56
 

ర‌త్నావ‌ళి విజ్ఞురాలై న‌స్త్రీ. ఆత్మ‌హ‌త్య మ‌హాపాత‌క‌మ‌ని తెలియును. మ‌ర‌ణముతో త‌న‌పాప‌ము ప‌రిహార‌మ‌గున‌న్న భావ‌ముతో మృత్యోన్ముఖురాలుకాలేదు. శ‌రీర‌ముతో చేసిన పాప‌ము శ‌రీర‌ము తోడ‌నే న‌శింప‌దు. పాప‌మైన‌ను పుణ్య‌మైన‌ను పూర్తిగ న‌నుభ‌వింప‌క త‌ప్ప‌ద‌ని ప‌రిపూర్ణ‌ముగ నెరిగిన స్త్రీ. కాని త‌నంత తానుగ ఉప్పెన కెదురుగ స‌ముద్రాభిముఖియై వెడ‌లుట‌కు కార‌ణ‌మేమి ?  య‌న్న‌చో నామెస‌మాధాన‌మిది...ఏభ‌ర్త ఒక అనాధురాలికి ఊర‌కే అబ్దికాలు పెట్టిస్తాన‌ని వాగ్దాన మిచ్చేటంత మంచివాడో అటువంటి భ‌ర్తిని వ‌ద‌లిపెట్టి పోయిన చెడిపెచావ‌క ఏంచేస్తుంది. ఆభ‌ర్త‌ను వ‌ద‌లి పెట్టాన‌ని దుఃఖించి దుఃఖించి ఈ పాపంఎట్లా పోతుందా అనివిచారించి త‌ప‌స్సు చేసిచేసి ఆభ‌ర్త‌తో క‌ల‌వ‌డం అసంభ‌వ‌మ‌ని తెలిసి తెలిసి కుములిపోతూవున్న స్త్రీ ఇంకాఏంచేస్తుంది అన్న‌ది. ర‌త్నావ‌ళి తానుచేసిన త‌ప్పిద‌మున కెంత‌భేద ప‌డుచుండునో ఎంత ఆక్రోశించు చుండెనో ఈమాట వ‌ల‌న తెలియుచున్న‌ది.

ర‌త్నావ‌ళి యేల‌చ‌నిపోవ‌లె. ఏయాశ్ర‌మ మందైన‌ను నిష్కామ క‌ర్మ‌ములు చేయుచు దీన‌జ‌నోర్ధ‌ర‌ణ‌ము చేయుచుభ‌క్తురాలై జ‌న్మ సార్ధ‌క్య‌మును చేసికొన‌రాదాయ‌ని కొంద‌రు విమ‌ర్శింతురు. ర‌త్నావ‌ళినీ రంగ‌ణ్ణీ మృత్యు ముఖంలోనిక పంపించ‌టం కేవ‌లం విశ్వ‌నాథ నిస్పృహానూ క‌ల‌వ‌రాన్నీ తెలుపుతుంది. వైరాగ్యం పొందిన ర‌త్నావ‌ళి కాని రంగ‌డు కాని నిష్కామ‌క‌ర్మ చేస్తూ లోకంలో ఉండ ద‌గిన‌వారు కారా ?  అనిన ర‌చ‌యిత సృష్టించిన పాత్ర‌ల‌లోని వైవిధ్య‌మునిట ప‌రిశీలింప‌వ‌ల‌యును. ర‌త్నావ‌ళితుదిఘ‌ట్ట‌మున ర‌త్నావ‌ళి పొందిన ఆత్మ‌వేద‌న న‌ర్ధ‌ము చేసికొనిన‌చో ఆమెచేసిన పనిని స‌మ‌ర్ధింప‌క మాన‌ము. లోక‌మున వివిధ‌ములైన మ‌న‌స్త‌త్వ‌ముల వారుందురు. వారి వారి భావ‌నాప‌ద్ధ‌తుల ప్ర‌కార‌ము వారుజీవ‌న‌విధాన‌ము నేర్ప‌రుచ‌కొందురు. చేసిన పాప‌మున‌కు పశ్చాత్తాప‌ము పొందిన వారంద‌రు నిష్కామ క‌ర్మ చేయుచు నిస్సంగుల‌గుట ప్ర‌కృతి స‌హ‌జ‌ముకాదు. ఎవ‌రియూహ‌ల ప్ర‌కార‌ము వారు వారి నిర్ణ‌య‌ముల నారింతురుచ‌. వేయిప‌డ‌గ‌లు లోని మంగ‌మ్మ ర‌త్నావ‌ళివ‌లె ప‌శ్చాత్త‌ప్తురాలు కాని యామె మ‌ర‌ణింప‌వ‌లెన‌ను కొన‌లేదు. కాని హ‌త్య‌గావింప‌బ‌డిన‌ది. ర‌త్నావ‌ళి త‌న శ‌రీర‌ముపై నంతరోసిన‌ది. కావున నాయ‌స‌హ్య‌త‌ను సంహింప‌లేక స‌ముద్రాభిముఖియై న‌డ‌చిన‌ది.

