37
 

ఈజ్యోతులాత్మ‌జ్యోతులేగాని ప్రాణ‌జ్యోతులుకావు. ఎందుచేత‌న‌న‌గామూడు జ్యోతులును జీవించియున్న‌వారివే య‌గుట‌యును, ఆత్మ‌స్వ‌రూప‌మొక్క యాత్మ‌కేగాని యింద్రియ‌ముల‌కుగ‌నా ప్రాణ‌ముల‌కు గాని క‌నిపించుట సాధ్య‌ముకాదు. స్వ‌యంప్ర‌భానామ సార్ధ‌క్య‌మీ తావున జ‌రిగిన‌ది. ఆమె స్వ‌యంప్ర‌భ ప్ర‌భ జ్యోతిస్వ‌రూప‌మైన‌ది. ఆజ్యోతినిచూచిన‌ది. భావించిన‌ది ఆత్మ స్వ‌యంప్ర‌కాశ‌ము. స్వ‌యంప్ర‌భ‌కూడ స్వ‌యంప్ర‌కాశ‌మైన‌ది. య‌శోవ‌తికూడ నామెప్ర‌క్క‌గ దోచుట‌లో స్వ‌యంప్ర‌భ‌యొక్క భావిజీవిత‌ముయ‌శోవ‌తి జీవిత‌ముతో ముడిప‌డుట సూచించుచున్న‌ది.

కృష్ణుని సుద‌ర్శ‌నాయుధ‌ముచే దామోద‌రుడు నిహ‌త‌రుడ‌య్యెను. అందుచేత స్వ‌యంవ‌ర మాగిపోయిన‌ది. భార‌త‌యుద్ధ‌మున గాంధార‌రాజు మ‌ర‌ణింప‌గా స్వ‌యంప్ర‌భ యేకాకినియైన‌ది. య‌శోవ‌తి స్వ‌యంప్ర‌భ‌ను కాశ్మీర‌మున‌కు పిలిపించి యాద‌రించిన‌ది. శివుని ధ్యానించుచు జ్ఞాన‌సంబంధ‌ములైన కీర్త‌న‌ల‌ను పాడుచుండుమ‌ని య‌శోవ‌తి స్వ‌యంప్ర‌భ కుపాయ‌ము చెప్పిన‌ది. స్వ‌యంప్ర‌భ త‌న‌నామ‌మున‌కు త‌గిన‌ట్లుగా ఆత్మ‌జ్యోతిని నిల‌బెట్టుకొని దానియందు బుద్ధిని నియ‌మించిన‌ది. య‌శోవ‌తి శివ‌కేశ‌వుల‌కు భేద‌ముపాటింప‌లేక‌పోయిన‌ది.

కాశ్మీర ప్ర‌జ‌ల‌ను త‌న‌దివ్య‌గాన సుధావాహినిలో తేలియాడించిన‌ది. రాజ‌భ‌వ‌న‌ము సాయంత్ర‌మగుస‌రికి సంగీత ప్రియుల‌తో నిండిపోయిన‌ది. త‌న గాన‌ముతో ప్ర‌జ‌ల‌కు ప్ర‌శాంతి చేకూర్చ‌గ‌లిగిన‌ది స్వ‌యంప్ర‌భా సంగీత సాహిత్య‌ములో సాహిత్య‌ము వ‌న‌న‌శ‌క్తి చేత‌గాని స‌ద్యః ప‌ర‌నిర్వృతిని ఘ‌టింప‌దు. సంగీత‌మున‌కంత ప్ర‌య‌త్న‌మ‌క్క‌ర‌లేదు. ఏ విద్య‌యైన‌ను దాని స్వ‌రూప‌మునుగూర్చి కొంత తెలియ‌క‌నెప్పుడు ననుభ‌వింప‌బ‌డ‌దు.కాని సంగీత మ‌ట్లుకాదు.

సంగీత‌మ‌పిసాహిత్యం స‌ర‌స్వ‌త్యాస్త‌న‌ద్వ‌యం

ఏక‌మాపాత మ‌ధుర‌మ‌న్య‌దాలోనామృత‌మ్‌

అందువ‌ల‌న‌నా పాత‌మధుర‌మైన సంగీత‌ముచే కాశ్మీర ప్ర‌జ‌ల హృద‌య‌ముల నుఱ్ఱూత‌లూగించి వ‌శ‌ము గావించుకొనిన‌ది స్వ‌యంప్ర‌భ‌.

