47
 

భ‌ట్టిదేవి

 

భ‌ట్టిదేవి ఇక్ష్వాకు వంశ‌ప్ర‌భువైన వీర‌పురుష‌ద‌త్తుని భార్య. వీర‌పురుష‌ద‌త్తునికి తాను శాంతిమూలుని యొక్క కుమారుడ‌ను కానేమోన‌ని యొక‌ర‌క‌మైన న్యూన‌త యున్న‌ది. త‌న‌లోనున్న నీ న్యూన‌తా భావ‌మును తొల‌గించుట‌కై భ‌ట్టిదేవి ప్రేమ‌లో త‌న‌ను తాను మ‌ర‌చిపోవ‌లెన‌ని ప్ర‌య‌త్నించును. కాని భ‌ట్టిదేవికి తాను సుక్ష‌త్రియ‌న‌ని యొక య‌హంభావ‌మున్న‌ది అందుచేత నామెత‌న ముభావ‌ముతో భ‌ర్త న‌ల్లంత దూర‌మున నిలిపిన‌ది పాతివ్ర‌త్య‌మున నీమె గంగూలీ ప్రేమ‌క‌థ లోని బాల కీడైన‌ది. ఆధిక్య‌భావ‌మున కూడ బాల వంటిది. కాని యీ భావ‌మును వెల్ల‌డింప లేదు గంగూలీ బాల‌ల మ‌ధ్య వారి ర‌హ‌దారులు క‌లియ‌క స‌మాంత‌ర‌రేఖ‌ల వెంట‌నే ప‌య‌నించు చుండిరి. కాని యంత‌మున కూడ మాన‌సిక‌ముగ నేక‌ము కాలేదు. వీర‌పురుష‌ద‌త్తుడు భ‌ట్టిదేవి ప్రేమ‌కై ప్ర‌జ‌ల‌ను హింస‌ల పాలుజేసి న‌ప్ప‌టికిని తుద‌కామెను ప్రేమ‌తో గెలువ‌గ‌లిగెను.

వీర‌పురుష‌ద‌త్తుడు ఇక్ష్వాకు వంశ ప్ర‌భువుల‌లో ప్ర‌ధ‌ముడైన వాసిష్ఠీపుత్ర శాంతిమూలుని కుమారుడు. ఇత‌ని త‌ల్లిమాఠ‌రీదేవి, నిజ‌మున‌కు వీర‌పురుషుడు. మాఠ‌రీదేవి గ‌ర్భ‌మున‌జ‌నించ‌లేదు. పుత్ర‌సంతాన‌ములేనందున మాఠ‌రీదేవియును నామె యాడ‌బ‌డుచు శాంతిశ్రీ‌యును క‌ల‌సి యుక్తిప‌న్ని కాళిందియ‌ను బ్రాహ్మ‌ణ స్త్రీకిని క్ష‌త్రియ యువ‌కున‌కును జ‌నించిన బిడ్డ‌ను మాఠ‌రీపుత్రునిగ ప్ర‌క‌టించిరి.

