36
 

స్వ‌యంప్ర‌భ‌

 

య‌శోవ‌తి న‌వ‌ల‌లోని స్వ‌యంప్ర‌భ గాంధార రాజ‌కుమారి. కాశ్మీరాధిపుడైన దామోద‌రుని మ‌ర‌ద‌లు. కృష్ణ ప్రేమికురాలు. స్వ‌యంప్ర‌భ త‌న గాంధ‌ర్వ‌గాన‌ముతో ప్ర‌జ‌ల‌ను మ‌నోవైక‌ల్య‌ముల‌నుండి తొల‌గించి స్వాంత చిత్తుల‌ను చేయుట‌యేగాక త‌న‌నుతాను కృష్ణునక‌ర్పించికొనిన ధ‌న్యురాలు. వివాహ‌మాడ‌క త‌న జీవిత‌మును కృష్ణ‌గాన ప‌రిపూత‌ము గావించుకొన్న‌ది స్వ‌యంప్ర‌భ‌.

స్వ‌యంప్ర‌భ గాంధార‌రాజున‌కు వ‌య‌సుమీరిన త‌రువాత పుట్టిన‌ది. గాంధార‌రాజైన దామోద‌రుడు త‌న‌కొక మ‌ర‌ద‌లు క‌లుగ‌వ‌లెన‌ని ముచ్చ‌ట ప‌డెడివాడు. స్వ‌యంప్ర‌భ పుట్టుస‌రిక‌త‌నికికూడ పెద్ద‌వ‌య‌స్సు వ‌చ్చిన‌ది. ఆమె బాధ్య‌త‌ను వ‌హింప‌వ‌లెన‌ని దామోద‌రుడు మోజుప‌డుచుండెడివాడు. మ‌ర‌ద‌ల‌నిన‌చో న‌త‌ని హృద‌య‌మున సున్నిత‌ముల‌గు తంతువులు వీణానివ్వాణ‌మును చేయుచుండును. దామోద‌రుడు కృష్ణ విరోధి. వైష్ణ‌వ మ‌త‌విరోధికాడు. కృష్ణునితో వ్య‌క్తిగ‌త వైర‌ముగ‌ల‌వాడు.

స్వ‌యంప్ర‌భ‌కు ప‌దునైదు సంవ‌త్స‌ర‌ములు వ‌చ్చుస‌రికి ప‌ర‌మ సౌంద‌ర్య‌వ‌తియైన‌ది. ఆమె స‌ర్వాంగ‌ముల‌యందున ల‌క్ష్మి తాండ‌విచుచుండెను. త‌న‌కొక ప్ర‌త్యేక‌మైన గుహ‌ను పూజాగృహ‌ముగ మార్పుచేసికొనిన‌ది. ఆ గుహ మిక్కిలి ర‌మ‌ణీయ‌మై యొప్పారుచుండెడిది. తుల‌సివ‌నంతో ర‌సాల‌వృక్ష‌ముల‌తో క‌ద‌శీత‌రుక‌దంబముల‌తో మ‌ల్లికాల‌త‌ల‌తో చంద్ర‌కాంత శిలానిర్మిత‌మైన పూజాగ్ర‌హ‌ముతో నాగుహ వైకుంఠ‌మువ‌లెనుండెడిది. స్వ‌యంప్ర‌భ పూచిన ల‌త‌వ‌లె వైష్ణ‌వీ చిహ్న‌ముల‌తో న‌ల‌రారుచుండ‌గా వ‌స్తుత‌తికూడ త‌చ్చిహ్న‌ములే యుందుట దామోద‌రున కాశ్చ‌ర్య కార‌ణ‌మైన‌ది. ఆమె వ‌క్ష‌స్థ్స‌ల‌మున విష్ణుకుమారుడైన మ‌న్మ‌థుడు ప్ర‌త్యాలీఢ‌పాదుడ‌గుట‌కు స్థావ‌ర‌మైన‌ది. ఆమె న‌డుము స‌న్న‌నై యెగిచిత్త‌మువ‌లె నుండీయుండ‌న‌ట్లుండెను. క‌నుబొమ‌లు అల్లెత్రాడు బిగించిన సారంగ‌మువ‌లెనుండ‌గా నాసిక వైకుంఠ న‌గ‌ర దేహ‌శీద‌త్త చంప‌క కుసుమ‌ముల వ‌లెనుండెను. మంద‌హాస‌ము సుద‌ర్శ‌నాయుధ ప్ర‌భ‌ల‌వ‌లె రోచిస్సుల‌ను వెద‌జ‌ల్లుచుండెను. గిరికాదేవి సౌంద‌ర్య వ‌ర్ణ‌న‌మును స్వ‌యంప్ర‌భ సౌంద‌ర్య వ‌ర్ణ‌మును వైష్ణ‌వ చిహ్నిత‌మ‌గుట గ‌మ‌నార్హ‌ము. స్వ‌యంప్ర‌భ నివసించు గుహ తుల‌సి వ‌న‌ముతో శంఖు చ‌క్ర‌ములు కుట్ట‌బ‌డిన ప‌ట్టు దుప్ప‌ట‌ముల‌తో నిలువెత్తు కృష్ణ విగ్ర‌హ‌ముతో సాక్షాద్వైకుంఠ‌మను భ్ర‌మ క‌ల్గించుచుండెను. ప‌రిస‌ర‌ములే యంత వైష్ణ‌వ‌మ‌య‌మైన‌చో స్వ‌యంప్ర‌భాంత‌రంగ వైకుంఠ‌ధామ‌మోయ‌న్న బాధావీచిక‌లు చెల‌రేగిన‌వి. ఆమె తండ్రి సంగీత‌మును విన‌కుండ విచారింప‌రాద‌నెను.

