7
 

చిర‌య‌శ‌స్విని య‌శోద‌

 

య‌శోద అన‌గానే మీ మ‌నస్సులో కిట్ట‌మ్మా..గోపాల బాలా కిట్ట‌మ్మా...అని పాట‌లు పాడుతూ బుజ్జ‌గిస్తూ న‌ల్ల‌న‌య్య‌కి బొజ్జ‌నిండా వెన్న మీగ‌ల‌డ‌లు తినిపించి త‌న హృద‌య‌మ‌నే రోటికి ఆలీలా శిశువును వాత్స‌ల్య ర‌జ్జువుతో బంధించిన మాతృస్వ‌రూపిణి ప్రేమ‌మూర్తి నంద‌య‌శోద‌...మెదిలింది క‌దూ !

నిజానికి ఈ య‌శోద ఆ య‌శోద కాక పోయిన‌ప్ప‌టికి పేరుబ‌ల‌మో యేమో గాని హ‌రివంశ‌ము, భాగ‌వ‌త‌మూ పార‌జాతాప‌హార‌ణ‌మూ భార‌త‌మూ మొద‌లైన గ్రంథాల‌ను కూలంక‌షంగా ప‌రిశోధించి కృష్ణ స్వ‌రూపాన్ని సాక‌ల్యంగా ఆక‌శింపు చేసుకున్నారు. ఇంత‌కీ మీక తెలిసిపోయింద‌నుకుంటాను య‌శోద అంటే మ‌న డాక్ట‌ర్ పి.య‌శోదారెడ్డిగారేన‌ని.

 ఓ వారం క్రితంకాబోలు లేస్తూనే వార్తాప‌త్రిక చూశాను. చూస్తూనే డా||య‌శోదారెడ్డిగారు అధికార తెలుగు భాషా సంఘానికి అధికార‌ణిగా నియ‌మితురాలైనార‌న్న వార్త‌ను ఆక‌శింపు చేసుకుని ఎంతో ఆనందించాను. ఈ ఆనందానికి కార‌ణాలు చాలా ఉన్నా ముచ్చ‌ట‌గా మూడింటిని ముచ్చ‌టిస్తాను. ఆంధ్ర సార‌స్వ‌త లోకానికీ సాహిత్య విద్యార్థి ప్ర‌పంచానికి ఆమె చేసిన కృషీ, మేలూ ఇంతింత‌న‌రాన‌వి అన్న సంతోష‌ము, సాటిస్త్రీ ఉన్న‌తాస‌నాన్ని అధిరోహించి నందుకు గ‌ర్వ‌ము అన్నింటినీమించి మ‌హిళా జాగృతి ద్వారా మ‌నంద‌రికీ బిర‌ప‌రిచితురాలు కావ‌డ‌మూ...

డా||య‌శోదారెడ్డిగారిని గురించి మ‌న వారికి కూడా తెలియ‌జేయ‌ల‌నే త‌ప‌న‌తో వారింటికి వెళ్ళి వారి అమూల్య‌మైన అభిప్రాయాల‌ను తెలుసుకోడం జరిగింది.

శ్రీ‌మ‌తి య‌శోద‌త మాట్లాడం అంటే వారి మాటు వినడ‌మే. వారి వాక్‌ఝ‌రిలో ఎన్నో విలువైన విష‌య‌లు అల‌వోక‌గా ప్ర‌స‌క్త‌మౌతుంటాయి. ఇంతేకాదు వీరి జ్ఞాప‌క‌శ‌క్తి ఆమోఘం. ఎన్నో చిన్న చిన్న సంగ‌తులు కూడా త‌డుముకోకుండా గ‌ల‌గ‌లా చెప్పేస్తారు. ఎప్పుడో జ‌రిగిన‌వైనా స‌రే. ఎన్న‌డో చ‌దివిన‌వైనా సరే య‌శోద‌గారిలో ప్ర‌స్ఫుటంగా వ్య‌క్త‌మ‌య్యేది ఆమె లోగుండెనిండా ఉన్న ఆత్మ విశ్వాసం ఈ ఆత్మ విశ్వాసం స్థ‌యిర్యం వ‌ల్ల‌నే స్వ‌యంకృషితో ఈనాడిలా ఆద‌ర్శ మ‌హిళ కాగ‌లిగారు.