వీర‌పురుషుని జ‌న్మ‌ర‌హ‌స్య‌ము ర‌హ‌స్యముగ నుండ‌క ప‌లుమంది ప‌లుర‌క‌ములుగ చెప్పుకొనున‌ట్లు చేసిన‌ది. అందువ‌ల‌న వీర‌పురుష‌ద‌త్తుడు వీరుడ‌య్య‌ను తాను క్ష‌త్రియుడ‌ను కానేమో య‌న్న అనుమాన‌ముతో బాధ‌ప‌డాసాగెను. ఈ విష‌య‌మ‌త‌నికి మ‌న‌శ్శ‌ల్య‌మైన‌ది. క్ష‌త్రియ‌క‌న్య‌ను వీరోచిత‌ముగ పెండ్లియాడి క్ష‌త్రియుడ‌న‌ని పించుకొన‌వ‌లెన‌న్న భావ‌ముతో క‌దంబ‌రాజ్యముపై దండెత్తి క‌దంబ‌రాజ క‌న్య‌ను పెండ్లియాడెను. కాని యామె మ‌న‌సును గెలువ లేక పోయెను. కదంబ‌రాజ‌దుహిత‌యైన భ‌ట్టిదేవి వీర‌పురుషున‌కు త్రిక‌ర‌ణ‌శుద్ధిగ నంకిత‌ము కాలేక‌పోయిన‌ది. భట్టిదేవి ప్రేమ‌ను గెలువ‌లేని వీర‌పురుషుడు ఆమెను హింసింప‌లేక ఆమె న‌మ్మ‌క‌ముల‌ను హింసింప‌ద‌ల‌చెను. ఆమె వేద‌మ‌తాభిమాని అతడు బౌద్ధ‌మును స్వీక‌రించి బ్రాహ్మ‌ణుల‌ను వారిదైవ‌ముల‌ను చిత్ర‌హింస‌పెట్టెను శివ‌లింగ‌ముల‌ను తాడించెను. వీర‌పురుషుని జీవిత‌మంత‌యు భ‌ట్టిదేవి ప్రేమ‌ను గెలుచుట‌కే ముడుపు గ‌ట్ట‌బ‌డిన‌ది చివ‌ర‌కు విజ‌య‌ముక‌లిగిన త‌దుప‌రి భట్టిదేవినే గాక రాజ్య‌మును స‌ర్వ‌స్వ‌మును త్యజించి స‌న్యాస‌మును స్వీక‌రించెను ఇందు భ‌ట్టిదేవి పాత్ర స‌జీవ‌ముగ చిత్రింప‌బ‌డిన‌ది.

వీర‌పురుషున‌కు సుక్ష‌త్రియ వంశ‌ము వారు క‌న్య‌నిచ్చుట‌కు సిద్ధ‌ప‌డ వీర‌పురుషున‌కు త‌న మేన‌త్త కూతుండ్ర‌పై ప్రేమ‌క‌ల‌దు. వీర‌పురుషుని తండ్రి యేక ప‌త్నీవ్ర‌తుడు వీర‌పురుషుడు స్త్రీ గ‌త‌బుద్ధియగుట‌చే ప్ర‌జ‌ల విమ‌ర్శ‌కు లోనుకావ‌ల‌సి వ‌చ్చిన‌ది. ప‌లువురు ఆతండ్రికి పుట్టిన బిడ్డ కాద‌నుట కీల‌క్ష‌ణ‌మును సాకుగ చెప్పుకొనిరి. ఒక‌రాత్రివేళ నెవ్వ‌తెయో కృష్టాన‌ది మీద ప‌డ‌వ‌పై వ‌చ్చి య‌ప్పుడే పుట్టిన ప‌సికందునిచ్చి పోయిన‌ద‌ని ప్ర‌జ‌లు చెప్పుకొనుచుండిరి. శాంతిమూలుడు క‌దంబ రాజున‌కు వీర‌పురుషున‌కు క‌దంబ‌రాజుక‌న్య నిచ్చి వివాహ‌ము చేయ‌మ‌ని క‌బురుపంప‌గా భ‌ట్టిదేవికి వీర‌పురుషుని పెండ్లియాడుట కిష్ట‌మేలేన‌ట్లువ్య‌క్త‌మైన‌ది. వీర‌పురుషుడా గ్ర‌హ‌మున కదంబుల‌పైన యుద్ధ‌మును ప్ర‌క‌టించెను వారి సైన్య‌మంత న‌శించి పోవుచుండ‌గా భ‌ట్టిదేవి నిచ్చి పెండ్లిచేసి సంధిచేసికొనిరి. వీర‌పురుషుడు తాను చ‌క్ర‌వ‌ర్తి యైన‌చో భ‌ట్టిదేవియే ప‌ట్ట‌మ‌హిషి య‌గున‌నెను. ఆమెయందు గ‌లిగిన ప్ర‌థ‌మ పురుష‌సంతాన‌మే భ‌విష్య‌దిక్ష్వాకు చ‌క్ర‌వ‌ర్తియ‌ని ప‌లికెను.