స్వ‌యంప్ర‌భ కంఠ‌ము కిన్నెర‌మీటి న‌ట్లుండును. ఆమె ప‌ద‌కొండ‌వ పుట్టిన‌రోజు పండుగ‌నాడు ఒక భోజాంగ‌న స్వ‌యంప్ర‌భ‌గాన‌మును వినిన‌ది. ఆమె స్వ‌యంప్ర‌భ కంఠ‌మున‌నొక విశేష‌మున్న‌ది అని చెప్పిన‌ది. ఆమె కంఠ‌మునందు గాంధార‌స్వ‌ర‌ము విస్ప‌ష్ట‌ముగానున్న‌ది. దేవ‌త‌ల కంద‌ముల యందు ప‌లుకును. అది దేవ‌తాగాంధార‌స్వ‌ర‌ము అని భోజాంగ‌న‌ప‌లికిన‌ది. ఆల‌క్ష‌ణ‌మువ‌ల‌న ఆమె కంఠ‌ములోనున్న లోకోత్త‌ర‌మాధుర్య‌మున‌కు సంగీత‌మెరుగ‌నివారుకూడ ముగ్ధులై త‌న్మ‌యుల‌గుదుర‌ని యామెచెప్పిన‌ది. మ‌రియు మాన‌వుల గొంతుల‌యందు దేవ‌తాగాంధార స్వ‌ర‌ము ప‌లుక‌రాదు. ప‌లికిన‌చో నాయుర్దాయ‌ము క్షీణించున‌న్న‌ది. ఇందుల‌కొక ప్ర‌తిక్రియ‌నుకూడ నామె సూచించిన‌ది. విష్ణువేభ‌ర్త‌మ‌ని భావించి భ‌గ‌వ‌న్నామ సంకీర్త‌న‌ము చేసిన దీర్గాయుష్కురాల‌గున‌ని చెప్పిన‌ది. దేవ‌తాగాంధార‌స్వ‌ర‌మును నొక స్వ‌ర‌ము సంగీత‌శాస్త్ర‌మున‌లేదు. దేవ‌గాందార‌య‌ను రాగ‌మున్న‌ది. గాంధార‌స్వ‌ర‌ములుమూడున్న‌వి. అందు దేవ‌తాగాంధార‌ములేదు. స్వ‌ర‌ములు ప‌దునారు. ష‌డ్జ‌మ‌ము, చ‌త‌శ్రుతిరిష‌భ‌ము, ష‌ట్‌శ్రుతిరిష‌భ‌ము, శుద్ధ‌గాంధార‌ము, సాధార‌ణ గాంధార‌ము అంత‌ర‌గాంధార‌ము... మొద‌లైన ప‌దునారు స్వ‌ర‌ముల‌లో దేవ‌తాగాంధార‌ములేదు. గావున దేవాతాగాంధార స్వ‌ర‌మున‌కు మాన‌వ సంగీత శాస్త్ర‌మున ఆధార‌ముల‌భింప‌దు. భోజాంగ‌న కృష్ణుని కైయేతెంచు ప‌లుదేవ‌త‌ల స్వ‌ర‌ముల‌లోన‌ను నార‌దుని గ‌ళ‌మున‌ను దేవ‌తా గాంథార‌స్వ‌ర‌మున వింటిన‌నిప‌ల్కిన‌ది. భోజాంగ‌న యిట్లుప‌ల్కుచుండ‌గా స్వ‌యంప్ర‌భ మూర్ఛ‌పోయిన‌ది. ఆమెకేమియో స్మృతులు రాదొడ‌గిన‌వి. తానునెల‌పిల్ల‌గ నుండ‌గా కృష్ణుడే నారాయ‌ణుడ‌నియెవ‌రో ప‌లుకుట గుర్తువ‌చ్చిన‌ది. స్వ‌యంప్ర‌భ‌లో న‌ణిగియున్న వైష్ణ‌వ‌భ‌క్తిని భోజాంగ‌న ప్ర‌బోధ‌మొన‌ర్చిన‌ది. నాటినుండియు స్వ‌యంప్ర‌భ‌కు స‌ర్వ‌ము విష్ణుమ‌య‌మైన‌ది. ఆమె మ‌న‌స్సులో శ్రీ‌కృష్ణ‌డే త‌న‌భ‌ర్త‌గా భావింప‌నారంభించెను. కాని కృష్ణ‌విగ్ర‌హ‌మును పూజించ‌దు. భోజాంగ‌న కృష్ణుని వ‌ర్ణించును. స్వ‌యంప్ర‌భ ఇదినారాయ‌ణ‌మూర్తి యొక్క వ‌ర్ణ‌న‌మేయ‌నును. ఆమె సంగీత గురువు సామిత్య గురువును కృష్ణ‌గాథ‌ల‌నే చెప్ప‌వ‌లెను. ఇట్లు స్వ‌యంప్ర‌భ శ‌రీర‌ము గాంధార‌దేశ‌మున‌ను, హృద‌య‌ము వ్రేప‌ల్లెయందును నిమ‌గ్న‌ములై యుండెను.

