దుర్యోధనుడు భీష్మ, కృప, కర్ణ, వికర్ణులదెస చూచినాడు.
నేను అదివరకే చెప్పాను జ్ఞాపకం ఉందో లేదో ? జూదంలో ఓడిపోయి, పాండవులు పన్నెండేళ్లు వనవాసము పదమూడోయేట జనపదంలో, మనం ఎరుగకుండా ఉండేటట్లు వసించాలనే కదా రాజ్యం విడిచిపోయారు ? ఈ పదమూడో ఏడు పూర్తిగాకుండా అర్జునుడు బైటపడితే, తిరిగి ఎప్పటిలాగ వనవాసానికి వెళ్లవలసిందే. అయితే బైటపడడమనేది మనం మన కాంక్షవల్ల వాళ్లను కనుగొనడం వల్ల నైనా కావచ్చు లేదా వారే వారి లోభంవల్ల బైటపడవచ్చు.
అజ్ఞాతవాస సంవత్సరం సమాప్తం అయిందో లేదో ఎక్కువ తక్కువలు నిశ్చియించడానికి తాతయ్యే అర్హుడు. సరియైన విషయం తెలుసుకోడానికి అర్జునుడు కూడా ఉండడం మంచిదే. సుశర్మను అక్కడ గోవులను పట్టమనడం, మనం ఇక్కడ గోగ్రహణం చేయడం, మత్స్య నగరంలో పాండవులు ఉన్నారని సందేహించి, ఒకవేళ ఉంటే వాళ్లు యుద్ధానికి తప్పక వస్తారు కదా, బైటపడతారు కదా అనేకదా మనం ఈ పనిచేశాము.
ఇప్పుడు విచారము ఎందుకు ? అర్జునుడైతే యేమి ? అని మేషులైతే యేమి ? మనం గోవులనుపట్టాము, ఎవరొచ్చినా బాహుబలం చూపిస్తాము. అంతేగాని అవతలవాడి శక్తి సామర్థ్యాలు ఊహించుకొని వెలవెలపోతామా ? మనస్సుల్లో ధైర్యం చిక్కబట్టి, అనుమనాలను పారద్రోలి, వాహనాలు ఆయుధాలు ఆయుత్తపర్చుకొని యుద్ధానికి తలపడాలిగాని, శత్రవులు చూచి ఇలాగ ఒకరి మొగం ఒకరు చూసుకుంటూ కూర్చుంటే అవుతుందా.
నాకు మాత్రం వనకు జయంతథ్యం అనిపిస్తోంది. ధర్మరాజు తమ్ముడు ఒక్కడూ ఈ సైన్యాన్ని గెలవగలడా ? ఎవరైనా వింటే నవ్విపోతారనన్నా ఎరుగడా ఆచార్యులవారు. నా ఎదుట అర్జునుణ్ణి ఘనంగా చిత్రించి సైన్యాలు భయపడేట్లు పిరికి మాటలు మాట్లాడుతున్నాడు ద్రోణుడు. రోషమన్నా ఉండాలి. రాజ్యాభిలాష అయినా ఉండాలి.
ఈ రెండూ లేకపోతే ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు ? కారణం ఏమీ కనుపించదు. శత్రవుని పెద్దజేసి వందిపొగడినట్లు ఎందుకలాగ పొగుడుతాడీయన. ఆచార్యులైనవారు ఊరికే దూరాన్నుంచి చూస్తూంటూరు ! అంతే ! బుద్ధిమంతులు ఇళ్ల కడనే ఉండి బాగా భోజనం చేస్తూ, ఆయుధాలతో పరిశ్రమ చేస్తూ నీతి శాస్త్రాల్లో గోష్టి చేస్తూ కాలక్షేపం చేస్తారుగాని పోట్లాడే వారు కారు ! వారిని రణభూమికి తీసుకువచ్చి నిలబెట్టడం కన్న, వెనుకనే వదిలివేస్తే వారు మన విజయాన్ని కోరుతూ ఉంటారు అది మంచిది అని దుర్యోధనుడు ద్రోణాచార్యుని ఆక్షేపించాడు.
