1
 

జ‌య‌ఘోష‌

డా || దిట్ట‌క‌వి శ్యామాలాదేవి


సియావ‌ర్ రామ‌చంద్ర్‌కీ  జై ! రాధాప‌తి కృష్ణ‌చంద్ర కీ జై ! గౌరీప‌తి చంద్ర్‌చూడుకీ జై ! ప‌వ‌న‌సుత హ‌నుమాన్‌కీ జై ! ఆ విశాల భ‌వ‌నంలో శ్రీ రామ‌న‌వ‌మి పూజ అత్యంత వైభ‌వోపేతంగా జ‌రిగింది ! భ‌క్త‌జ‌న‌సందోహంలో దైవ‌ప్రేమ వ‌ర‌ద‌లై పెల్లుబికింది జై ! జై! అంటూ వారు మ‌న‌స్ఫూర్తిగా గొంతెత్తి జ‌య‌కొట్టి ఆనందించారు. వాతావ‌ర‌ణ‌మంతా దివ్య‌భావ‌న‌ల‌తో ఉత్తేజ‌భ‌రిత‌మైపోయింది ! అంద‌రూ తీర్ధ‌ప్ర‌పాదాలు తీసుకుని తృప్తిగా ఇళ్ల‌కు వెళ్లిపోయారు.

ఇక ఆ ఇంటివారు మాత్రమే మిగిలిపోయారు. ఆనంద‌రావుగారు, వారి స‌తీమ‌ణి జ‌యతి. ఆమె సోద‌రి జ‌యంతి ! మ‌నుమ‌రాలు హంసి ! జ‌యంతి చిన్న‌త‌నం నుండే అంద‌రు యువ‌తుల‌లాగా న‌గ‌లు, చీర‌లు భ‌ర్త‌, పిల్ల‌లు అనే భావంతో గాక భ‌క్తి, జ్ఞానం, వైరాగ్యం అంటూ నిరంత‌ర జ‌ప‌త‌పాల‌లో మునిగిపోయి తాను తెలుసుకున్న స‌త్యాల‌ను ప‌దిమందికీ పంచాల‌నే త‌ప‌న‌తో భార‌తదేశం న‌లుమూల‌లా ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌లో భ‌క్తి ప్ర‌ప‌త్లును వృద్ధి చేస్తూ ఒక ఉత్త‌మ‌స్థానాన్ని ఆక్ర‌మించుకొంది.

జ‌య‌తి త‌న సోద‌రిని తీసుకువ‌చ్చి వారి యింటిలో కొన్ని స‌మావేశాల‌ను ఏర్పాటు చేసి అంద‌రితోపాటుతాను కూడా త‌న చెల్లెలి వాగ‌మృతాన్ని గ్రోలాల‌ని వాంఛించింది. ఈ శ్రీ‌రామ‌న‌వ‌మి యింత అద్భుతంగా, ఆనంద‌భ‌రితంగా జ‌ర‌గ‌డంతో జ‌య‌తి సంతోషంతో ఉబ్బిత‌బ్బిల‌య్యింది.

