49
 

వేద‌వ‌తి

వేద‌వ‌తి ప్ర‌తీకాత్మ‌క స్వ‌రూపిణి. ఆమె వేద‌ముల యొక్క స‌మాహార స్వ‌రూప‌ము. సంగీత శాస్త్ర‌మున‌కు జ్యోతి శ్శాస్త్ర‌మున‌కు ప్ర‌తికృతి. భ‌ర‌త‌భూమి క‌ర్మ‌భూమి. భార‌తీయుల‌కు వేద‌ములు ప్ర‌మాణ‌మ‌లు. వేద ప్రాశ‌స్త్య‌మును త‌గ్గించుట క‌నేక ప‌ర్యాయ‌ముల‌నేక మత‌ముల వారు ప్ర‌య‌త్నించి న‌ప్ప‌టికిని చెక్కుచెద‌ర‌క నిల‌చిన‌ది వేద‌నాగ‌రిక‌త కాల‌ము క‌ల‌సిరాన‌ప్పుడు ధీరునికైన‌ను త‌ల‌వంచ‌క ఆమె అలాగే కొంత‌కాల‌ము వేద‌ప‌ప్రాశ‌స్త్య‌ము మ‌రుగున ప‌డిన‌ట్లుగ క‌నుపించిన‌ను మ‌రి కొంత కాల‌మున‌కు తిగిరి త‌ల‌యెత్తి నిలుచును.

వేద‌వ‌తి వేద‌ముల‌కు ప్ర‌తీక‌గావున ఆమెను మ్లేచ్చులు దొంగ‌లించుకొనిపోయి శ‌క్తికొల‌ది కృశింప జేయ‌గ‌ల్గిరి అన‌గా కొంత‌కాల‌ము వేద ధ‌ర్మ‌ము మ‌రుగున ప‌డిన‌ట్లుగ‌, మ్లేచ్ఛుల యాగ‌మ‌న‌ము వ‌ల‌న భావింప‌బ‌డిన‌ది. మ‌ర‌ల విక్ర‌మాదిత్యుని వంటి శ‌క‌పురుషుల‌చే పున‌రుద్ధరింబ‌డిన‌ది. వేద‌వ‌తి తిరిగి క్షేమ‌ముగ త‌ల్లిదండ్రుల ద‌రికి చేరుకొన‌గ‌లిగిన‌ది.


వేద‌వ‌తి వ‌రాహ‌మిహిరుని కుమార్తె. య‌వ‌నులామె నెత్తుకొని పోయిరి. నాలుగు సంవ‌త్స‌ర‌ముల త‌రువాత త‌న‌కుమార్తెను వెద‌కుభార‌మును వేయుచు విక్ర‌మాదిత్యుని క‌డ‌కామె తండ్రి వ‌చ్చెను.ఆమె విచిత్ర‌మైన బాలిక సౌంద‌ర్య‌వ‌తి, ఒక దేవీ భ‌క్తుడామెకు దేవీ మంత్ర‌ము నుప‌దేశించెను. ఆమంత్ర‌దేవ‌త నామె నాల్గు సంవ‌త్స‌ర‌ములు నిద్రాహార‌ములుమాని యుపాసించెను. ఆనాటినుండియు వేద‌వ‌తి మొగ‌ము నందోక కాంతి వ్యాపించిన‌ది. ఆమెకిష్ట‌ముకాని ప‌నులెవ్వ‌రును చేయ‌రాదు. ప్రేమ‌చేత‌నే గాని కోప‌ముచేత స్పృశింప‌రాదు. ఇట్టికార‌ణ‌ముల చేత వేద‌వ‌తిని య‌వ‌నులెత్తుకొని పోయిన‌ను వివాహ‌ము చేసికొందుర‌ను భ‌య‌మామె తండ్రికి లేదు. ఆమె క్షేమ‌మామె చూచుకొన‌గ‌ల‌దు. కాని విడ‌పించి తీసికొని రావ‌ల‌సిన బాధ్య‌త చ‌క్ర‌వ‌ర్తిదే. వేద‌వ‌తి యొక్క జీవిత‌మునందు ఖ‌గోళాంశమెక్క‌వ యున్న‌ద‌నియు జాత‌కాంశ‌ము త‌క్కువ యున్న‌ద‌నియు వ‌రాహ‌మిహిరుడు చ‌క్ర‌వ‌ర్తితో చెప్పెను.

