12
 

గండ‌ము త‌ప్ప‌క ఏమ‌గును ? చిన్న ప్ర‌భువులు కార‌ణ‌జ‌న్ములు. అన్ని ఆప‌ద‌లు వాటంత‌ట అవే తొల‌గిపోక త‌ప్ప‌వు.

అచ్యుత : చెవ్వ‌ప్ర‌భువులు మ‌నుమ‌ని వేయిక‌న్నుల క‌నిపెట్టి యుండుమ‌ని అనేక‌మారులు చెప్పియున్నారు.ఇప్పుడు ర‌ఘునాథునికి రాహుద‌శ జ‌రుగుతున్న‌ది. ఇందు, కుజాంత‌ర్ద‌శ ప్ర‌వేశించుట చేత‌నూ, కుజ రాహువుల‌కు ష‌ష్టాష్ట‌క‌ముల‌గుట చేత‌నూ, మార‌క‌ద‌శ‌గాని అంత‌కు దారి తీయు ప్ర‌మాద‌ములుగాని క‌లుగ‌వ‌చ్చును, అని తండ్రిగారు భ‌య‌పడినారు.

గోవింద : నిజ‌మే, శాస్త్ర‌మ‌లాగే ఉంది. కానీ, అనుభ‌వ‌ము కూడా జోడించి చూడాలి. అర్ధాల‌లో ఎన్నో అంత‌రార్ధాలు ఉంటాయి. రాహుస్థిత రాశ్యాధిప‌తి కుజునితోడ‌నూ ఉచ్ఛ‌యందున్న సూర్యుని తోడ‌నూ క‌లిసి రాజ్య‌స్థాన‌ము నందుండుట వ‌ల‌న ప్ర‌మాద‌ముల వ‌ల్ల కాలిలో ముల్లు దిగినంత‌కూడ బాధ క‌లుగ‌దు, స‌రిక‌దా విప‌రీత రాజ‌యోగ‌ముగా కూడ ప‌రిణ‌మించ‌వ‌చ్చును. కాగా, క‌ర్కాట‌క ల‌గ్నానికి కుజుడే సంపూర్ణ యోగ‌ప్ర‌దుడు. ఇత‌డు స్వ‌స్థాన‌మునందు ఉచ్ఛ‌యందున్న కుటుంబాధిప‌తితో కూడి క‌న్యాలాభ‌మును కూడ సూచించుచున్నాడు. ఈ స‌త్య‌ము త‌మ‌కు నిర్ధార‌ణ అయింద‌నుకుంటాను.

అచ్యుత : అమాత్యా ! ఇక మీరు నిర్ణ‌యించిన సుముహూర్తాన‌కు నా చిట్టి తండ్రికి అధికార‌ము ద‌త్త‌త‌చేస్తాను. పుత్రార‌మ్మ‌ని ముద్దుటుంగ‌ర‌మిచ్చి మా నాయ‌క‌రాజుల సంప్ర‌దాయాన్ని నిల‌బెడ‌తాను.

గోవింద : శుభం ! శుభం ! అలాగే జ‌రుగ‌నిద్దాం. ప్ర‌భువుల వారు కూడ నా విన్న‌పాన్ని వినాలి. త‌మ‌ను కేవ‌లం ఆవేశ‌పూరితుల‌ను చేయాల‌నే తీక్ష‌ణంగా మాట్లాడ‌డం జరిగింది. తాము అన్య‌దా భావించ‌రాదు.

ముగ్గురి హృద‌యాలూ స్వ‌చ్ఛ‌మైన తెలిగ‌న్నేరుల‌వ‌లె, ఆనందంగా న‌వ్వుకున్న‌వి.

నాయ‌నా ! క‌ళావ‌తీదేవీ, రామ‌భ‌ద్రాంబా ప‌తిదేవుల కుశ‌ల‌ము తెలియ‌క అగ్గ‌లాడుచున్నారు. వారిని ఆశ్వాసించుట‌కు త‌క్ష‌ణ‌మే బ‌య‌లుదేరు.

ర‌ఘునాథుని చూచిన‌పుడెల్ల గోవిందుల వారికొక దృశ్య‌ము హృద‌య సీమ‌లో క‌దులాడి సంత‌స‌ము క‌లుగుతూ ఉంటుంది.

