసికొన్న‌ది గుర్తు చేసింది. ఇడుగో వీడు నీ కొడుకు. వీడికి లోగ‌డ నువ్వు మాటయిచ్చిన ప్ర‌కారం యువ‌రాజ్య ప‌ట్టాభిషేకం చెయ్యి అని ఖండితంగా నిగ్గ‌దీసింది.

ఆ రాజు మ‌హామ‌హులైప మంత్రి సామంత దండ‌నాధాది ప్ర‌ముఖ అధికార అన‌ధికారుల‌తో కొలువుదీర్చి ఉన్నాడు. వ‌నాల‌లో చెట్టూ పుట్ట‌లూ మ‌ధ్య లేళ్ళూ జింక‌ల మ‌ధ్య పెరిగిన ఒక స్త్రీ మ‌హారాజును ఇలా ఎదుర్కోగ‌ల‌ద‌ని అనుకోలేదు. తెల్లబోయాడు. అధికారం ఉప‌యోగించి వెళ్ళ గొట్ట‌బోయాడు. ఇలా అనుచిత‌మైన‌మాట‌లు మాట్లాడ‌క ఎక్క‌డినుంచి వ‌చ్చారో అక్క‌డ‌కి వెళ్ళు అని నిర్థ‌యంగా ప‌లికాడు. అత‌డికి క‌ణ్వుడు శాపం యిస్తాడ‌నే భ‌యం లేదు. ఇచ్చేవాడైతే ఎప్పుడో ఇచ్చేసేవాడు.

ఇంత ప‌చ్చి అబ‌ద్ద‌మా అని శ‌కుంత‌ల నిర్విణ్ణురాలై పోయింది. ఒక అవినీతి మంతుడి కామానికి అన్యాయంగా బ‌లి అయి పోయాన‌నే కోపంతో వ‌ణికిపోయింది. ఆ ఆగ్ర‌హం వేడికి హృద‌యం మంచులా క‌రిగి క‌న్నీరు లా ప్ర‌వ‌హించింది. ఆ క‌న్నీరు కోప‌మేగాని శోకంకాద‌ని న‌న్న‌య స్ప‌ష్టంగా చెప్పాడు. అంతేగానీ దిక్కుతోచ‌క క‌నిపించ‌ని, త‌న‌ను క‌నీ పెంచ‌ని అమ్మ కోస‌మో భ‌గ‌వంతుడికోస‌మో భోరుమ‌ని ఏడ‌వ‌లేదు. ప్ర‌పంచం శూన్య‌మై క‌ళ్ళు గిర్రున తిరిగిపోగా కూలిపోయి శోకించ‌లేదు.

ప్ర‌జ‌ల‌కు నీతి న్యాయం చెప్ప‌వ‌ల‌సిన పెద్ద‌మ‌నిషి ధ‌ర్మాన్ని కాల‌రాస్తున్నాడు. శ‌కుంత‌ల పాల‌కుడికే బుద్ధి చెప్ప‌డానికి నిశ్చ‌యించుకొంది. రాజ‌దండం ఆమెను భ‌య‌పెట్ట‌లేక‌పోయింది. రాజు నెదిరిస్తే ఏం శిక్షో అని వెర‌వ‌లేదు. ఇంత‌కు తెగించి కామతృప్తి చేసుకొని కొడుకుని గ‌ని నువ్వెవ‌రివో నాకు తెలీదు అవ‌త‌లికి పో అని వెళ్ళ గొట్టేవంచ‌కుడిని తాను చెప్పే ధ‌ర్మ ప‌న్నాలు మార్చ‌గ‌ల‌వ‌ని కూడా ఆమె అనుకోలేదు. కానీ రాజు చేసిన అన్యాయం బ‌య‌ట‌పెట్ట‌ద‌ల‌చుకొన్న‌ది. త‌న‌ల మ‌రో క‌న్య బ‌లి కాకూడ‌ద‌నుకొన్న‌ది. రాజుగారి బండారం ఏమిటో ప్ర‌పంచానికి గొంతెత్తి చెప్పాల‌నుకొన్న‌ది.

అత‌డు పెళ్ళాడింది మ‌రో న‌ర‌మాన‌వుడు చూడ‌లేదు. సాక్ష్యం ఎలా తెగ‌ల‌దు ?  సూర్యుడూ చంద్రుడూ మొద‌లైన పంచ‌భూతాల‌ను కాద‌న్నా అంత‌రాత్మ‌ను కాద‌న‌గ‌ల‌వా అని ప్ర‌శ్నించింది. నాకు పుట్టిన కుమారునికి ప‌ట్టం క‌డుతాన‌న్నావు జ్ఞాపంకం చేసుకో అంది. ఒక స్త్రీని అన్యాయం చేస్తే పుట్ట‌గ‌తులుండ‌వ‌న్న‌ది. ఇంకొక  అడుగు ముందుకు వేసి అతి దుర్మ‌తికి ఇహముల ప‌ర‌ముల గ‌ల‌మే అని రాజును నిర్భ‌యంగా దుర్మ‌తి కాదు అతిదుర్మ‌తి అని తిట్టిపోసింది.

భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఒక‌టే. ఒక ప‌దార్థానికి చెందిన రెండు స‌గాలు. భార్య ముందు చనిపోతే ప‌ర‌లోకంలో భర్త‌కోసం ఎదురు చూస్తుంది. అలాగే భ‌ర్త‌కూడా. అలా ఇహానికి ప‌రానికి న‌మ్ముకొన్న భార్య‌ను అవ‌మానించ‌డం అధ‌ర్మం అని ఎలుగెత్తి చాటిన ధైర్య‌వంతురాలు శ‌కుంత‌ల‌.

ఇక కొడుకంటే ఎవ‌రునుకున్నావు. నువ్వే మ‌ళ్ళీ పుత్ర‌రూపంలో జ‌న్మించావు.  ఇలాగే సృష్టి అవిచ్చ‌న్నంగా సాగుతోంది. అని సృష్టి ర‌హ‌స్యం చెప్పింది. వేదాల‌నూ ధ‌ర్మ‌శాస్త్రాల‌నూ శ‌రీర‌శాస్త్రాన్నీ నీతి శాస్త్రాన్ని త్ర‌వ్వి త‌ల‌కెత్తి సోసినా రాజులో చ‌ల‌నం క‌లుగ‌లేదు.

ఇక ఈ గొడ‌వంతా ఎందుకు ఈ కూమారుణ్ణి ఒక్క‌మాటు కౌగ‌లించు చూసుకో నీకు ఎంత ఆంనందం క‌ల్గుతుందో, ఈ ఆనందానికి మ‌రేదీ సాటిరాదు అని కూడా చెప్పింది. పైగా ఆ కొడుకు ఇలాటి అలాటి వాడు కాద‌ట !  నూరు వాజ‌పేయాలు చేసి మ‌హాఘ‌నుడౌతాడ‌ని స‌ర‌స్వ‌తీదేవి కూడా చెప్పింద‌ట‌. ఇంకా రాజులో మార్పురాలేదు. వేయి ఆశ్వ‌మేధాలు చేసినా క‌ల‌గ‌ని స‌త్ఫ‌లితం ఒక్క నిజం చెపితే క‌ల్గుతుందన్న‌ది. రాజుకు అంగ‌బ‌లం అర్థ‌బ‌లం ఉండి ఎన్ని యాగాలు దానాలు చేస్తే మాత్రం ఏం ప్ర‌యోజ‌నం అబ‌ద్దాలాడేవాడికి ?  అన్న ఎత్తి పొడుపు శ‌కుంత‌ల మాటల్లో ఉంది.

ఇలా మోస‌పోయినా తిరిగి త‌న‌స్థానాన్ని నిల‌బెట్టుకోద‌లిచే ఒక స్త్రీ నిజజీవితంలో ఎలా ప్ర‌వ‌ర్తిస్తుందో అచ్చంగా అలాగే ర‌క్త‌మాంసాలున్న స‌జీవ‌మూర్తినిలాగా న‌న్న‌య శ‌కుంత‌ల‌ను సృష్టించాడు. దుష్యంతుడూ అలాగే మాన‌వ‌మాత్రుల‌లో వుండే స‌హ‌జ బ‌ల‌హీన‌ల‌త‌ను ప్ర‌ద‌ర్శించాడు.

న‌న్న‌య శ‌కుంత‌ల పౌరుష‌వంతురాలు, ధైర్య‌వంతురాలు, స్థ‌యిర్యంక‌ల‌ది. ధ‌ర్మ శాస్త్రాలు తెలిసిన విదుషి నీ కావ్యాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే గోచిరించ‌క‌త‌ప్ప‌దు.

ఇక కాళిదాసు దుర్వాసుడూ, శాపం, అభిజ్ఞానం అంటూ అద్భుతాల‌ను చిత్రించి గాలిలో తేలిపోతాడు. అభిజ్ఞాన‌శాకుంత‌లం ర‌మణీయంగా వుండి శాశ్వ‌తంగా నిల‌చిపోతుంది.

న‌న్న‌య శ‌కుంత‌ల అన్ని కాలాల‌కూ ప్ర‌తినిధిగా వుండి తొంద‌ర‌పాటుగా వ్య‌వ‌హ‌రించే క‌న్య‌ల‌కూ పెద్ద‌ల‌ను నిర్ల‌క్ష్యం వేసి ఎక్క‌డికో పారిపోయి పెళ్లిళ్ళు చేసుకునో చేసుకోకో సంసారాలు చేసుకునే అమ్మాయిల‌కు,ఇలాటి ప‌రిస్థితుల్లో, కోరిక‌ల వేడికో పురుషుల వాగ్థానాలెంత నీటిమూట‌లో గ్ర‌హించుకోమ‌ని హెచ్చ‌రిస్తుంది. అడుగు ముందుకు వేసేముందే ఎంత గాఢంగా నిదానంగా ఆలోచించాలో బోధ‌ప‌రుస్తుంది. శ‌కుంత‌ల ఆకాశ‌వాణి పుల‌కులా భ‌ర‌తుడు రాజ్యం చేయ‌డ‌మూ అది వేరే క‌థ‌. మ‌నుకు కావ‌న్సింది ఇంత‌వ‌ర‌కే.