కుటుంబంలో వేలు పుచ్చుకుని నడిపించే వారు లేక‌పోగా తొమ్మిదో ఏట‌నే వివాహంచేసి విద్య‌నంత‌టితో ఆపాల‌ని కూడా ప్ర‌య‌త్నించారుట‌. ప‌ల్లెటూరిలో జ‌న్మించిన య‌శోదారెడ్డిగారి విద్యారంభంలో చిత్ర‌మైన ఓ సంఘ‌ట‌న జ‌రిగింద‌ట‌. ఆ రోజుల్లో ఆడ‌పిల్ల‌ల‌కు చ‌వువెందుకు అనేవారు క‌దా మీరు స్కూల్లోచేరి ఇంగ్లీషు చ‌దువులు చ‌దవ‌డం ఎలా సంభ‌వించింది అని ప్ర‌శ్నిస్తే య‌శోదారెడ్డిగారు ఇలా చెప్పారు.

యః-  స్కూల్లో చేరాన‌న్న మాటే గాని నాకు ఇంగ్లీషు రాదు. ఓ రోజున ప‌ట్టాభిరామ‌య్య‌గార‌నే మా ఇంగ్లీషు మాస్టారు పొయిట్రీ క్లాసు తీసుకుంటున్నారు. ఇంగ్లీషు ప‌ద్యాన్ని అప్ప‌చెప్ప‌ని వాళ్లంద‌ర్నీ బ‌య‌ట నిల‌బ‌డి చ‌ద‌వ‌మ‌న్నారు. నేను నాకు ఎ.బి.సి.డి. లే రావు అని చెప్పినా ఆయ‌న విన్పించుకోలేదు. బ‌య‌ట నిల‌బ‌డ్డాను. నా ప‌క్క‌న అంబుజ‌మూ, ఆండాళ్ళు అని ఇద్ద‌రు పిల్ల‌లు ప‌ద్యాన్ని గ‌ట్టిగా చ‌ద‌వ‌డంతో ఆ పద్యం నాకు వ‌చ్చేసింది. వెంట‌నే సారుకి అప్ప‌చెప్పాను. ఆ సారు అప్పుడు అక్ష‌రాలు రావ‌ని అబ్ధం చెప్పాన‌ని దండించారు. నేను నిజ‌మేన‌ని ప‌దే ప‌దే చెప్ప‌డంతో న‌మ్మి న‌న్ను కొట్టినందుకు బాధ‌తో తండ్రిలా దగ్గ‌రికి తీసుకుని నెల‌రోజుల్లో మిగ‌తా పిల్ల‌లతో స‌మానంగా నేనుకూడా చ‌దివేలా త‌యారు చేశారు.

ఇలా య‌శోదారెడ్డిగారి జీవితంలో ప‌ట్టాభిరామ‌య్య‌గారు తండ్రి గురువు అయి ఆమె అభివృద్ధికి ప్ర‌థ‌మ సాధ‌నం అయ్యారు. స్కూల్లో చ‌దువుతుండ‌గానే ఆమెలోని ర‌చ‌యిత్రి మేలుకున్నారు. ఏడ‌వ‌త‌ర‌గ‌తిలో ఉండ‌గానే జ‌మునాలాల్ బ‌జాజ్ మీద వ్యాసం రాశారు.

ప్రః-  మీ వివాహం చ‌దువు పూర్తయ్యాక‌నే అయ్యాందా ?