సంగీత‌ము వ‌ల‌న నంతఃక‌ర‌ణ‌ము శుద్ధ‌మ‌గును. ప్ర‌కృతి స్వ‌భావ‌ముల‌కును సంగీత‌ములోనున్న రాగ‌ముల‌కునున్న సంబంధ‌మెట్టిదో ఆత్మ‌కును సంగీత‌మున‌కునున్న సంబంధ‌మ‌ట్టిది. య‌శోవ‌తి స్వ‌యంప్ర‌భా గాన‌మాహాత్మ్య‌మును గుర్తించి రాజ్య‌మ‌ల్ల‌క‌ల్లోల‌ముల‌కు గుఱికాకుండ రెండువేళ‌ల సంగీత‌ము నేర్పాటుచేసిన‌ది. ప్ర‌జ‌ల హృద‌య‌ములు శాంత‌ముగ‌నున్న‌వి.

స్వ‌యంప్ర‌భ విష్ణుమూర్తిని భ‌ర్త‌గ భావింప‌కుండ గాన‌ముచేయుట కామె యిహ‌లోక విమోహ‌మే కార‌ణ‌ము. సౌంద‌ర్య‌మున‌కుగాని సంగీత వైశార‌ద్య‌మున‌కుగాని గ‌ర్వింప‌క స‌మ‌స్త‌మును వైరాగ్య‌భావ‌ముతో కృష్ణ ప‌ర‌ము చేసిన‌ది. స్వ‌యంప్ర‌భ స్వ‌యంప్ర‌భ‌యేయ‌న్న య‌శోవ‌తి మాట‌లు స‌త్య‌ములు. అన‌తికాల‌మున‌కే ప‌ర‌మ‌ప‌దించిన స్వ‌యంప్ర‌భ మ‌ధుర‌భ‌క్తి గిరిక మ‌ధుర‌భ‌క్తిక‌న్న విల‌క్ష‌ణ‌మైయున్న‌ది.

పాతివ్ర‌త్య‌ము

 

ప‌తినే ప్ర‌త్య‌క్ష‌దైవ‌ముగ భావించి యాత్మార్ప‌ణ‌మును గావించుకొనిన స్త్రీల‌ను ప‌తివ్ర‌త‌లందురు. భార‌త‌దేశ‌మున ప‌తివ్ర‌త‌ల‌కొక్క ప్ర‌త్యేక స్థాన‌మున్న‌ది. సృష్టి స్థితిల‌య‌కారులైన బ్ర‌హ్మ విష్ఱు మ‌హేశ్వ‌రులు ప‌తివ్ర‌త‌యైన అన‌సూయ మ‌హాత్మ్య‌మువ‌ల‌న ప‌సిబాలురు కావ‌ల‌సివ‌చ్చిన‌ది.

 

విశ్వ‌నాథ‌వారి న‌వ‌ల‌లో పెక్కురు ప‌తివ్ర‌త‌లున్న‌ప్ప‌టికిని వేయిప‌డ‌గ‌లు లోని అరుంధ‌తి, అరుంధ‌తీ న‌క్ష‌త్ర‌మువ‌లె చిర‌స్థాయినందుకొనుట వ‌ల‌న నీమెను పాతివ్ర‌త్య సిద్ధాంత‌మున‌కు ప్ర‌తీక‌గ స్వీక‌రించుట‌యైన‌ది.

 

ఆశ్వ‌మేధ‌ము న‌వ‌ల‌లోని కుముద్వ‌తి గుణ‌మున‌కు మిన్న‌యై భాసించి భ‌ర్త‌ను కాపాడుకొనుట‌కై ప్రాణ‌ముల‌కు తెగించి చ‌రించిన స్త్రీ.

 

చంద‌వోలు రాణిలోని స‌రోజ‌లోచ‌న‌కూడ ప‌తివ్ర‌త‌ల‌లో మిన్న‌యై ప‌తి మ‌ర‌ణానంత‌ర‌ము యోగ‌మున ప్రాణ‌త్యాగ‌ము చేసిన వ‌నిత‌.