వేద‌వ‌తి మూర్తీభ‌వించిన చ‌తుర్వేద సార‌ము. వేదాంగ‌మైన ఖ‌గోళ జ్యోతిశ్శాస్త్ర‌నిష్ణాతుడైన వ‌రాహ‌మిహిరుని క‌న్న‌బిడ్డ‌యామె. వేద‌వ‌తిపై నెంత‌మ‌మ‌కార‌మో వేద‌ముల యందంత ప్రేమ‌, అభిమాన‌ము. వేద స‌ర‌స్వ‌తి యాత‌నికి క‌న్న‌త‌ల్లి వేద‌వ‌తి యాయ‌న క‌న్న‌బిడ్డ‌. మ్లేచ్ఛుల ప్ర‌ధాన వైర‌మువైదిక మ‌త‌ముపై అభిమాన‌ము క్షీణించుట‌యును త‌త్‌స్థాన‌మున మ్లేచ్ఛ భావ‌ముల స్వేచ్ఛా విహార‌మున ఇచ‌ట‌వ్యంగ్య రూప‌మున నిక్షేపింప‌బ‌డిన‌ది. వేద‌వ‌తి నెత్తుకొని పోయిరి గాని వార‌లామె నేమియును చేయుట‌కు స‌మ‌ర్ధులుకారు. వారు స‌మ‌ర్ధులై నప్ప‌టికిని వేద‌వ‌తి యొక్క య‌సామాన్య ప్ర‌తిభాపా వాదులు మ్లేచ్ఛుల యాట‌ల‌ను సాగ‌నీయ‌వు.

వేద‌వ‌తి గానప్రియ‌. సామ‌దేవ సార‌మైన సంగీత‌మున కీమె హృద‌య‌ము ర‌మించును. త‌న స్వ‌రూప‌ము. త‌నలో నొక భాగ‌ము న‌యిన సంగీత‌మున‌కీమె ర‌మించుట స్వాత్మానంద ల‌యీభూత‌మైన బ్ర‌హ్మ‌ప‌దార్ధ స్వ‌రూప‌మే వేద‌వ‌తి య‌ని ధృవీక‌రించుట‌. య‌వ‌నాచార‌మ‌య‌మై పోయిన భార‌త‌దేశ‌మున వేద ధ‌ర్మ‌మును పున‌రుద్ధ‌రించుట కుద్బ‌వించిన శ‌క‌పురుషుడు మ‌హాచ‌క్ర‌వ‌ర్తియ‌గు విక్ర‌మార్కుని వేద‌వ‌తిని ర‌క్షింపుమ‌ని కోరెను. ఆ బాలిక యినుప పంజ‌ర‌మున నున్న‌ది. వేద‌వ‌తికిని భ‌ర‌త‌భూమికిని శ‌క‌కారుడైన‌ విక్ర‌మార్కున‌కును అవినాభావ సంబంధ‌మున్న‌ది. వేద‌వ‌తి వేదాత్మ‌, క్ష‌మ వృద్ధుల‌ను పొందు చంద్రునివ‌లె మ్లేచ్ఛ సంగీత‌న‌ముకు క్షీణించుచు, నార్ష‌గాన‌మున‌కు పుష్టినందుచున్న త‌ద్వేద‌వ‌తిని మ్లేచ్ఛ చ్ఛాయ‌ల‌నుండి త‌ప్పించుట‌కై యుద్భ‌వించిన కార‌ణ‌జ‌న్ముడు గుహ్య‌కేశ్వ‌రుడను శివ‌భ‌క్తుడు విక్ర‌మార్కుడు.