యః-  తొమ్మిదేళ్ళ‌కే పెళ్ళి ప్ర‌య‌త్నాలు చేశారు. ఒక‌సారి పెళ్ళివాళ్ళు నన్ను చూడ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు నేను బండిమీదినుండి దూకుతుంటే చూసి ఈ పిల్ల దుడుకుది మ‌న‌కి ప‌నికిరాదు అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. రెండోసారి మామేన‌త్త కొడుకే పెళ్ళికొడుకుగా నన్ను చూడ‌మ‌ని మా మేన‌త్త‌తో వచ్చాడు.  అప్పుడు నేను చెట్టు ఎక్క‌డానికి మా మేన‌త్త కొడుకుని వంగ‌మ‌ని అత‌ని వీపు మీద నుంచుని చెట్టు ఎక్కాన‌ట‌. అది చూసి మా మేన‌త్త‌కు కోపం వ‌చ్చింది. ఇప్పుడే నిన్ను వంగ‌బెట్టింది. ఇంక పెళ్ళ‌య్యాక నీమాటేంవింటుంది అని ఆమె కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది.

ఆ త‌రువాత కుటుంబ ప‌రిస్థితులు క్షీణించి పెళ్ళి వెన‌క‌బ‌డినా, చ‌దువు ఆమెను ముందుకు న‌డిపించింది. ప్ర‌ఖ్యాత క‌ళాకారులు పి.టి.రెడ్డిగారిని వివాహ‌మాడాను. పెళ్ళ‌య్యాక కూడా కాలేజీలో చేరి చుదువుకొని డాక్ట‌ర్ ప‌ట్టాపుచ్చుకునే దాకా ప‌ట్టు వ‌ద‌ల‌లేదు. అంతేకాదు. ఆమె విద్యారంగంలో నిర‌తంరంగా కృషి చేస్తూనే ఉన్నారు. శ్రీ‌మ‌తి య‌శోదారెడ్డిగారు తెలుగులో హ‌రివంశంలు అనే  అంశంపై ప‌రిశోధ‌న చేసి పి.హెచ్‌.డి. ప‌ట్టా పుచ్చుకున్నారు. ఉస్మానియా యూనివ‌ర్శిటీ తెలుగుశాఖ‌లో లెక్చ‌ర‌ర్‌గా చేరి రీడ‌ర్ అయ్యి ప్రొఫెస‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఆగ్రా యూనివ‌ర్శిటీ 1976లో డి.లిట్ ప్ర‌దానం చేసింది. శ్రీ‌మ‌తి య‌శోదగారు బ‌హుభాషాభిజ్ఞురాలు. కాలేజి విద్యాభ్యాసం మూలంగా ఇంగ్లీషు సంస్కృతంలో, మాస్ట‌ర్ డిగ్రీ తీసుకోవ‌డం వ‌ల్ల సంస్కృతం జ‌ర్మ‌న్ భాష‌లో జూనియ‌ర్ డిప్లొమా పొంద‌డం వ‌ల్ల జ‌ర్మ‌న్ భాష నేర్చారు. ఇవిగాక హిందీ ఉర్దూ క‌న్న‌డ భాష‌ల్లో ప్రావీణ్యం, సంపాదించారు. ఆనాటి ఆ ప‌ల్లెటూర్లో చెట్లెక్కి అల్ల‌రి చేసే ఆ బాలిక‌ను చూసిన వారెవ‌రైనా ఇంతటి విదుషీమ‌ణి కాగ‌ల‌ద‌ని ఊహించి ఉంటారా ?

తెలుగులో హ‌రివంశ‌ములు ఆరుపైనే ఉంటాయ‌న్నారు. అందులోనే మానిభైర‌వ‌క‌విరాసిన హ‌రివంశాన్ని య‌శోదారెడ్డిగారు సంస్క‌రించి ప్ర‌క‌టించారు. ఎర్రాప్ర‌గ‌డ పారిజాతాప‌హార‌ణ ఘ‌ట్ట‌మూ, ప్ర‌ద్యుమ్న‌కుమార‌ని వివాహ గాథ లేవు. ఇవి మూల గ్రంథంలో ఉన్నాయంటారు. ఇలాటి కొంగ్రొత్త విష‌యాల‌ను వెలికి తీస్తూ ఎన్నో గ్రంథాల‌ను ర‌చించారు.