భ‌ట్టిదేవి త‌మ‌ప్ర‌థ‌మ స‌మాగ‌మము నాటిరేయి భ‌ర్త త‌న‌న‌ది క్షేప‌ము చేయున‌ని భావించిన‌ది. అట్లు చేసిన‌చో క‌త్తి సాయ‌ముతో క‌క్ష‌తీర్చుకొనుట‌కు సిద్ధ‌ప‌డియే వ‌చ్చిన‌ది. క్రోథ‌మూర్తియై య‌వ‌మాన‌ముతో వ‌చ్చిన‌ది. ఆమె మ‌న‌సులో భ‌ర్త యెడ‌ల నెట్టి మ‌ధుర‌భావ‌ముగాని స్నిగ్ధ‌భావ‌ముగాని క‌లుగ‌లేదు. ఇందుల‌కు కార‌ణ‌మాత‌డు యుధ్ధ‌మున గెలిచితెచ్చుట‌యే శ‌రీర బ‌ల‌ముచేత సేనాబ‌ల‌ము చేత దెచ్చినాడు హృద‌య‌ము నెటుల వ‌శ‌ప‌ర‌చుకొల‌గ‌ల‌డు అనియామె మ‌న‌సు బుస‌కొట్టిన‌ది. హృద‌య‌మ‌త‌ని వశ‌ము చేయ‌కుండ గ‌ట్టిప్రయ‌త్న‌ము మీద‌నే వ‌చ్చిన‌ది. భ‌ర్త‌తాను భావించిన‌ట్లు దూష‌ణ చేయుట‌గాని తండ్రిని చుల‌క‌న‌గ చూచుట గాని చేయ‌లేదు వీర పురుషున‌కుగూడ భ‌ట్టీదేవిపై నొక వ్య‌తిరేక భావ‌మున్న‌ది. ఆభ‌వ‌న‌మున‌నా వ్య‌తిరేక భావ‌ము తోడ‌నే య‌డుగు పెట్టెను. భ‌ట్టిదేవి త‌న‌ను వివాహ‌మాడుట‌కు వ్య‌తిరేక‌త‌ను సూచించిన ద‌నివినిన య‌త‌ని మ‌న‌సు కోప‌ముతోనుడికి పోయిన‌ది. కావున నిరువురు నేదోయొక కార‌ణ‌ముచేత శ‌త్రువుల‌వ‌లె నుండిరి. వీర‌పురుషుడు భ‌ట్టిదేవి సౌంద‌ర్య‌మున‌కు ముగ్ధుడైనాడు వెంట‌నే య‌త‌ని మ‌న‌సు అద్ద‌మువ‌లె నిష్క‌ల్మ‌ష‌మైన‌ది. ఆమెపై న‌త‌నికి ప్రేమ‌క‌ల్గిన‌ది. అతని వాజ్ని పుణ‌త‌కామె లొంగిపోయిన‌ది. మ‌రునాడు గాని త‌న‌యోట‌మి గ్ర‌హించుకొన‌లేదు. మ‌రునాడు కానియామె త‌న్ను దానురుగ లేదు ఎరిగిన త‌రువాత వీర‌పురుష‌ద‌త్తుని యందామె క‌ఠినురాలాయెను. వీర‌పురుష‌ద‌త్తున‌కు తొలిరాత్రి మాత్ర‌మే సుఖ‌హేతువాయెను. భ‌ట్టిదేవి తాను నిర్మించుకొనిన యొక హ‌ద్దును దాటి ముందున‌కు వ‌చ్చుట‌కు యిష్ట‌ప‌డ‌లేదు. ఆమెమ‌న‌స‌త‌ని యందు క‌ఠిన‌శిల‌యైన‌ద‌గుటచే దానికి మార్ధ‌వ‌ము లేద‌ని తెలియుచున్న‌ది.