వేద‌వ‌తిని య‌వ‌నులెత్తుకొని పోవుట‌చే చ‌క్ర‌వ‌ర్తి సాయ‌మును వ‌రాహ‌మిహిరుడు కోరుట‌లోగ‌ల సామంజ‌స్య మిట్టిది. వేద‌వ‌తి యొక్క యునికి చ‌క్ర‌వ‌ర్తికి జ‌పావ‌సాన‌మున ద్యోత‌క‌మ‌గున‌ని మిహిరుడు చెప్పెను. త‌పోగృహ‌ములోని క‌డుగుపెట్టు స‌మ‌య‌ములో చ‌క్ర‌వ‌ర్తికొక హృద‌య విదార‌క‌మైన ధ్వ‌ని వినిపించిన‌ది. క్ష‌ణ‌ము సేపు చ‌క్ర‌వ‌ర్తి విభ్రాంతుడై స్థాణుతుల్యుడైనాడు. ఆయ‌రుపు ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన స్వ‌ర‌స‌మ్మేశ‌న‌ముతో నుండి గుండెల‌లో చేయిపెట్టి క‌ల‌చిన‌ట్లై నలుబ‌ది యేండ్ల‌కు పూర్వ‌ము తాను విన్న హృద‌య విదార‌క‌మైన రావ‌ము పున‌ర‌నుభూత‌మైన‌ది. ఆనాడొక‌హ‌రిణ‌ముపైనొక సింగ‌ము దూకిన‌ది. హ‌రిణ‌ముయొక్క కూయియు సింహ‌ము యొక్క లోగొంతుత‌లోని గ‌ర్జ‌న‌ము గ‌ల‌సియొక విరోధి స్వ‌ర‌స‌మ్మిళిత ధ్వ‌నివ‌లెద‌న‌కు వినిపించి త‌న శరీర‌మునంద‌లి ర‌క్త‌నాళ‌ముల‌ను చేతిలో బ‌ట్టికొని క‌లియ‌బెట్టి న‌ట్ల‌య్యెను. ప్ర‌స్తుత‌మున చ‌క్ర‌వ‌ర్తి విన్న‌రావ‌ము స‌ర్ప‌మును హ‌ఠాత్తుగా చూచి మయూర‌ము ప్రాణ‌భీతితో పెట్టిన కేక‌యు, శుక‌ముల‌కు మాట‌ల‌నునేర్పు కాక‌పాది య‌న్న ముదుస‌లి దాసి శుక‌ముల‌ను సుకుమారములైన చిత్ర‌హింస‌లు పెట్టుచుండ‌గా నిర్గ‌త‌మైన బాధా నినాద‌మును, మిళిత‌మైన‌ట్టిదిగా, చ‌క్ర‌వీనుల కొకేసారి వినిపించి చెప్ప‌రాని వ్యాకుల‌త‌ను మ‌న‌సులో న‌నుభ‌వించెను. త‌పోమందిర దేహ‌ళీస్థితుడైన చ‌క్ర‌వ‌ర్తికిది య‌శుభ‌శ‌కున‌మా ? ఉప‌శృతియా ? వేద‌వ‌తీ స్వ‌రూపావ‌గ‌త ప్ర‌థ‌మ సోపాన‌మా ? త‌పో గృహ‌మున‌కు వెళ్ళుచుండ‌గా చ‌క్ర‌వ‌ర్తి వినిన యీధ్వ‌ని వేద‌వ‌తి యొక్క స్థితిని తెలియ‌జేయుచున్న‌ది. ఆచ‌ట ఆమె య‌వ‌న సంగీత‌మువిని క్షీణించుచున్న‌ది. ఆమె ప‌రిస్థితి స‌ర్ప‌ద్ర‌ష్ట‌య‌గు మ‌యూరి వ‌లెను సుకుమార శిక్ష‌ణార్థ‌మై ముండ్ల‌తో పొడ‌వ బ‌డుచున్న శుక‌ము వ‌లెను చ‌క్ర‌వ‌ర్తికి హృద్గ్రాహ్య‌మైన‌ది.