నృత్య‌గాన ప్ర‌వ‌ర్త‌కుడు శ్రీ‌కృష్ణుడు అంటారు య‌శోదారెడ్డిగారు ఈ భావాల‌కు త‌గిన ఆధారం హ‌రివంశంలో ఉంది. ఛ‌ళికాగానం ఛ‌ళికానృత్యం, కుమార‌జాతి మొద‌లైన కొన్ని ల‌లిత క‌ళా విశేషాల‌ను బ‌ట్టి ఛ‌ళికాగాన నృత్యాల‌నుండే రాస‌క్రీడ‌, రాస‌నాట్యం ఏర్ప‌డిందంటారు. ఈ విష‌యంపై ప‌రిశోధ‌న చెయ్య‌వ‌ల‌సిన అవ‌శ్య‌కం ఉంది. నృత్యానికి న‌ట‌రాజు, గానానికి తుంబుర నార‌దుల‌ను స‌ర‌స్వ‌తీ దేవుల‌ని చెప్పుకుంటాం. పోత‌న క‌వితాసుధ‌ను, భాగ‌వ‌త కావ్య‌కుసుమాల‌ను ఆందించ‌డ‌మే కాదు తెలంగాణ తెలుగు యాసలోని తీయంద‌నాల‌ను రేడియోద్వారా క‌థ‌ల‌ద్వారా ప్ర‌జానీకానికి రుచులూరించేలా పంచిపెట్టారు. మ‌హాల‌క్ష్మి ముచ్చ‌ట్లు వినిన వారంద‌రికీ ఈ మాట ప్ర‌త్యేకం చెప్ప‌న‌వ‌స‌రంలేదు. య‌శోద‌గారి జిహ్వపై తెలుగువాణి చిద్విలాసంగా నాట్య‌మాడుతుంది. ఆమె క‌లంలో చురుకు ఛ‌ళుకు, గ‌ళం విప్ప‌తేనే లొలుకు. ఇక విద్యార్థినీ విద్యార్థుల హృద‌యాల్లో ఈ ఉపాధ్యాయుని ప్రాతః స్మ‌ర‌ణీయం.

ఆంగ్ల గ్రంథాల‌ను హిందీ గ్రంథాల‌ను ఆంధ్ర భాష‌లోనికి అనువ‌దించి ఆయారంగాల్లో కూడా త‌న ప్ర‌తిభ‌ను చాటుకొన్నారు. ఎంతో మంది విద్యార్థులు పి.హెచ్‌.డి.లు, ఎమ్‌.ఫిల్ ప‌ట్ట‌భ‌ద్రులు అయ్యేందుకు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎన్నో యూనివ‌ర్శిలీల‌క వెళ్ళి అనేక విష‌యాల‌పై వ్యాసాల‌ను చ‌దివి, ఎన్నో వేదిక‌ల‌పై విజ్ఞానోవ‌న్యాసాల‌ను ఇచ్చి ఒక నిర్థిష్ట‌మైన స్థానాన్ని పొందారు. య‌శోదారెడ్డిగారు రచించిన గ్రంధాల‌న్నింటికీ ప‌రిశోధ‌న వ్యాసాల స్థాయి ఉండ‌టం మ‌రో విశేషం వ్రాసింది ఖ‌చ్చితంగా ద్వంద్వాతీతంగా నిర్దుష్టంగా వ్రాయ‌డం ఆమె హృద‌యల‌క్ష‌ణం.

పండితుల ర‌స‌పిపాసుల కొర‌కు ర‌చ‌న‌లు చేసినా పాప‌ల‌కొర‌కు కూడా ర‌చించ‌డం మ‌ర‌చిపోలేదు. ఇలా వ్రాయ‌డం క‌ష్ట‌త‌రం పండితుల్లో పండితురాలిగా పాప‌ల్లో పాప‌గా ర‌చ‌యిత్రి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసిన‌ట్లే ప్ర‌వ‌ర్తింన‌జేశారు. బ‌డిపెద్ద‌, న‌క్కబావ‌, బుచ్చిగాడు. పేద‌రాసిపెద్ద‌మ్మ క‌థ‌లు, ఇవ‌న్నీ పిల్ల‌ల‌కి ఈమె పంచిన పిండివంట‌లు.