గోవుల్ని కాపలా కాసే గొల్లవాళ్లను పారద్రోల గోవులను పట్టుకొన్నానని ఎందుకీ తెలివి తక్కువ ప్రేలాపం ? అని ఇంకా ఊళ్లోకి తిరిగి వెళ్లెవేళయినా కాలేదు ! నువ్వు చూపించిన ప్రతాపం ఏమున్నది. ఇంతవరకూ, యుద్ధంలో శౌర్యంతో పరుల రాజ్యం పుచ్చుకొన్నప్పటికి కూడా సజ్జనుడు నువ్వు మాట్లాడినట్లుగా మాట్లాడడు. జూదంవల్ల సరిసంపాదించి ప్రగల్భాలెందుకు ? ఇదుగో ఇప్పుడు సమయం వచ్చింది. ఇక పాత పద్దతి చెల్లదు. పాండవులను బాహుబలంతో గెలిచిన తరువాతనేనా నువ్వు ద్రౌపదిని సభలోకి ఈడ్చించగలిగినది ? అదంతా శకునితంత్రం కాదా ? ఇప్పుడు ఈ విరోధిని కూడా మీ మేనమామయే గెల్చిపెడతాడు ?
బాగా మదమెక్కి నువ్వు నా తండ్రిని ఆధిక్షేపస్తే అధిక్షేపించవ్చు. దానికేం, దేవదానవులక్కూడా దుర్జయుడైన అర్జుణున్ని నువ్వు కన్నెత్తి చూడగలవా ? ప్రవర్తనకూ, పరాక్రమానికీ అధికుడైనవాణ్ణి ఎవరు బడితేవారు మెచ్చుకోవాలి కదా ! తన ప్రియ శిష్యుణ్ణి గురువు మెచ్చుకొంటే తప్పా ? సిగ్గుమాలి, మా నాన్న రణం చేస్తే చేస్తాడేమోగాని, నాకు మాత్రం మిక్కిలి రోతగా ఉంది. ఈ వ్యవహారం ప్రళయాన్నైనా, బడబాగ్నినైనా, మృత్యువునైనా ఎదిర్చి తప్పించుకోవచ్చునేమోగాని, అర్జునుడీ అస్త్రాలు మాత్రం సమూలంగా నాశనం చేస్తాయి. ఇక్కడ కుటిల బుద్ధి చెల్లదు. బాహుబలం కావాలి. అతడు గాంఢీవంతో జూదరి పాచికలు చేయడు. బాణవర్షం కురిపిస్తాడు ! అందుచేత ఇప్పుడు గోవులను విడిపించడానికి విరాటరాజు వస్తే యుద్ధం చేద్దాం, అర్జునుడే వస్తే అతని పొంతకు పోదాం అన్నాడు అశ్వత్థామ, రుసరుసలాడుతూ.
కర్ణుడు కోపోద్ధీపితుడయాడు.
గోగ్రహణం చేద్దాం అని ఒప్పుకొని పాండవులు ఇక్కడ ఉన్నారేమో చూద్దాం అని వేడుక పడి అంతా ఇక్కడికి వచ్చారు. తీరా వచ్చాక ఇప్పుడు అర్జునుణ్ణి చూచి, అతణ్ణి తెగ పొగుడుతూ, భయపడుతూ, మన రాజుకి ఇలాగ పిరికి మందు పోయడం బాగున్నదా ? మీకు భయం అయితే ఊరుకోండి. ఒక్క వీరుడికి ఒక్కడే చాలు. ఎంతమంది కావాలి ? అర్జునుణ్ణి నేనొక్కణ్ణో జయిస్తాను. మీరంతా చూస్తూ ఉండండి. అతడు పదమూడేళ్లు తరువాత కయ్యానికి వస్తున్నాడు. అతని శక్తి సామర్ధ్యాలు లోకంలో ప్రసిద్ధికెక్కాయి. కౌరవ సైన్యంలో శక్తి శౌర్యాలు కలవాడిలా నేనూ ఎన్నబడుతున్నాను కదా ! కనుక మేము ఇద్దరము బాహుబలము, విక్రమము ఒకళ్లకొకళ్లు చూపించుకోవడం ఉచితం. అను దినమూ అంతకంతకు పెరుగుతూన్న రాజానుగ్రహ అప్పు తీర్చడం, అర్జునుణ్ణి యుద్ధంలో ఓడిస్తానని నేను పదే పదే రాజుకు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చడం, కర్ణార్జునుల్లో ఎవడు ఘనుడా అనే ప్రజా సందేహం నివారించడం, పరశురాముడి శుశ్రూష చేసి నేర్చిన విలువిద్యలోని నిజస్వరూపం చూపడం అన్నీ నేడు సమకూడాయి నాకు ! ఇది నాకెంతో పుణ్యదినం. మీకు యుద్ధం చూడాలని ఇష్టమైతే చూడండి. చూడాలనే వేడుక లేదంటారా, పశువుల వెనకాలపొండి అన్నాడు కర్ణుడు క్రోధంతో.