వేద‌వ‌తి శ‌త్రువుల మ‌ధ్య‌నాకార మాత్ర‌యై ప్రాణా వ‌శిష్ట‌యైయున్న‌ది. కాక‌పాది చిలుక‌ల‌నెట్లు యుండ్ల‌చే శిక్షించు చున్న‌దో య‌వ‌న‌గాన‌మున‌కామె య‌ట్లు మ‌రింత క్షీణ‌ద‌శ‌కు చేరుకున్న‌ది. మ‌హా స‌ర్ప‌మును చూచిన మ‌యూర‌మెట్లు ప్రాణ‌భీతి చేత కేకార‌వ‌మును చేసిన‌దో, అట్లే వేద‌వ‌తి కూడ వేద‌మ‌త విద్వేషియు, నాస్తిక మ‌త‌శేఖ‌రుడు న‌గు క‌ట‌క‌ట యోగి ద‌ర్శ‌న మాత్ర‌ముచే గ‌డ‌గ‌డ వ‌డ‌కిన‌ది. ప‌ర‌మ వైదిక మూర్తికావిశ్ల‌ధ ద‌శ‌ యేల‌న‌న్న‌చో, నామెకాల స్వ‌రూపిణి. ఖ‌గోళాంత‌ర్గ‌త స‌ర్వ స్వ‌రూప‌మున క‌ప‌ర స్వ‌రూప‌ము. కాల మ‌హాత్మ్య‌ముచేత ఖేద‌ప‌డ‌క త‌ప్ప‌దు. బాధ‌ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదియొక లీల‌.

నాస్తికులు, య‌వ‌నులు వేద‌ధ‌ర్మ విరోధులు. ఆర్ష‌వ్య‌వ‌స్థ‌కు వ‌ర్ణాశ్ర‌మ ధ‌ర్మ‌ముల‌కు య‌జ్ఞ‌యాగాది క్ర‌తువుల‌న‌కు శ‌త్రువులు. ఆనుకూల దాంప‌త్య‌ము పాతివ్ర‌త్య‌ము న‌నెడి మ‌హాసిద్ధాంత‌పు పునాదుల‌పై నిల‌బ‌డిన స‌నాత‌న‌ధ‌ర్మ మ‌హాసౌద‌మును స‌మూల‌ముగా న‌శింప జేయుట‌కై వారెన్నుకొనిన విధాన‌ము భార‌త‌స్త్రీల నెత్తికొని పొవుట వారి శీల‌మును భంగ‌ప‌ర‌చుట‌. ఈ భావ‌ముల తోడ‌నే వేద‌వ‌తిని కూడ నెత్తుకొని పోయిరి. రావ‌ణాసురునిచే త‌స్క‌రింప‌బ‌డి య‌శోక వ‌న‌మున కుమిలిన జాన‌కీదేవివ‌లెనే వేద‌వ‌తీదేవి కూడ మ‌హా ప‌ర్వ‌తాంర్గ‌త గుహ‌ల‌లో నుంచ‌బ‌డిన‌ది. సీతాదేవి యెంత‌గి య‌గ్నిరూప‌మో వేద‌వ‌తి కూడ నంత‌టి య‌గ్ని మూర్తియే. సీత‌వైష్ణ‌వీశ‌క్తి. వేద‌వ‌తి యెగ‌మాయాశ‌క్తి. ఈ రెండు శ‌క్తులు నొకే ప్ర‌కృతి గ‌ల‌వి.


వేద‌వ‌తి యోగ‌ము ఆర్ష‌గాన శ్ర‌వ‌ణ‌ముతో సుషోష‌క‌ము. మ్లేచ్ఛుల య‌స‌భ్య గాన‌ముతో శారీర‌క‌క్షైణ్య‌ము. వేద‌వ‌తి త‌స్క‌రింప‌బ‌డుట య‌న్న విష‌య‌ము, భారత‌దేశ‌ములో య‌వ‌న నాగ‌రిక‌తా ప్ర‌భావ‌ము వ‌ల‌న కొంత కాల‌మీ భూమి వేద దూర‌మైన‌దనియు శ‌క‌కారుడైన విక్ర‌మార్కునిచే వేద ధ‌ర్మ‌ము పున‌రుద్ధ‌రింప‌బ‌డినద‌నుట‌యు ధ్వ‌నిరూప వ్యాఖ్యాన‌ము, ఆకాల‌మున వేద‌వ‌తీస్థితి వ‌లె వేద‌ధ‌ర్మ‌ముల యొక్క ప‌రిస్థితి అస్తి నాస్తి విచికిత్సా హేతువై యుండెన‌నుట యీ న‌వ‌ల‌లోని యంత‌రార్ధ‌ము.