దామోద‌రుడు స్వ‌యంప్ర‌భ‌ను మంద‌లించెను మాన‌వుల‌లో గొప్ప‌వారుందురు కాని భ‌గ‌వంతుడుడ‌డ‌నెను. ఒక‌వేళ కృష్ణుడు భ‌గ‌వంతుడేయైన‌చో ధ్యానింప‌వ‌లెగాని పెండ్లియాడుదురాయ‌నెను. నారాయ‌ణుని భ‌ర్త‌గా భావించిన‌చో దేవి శుంభ‌నిశుంభుల‌ను హ‌త‌మార్చిన‌ట్ల‌గున‌నెను. యోగ్యుని పెండ్లియాడి కీర్తి ప్ర‌తిష్ట‌ల‌ను తెమ్మ‌నెను.

స్వ‌యంప్ర‌భ తాను కృష్ణుని భార్య‌న‌న‌గా వేరొక‌రాజ‌కుమారుని పెండ్లి యాడిన‌ట్లాడ‌న‌నిన‌ది. నేనెవ్వ‌రిని పెండ్లియాడ‌ను. యోగులు స‌మాధి స్థితులై యాత్మారాముని ద‌ర్శింతురు నాక‌ట్టిస్థితిలేదు భ‌గ‌వ‌త్కీర్త‌న‌ము చేయుదును. ఆయ‌న లీల‌లు పాడుదును. అత‌నికంకిత‌ముగా బ్ర‌తుకుదును తుచ్ఛ‌ములైన యీ యింద్రియ‌ములంద‌లి లోల‌త్వ‌ము నాకున‌చ్చుట‌లేదు. అని స్వ‌యంప్ర‌భ దామోద‌రునితో చెప్పిన‌ది.ధ్యాన‌స‌మ‌య‌మున త‌న‌కొక మూర్తిక‌నుపించును. అత‌డు కృష్ణుడుకావ‌చ్చున‌న్న‌ది. స్వ‌యంప్ర‌భ‌ధ్యాన‌ము య‌శోవ‌తి ధ్యాన‌ముక‌న్న విల‌క్ష‌ణ‌మ‌నుట ఇచ‌ట గ‌మ‌నింప‌వ‌చ్చును. య‌శోవ‌తికే మూర్తియును దోప‌లేదుగాని యేవోగాథ‌ల‌కు సంబంధించిన‌కొన్ని యూహ‌లు మాత్ర‌మే ఆమెకు భాసించెడివి. య‌శోవ‌తిధ్యాన‌మున భ‌గ‌వ‌త్ర్కియా సంబంధికాగా స్వ‌యంప్ర‌భాద్యానము భ‌గ‌వ‌న్మూర్తికి సంబంధించినద‌నుట‌యే. స్వ‌యంప్ర‌భ‌లోని భ‌క్తి భోగాంగ‌నా ప్ర‌మేయ‌ముచేత మ‌ధుర భ‌క్తి గ‌మారినది. కాని స్వ‌యంప్ర‌భ గిరిక‌లె విర‌హమ‌నుభ‌వింప‌లేదు. ఇందుల‌కు కార‌ణ‌మామె మ‌న‌స్సు కృష్ణునితోన‌భేద భావ‌ముతోనుండుట‌యే. కృష్ణుడు పాండ‌వ ప‌క్ష‌పాతియ‌గుట‌చే త‌మ‌కు విరోధియ‌న్న‌ది. నేన‌త‌ని శ‌రీర‌మున‌కు ఆత్మ‌కు విభేద‌ముచేసి చూచుచున్నాను. అత‌డు భ‌గ‌వంతుడు అనిన‌ది. అత‌ని నారాయ‌ణ‌త్వ‌మామె కారాధ్య‌స్థాన‌ము. కృష్ణ‌త్వ‌ము విరోధి స్థాన‌మున‌య్యెను. ఇట్టి స‌మ‌స్య‌లు భ‌గ‌వంతుడ‌వ‌త‌రించిన కాల‌మున పుట్టుట