సాహిత్య ప్ర‌స‌క్తి అయినాక శ్రీ‌మ‌తి య‌శోదారెడ్డిగారి ని అధికార భాషా పీఠం గురించి ప్ర‌శ్నించాను. వావిలాల గోపాల కృష్ణ‌య్య గారు, సి.నారాయ‌ణ‌రెడ్డిగారు, నండూరి రామ‌కృష్న‌మాచార్య‌గారు,  మొద‌లైన పెద్ద‌లు ఈ పీఠాన్ని అధిరోహించిన వారే నేటికి ఈ మ‌హిళా ర‌త్నం వంతువచ్చింది. దీని కాల‌వ్య‌వ‌ధి ఒక సంవ‌త్స‌రం త‌రువాత మ‌రి రెండు సంవ‌త్స‌రాలు పెంచ‌వ‌చ్చు. కాని ఉత్స‌హ‌వంతుల‌కు ఈ వ్య‌వ‌ధి స‌రిపోదు. అస‌లు ఈ వ్య‌వ‌స్థ‌ను గురించి త‌మ బాధ్య‌త‌లు బాధ‌లు తెలుసుకొనే స‌రికే రెండు మూడునెల‌లు ప‌ట్ట‌వ‌చ్చు త‌రువాత తాము చేయ‌ద‌ల్చుకొన్న‌ద‌ని గురించిఒ ప్రణాళిక త‌యారు చేసుకోడం దాన్ని అమ‌లు ప‌ట్ట‌డానికి కృషి చెయ్య‌డం ఇంత‌లో అయ్యేప‌నికాదు. ఇంకా కొంత‌కాలం అంటే క‌నీసం మూడు సంవ‌త్స‌రాలైనా అర్హులైన‌వారు ఈ స్థానంలో వుంటే భాషా స‌మ‌స్య ఒక కొలిక్కి రావ‌చ్చునేమో

ప్రః-  అధికార భాష‌కు సామిత్యానికి ఉన్న సంబంధం ఎట్టిది ?

యః- అధికార భాష‌కు సాహిత్యానికి ఏం సంబంధంలేదు. మ‌నది తెలుగు రాష్ట్రం మ‌న భాష తెలుగు. పాలితులు తెలుగువారు. పాల‌కులు తెలుగువారు. అందుచేత మ‌న అధికార భాష కూడా తెలుగు అయితే బావుంటుంది. ప్ర‌జోవ‌యోగ్యంగా ఉంటుంది. ఇంకా విపులంగా చెప్పాలంటే సాధార‌ణ ప్ర‌జానీకానికి అధికార వ‌ర్గంతో స‌న్నిహిత‌త్వాన్ని క‌ల్పించే వాహిక ఈ అధికార భాష‌.

కోర్టులో త‌మ‌గోడు చెప్పుకోడం, రెవెన్యూలో త‌మ స్థితిగ‌తుల‌ను వెల్ల‌డించుకోడం ప్ర‌భుత్వానికి అర్జీలు పెట్టుకోడం వంటి సంద‌ర్భాల్లో ప్ర‌జ‌లు త‌మ‌కు వ‌చ్చిన త‌మ‌కు తెలిసిన మాతృభాష‌లో ఈ వ్య‌వ‌హారాలు చూసుకోగ‌లిగితే ఎన్నో అపార్థాలు త‌ప్పిపోతాయి. 1966 లో ప్రారంభ‌మ‌యినా ఇంకా తెలుగు భాష దేశంలో పూర్తిగా అమలు కావ‌డం లేదు. ఈ అధికార భాషా సంఘం ఇంగ్లీషు బోధ‌నా భాష‌గా ఉండ‌రాద‌ని కాని ఆంగ్ల భాషా ప్రాముఖ్యాన్ని తగ్గించాల‌నిగాని వాదించ‌దు. దీని ప‌రిధి, ఉనికి సున్నిత‌మైన‌వి. ఇలాంటి భాషా సంఘాలు, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లోను ఉన్నాయి. మిగ‌తా రాష్ట్రాల‌వారు ఏ విధంగా కృషి చేస్తున్న‌దీ తెలుసుకోడం కూడా చాలా అవ‌స‌ర‌మే.