భార్యాభ‌ర్త‌ల న‌డుమ‌నొక యగాథ మేర్ప‌డిన‌ది. అత‌నిది. స్త్రీ గ‌త బుద్ధియ‌గుట‌చే భ‌ట్టీదేవిచే క‌ల్పింప‌బ‌డిన లోప‌ము మ‌రియొక వివాహ‌ముచేత తీరున‌ని భావించి మేన‌త్త కుమార్తెను పెండ్లియాడెను. భ‌ట్టిదేవి నిరాద‌ర‌ణ‌ము చేత క‌లిగిన వీర‌పురుషుని మ‌నోవేద‌న‌ము బౌద్ధ మ‌తావ‌లంబ‌కురాల‌గు శాంతిశ్రీ ప‌రిచ‌ర్య‌ల‌చే కొంత‌కాల‌ము మ‌రుగైన‌ది. ఈ వివాహ‌ము భ‌ట్టిదేవి హృద‌య‌మును భ‌ర్త‌కు మ‌రింత దూర‌ముచేసిన‌ది. అత‌ని నిండురాచ‌గుండె మేన‌త్త కూతురి హ‌స్త‌స్ప‌ర్శ‌చేత మోహ‌నాపాంగ‌రేఖాస‌మ్మార్జ‌న‌ము చేత‌లాల‌నా మృదూక్తుల‌చేత న‌ప్ప‌టిబిగువు స‌డ‌లి శాంత‌శ్రీ మ‌సృణింస భాగ‌మున‌వాలి దుఃఖించెను. మ‌హావీరుడైన వీర‌పురుష‌ద‌త్తుడు దుఃఖించెన‌నుట‌లో న‌త‌ని హృద‌య‌మున‌కు భ‌ట్టిదేవి క‌ల్గించిన నిరాద‌ర‌ణ మెంత‌గాఢ‌మైన‌దో ఎంత‌నిరాశ నిస్పృహ‌క‌త‌డు లోన‌య్యెనో వ్య‌క్త‌మ‌గుచున్న‌ది. వీరపురుషున‌కు తాను మాఠ‌రీగ‌ర్భ‌సంజాతుడ‌ను కాడ‌ని ప్ర‌జ‌లు చేయువాద‌ము చిన్న‌త‌న‌మునుండి తెలియును. భ‌ట్టిదేవి నిరాక‌రించుట‌కు కారణ‌ముకూడ‌న‌దియే య‌ని య‌త‌నిభావ‌ము. అత‌నికి వివాహ‌మైన త‌రువాత భార్య‌యొడిలో సేద‌దీర్చికొని త‌న‌పై తాను విశ్వాస‌మును పెంపొందించుకొనుట‌కు వ‌ల‌సిన శాంతి సంతోష‌ములనామె ప్రసాధింప లేక పోయిన‌ది ఆమె వైపునున్న దొక‌టే కార‌ణ‌ము త‌న‌ను యుద్ధ‌మున గెలిచెను కాని హృద‌య‌మున గెలువ‌లేద‌ని వివాహ‌మైన త‌రువాత కూడా నామె హృద‌య కుసుమ మాత‌ని యెడ‌విసిత‌ము గాక పోయిన‌ది. వీర‌పురుషుడామె హృద‌య ప‌రిణామమున‌కై వేచియుండ‌క నొక‌టి త‌రువాత నొక‌టిగ వివాహ‌ము చేసికొనుట‌తో భ‌ట్టిదేవి యాత‌నిని కౌముకునిగ భావించుట క‌వ‌కాశ‌మిడి న‌ట్లైన‌ది. అత‌నిలో నున్న న్యూన‌తా భావ‌మునామె ప‌ట్టించుకొన‌లేదు. విధిలేని ప‌రిస్థితుల‌లో న‌త‌నికి వ‌శ‌ము కావ‌ల‌సి వ‌చ్చినందున మ‌రింత నిర్లిప్త‌త‌తో మెస‌ల సాగిన‌ది. ఆమె నిర్లిప్త‌త య‌త‌నిలో మ‌రింత ప‌గ‌పేరుకొనున‌ట్లు జేసిన‌ది. ఆమె హృద‌య‌మును గెలువ‌లెన‌న్న వ్య‌గ్ర‌తతో నాత‌డు బౌద్ధ‌మును ప్రోది చేసికొని నిల‌బ‌డ‌వ‌లెన‌న్న భ్ర‌మ‌తో బ్రాహ్మ‌ణ‌మ‌త ద్వేషియైనాడు. భ‌గ‌వ‌ద్వేషియైనాడు