బాలకేలోపము రానీయరాదని నరహరి గంగూలీని కోరెను. అతనికి గంగూలీపై పరిపూర్ణమైన ప్రేమ. బాలయందగత్తె. బాల సంస్కృతాంధ్రములను కూలంకషముగ చదివినది. గంగూలీదికొద్దిపాటి చదువు. గంగూలీ యనాకారి, బాలధనవతి గంగూలీ బికారి. పూటకు ఠికానా లేనివాడు. వీరిరువురిస్వభావములకు పొందిక కుదరలేదు.
బాలమేనమామ కూమారునకు జబ్బుగానుండెనని భర్త మేడపైనుండి దిగిరాలేదని చెప్పకుండ నాయూరు వెళ్ళినెలరోజులుండి వచ్చినది. అన్ని నాళ్ళక్కడ నుండుటకామె బాధపడుచునేయున్నది. మేడదిగి రానందున చెప్పకుండ వెళ్ళుటయేల తానుపైకిపోయి చెప్పిపోకూడదాయని భర్త భావించెను. గురువైన భీమశంకరమునకిచ్చినంత గౌరవము భర్తకీయలేదు. అందుచేతనే భీమశంకరముపై గంగూలీకి కోపము. తనను గౌరవించని స్త్రీ యతనిని గౌరవింపనేల యనిగంగూలీ యూహించును.
గంగూలీకున్న దుర్భద్ధులన్నియు వివాహమైన తరువాతవచ్చినవే. పెండ్లికిముందతడెంతయో సజ్జనుడు. నరహరివ్యాపారమున సొంతకుమారుని కన్ననెక్కువ సాయముచేసెను. బాలభవిష్యత్తుకొరకు నరహరిమరణానంతరము వ్యాపారము లేకుండునట్లు వ్యాపారములన్నియు నమ్మివేసి ధనరూపమున బ్యాంకులో పొందుపరచెను. ఆసమయమున నాతడెన్ని వేలు దాచికొన్నను దాచుకొనగలడు కానియట్లు చేయలేదు.
యాచించి చదువుకొను గంగూలీకి చదువుపై నెంతయో మోహము. నరహరికి సాయపడుటతో నతని చదువు వెనుకబట్టినది. తానుచేసినదానికి నరహరి మరణశాసనమున పాతికవేలిచ్చినచో బాలని భావింపగల వామాన్యమైన ఆశగలవాడేగాని నరహరియాస్తి నన్యాయముగా దోచుకొనవలెనను దురాశలేనివాడు.
గంగూలీయొక పత్రికను నడిపించుచు సనాతనభావ పరులమీద ధ్వజమెత్తించెను. గురుదూషణ చేయించెను. భీమశంకరమునకు తక్కువ జీతమిచ్చి అతనిరచనల నింకొక పత్రికలకు పంపనీయక అతని రచనలను గుత్తగకొని అదియే పగసాధించుట యనిభావించెను.
వివాహము కామ ధర్మ ప్రేమల నడుమనున్న వ్యవహారముగా భాసించుచున్నది. కామము మూలవస్తవు. ధర్మము సంప్రదాయముచేత పూర్వఋషులేర్పరచిన మతాభిప్రాయములచేత దానియందారోపింపబడిన వస్తవు. ప్రేమయన్నది కామ ధర్మముల నుద్దీపింపజేయను.కామమిహలోకమైనది. ధర్మము పారలౌకికమైనది. ఈ ప్రేమరెంటిని ప్రకాశింపచేయును బాలపరలోకమునకు సంబంధించిన ధర్మమునాశ్రయించినది. గంగూలీ వాంఛించిన ప్రేమను బాలయందీయలేకపోగా నామెపాతివ్రత్యము గంగూలీకి కొరకుడుపడలేదు. కొన్ని దినములీయె తిలకమును ధరించుటమాని బాలకు భర్తపైనున్న యనురాగరాహిత్య మీచర్యవలన నిరూపితమగుచున్నది. మగనాలు తిలకము ధరించ వలయునన్న విస్పష్టమైన భావమునందను రాగము కలుగుటకు నాజీవియొక్క యంతరాంతరములో నతడు తనభర్తయన్న గాఢమైన భావములను వారియందతి గాఢమైన యనురాగము నుండవలయునుగదా ఇచట బాలకు భర్త యందు గాఢమైన యనురాగము లేదనుట వ్యక్తమగుచున్నది. అనురాగములేని భార్య పాతివ్రత్యమెట్లునెరపినదో చిత్రము మరియు బాలకు రంగనాథముపై మనస్సుండెనో లేదోయన్నది గుంభనమైనవిషయము.
చివరకు బాల తన భర్తను పొగడినది. పరమేశ్వరుడు నన్నల్పాయుష్కుడైన నటేశమునకంటెగనా యవివేకియైన రంగనాథమునకుగాని భార్యగాజేయక వివేకియు దీర్ఘాయుష్మంతుడును బుద్ధిమంతుడుసమర్ధుడునై నమీకిచ్చి పెండ్లిచేసెను అన్నది. పగనువీడమన్నది. ఈ నవలలో నున్నపాత్రల మనస్తత్వ చిత్రణము సహజముడ నున్నది. పాత్రలు సజీవములనియే చెప్పవచ్చును. ఎందుచేతననగా నిరువురిలో లోపములు చిత్రింపబడినవి కావున సజీవములు ఎట్టిలోపమును లేక యన్నియును మంచిగుణములేయుండుట యసంభవమనియు సజీవత్వమునకు లక్షణము కాదనియు కొందరు విమర్శకు లభిప్రాయపడుచుండిరి. మనుజునిలోకొన్నేని లోపములుండవలయును క్రమవికాసముననివి సంస్కరింప బడవలయును అట్లు సంస్కృతి నొందిన పాత్రయే సజీవమనబడవలయును. అనుభావముల కనుగుణముగాబాల,గంగూలీ పాత్రలు చిత్రీకరింపబడినవి.
భార్యాభర్తల యభిప్రాయములు కలియనిచో నెట్లు గృహము యుద్ధరంగమువలె నుండునో తెలుపు ప్రచ్ఛన్న యుధ్ధగాథయే గంగూలీ ప్రేమకథ.
|