వేద‌వ‌తి బాల్య‌మున వ్యాధిగ్ర‌స్త‌యై యుండెడిది. జాత‌క‌మును చూడ‌గా పూర్ణాయుర్దాయ మున్న‌ది. ఆమె వ్యాధి సంగీత శ్ర‌వ‌ణ‌మున నెమ్మ‌దించుట గ‌మ‌నించిరి. ఒక సంగీత విద్వాంసుడు హిమాల‌య‌ముల‌లో నుండి త‌పస్సుజేసికొనుచున్న త‌న‌గురువున‌కు వేద‌వ‌తి యొక్క య‌నారోగ్య‌మును చెప్పి నివార‌ణోపాయ‌ము న‌డుగ‌గా నాగురువు త్రికాల‌ముల‌యందునా వేద‌వ‌తికి వేద‌ముల‌ను వినిపింపు మ‌నియు అట్లుప‌దిసంవ‌త్స‌ర‌ములు చేయ‌వ‌లెన‌నియు చెప్పెను. వేద‌వ‌తి ప్రాతఃకాల‌మున ఋగ్వేద‌మూర్తియై మ‌ధ్యాహ్న‌మున య‌జుర్వేదాకృతియై సాయంస‌మ‌య‌ముల సామ‌దేవ స్వ‌రూపిణియై భాసించెడిది. వేద‌పండితులాయా కాల‌ముల యందావేద‌ముల‌ను గాన‌ముచేయుచుండ‌గా వేద‌వ‌తి యాగాన‌ములో లీన‌యై తానేగాన‌మై గాన‌మే తానై, వేద‌ముల‌కు త‌న‌కు న‌భేదాకృతియైన‌ట్లు త‌న్మ‌యావ‌స్థ‌లో బ్ర‌హ్మానంద‌మున లీన‌మ‌య్యెడిది. వేద‌వ‌తి యానందావ‌స్థ‌లో నున్న‌పుడు చక్ర‌వ‌ర్తి రాజ్య‌ము సువ్య‌వ‌స్థిత‌మై యున్న‌ది. వ‌రాహ‌మిహిరుడు వేద‌వ‌తి యొక్క శారీర‌క ప‌రిస్థితికిని విక్ర‌మార్కుని రాజ్య‌ప‌రిస్థితికినిగ‌ల సామ్య‌మును గ్ర‌హించి వ్రాసియుంచెను. వేద‌వ‌తి కాళ్ళునీర‌స‌ప‌డి న‌డ‌వ‌లేని స్థితిలో నున్న‌పుడు విక్ర‌మార్క చ‌క్ర‌వ‌ర్తి శ‌త‌ద్రూన‌రీత‌ర‌ణ‌ము చేయ‌జాల‌క నిర్య్వ‌వ‌సాయుడై తీర‌మున‌నే యుండెను. వేద‌వ‌తికి తీవ్ర‌శిరోభార‌ము క‌ల్గిన‌పుడు కొంద‌రుయ‌వ‌నులు బ్రాహ్మ‌ణ‌వేష‌ముల‌ను ధ‌రించి దేశ‌మున త‌మ య‌వ‌న‌సిద్ధాంత ప్ర‌చార‌మును చేయుమొద‌లిడిరి. ఇది చ‌క్ర‌వ‌ర్తికి శిరోభార‌మును క‌ల్గించిన‌ది. నివార‌ణోపాయ‌మును కూడ బాగుగ యోచించిచేయవ‌లెనని సూచ‌న‌. వేద‌వ‌తికి తీవ్ర‌వ్యాధి క‌ల్గిన‌పుడు చ‌క్ర‌వ‌ర్తి ప్రాణ‌ములు గూడ సంశ‌య‌గ్ర‌స్త ముల‌య్యెడివి. చ‌క్ర‌వ‌ర్తిని సంహ‌రించుట‌కు కిల్కిల‌య‌వ‌నుల‌చేత వ్య‌ర్ధ‌ప్ర‌య‌త్న‌ములు చేసిరి. వేద‌వ‌తి ప్రాణ‌ముల‌కు చ‌క్ర‌వ‌ర్తి ప్రాణ‌ముల‌కు నొక‌య‌భేద్యేమైన లంకెయున్న‌ద‌ని వ‌రాహ‌మిహిరుడు గ్ర‌హించెను.