అయితే జయంతీ ! ఎవ‌రికివారు మౌనంగా ధ్యానం చేసుకుంటే మంచిదా ?  ఇలా ప‌దిమందితో క‌లిసి పూజ చేసుకుంటే మంచిదా ?  జ‌యంతి ప్ర‌శ్న‌కు జ‌యంతి జ‌వాబు చెప్ప‌బోతుండ‌గా హంసి అడ్డు త‌గిలింది. అమ్మ‌మ్మా ముందు నా డౌటు తీర్చాక మీ అక్క‌య్య‌కి స‌మాధానం చెప్పు అంది. జ‌యంతీ ! నువ్వొచ్చాక దీనికి అనుమానాలు ఎక్కువైనాయి అన్న‌ది జ‌యంతి. ఏమిటో అడుగు హంసీ, ఇందాక పూజ అయిన త‌రువాత మా అందరిచేతా రాముడికీ, కృష్ణుడికీ, శివుడికీ అంద‌రికీ జై కొట్టించావే. అల్ప‌మాన‌వుల‌మైన మ‌నం దివ్యూలూ దేవుళ్ళూ అయిన ఆ మ‌హామ‌హుల‌కి జ‌య‌వాక్యం ప‌ల‌క‌డం ఏమిటి ?  మ‌నం జ‌య్ అన‌క‌పోతే వాళ్ళ‌కు జ‌యం క‌ల‌గ‌దా ?  మ‌నం జ‌యం ప‌లికితే వాళ్ళ‌కు వ‌చ్చే లాభం ఏమిటి ?  చెప్ప‌క‌పోతే వ‌చ్చే న‌ష్ట‌మేమిటి ?.  నాన్నా హంసీ చాలా చ‌క్క‌ని ప్ర‌శ్న వేశావు ! ఇందులో స‌మాధానం రెండుర‌కాలుగా చెప్ప‌వ‌చ్చు ! ఇది జ‌య‌తి వేసిన ప్ర‌శ్న‌కు కూడా స‌మాధాన‌మే !
భ‌క్తులంద‌రిచేతా చెప్ప‌వ‌చ్చు ! ఇది జ‌యంతి వేసిన ప్ర‌శ్న‌కు కూడా స‌మాధాన‌మే ! భ‌క్తులంద‌రిచేతా ఒక్క‌సారిగా జై అని అనిపించ‌డం వ‌ల్ల వారంద‌రు ఆ స‌మ‌యంలో భ‌గ‌వ‌దావేశ‌పూరితులౌతారు. దీనినే సామూహిక చైత‌న్యం అన‌వ‌చ్చు. ఒక్క జై అనేకాక న‌మఃపార్వ‌తీ ప‌త‌యే అని పంతులుగారు అంటే హ‌ర‌హ‌ర మ‌హాదేవ్ అని భ‌క్తులు వేనోళ్ళ‌తో అంటారు. ఇలా బిగ్గ‌ర‌గా నోరారా హ‌ర‌హ‌ర మ‌హాదేవ్ అనేట‌ప్పుడు స‌హ‌జంగా అటూ ఇటూ ప‌రుగుతీసే చంచ‌ల‌మైన మ‌న‌స్సు సామూహిక చైత‌న్యం వ‌ల్ల జ‌నించిన ఘోష‌కు ఆక‌ర్షింప‌బడుతుంది. ఇక్క‌డ ఈ ఘోషే భ‌గ‌వంతుని స్వ‌రూం ! దృశ్యానిక‌న్నా శ్రవ్యానికి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే యుద్ధానికి ముందు భ‌యంక‌రంగా శంఖారావం పూరిస్తారు. శ‌త్రువుల గుండె ఝ‌ల్లుమ‌ని ధైర్యం కోల్పోవ‌డానిక‌న్న‌మాట ! భోజ‌నకాలే హ‌రినామ స్మ‌ర‌ణ గోవిందా ! గోవిందా ! అంటూ భ‌క్తులంద‌రూ గోవింద స్మ‌ర‌ణ చేస్తారు తెల్సిందా ?  మౌనానాంద య‌తుల‌కు జ‌య అన్నారంద‌రూ. శివ‌చిదానంద భార‌తుల‌కు జ‌య అన్నారు ఉత్సాహంగా.

జ‌యంతి మ‌ళ్ళీ ప్రారంభించింది.

ఇప్పుడు చూడు, కరాటెలో కూడా ముందు గ‌ట్టిగా అరిచి త‌రువాత క‌ర‌వాటం చూపిస్తారు. ఇది స‌మాధాన‌మైతే ఒక జ‌య అనేది ఒకరి విజ‌యాన్ని ఆకాంక్షిస్తూ వ్య‌క్త‌ప‌ర‌చేమాట‌. నువ్వ‌న్న‌ట్లుగా విజ‌య‌మే స్వ‌రూపంగాగ‌ల దైవాల‌కు మ‌నం జ‌యం అన‌డ‌మేమిటి ?  వారికి జ‌యం కోర‌డం అంటే మ‌న‌లోనే వున్న దైవానికి జ‌యం కోరుతూ మ‌న‌కు కొంత విజ‌యం కోరుకుంటున్నామ‌న్న‌మాటే. విష్ణువుకి జ‌య‌రూపుడ‌నేనాయం ఉంది. సూర్యుడిని జ‌యాయ జ‌య‌భ‌ద్రాయ అంటున్నాం. అమ్మ‌వారిని జ‌య‌త్వం అని ఆరాధిస్తున్నాం. ఈ జ‌య అనేది స‌ర్వదేవ‌త‌ల యొక్క స్వ‌రూపం. ఇంకొక్క‌మాట‌. వాల్మీకి మ‌హ‌ర్షి రామ రామ అనే రామ నామాన్ని తిర‌గవేసి మ‌రామ‌రా అని జ‌పం చేశాడు. ఒక్క‌మాటు నువ్వు గ‌బ‌గ‌బా జ‌య‌జ‌య‌జ‌య అని అను. హంసి జ‌య‌జ‌య‌జ‌య అని త్వ‌ర‌త్వ‌ర‌గా అని ఆశ్చ‌ర్యంగా అమ్మ‌మ్మా ! జ‌య కాస్తా య‌జ అయ్యింది అంది.  అదీ అస‌లు సంగ‌తి. య‌జ అంటే య‌జ్ఞం చెయ్యి అని అర్ధం. ఏ దైవ‌నామానికి జ‌యం ప‌లుకుతున్నామో ఆ దైవ‌నామాన్ని య‌జిం అని అర్థం. నామాన్ని య‌జించ‌డ‌మేమిటి అనుకుంటున్నావు క‌దూ. ఆత్మ అగ్ని. అంటూ చైత‌న్యం. హృద‌యం ఆధారం. మ‌న‌స్సు య‌జ్ఞ‌కుండం. మ‌నోయ‌జ్ఞ కుండుంలో రామ‌నామ స‌మిథ‌లు. రామ‌చరిత‌మే గోఘృత‌ము. ఇద‌న్న‌మాట జ‌య‌రామ అంటే అర్ధం. య‌జ అని నీలేనే వున్న నిన్ను నీవు వ్య‌క్తిప‌రుంగానూ, సామూహికంగానూ హెచ్చ‌రించుకోవ‌డ‌మే జ‌య‌ఘోష యొక్క ప‌ర‌మార్ధం. హంసి అనుమానం తీరి లోప‌లికి వెళ్ళిపోయింది.