స్త్రీ హృద‌య‌మును గెలుచుట కొర‌కు రాజ్య‌మునంత‌యునా రాజ‌ల్ల‌క‌ల్లోల‌ముచేసెను. ఆమెమీదవ‌గ‌ప‌గ‌గ మార్చుకొనున‌ట్ల‌త‌ని మాన‌సిక ప‌రిస్థితితోడ్ప‌డిన‌ది. త‌రువాతనా ప‌గ‌ను మ‌త‌ము మీది ప‌గ‌గ రాజ్య‌ముమీద ప‌గ‌గ బ్రాహ్మ‌ణుల మీది ప‌గ‌గ మార్చుకొనినాడు. వీర‌పురుషుని మిగిలిన భార్య‌ల త‌న‌ని దైవ‌ముగ చూచు చుందురు కాని అత‌ని హృద‌య‌ము మాత్ర‌ము ప‌ట్ట‌మ‌హిషియైన భ‌ట్టి ప్రేమ‌నే కోరును. భట్టిదేవి వీరుడైన భ‌ర్త మ‌న‌సులోనున్న చిన్న‌శ‌ల్య‌మును తొల‌గింప ప్ర‌య‌త్న‌ము చేయ‌క‌, మౌన‌రూప‌మైన గాంభిర్య‌ము పాటించి య‌త‌ని పుట్టుక‌కు సంబంధించిన న్యూన‌త‌ను మ‌రింత సుషోష‌త‌మును గావించిన‌ది. ముగ్గురురాణుల ప్రేమ‌ను స‌ర‌కు చేయ‌క నిర్ల‌క్ష్య‌ముగ చూచు భ‌ట్టిదేవి యాద‌ర‌ణ‌ము న‌త‌డు కోరుట‌చే న‌త‌ని కామె పై నున్న ప్రేమాధిక్య‌ము వెల్ల‌డియ‌గుచున్న‌ది. మ‌రియు త‌నాసించిన వారు త‌న‌ను కోర‌రు. త‌న‌ను కోరిన‌వారిని తాను కోర‌డు, తాకోరిన‌వారిని విధియంగీక‌రింప‌ద‌న్న స‌త్య‌మిచుట సూచ‌న‌ప్రాయ‌ముగనున్న‌ది. న‌వ‌ల‌లో నీ పాత్ర‌పోష‌ణ‌ము వ‌ల‌న నీసంఘ‌ర్ష‌ణ‌మున‌క‌వ‌కాశ‌ము క‌ల్గిన‌ది.

వీర‌పురుషుని రెండ‌వ వివాహ‌ము త‌రువాత భ‌ట్టిదేవిలో భ‌ర్త‌ను ప‌ట్టించుకోని త‌న‌మెక్కువ‌యైన‌ది. ఆమెకు నామెలో బ‌దివికార‌ములు, ఈర్ష్య‌, కోప‌ము నిరాద‌ర‌ణ‌, పోనిమ్మ‌నుట‌,యిదియునొక‌మే లేయ‌నుట‌, ఆమె త‌న‌క‌న్న‌నంద‌క‌త్తెయాయ‌నుకొనుట‌, త‌న‌కీ విష‌య‌మున ప్ర‌స‌క్తియేమి య‌నుకొనుట ఇట్టి భావ‌ములు భ‌ట్టిదేవిలో యున్నందున నామెకు లోలోప‌ల వీర‌పురుషుడ‌న్న‌చో ప్రేమ‌యున్న‌ద‌నియు అత‌నివివాహ‌ల‌ముకామె మాత్స‌ర్య‌ప‌డుట‌లోని య‌ర్ధ‌మిదియే య‌ని తెల్ల‌మ‌గుచుండును.

మాఠ‌రీదేవి మ‌ర‌ణించిన‌ది. క‌ఠిన‌త్వ‌ము లేచి మ‌హారాజు హృద‌య‌ము, మాతృమ‌ర‌ణ సంజ‌నిత శోక‌ముతో మ‌రింత నీర‌వ‌మైన‌ది. తాను క్ష‌త్రియ‌డ‌ను కానేమో య‌న్న య‌నుమాన‌ము మ‌రింత బాధ‌పెట్ట‌సాగిన‌ది. కాక పోయిన‌చో నేమి ? య‌న్న భావ‌మ‌త‌నికి రాక‌పోయిన‌ది. మీరు క్ష‌త్రియులు. నేన‌గుదునోకానో నాకు బిల్ల‌నిత్తురా ? య‌ని వీర‌పురుషుడు మేన‌త్త‌యైన శాంతిశ్రీ‌ని