టిక‌టిక య‌నుగాయ‌కుడు శంక‌రాచార్య‌విర‌చిత‌స్తోత్ర‌ముల‌ను గాన‌ము చేయుట నేర్చుకొనెను. హిమాల‌య‌ములందున్న గుర‌వుయొక్క సంక‌ల్ప బ‌ల‌ముచే టిక‌టిక త‌న‌ప్ర‌మేయ‌ము లేక‌నే వేద‌వ‌తి యున్న తావును క‌నుగొన గ‌ల్గెను. ఈ వేద‌వ‌తి నాద‌మ‌య‌మూర్తి కావ‌ల‌యును ఈ పాప‌పు సంగీత‌ము వినుట వ‌ల‌న నామెమెలిక‌లు తిరిగిపోవునేమో ఆమెకార్శ్య‌మున‌కిది హేతువుకావ‌ల‌యును వీడెవ‌డో కిరాత‌యోగి యీమెనిట్లు బాధించుచుండెను అని టిక‌టిక భావించెను. య‌వ‌న సంగీత‌ము తుచ్ఛ‌మైన‌ద‌ని బుద్ధికి భాసించుచునే యున్న‌దికాని దానికున్న యాక‌ర్ష‌ణ‌మున కంతులేదు. టిక‌టిక వేద‌వ‌తియున్న గుహ‌లోనికి జ‌ల‌మార్గ‌మున న‌డ‌చివ‌చ్చెను.

మ‌ధుగుంజ‌య‌ను మ‌రియెక గాయ‌కురాలి గాన‌మున కాక‌ర్షితుడై యాగాన‌ము విన‌బ‌డుచున్న దిశ‌కున‌డ‌చుచుదారిలో నున్న‌నీటి ప‌డియ‌మీద‌గూడ న‌డ‌చుచు విన‌బ‌డుచున్న వేద‌వ‌తిస‌న్నిధికి చేరున‌ట్లు చేసెను. ఆమెకృశించిరేపోమాపోచ‌నిపోవున‌ట్లుండెను. టిక‌టిక శ‌ర్యాతిత‌ల్లినేర్పిన‌భ‌జ‌గోవింద‌శ్లోక‌ములు సౌంద‌ర్య‌ల‌హ‌రీ శ్లోక‌ములు క‌రావ‌లంబ స్తోత్ర‌మును ప‌ఠింప‌గా వేద‌వ‌తిశ‌రీర‌ము పుష్పిత‌మైన‌ట్లు ప్రాణ‌ములు పోసికొనెను.

య‌వ‌నుడైన క‌ట‌క‌ట‌యోగి నిమిష‌ధారి స‌మాయ‌మున వేద‌వ‌తిని త‌స్క‌రించుకొని వ‌చ్చెను. అత‌డు నిమిష‌ధారితో నిట్ల‌నెను. నాకు వేద‌ముతో విరోధ‌ము. బ‌హుజ‌న్మ‌లెత్తితిని అన్ని జ‌న్మ‌ల‌యందు వేద‌మ‌త‌ముతోడి విరోధ‌ము సాగించితిని. కాదు యుగాంత‌ము సాధింతును అనెను. నిమిష‌ధారి ఖండ‌కాల‌మునంద‌లి ప‌ర‌మ‌క‌నిష్ఠ ఖండ‌స్వ‌రూపుడు అత‌డు నిముష‌ముల‌ను ప్రోగుజేసికొని జీవించును. వేద‌వ‌తి నాద‌మ‌య‌మూర్తి అఖండ గానానంద ర‌స‌స్వ‌రూపిణి. అఖండ‌ప్ర‌ణ‌వ‌రూప శ‌బ్ద‌బ్ర‌హ్మము, కావున ఖండ‌స్వ‌రూపుడ‌గు నిమిష‌ధారికిని య‌ఖండ‌మూర్తి య‌గువేద‌వ‌తికిని స‌హ‌జ భిన్న స్వ‌రూప‌ములు.