స‌హ‌జ‌ము. ప్ర‌జ‌లు నమ్మ‌లేరు న‌మ్మ‌కుండ నుండ‌లేరు. మ‌న‌స్సుసంశ‌యించును హృద‌య‌మౌన‌నును. బ‌హువిక‌ల్ప‌ములు జ‌నించుచుండును. కావున స్వ‌యంప్ర‌భ త‌న‌కు విరోధ‌ము శ‌రీర‌ముతోడ‌నేయ‌ని య‌న్న‌ది. ఇది స్వ‌యంప్ర‌భ‌లోని లోప‌ము, పాండ‌వ‌ప‌క్ష‌పాత విమ‌ర్శ‌న‌మేల కృష్ణుడు వేణువునూద‌క వీణ‌నుమీట వ‌లెన‌న్న‌ది. ఇట్టి స్వ‌ల్ప భావ‌ముల‌చేత నామెలోని యౌన్న‌త్వ‌మున‌కు మ‌చ్చ‌వాటిల్లిన‌ది. ఆయ‌న వేణువూదుట నాకిష్ట‌ములేదు. ఆయ‌న వీణావాయించ వ‌ల‌యును. అని స్వ‌యంప్ర‌భ య‌న్న‌ది. దామోద‌రుడు పెండ్లి చేసికొమ్మ‌న్న‌చో చేసికొందున‌న్న‌ది. ధ‌ర్మ‌బుద్ధియైన వానిని వ‌రించుట‌కు స్వ‌యంప్ర‌భ యంగీక‌రించిన‌ది. య‌శోవ‌తి త‌న‌కు క‌ల‌లో క‌నుపించి గురుత్వ‌ము వ‌హించున‌ని చెప్పిన‌ది. దామోద‌రుడు య‌శోవ‌తి భ‌ర్త‌య‌గుట‌చే న‌త‌ని మాట‌ల కంగీక‌రింతున‌ని ప‌ల్కిన‌ది.

దామోద‌రుడు స్వ‌యంప్ర‌భ‌కు స్వ‌యంవ‌ర‌ము ప్ర‌క‌టించెను. అనేక‌మంది రాజుల‌కు ఆహ్వాన‌ములు వెళ్ళిన‌వికాని కృష్ణునిమాత్ర‌మాహ్వానింప‌లేదు. స్వ‌యంప్ర‌భ యొక‌నాటి య‌ర్థ‌రాత్ర‌మున నారాయ‌ణ విగ్ర‌హోప‌రిభాగ‌మున మూడువెలుగుల‌ను గాంచెను. ముందురెండు చిన్న వెలుగులు వెనుక‌నొక పెద్ద వెలుగునున్న‌వి. ఒక చిన్న‌వెలుగు స్వ‌యంప్ర‌భ‌, రెండ‌వ చిన్న వెలుగు య‌శోవ‌తి, పెద్ద వెలుగు శ్రీ‌కృష్ణుడు అని స్వ‌యంప్ర‌భ‌కు స్ఫురించిన‌ది. ఆ వెలుగుల వ‌ల‌న స్వ‌యంప్ర‌భా స్వ‌యంవ‌ర‌మును తెలిసికొనిన కృష్ణుడు అభ‌య‌సూచ‌క‌ముగ నామెకు క‌నిపించియుండ వ‌చ్చును. స్వ‌యంప్ర‌భ‌కు వివాహ‌మ‌న్న న‌యిష్ట‌ము అందున‌ను కృష్ణుని కాని వానిని పెండ్లియాడుట మ‌రింత‌య నియిష్ట‌ము. ఆమె మ‌న‌స్సు క్షోభించుచుండ‌గా నాదీన‌హృద‌య‌మును కాపాడుట‌కై జ్యోతిరూమున కృష్ణుడు కానుపించెను. ముందామె య‌శోవ‌తి యొక్క తేజ‌స్సును త‌రువాత భ‌గ‌వానుని తేజ‌స్సును ద్యోత‌క‌ములైన‌వి.