ర‌ఘునాధున‌కు అయిద‌వ సంవ‌త్స‌ర‌ము వ‌చ్చిన వెంట‌నే మ‌హారాజు బాలునికి అక్ష‌రాభ్యాస‌ముకేర్పాటు చేసినారు. ర‌ఘునాధుడ‌ప్పుడు ఉన్న‌తాస‌న‌మున త‌న ప్ర‌క్క‌న కూర్చండ‌క‌, ఒడిలో కూర్చుని మాత్ర‌మే అక్ష‌రాలు దిద్దుతాన‌ని ప‌ట్టుప‌ట్టినాడు. అంత‌క‌న్న మ‌హ‌ద్భాగ్య‌మున్న‌దా ! య‌ని తాను ప్రేమ‌తో అక్కున జేర్చుకొని, శిర‌సు మూర్కొని, శ్రీ మాత చ‌ర‌ణ స‌న్నిధాన‌మును మ‌దిలో త‌ల‌చుకొనుచు, ఓం న‌మ‌శ్శివాయ‌, అవి వ్రాయించ‌బోయినాడు. నాయ‌నాగారూ ! మ‌న‌ము శివ‌భ‌క్తుల‌ము కాముక‌దా ! ఓం న‌మో విష్ణ‌వే అని వ్రాయాలిక‌దా ! అన్నాడా బాలుడు, ముద్దులొలుకుతూ, అహొ ! ఏమి జ్ఞానేచ్ఛ ! ఎంత మంచి ఉచ్ఛార‌ణ ! మ‌దిని తాను న‌మ్మిన‌ది గాని చేయ‌న‌న్న దృఢ సంక‌ల్ప‌ముగ‌ల ఈ బాలుడు త‌న జ‌న్మ‌ను త‌రింప‌జేయ‌డానికి పుట్టిన వాడు కాడూ ! అమాత్య‌వ‌రుల గుండెలో అమృతోద‌ధి మ‌హొత్తుంగ త‌రంగ‌యై ప‌ర‌వ‌ళ్ళు త్రొక్కిన‌ది.

త‌దాది సంద‌ర్భ‌ము వ‌చ్చిన‌పుడెల్ల శివ‌కేశ‌వుల‌కు భేద‌ము లేద‌ని తెలియ‌జేయు గాథ‌ల న‌నేక‌ముల‌ను చెప్పి యాత‌ని మ‌దిలో రేకెత్తు జిజ్ఞాస‌ను తీర్చుచూ భ‌గవంతుడు ఒక్క‌డే అన్న అచంచ‌ల భావ‌మును క‌లుగ‌చేయ‌గ‌లిగినా...ఈత‌డు మ‌హా మేధావియ‌ని ప్రేమించుట లేదు. ఈత‌డే క‌ళా సంప‌న్నుడ‌ని స‌మాదరించుట లేదు. లేదా, మ‌ది న‌చ్చిన ప్రియ‌శిష్యుడ‌ని లాలించుట‌లేదు. ఆ బాలుడు త‌న‌తో అభిన్నుడు. పుత్ర స‌మానుడు. ఆ ఇరువురి హృద‌య‌ముల‌లో నొక్క‌రీతిగా భాసించు ఆ శ్రీ రామ‌చంద్రుడే వారిరువురునూ అంత ఆత్మీయుల‌ను చేసినాడు.

4

ప్రాత‌స్సంధ్య క‌న‌కాంబ‌ర ధారిణియై స‌ర్వ‌శోభాయ మాన‌ముగ న‌వ‌త‌రించిన‌ది. వేద‌పండితులు ఉషోదేవికి సుస్వాగ‌త మంత్ర‌మ‌లు ప‌లికినారు. జ‌య‌భేరీ శంఖ‌కాహళ‌నాద - స్వ‌రాది మంగ‌ళ వాద్య‌ముల‌తో పాటుగ ర‌ఘునాథ భూపాలుని క్షేమ‌వార్త‌, యౌవ‌రాజ్య ప‌ట్టాభిషేక‌వార్త ప్ర‌జ‌ల‌కు శ్ర‌వ‌ణ పేయంగా నిన‌దించిన‌వి.

స‌ర్వ‌రాజ్య పాల‌కుల‌కు ఆహ్వాన‌ములు పంప‌బడిన‌వి. ప్ర‌తి నిధులు మ‌హొత్స‌వ‌మున‌కు వ‌చ్చుట‌కు త‌గినంత వ్య‌వ‌ధాన‌ము లేకున్న‌నూ, ర‌ఘునాథుల ప‌ట్టాభిషేక వార్త తెలియ‌జేయ‌వ‌లెనన్న ధ్యేయ‌ముతో ఆహ్వాన‌ములు పంపిరి.