ప్రః-  జాతీయ భాష‌గా సంస్కృతం ఉండాల‌ని కొంద‌రు వాదిస్తూ ఉంటారు క‌దా మ‌రి మీ అభిప్రాయం ఏమిటి ?

యః- బుద్ధి తెలిసాక త‌ల్లీ తండ్రి చుట్టుప‌క్క‌ల‌వారు ఏంభాష మాట్లాడితే బిడ్డ ఆదేభాష‌లో మాట్లాడుతుంది. ఇది మాతృభాష‌, ఇక ఇంగ్లీషు అంత‌ర్జాతీయ భాష‌. సైన్సుకీ, ఇంగ్లీషుకి పెద్ద లింకువుంది. వైజ్ఞానిక గ్రంథాలు ఎన్నో ఇంగ్లీషులో ఉన్నాయి. మ‌న‌ము వైజ్ఞానికంగా పురోగ‌మించాలంటే ఇంగ్లీషు నేర్వాలి. ఇక జాతీయ భాష‌గా హిందీ త‌ప్ప‌నిస‌రి. ఏ రాష్ట్రంవారు ఆ రాష్ట్ర‌భాష‌నే మాట్లాడుకుంటూ ఆ భాష‌లోనే చ‌దువుకుంటూ లిమిటెడ్ గా అయిపోకూడ‌దు. చదువుకున్నా చ‌దువుకోక‌పోయినా ప్ర‌తిమ‌నిషీ రెండు మూడు భాష‌లు, క‌నీసం మాట్లాడ‌ట‌మైనా నేర్చుకోవాల‌న్న‌ది నా అభిప్రాయం. ఇక సంస్కృత మాంటారా అది దేవ‌భాష‌. పండితులు త‌ప్ప పామ‌రులు ఆ రోజుల్లోనైనా సంస్కృత భాష‌లో సంభాషించే వార‌ని నా క‌న్పించ‌దు. అన్ని వ్యవ‌హారాలు సంస్కృతంలోకి మార్చాలంటే చాలా క‌ష్టం ఇప్ప‌టికే టి.వి.రేడియెల వ‌ల్ల హిందీకి అల‌వాటు ప‌డిపోతున్నాము. మ‌ళ్ళీ సంస్కృతం అంటే క‌ష్టం.

ప్రః-  కొంత‌మంది పురుషాధిక్య ప్ర‌పంచం అనీ స్త్రీల‌ను అణ‌గ‌దొక్కుతున్నార‌నీ అంటూ వుంటారు. దీనిమీద మీరే మంటారు.

యః-  నా మాటుకునాకు స్త్రీ క‌న్న పురుషుడు అధికంగా వుండాల‌న‌న‌దే అభిమతం. అధికం అంటే మ‌న‌నెత్తి నెక్కి స‌వారీ చేయ్య‌డం కాదు. వంటింట్లో జేరి ఓ లుంగీ క‌ట్టుకుని వంట చేస్తూ వుంటే నాకు ఇష్టం ఉండ‌దు. అలా వుంటే ఓ నౌఖ‌రుగా అన్పిస్తుందేగాని భ‌ర్త అనే గౌర‌వం ఎలా వుంటుంది ?  స్త్రీ పురుషుడూ ఆడుతూ పాడుతూ చెరోపనీ చేసుకోడంలో అందం హాయీ ఉంది. ఒక‌ర్ని ఒక‌రు అర్థం చేసుకోవాలేగ‌ని అహంకారాలు పెంచుకుని ఇంటిని న‌ర‌కం చేసుకోకూడ‌దు.

ప్రః-  అయితే మ‌న‌కంటే గొప్ప‌వాళ్ళని భ‌ర్త‌లుగా కోరుకుని మ‌న‌మే వాళ్ళకి ఉన్న‌త స్థానాన్ని ఇస్తున్నామ‌న్న మాట ?