జ‌య‌తి జ‌యంతి కూర్చుని, చ‌ర్చించుకుంటూండ‌గా హంసి త‌న స్నేహితురాళ్ళ‌తో క‌ల‌సి వ‌చ్చింది. అమ్మ‌మ్మా నా స్నేహితురాళ్ళు వేద‌వ‌తి, గాయ‌త్రి అని ఇద్ద‌ర్ని ప‌రిచ‌యం చేసింది. ఎన్ని యుగాల‌నాటివాళ్ళో అంది జ‌యంతి న‌వ్వుతూ...అదేమిటి వీళ్ళ‌కింకా ఇర‌వై ఏళ్ళ‌న్నా రాలేదు అంది హంసి. లేదు ఇద్ద‌రూ స‌నాతనులే అయితే వీళ్ళ‌ను చూస్తూంటే వేదం ముందా ?  గాయ‌త్రి ముందా అని ఆలోచిస్తున్నాను అంది జ‌యంతి. వేద‌మే ముందండీ అంది వేద‌వ‌తి ! అదెలా గాయ‌త్రి లేకుండా వేదం లేదే ?  అంది జ‌యంతి. అయితే గాయ‌త్రి ముందు క‌దండీ, గాయ‌త్రి సంతోషంగా అంది. వేదం లేంది గాయ‌త్రి ఎలా వుంటుంది ? హంసి గారాబంగా అంది.

నువ్వే చెప్పు అమ్మ‌మ్మా ! మాకేం తెలుస‌ని ?  మ‌న మొద‌టి వేద‌మైన ఋగ్వేదంలో మొద‌టి మండ‌లంలో మొద‌టి అనువాకంలో మొద‌టి మంత్రం మ‌ధుచ్చ‌న్దా ఋషిః అగ్నిర్దేవ‌తా గాయ‌త్రీ ఛ‌న్దః అని వుంది. అబ్బ మ‌ధుచ్చ‌న్ద అన్న పేరు బాగుంది. గాయ‌త్రీ నీకు కొడుకు పుడితే మ‌ధుచ్చ‌న్ అని పేరు పెట్టుకోవే. ఇంత పెద్ద‌వాళ్ళ ద‌గ్గ‌ర‌కొచ్చి నీ పిచ్చివాగుడేమిటి గాయ‌త్రి విసుక్కుంది. అమ్మ‌మ్మా అయితే అక్ష‌ర‌బ‌ద్ద‌మ‌యిన మొద‌టి ఋషి మ‌ధుచ్చందుడు. మొద‌టి దైవం అగ్ని, మొద‌టి ఛంద‌స్సు గాయ‌త్రి. ఓహో ఎన్ని యుగాల‌నించి ఈ గాయత్రి ప‌రంప‌ర‌గా వ‌స్తోంది. అయితే అమ్మ‌మ్మా ! ఆత్మే అగ్ని అని ఇందాక చెప్పావు క‌దా. ఆ అగ్నే ఈ వేదంలో చెప్ప‌బ‌డ్డ అగ్నీ ఒక్క‌టేనా ?