అడిగెను. క్ష‌త్రియ‌త్వ‌నిరూప‌ణ‌మున‌క‌త‌ని వ‌య‌సు చెల్లిపోవుచుండెను. కాని భట్టిదేవి భ‌ర్త దుఃఖ‌ము ప‌ట్ట‌దు. ఆమెయ‌త‌ని వంశ‌మును త‌న‌గ‌ర్భ‌మున మ్రోయుచున్న‌ది. అయిన‌ను చ‌క్ర‌వ‌ర్తితో సేద‌దీర్చుమాట ప‌లికి యెరుగ‌దు. ఆమె య‌త‌నికి చేయుమ‌ర్యాద‌కు లోటులేదు. చూపుగార‌వ‌మున‌కును లోటులేదు. కాని య‌త‌ని పాల‌క‌వ‌ర్గ‌ములోని వారు మాటాడిన‌ట్లు మాటాడును. ఒక‌నాడు వీర‌పురుష‌ద‌త్తుడు త‌మ మ‌ధ్య‌నున్న దూర‌మునంత‌ము చేయ‌ద‌ల‌చి భార్య‌ను మన‌సువిప్పి మాటాడ‌వ‌ల‌సిన‌దిగ న‌భ్య‌ర్దించెను.ను వారు నేను క్ష‌త్రియుడ‌నుగానా ? నిన్నుబ‌ల‌వంత‌ముగ దెచ్చితిన‌ని కోప‌మా ? రాక్ష‌స‌వివాహ‌ములు స్మృతులొప్పుకొన్న‌వే...నీకు నాయందేల ప్రేమ‌లేదు అని ప్ర‌శ్నించి త‌న‌లోని దోష‌మును చెప్ప‌మ‌ని కోరెను.

త‌న తండ్రియ‌గు శాంతిమూలునికి మాఠ‌రీదేవికి పుట్టినిచో వారి పోలిక‌లుత‌న‌లో నెట్లుండున‌నెను. ఆమె చాతుర్య‌ముగ తాన‌త‌నిని క్ష‌త్రియుడు కాద‌నిలేద‌నియు, ప్రేమించుట‌లేద‌ని యెవ‌రు చెప్పిర‌నియు తిరిగి ప్ర‌శ్నించిన‌ది. అత‌డు త‌న హృద‌య‌ము విప్పిమాటాడిన‌చో నామె ద‌గ్గ‌ర‌గున‌ని భావించెను. భ‌ట్టిదేవి మాత్ర‌ము త‌మ‌మ‌ధ్య‌నున్న ద‌వ్వేమాత్ర‌ము త‌గ్గున‌ట్లుగ ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఇంత‌టితో వీర‌పురుషుని మ‌న‌సు క‌రడు క‌ట్టి ఆమె పై గ‌ల కోప‌మున‌కొక రూప‌మేర్ప‌డిన‌ది.

భట్టిదేవి భ‌ర్త హృద‌య‌మున‌కు ద‌గ్గ‌ర‌కాలేక పోయిన‌ది కాని యామె సుగుణ‌ముల‌కు లోటులేదు. ఆమెకుత‌న‌లోనున్న లోప‌ముత‌న‌కు తెలియును. భ‌ర్త‌నుహృద‌య‌పూర్వ‌క‌ముగ ప్రేమింప‌లేక పోవుచున్నాన‌ని గూడ‌యామె గ్ర‌హించిన‌ది వీర‌పురుషుని మ‌ర‌ద‌లై న‌ష‌ష్ఠిశ్రీ వీర‌పురుషుని ప్రేమించిన‌ది. షష్ఠి, వీర‌పురుషునివిర‌హ‌మున శ‌ల్యావ‌శిష్ట‌యైన స్థితిలో భ‌ట్టిదేవి యామె కుప‌చ‌ర్య‌లు చేసిన‌ది. షష్ఠిని త‌ల్లివ‌లె సోద‌రివ‌లె యాద‌రించిన‌ది. ఈమె యీ యాద‌ర‌ణ‌మును మిగిలిన స‌ప‌త్నుల యెడ‌ల చూప‌నందున వీర‌పురుషుని హృద‌య‌ద‌ఘ్న‌ముగ ప్రేమించిన ష‌ష్టి యెడ‌ల‌నే చూపినందువ‌ల‌న త‌న భ‌ర్త‌ను ప్రేమించిన ప‌డ‌తిపై త‌న‌కాద‌ర‌ము క‌ల్గిన‌ది. తాను