యః- అవును అందులో మ‌న‌కెంతో నిశ్చింత‌, ధైర్యం క‌ల్గుతాయి. శారీర‌కంగా మ‌న‌కి త‌క్కువ బ‌లం వుంటుంది. మ‌న‌ల్ని ర‌క్షించే పురుషుణ్ణి బ‌ల‌వంతుణ్ణి మ‌నం ఎన్నుకోడం ఎంతో స‌మంజ‌సం. ఇక స్త్రీల‌ను అణ‌చి వేయ‌డం అనేమాట నేను ఒప్ప‌ను. గ‌డుసువాళ్ళు, మొగుళ్ళ‌ని కాల్చుకు తినేవాళ్ళు ఆడ‌వాళ్ళ‌లోనూ ఉంటారు. మ‌గాళ్ళ‌లోనూ ఉంటారు. కాబ‌ట్టి ఇది కేవ‌లం పురుషుల‌కే చెందుతుందని అన‌కూడ‌దు. స్త్రీకి ఉండే శ‌రీర ఆక‌ర్ష‌ణ న‌ల‌భై సంవ‌త్స‌రాలు వ‌చ్చేస‌రికి పోతుంది. అప్పుడు కూడా పురుషుడు భార్య‌ని గౌరవంగా చూస్తూనే ఉంటాడు. త‌ల‌పండి శ‌క్తి ఉడిగినా ఇల్లాలు భ‌ర్త చేతా పిల్ల‌ల చేతా గౌర‌వింప‌బ‌డుతూ, ప్రేమింప బ‌డుతూనే ఉంటుంది. గృహిణిగా ఆమె స్థానానికి ఎటువంటి ఇబ్బందీ లేదు అన్నారు.

డాక్ట‌ర్ య‌శోదారెడ్డిగారు స్త్రీలు ఉద్యోగినులైతే గృహాన్ని చ‌క్క‌దిద్దుకోలేక‌పోతున్నార‌న్న వ్య‌ధ‌ను వ్య‌క్తం చేశారు. ఇదివ‌ర‌కు గృహిణికి గృహ‌కృత్యాలు చూసుకుంటూ పిల్ల‌ల‌ను కాపాడుకొనేందుకు వీలువుండేది. ఇప్ప‌డు భ‌ర్త‌తోపాటే ఆఫీసుకి వెళ్ళిపోతుంది. ఇది పిల్ల‌ల‌కి స‌మ‌స్య‌, పెద్ద పిల్ల‌లకో ర‌కంగానూ ప‌సిపిల్ల‌ల‌కో రకంగానూ దీనివ‌ల్ల దుష్ఫ‌లితం క‌లుగుతూనే వుంది అంటారు. అత్య‌వ‌స‌రం అయితేనో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌ము లాభ‌దాయ‌క‌మూ అయితేనోగాని ఆడ‌వాళ్ళు ఉద్యోగాల‌కి వెళ్ళ‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌కూడ‌దు. ఇట్లు భార్యాభ‌ర్త లిద్ద‌రికి చెందింది. దాన్నెలా స్వ‌ర్గ‌ధామం చేసుకోవాలో ఆలోచించి నిర్ణయాలు చేసుకోడంలో ఇద్ద‌రూ స‌మ‌భాగ‌స్వాములే.

సంగీత‌, సాహిత్య‌, లలిత‌క‌ళా ఎకాడ‌మీ వంటి పెక్కు సంస్థ‌ల‌లో మెంబ‌ర్‌గా ప‌నిచేసి ఉస్మానియా యూనివ‌ర్శిటీలో ఆంధ్ర‌సాహిత్య‌శాఖ‌కు ప్రొఫెస‌ర్ గా చేసి రిటైరైన‌, శ్రీ‌మ‌తి డాక్ట‌ర్ య‌శోదారెడ్డి వంటి ప్ర‌తిభాశాలిని, త‌మ కౌశ‌ల్యంతో అధికార భాషా సంఘాధికారిణిగా మ‌రింత రాణించి ప్ర‌జాభిమానాన్ని పొంద‌గ‌ల‌ర‌ని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నా భావాల‌ను మీ అంద‌రితో పంచుకొంటున్నాను. సెల‌వామ‌రి !