నువ్వెప్పుడూ కజ్జాకు కాలు దువ్వుతావు. అంతేగాని కార్య సాధన ఎలాగో ఎరుగవు. బుద్ధిమంతులు కార్యసాధనపట్ల యుద్ధ పద్ధతి గొప్పదిగా ఎంచరు. దేశ కాల ప్రాంతములను బట్టి సమరం చేస్తే ఫలిస్తుంది కాని తన అంతరం ఎదుటివారి అంతరం తెలుసుకోకుండా మోటుగా తెలిస్తే మొదలు చెడి తుదకు అనర్థం కాక తప్పదు. అర్జునుడు ఒక్కడే కదా అనుకుంటున్నావు కాబోలు. దేవేంద్రుడు ఆగిగా గల అమరులతో పోరాడి ఖాండవ వనాన్ని దగ్థం చేసింది అతడొక్కడే కదా ! యాదవుల బలాన్ని అణచివేసి సుభద్రను తీసుకుపోయింది అతడొక్కడేనన్న సంగతి తెలుసా ? ఈ కురు వంశానికి దిగ్విజయాల వల్ల తేజస్సు చేకూర్చింది అతడొక్కడేనని మరచావా ? ఆనాడు గంధర్వ రాజును ఓడించి దుర్యోధనుణ్ణి విడిపించింది. అతడొక్కడేనని జ్ఞాపకం ఉన్నదా ? నినాత కవచులనేవాళ్లునూ, కాలకేయుల్నీ చంపింది అతడొక్కడేనని ఎరుగనా ? అంతవరకూ ఎందుకు ? రాజులంతా ఏకమై, ద్రౌపది కోసం, అతనితో పోరాడి చావుదెబ్బలు తిని పారిపోయినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావో లేవో నిజం చెప్పు.
కర్ణా ? పాండువులంతా, విడివిడిగా శత్రు రాజులను జయించి తను తను పరాక్రమాన్ని చాటారు. నువ్వు మాత్రం ఇక్కడే పరాక్రమాన్ని మహోగ్రమైన మాటలతో చాటుతున్నావు ! నీకెందుకా వృధా గర్వం ? అర్జునుడితో ఒంటరిగా పోరాటం అంటే ఎటువంటిదో గ్రహించు. వరద నదిని వట్టి చేతులతో ఈదడం వంటిది. అగ్నిలో దుముకుట లాటిది. వాసుకి కోరలు పీకడానికి ప్రయత్నించినట్లుంటుంది. పెనుగాలిలో రగుల్కొన్న దావానలాన్ని ఆర్పేందుకు ఒక్క మనిషి సరిపోతాడా ? సాహసం కూడదు.
సాహసం వల్ల ఈ పని కాదు. రాజును ఎలాగ కాపాడాలో అలాగ కాపాడాలి. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, నువ్వూ, నేనూ అంతా ఏకమై ఒక్కుమ్మడిగా అతనితో తలపడదాం. దేవేంద్రుడు కూడా అతనితో ఒంటరిగా పోరాడలేడు అని కృపాచార్యులు కర్ణుడికి ఇంగితం భోదించినాడు.
నీకెప్పుడూ లోలోపల తన శత్రువుల యందే ఎక్కువ మమత అని ఎరిగి ఉండిన్నీ, రాజు నిన్ను తోడుగా తీసుకురావడం తెలివితక్కువతనం , నీవూ, నీ పిల్లలూ, నీ చుట్టాలు రాజు సొమ్ము కుత్తుకలో వేలు పెడితే అందే వరకూ ఇన్నాళ్లు తెగ తిని బ్రతుకుతూ, దేహాలు పెంచారు. తీరా రణ సమయం వచ్చే సరికి పిరికిపందల్లా ఒదుగుతున్నారు.
|