తాత్కాల‌కోద్రేక పూరిత‌మైన య‌స‌భ్యాసంబ‌ద్ధ సంగీత‌మున కామె హృద‌య‌ము క్షోభిల్లి శ‌రీర‌ము క్షీణించుట జ‌రిగిన‌ది. దృశాద్ర‌ఘీయ‌శ్యా య‌ను సౌంద‌ర్య‌ల‌మ‌రీస్తోత్ర‌ము టిక‌టిక గాన‌ము చేయుచుండ‌గా నామె కార్శ్య‌ముప‌శ‌మిల్లెను. ఆమెముఖ‌స‌రోజాత‌మున శ‌ర‌ద్వేళా ప్రాతఃకాల త‌రుణాదిత్య‌మృదుక‌ర కిర‌ణ‌ములు నిమిరిన‌ట్ల‌తి శ‌యించెను. ప‌ర‌మూడేండ్లు దుష్ట సంగీత‌మును వినివిని మ‌ర‌ణోన్ముఖియైన వేద‌వ‌తిని మ‌ధుగుంజ‌య‌ను గాయ‌కురాలి మృదుసంగీత‌ముచేత పుర‌రాశ క‌ల్పించుచు క‌ట‌క‌ట యోగి త‌న క‌ఠిన హృద‌య‌మును వెల్ల‌డించుకొనెను.

వేద‌వ‌తి జాగ్ర‌ద‌వ‌స్థ‌లో నుండ‌గా టిక‌టిక శంక‌చార్య‌కృత స్తోత్ర‌ముల‌ను గాన‌ము చేసెను. అంత‌వేద‌వ‌తి లోనెంత‌యోమార్పు వ‌చ్చెను. గ్రీష్మ‌ర్తువున శుష్కించి పోయిన మ‌హాన‌ది కొండ‌ల‌లో మ‌హావ‌ర్ష‌ములు కురిసి ఉప‌న‌దులు శాఖాన‌దుల‌లో నుండి జ‌ల‌ముపోసికొని కెర‌ళ్ళుకెర‌ళ్ళు త‌ర‌గ‌లు త‌ర‌గ‌లుగా బుడ‌గ‌లు బుడ‌గ‌లుగా గోధుమ ప‌సిత్రాచులు ప్రాకిన‌ట్లు కుటుంబ‌ములు న‌డ‌చిన‌ట్లు గ‌రుడిపిల్ల లెగిరిన‌ట్లు మ‌హాభుజంగ‌ములు పూత్కార‌ము చేసిన‌ట్లు ర‌సాల మ‌హావృక్ష‌మున రెమ్మ‌రెమ్మ‌ను పూవుగుత్తులు చిక్క‌గా వెదికి వ‌చ్చిన‌ట్లు స్నిగ్ధ‌మగుచుండెను. వేద‌వ‌తి సంగీత‌మున‌కింత ప్ర‌భావిత‌మైన‌ది. ఆమె హృద‌య‌మింత‌యు త్ఫుల్ల‌మైన‌ది.


వేద‌వ‌తి వ‌రాహ‌మిహిరుని సూర్యోపాస‌న ఫ‌ల‌ముగ న‌వ‌గ్ర‌హోపాస‌న ఫ‌ల‌ముగ క‌లిగిన త‌ప‌శ్శ‌క్తి వ‌ల‌న జ‌నించిన‌ది. అందుచేత‌నే వ‌రాహ‌మిహిరుని స‌ర్వ‌విజ్ఞాన‌మున‌కు ప్ర‌తీక‌గ‌వేద‌వ‌తి యుద‌యించిన‌ది.