50
 

పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి !

 

పూర్వ‌కాలం నిప్పులు క‌డుక్కునేవారు. పూర్వ‌కాలం అనేస‌రికి మ‌రీ వంద‌లూ వేలూ సంవ‌త్స‌రాలు వెన‌క్కి పోన‌క్క‌ర‌లేదు. ప‌దిహేను పాతిక సంవ‌త్స‌రాల‌కి ముందు ఆచారాలు నేటివారికి తెలీదు. ఎప్పుడూ మ‌డీ త‌డీ ఆచారం. త‌డిబ‌ట్ట‌ల తోనే వంట‌లు చేసేవారు. వంటింట్లోకి మ‌డి క‌ట్టుకోకుండా అడుగుపెట్ట‌డానికి వీల్లేదు. అవ‌కాయ‌జాడి అంద‌రూ ముట్ట‌డానికి వీల్లేదు.  దానికో వాసిన క‌ట్టాల్సిందే. ఖర్మంజాల‌క ఏ కొంగో గుడ్డపీల‌కో దార‌మ్ముక్కో అంటుకుంటే వండిందంతా అవ‌త‌ల పారెయ్యాల్సిందే. మ‌ళ్ళీ వండాల్సిందే. విస్త‌ళ్ళ‌ల్లోకి కుంభం తోడేస‌రికి ఆనాడు రెండో మూడో కొట్ట‌క‌త‌ప్ప‌దు. ఆడ‌వారు చేతులు కడుక్కునేస‌రికి చుక్క‌లు తొంగిచూసినా ఆశ్చ‌ర్యం ఉండ‌క్క‌ర్లేదు. మ‌రీ ఇంత చాద‌స్త‌మా !  అని మ‌నం ముక్కున వేళ్ళేసుకుంటాం.

నిజ‌మే ఇందులో చాద‌స్తం చాలావుంది. ఎప్పుడూ నూతిద‌గ్గ‌ర స్నానాలు చేస్తూ తడిబ‌ట్ట‌ల‌తోనూ ఉండేవారు అస్త‌మానం ముక్కు చీదుకుంటూ ఉండేవారు కాదు. ఎందుకంటే వారి శ‌రీరానికా చ‌ల్ల‌నిస్థితి అల‌వాటుప‌డి పోయేవుండేది. పిల్ల‌లు స్కూలునుంచి ఇంటికివచ్చాక పాలేరు చెంబుతో నీళ్ళిస్తే కాళ్ళు క‌డుక్కొని ముందుగ‌దిలోకి రావాలి. ముందుగ‌ది నానుకునివున్న ప‌క్క‌గ‌దిలోకి వెళ్ళి స్కూలుకి తొడుక్కెళ్ళిన బ‌ట్ట‌లు చిల‌క్కొయ్య‌కి త‌గిలించి అమ్మ‌యిచ్చిన చాక‌లి మ‌డ‌త‌లు క‌ట్టుకోవాలి ! చాక‌లి మ‌డ‌త‌లు అనేకంటే చాక‌లి ముడ‌త‌లు అన‌డం మేలు అంటే రోజువారీ తొడుక్కునే బ‌ట్ట‌ల‌కి ఇస్త్రీ ఉండేదికాదు. ఈ అల‌వాట్లు ప‌ల్లెటూళ్ళ‌లో మ‌రీ ఖ‌చ్చితంగానూ బ‌స్తీల‌లో కాస్త చూసీ చూడ‌న‌ట్లుగానూ ఆచ‌రిస్తూనే ఉండేవారు.

స్కూల్లో ఎంతోమంది పిల్ల‌లు అతి ద‌గ్గ‌ర‌గా కూర్చుంటారు. కొంద‌రు శుభ్రంగానూ కొంద‌రు అశుభ్రంగానూ ఉండొచ్చు. కొంద‌రిలో పైకి కాన‌రాని ఇన్‌ఫెక్ష‌న్స్ ఏవైనా ఉండొచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారాగాని ద‌గ్గిన‌ప్పుడో తుమ్మిన‌ప్పుడో గాని ఆ క్రిములు బ‌ట్ట‌ల‌కి అంట‌వచ్చు. వాటి ద్వారా రోగ‌క్రిములు వ్యాపించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పుడూ ఎలానూ తప్ప‌దు. ఇంటికొచ్చాకైనా మార్చుకుంటే మంచిద‌నే ఉద్దేశం ఈ ప‌ద్ద‌తిలో క‌న్పిస్తోంది.

కాళ్ళు క‌డుక్కోంటే లోనికి రానీయ‌క పోవ‌డం కూడా ఇలాంటిదే. వీధుల‌లోని దుమ్ము, ధూళీతో క్రిమివ్యాప‌క‌మ‌య్యాక ఇబ్బంది క‌ల‌గ‌క‌ముందే ముందు జాగ్ర‌త్త‌గా కాళ్ళూ శుభ్రంచేసుకుని రావ‌డం స‌ర్వ‌విధాలా మంచిది. బంధుమిత్రులు రాగానేకాళ్ళు క‌డుక్కోడానికి నీళ్ళిచ్చే ఆచారం ఆ రోజుల్లో త‌ప్ప‌కుండా పాటింప‌బ‌డేది. అర్ఘ్య‌పాద్యాలిచ్చిన త‌రువాత‌నే కుశ‌ల‌ప్ర‌శ్న‌లు !  ప‌పిపిల్ల‌ల‌కి వ్యాధిసోకే అవ‌కాశం మ‌రింత హెచ్చుగా ఉండ‌టంతో వారుండే గ‌దికి మ‌రిన్ని ర‌క్ష‌ణ‌లు చేసి పొద్దున్నా సాయంత్రం సాంబ్రాణి పొగ‌లూ దిష్టితీసిన మిర‌ప‌కాయ పొగ‌లూ పెట్టేవారు.