చేయ‌లేని ప‌నిని షష్ఠి మ‌న‌స్ఫూర్తిగ చేయ‌గ‌లిగిన‌ద‌ను సుహృద్భావ‌ము భ‌ట్టిదేవిలో క‌లిగియుండ వ‌చ్చును. భ‌ట్టిమ‌న‌స‌ప్పుడ‌ప్పుడు మ‌హారాజును చూడ‌నిచ్చ‌గించుచుండును. అప్పుడు ఆమె కుమారుని రాజువ‌ద్ద‌కు పంపును రాజ‌కుమారుని తీసికొని భ‌ట్టివ‌ద్ద‌కు వ‌చ్చును. ఈ విష‌య‌మిట్లు జ‌రుగువ‌లెన‌ని యోవ్వ‌రి చేత‌ను నిర్ణ‌యింప‌బ‌డ‌లేదు. కానియ‌దియ‌ట్లు జ‌రుగుట య‌ల‌వాటైన‌ది. అత‌డు వ‌చ్చిన‌ను ఆమెకోరిన‌ను మ‌ధ్య‌నొక దూర‌ము నామెచూపుల‌లో ప్ర‌ద‌ర్శించును ఆమె కొడుకును ప‌రిచారికుల కిచ్చిపంపును. న‌న్నంతిపుర‌మున‌కు ర‌మ్మ‌నియాజ్ఞ ఆమెనిలుచుండుట‌లో నామె చూచుట‌లో నేదోయొక దూర‌పు రేఖ‌యుండును ఆదూర‌పురేఖ న‌న్నుసాహ‌సింప నీయ‌దు వీర‌పురుషున‌కు త‌న‌భార్య‌కోపించియు లాలించియు హేల‌గ క‌వ్వించియు విలాస‌ముగ త‌న‌తో నుండ‌వ‌లెన‌ని కోరిక ఈ కోరిక యిత‌నికి న‌ల్వురు భార్య‌ల యందున తీర‌లేదు. షష్ఠి నిర్ల‌క్ష్య‌ముగ మాటాడియ‌త‌నిని చెంప‌పై కొట్టుట‌చేత నామెను చూచి ముచ్చ‌ట‌ప‌డినాడు వివాహ‌మైన త‌రువాత ష‌ష్ఠి కూడిమిగిలిన వారివ‌లెనే భ‌య‌భ‌క్తులు చూపుట యూగిమ‌ణ‌గి యుండుట చేయుట మొద‌లిడిన‌ది. అత‌నికి ష‌ష్ఠి పైకూడ మోహ‌మువ‌ద‌లిన‌ది. అత‌డు శాంతిశ్రీ ద‌గ్గ‌ర‌కు మూడు సంవ‌త్స‌ర‌ముల త‌రువాత నొక‌నాడు వెళ్ళెను. ఆమె కోపించి య‌లుకబూను న‌నుకొనెను. కాని శాంతిశ్రీ భ‌ర్త‌రాగానే ప‌రిచ‌ర్య‌లు చేసి విన‌య విధేయ‌త‌ల‌ను చూపిన‌ది. ఆమెయు త‌ననొక భార్య‌యా య‌నుకొనెను. నేను నిజానికి ష‌ష్టీ శ్రీ‌విర‌హినిగాను రుద్ర‌ధారా ప్రియుడుగాను బాపిశ్రీ కాముకుడ‌ను గాను, నిన్ను భార్య‌య‌ను కొనెడి వాడ‌నుగానునేను నిజాన‌కు భ‌ట్టిదేవివిర‌హిని అని శాంతిశ్రీ‌తో మ‌న‌సువిప్పి చెప్పెను. అత‌ని విర‌హ‌మున క‌వ‌ధి లేద‌నియు భ‌ట్టిదేవి త‌న‌ను తృణీక‌రించెన‌నియుకూడ‌చెప్పెను. రాజుయొక్క వేద‌న‌నుచూచిన‌శాంతిశ్రీ‌తో యావేద‌న తీర్చుట‌కు స‌మ‌ర్ధుడుభ‌ద‌తాంచార్యుడ‌ను బౌద్ధుడ‌ని చెప్పిన‌ది. శాంతిశ్రీ‌కిభ‌ర్త‌నెడ వైముఖ్య‌ములేదు భ‌ట్టిదేవిని ప్రేమించున‌ని యీర్ష్య‌లేదు. నిజ‌మైన బౌద్ధ‌మ‌త‌స్థురాలైన ప‌ర‌మ‌శాంతిమూర్తివంటిది.