హంసీ ! వేదంలో చెప్ప‌బ‌డ్డ అగ్ని ప‌ర‌మాత్మ స్వ‌రూపం. ఆత్మ అనేది ఒక జీవునికి సంబంధించిన‌ది. దీనినే జీవాత్మ అంటారు. అయితే జీవాత్మ ప‌ర‌మాత్మ ఒక్క‌టా వేరు లేరా ?  గాయ‌త్రిని చూసి జ‌యంతి న‌వ్వింది. అమ్మాయీ జీవాత్మ‌ని గురించి ప‌ర‌మాత్మ‌ని గురించీ వారి ఏక‌త్వాన్ని భిన్న‌త్వాన్ని గురించి వేదం పుట్టిన‌ప్ప‌టి నుండి, గాయ‌త్రి పుట్టిన‌ప్ప‌ట్నుండి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌హామ‌హులు, యోగులు, ఋషులు, సిద్ధ‌పురుషులు ఎన్నో మ‌హావిష‌యాలు చెప్పారు. కొంద‌రు ఒక్క‌టే న‌న్నారు, కొంద‌రు రెండ‌న్నారు. అమ్మమ్మా నువ్వేం చెప్తావో చెప్పు. వారేమ‌న్నారో మాకు చెప్పి మ‌మ్మ‌ల్ని కంగారు పెట్ట‌కు అంది హంసి. త‌ల్లీ ఒక మ‌హాన‌ది ఉంది లేదా స‌ముద్రం ఉంది. వాగుల‌క‌న్నా కాల‌వ‌ల‌క‌న్నా, న‌దుల‌క‌న్నా, స‌ముద్రం ఎలాగైతే అతి పెద్ద జ‌లాశ‌య‌మో....ఆ....ఆ...తెలిసింది...ప‌ర‌మాత్మ‌కూడా కొన్ని గొప్ప‌గొప్ప ఆత్మ‌ల ఆత్మాశ‌యం...అంతేనా...?  హంసీ ! అమ్మ‌మ్మ‌ను చెప్పనివ్వు జ‌యంతి విసుక్కుంది. హంసీ నీ ఆత్మాశ‌యం ఏమిటంటే నీ ఆత్మ‌ను నువ్వు ప‌ట్టుకోవ‌డ‌మే క‌దా జ‌యంతి న‌వ్వింది.

స‌రే అమ్మ‌మ్మా ! చెప్పు ! ఆ హిడెన్ ట్రెజ‌రీని అంటే గుప్త‌నిధిని త‌రువాత క‌నుక్కుంటాగాని.....ఏదో స‌ముద్రం అన్నావు ?  ఆ.....స‌ముద్రం ద‌గ్గ‌ర‌కు నువ్వు, వేద‌వ‌తి, గాయ‌త్రి, జ‌యంతి నేను వెళ్ళాం అనుకో. మ‌న‌మంద‌రం ఒక‌రు సీసాతోను, ఒక‌రు వెండిగ్లాసుతోను, ఒక‌రు  మ‌ర‌బెంబుతోను  ఆ స‌ముద్రంలోంచి నీళ్ళు తెచ్చాం. అప్పుడు మ‌నం తెచ్చిన నీళ్ళ‌ను ఏమంటాం ?  స‌ముద్రం అంటామా ? అనం. అంటే అవి స‌ముద్రం నీళ్ళేగాని స‌ముద్రం కాదుక‌దా ! ఆ నీళ్ళ‌కి పేరులేదు. అన్నీ నీళ్ళే కాని మ‌నం చెప్పుకోవాలంటే గుర్తుగా ఆ నీళ్ళ‌గ్లాసు ఇలా ప‌ట్టుకురా అంటాం ! ఆ చెంబు ప‌ట్టుకురా అంటాం. ఆ సీసా ప‌ట్టుకురా అంటాం ! అంటే ఆధారం గ్లాసు. అంటే నీళ్ళు నిలిచేందుకు గ్లాసు ఉప‌యోగప‌డింది. ఆధేయం నీరు. ఆధారాన్ని ఆస‌రాగా చేసుకుని నిలిచింది. నాకిప్పుడు తెలిసిపోయింది. పెద్ద అగ్ని స్వ‌రూపుడు ప‌ర‌మాత్మ అయితే గ్లాసు, చెంబు, సీసాల్లాగ నువ్వు, నేను, గాయ‌త్రి, వేద‌వ‌తి, అమ్మ‌మ్మ‌. మ‌న‌లో ఉండే ఆత్మ అంటే చైత‌న్యం. ప‌ర‌మాత్మ యొక్క అగ్ని తున‌క‌లే. హంసి మాట‌ల‌కు జ‌యంతి ఆశ్చ‌ర్య‌పోయింది. జ‌యంతీ ! నువ్వు కుటుంబానికి కాకుండా పోయావు - ఇక హంసిని కూడా నీ దార్లోకి లాక్కుపోకు. జ‌య‌తీ నువ్వు భ‌య‌ప‌డ‌కు, హంసి లోని జీవుడు సామాన్యుడు కాడు. గ‌త‌జ‌న్మ‌లో ఎంతో సాద‌న‌చే...అమ్మ‌మ్మా ఆగు నేను స్త్రీని. నాలో జీవుడు పురుషుడా, ముందు భోజ‌నం చెయ్యండి, త‌ర్వాత ఈ చ‌ర్చ అంద‌రూ లేచారు.