వంటఇల్లు బామ్మ‌గారిలో అమ్మ‌మ్మ‌గారో స్వాదీనం చేసుకునేవారు. అంతా వారిదే అద్వ‌ర్యం. మడి అనేది శుభ్రానికి మారు పేరుగా ఉండాల్సింది. కాల‌క్ర‌మేణా అస‌లు ఎందుకుద్దేశింప‌బ‌డిందో మ‌ర్చిపోయి చాద‌స్తంగా మారిపోయింది.

మంచినీళ్ళుతాగితే ఎత్తిపోసుకునే అల‌వాటు కొంద‌రికుంటుంది. గ్లాసుల‌న పెదాల‌కు క‌రుచుకు త్రాగిన‌ప్పుడు లాలాజ‌లం ద్వారా గ్లాసుకి అంటిన రోగ‌క్రిములు క‌డిగినా పోక‌పోవ‌చ్చు. అంద‌రిలోనూ రోగ క్రిములుంటాయిని కాదు. ఒక వేళ ఉన్నా తెలియ‌నిస్థితి ఉన్న‌ప్పుడు మ‌న‌కి తెలుసుకునే అవ‌కాశం ఉండ‌దు. కాబట్టి ముందే జాగ్ర‌త్త ప‌డ‌ట‌మ‌న్న‌మాట ఇలాగే వారికి ఇచ్చే టిఫిన్‌ప్లేట్స్‌, స్పూన్స్ కూడా గుర్తు తెలిసేలా వేరేర‌కానివి వుంచుకోడం ప్రత్యేక స్థ‌లంలో వాటిని ఉంచుకోడం మంచిది. ఇత‌రులు నోట్లో పెట్టుకున్న స్పూన్స్ మ‌నం వాడ‌టం మంచిదికాదు.

మ‌నం ఇంకొకరిఇంటికి వెడితే మ‌నమూ వారికి అతిధుల‌మేన‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఇలా వారికి ప్ర‌త్యేకంగా కొన్ని వ‌స్తువుల నుంచ‌డం వారిని త‌క్కువ‌చేయ‌డానికి కాదు అన్న‌ది గ్ర‌హించుకోవాలి.

కొంద‌రు బ‌య‌టఊళ్ళు వ‌స్తున్నా వెంట తువ్వాళ్ళూ, దుప్ప‌ట్లూ తెచ్చుకోరు. అలాంట‌ప్పుడు ఇల్లాళ్ళ బాధ ఇంతా అంతా కాదు. వారువెళ్ళ‌గానే వాటిని మ‌ళ్ళీ ఉతికి ఆర‌వేసుకోక త‌ప్ప‌దుక‌దా !

ఇదివ‌ర‌కులాగా ఇప్పుడీ ఆచారాల‌న్నీ పాటించ‌డం చాలాక‌ష్టం అయినా సాధ్య‌మైన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకోడం ఆరోగ్య దృష్ట్యా ఎంతోమంచిది.

ఇదివ‌ర‌కు వారు విస్త‌రిలో భోజ‌నాలు చేసి తిన‌గానే అవ‌త‌ల పారివేసేవారు. ఇప్పుడలాకాదు. గాజు ప్లేట్ల‌లోనో స్టీలు కంచాల‌లోనో పెట్టాలి. ఆ నాడొక ఆంగ్లేయుడ‌భిప్రాయ ప‌డ్డాడుట‌. హిందువులు బీద‌వారు బీద‌వారంటారు. వారు భోజ‌నం చేసిన ప్లేటును ఏరోజుకారోజే పారేసుకుంటారు. ఏ రోజు ప‌ళ్ళు తోచుకున్న బ్ర‌ష్‌ను ఆ రోజే పారేస్తారు (వేప‌పుల్ల‌) అని.

మొహానికి కాళ్ళ‌కీ పసుపు పూసుకోడం లోనూ జుట్టుకు సాంబ్రాణి పొగ వేయ‌డంలోనూ రాగితాయ‌త్తులూ క‌ట్టుకోవ‌డంలోనూ మెళ్ళో బంగారుబిళ్ళ‌ను మంగ‌ళ‌సూత్రంగా ధ‌రించ‌డంలోనూ కాళ్ళ‌కు వెండిక‌డియాలు పెట్టుకోవ‌డంలోనూ ఆవ‌కాయ జాడీకి వాసెన క‌ట్ట‌డంలోనూ ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగిఉన్నాయి. ఆ ! ఇదంతా పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి అని కొట్టివేయ‌వచ్చు మ‌న‌కు చేత‌న‌యిన‌న్ని ఆరోగ్య సూత్రాలు పాటించ‌డంవ‌ల‌న లాభ‌మేగాని న‌ష్టం ఉండ‌దుక‌దా ! మనం చేసే ప్ర‌తిప‌నీ ఎందుకు చేస్తున్నామో తెలిసి చేసుకుంటే తృప్తిగా వుంటుంది. అర్ధవంతంగానూ ఉంటుంది. మా అమ్మ‌మ్మ ఇలాచేసింది. మా అమ్మ అలాగే చేసింది, నేనూ అలాగే చేస్తాన‌నుకోడం మూర్ఖ‌మ‌నిపించుకుంటుంది. ప్ర‌తిపనిలోని మంచీ చెడ్డా గ‌మ‌నించి కాలానుగుణంగా ప్ర‌వ‌ర్తించ‌డం స‌ర్వ‌విధాలా శ్రేయ‌స్క‌రంగా ఉంటుంది. పాత‌చింత‌కాయ ప‌చ్చ‌డి ప‌థ్యానికి మంచిది.