రత్నావ‌ళి యొక స‌జీవ‌మైన పాత్ర‌కావున‌నే ఆమె జీవిత మా విధ‌ముగ ముగింపు చేసికొనిన‌ది. ఏగ‌దిలో తానుపాప‌కృత్య‌మును చేసిన‌దో ఆగ‌దిలో నుండియే త‌న పాప‌మ‌ను దగ్ధ‌ము చేయుట మొద‌లిడిన‌ది. స‌ముద్ర‌ము ద‌గ్గ‌ర పూర్తి చేయ‌త‌ల‌చిన‌ది.

ర‌చ‌యిత ర‌త్నావ‌ళిని రంగ‌డిని నికృష్టులైన వారినిగ విలువ‌కట్ట‌లేదు. వారిప‌శ్చాత్తాప‌మున‌నే వారి యౌన్న‌త్య‌ము వెల్ల‌డి య‌గుచున్న‌ది.

సీతారామ‌య్య‌యును అత‌ని మూడ‌వ‌భార్య రాజ్య‌మును నిత్య‌కృత‌ముల‌లో నొడిదుడుకులు లేకుండ జీవించు స‌ర్వ‌సాధార‌ణ వ్య‌క్తులు. సీతారామ‌య్య‌లో ర‌త్నావ‌ళిని స్వీక‌రించు హృద‌యౌన్న‌త్య‌మున్న‌ది. అయిన‌ప్ప‌టికిని జ్ఞానికాడు. పెద్ద‌లు చెప్పిర‌ని సంప్ర‌దాయ‌ములోనుండి యొక ధ‌ర్మ‌ము నాచ‌రించునేగాని ఆధ‌ర్మాచ‌ర‌ణ‌కున్న పూర్వాప‌ర‌ములు గాని యుచితానుచిత‌ములు గాని యావ‌శ్య‌క‌ముగాని ర‌త్నావ‌ళికి తెలిసినంత సీతారామ‌య్య‌కు తెలియ‌దు. ఇట్టి పాత్ర‌త‌ను హృద‌య సంస్కార‌మును ర‌త్నావ‌ళి కాపాదించిరి..అన‌గా ర‌త్నావ‌ళి లేచిపోయిన స్త్రీ గావున నీచ‌ముగ చూడ‌బ‌డ‌లేదు. న‌వ‌ల‌లోని వ్య‌క్తులంద‌రి కన్న‌మిన్న‌గ చూడ‌బ‌డి యుదాత్త గుణ‌ముల‌లో చిత్రింప‌బడిన‌ది.

వేద‌జ్ఞుడ‌గు పండితుని వంటిది ర‌త్న‌వళి.

తుచ త‌ప్ప‌కుండ శుక‌మువ‌లె వ‌ల్లించువంటివాడు సీతారామ‌య్య. ర‌త్నావ‌ళికి రంగ‌డును సీతార‌మ‌య్య‌కు రాజ్య‌మును ఛాయ‌ల‌వంటివాడు. ర‌త్నావ‌ళి చ‌రించిన స్వేచ్ఛావ్ర‌ణ‌ము జీవిత‌మున‌కు కార‌ణ‌ము పాశ్చాత్య నాగ‌రిక‌తా ప్ర‌భావ‌మునుండి జ‌నించిన స్వేచ్ఛాప్ర‌ణ‌య లీలావైఖ‌రియే నీతి బాహ్య భోగ‌లాల‌స‌త్వ‌ము నియ‌మ‌ర‌హిత స్వేచ్ఛాప్ర‌వృత్తి మాన‌సిక దౌర్బ‌ల్య‌ము కొంత‌వ‌ర‌కు కార‌ణ‌ములు. ఉత్త‌మ ర‌చ‌యిత క‌వీంద్రుడు నాత్మ‌సాహితీ ప్రాభవ‌ముచేత ప‌త‌నోన్ముఖ‌మైన స‌మాజ‌ము నుద్ద‌రింప ప్ర‌య‌త్నింతురు. విశ్వ‌నాథ‌వారిలో నీత‌ప‌న య‌త్య‌ధిక‌ము. వీరి వేద‌న వీరి న‌వ‌ల లంద‌న్నిట ప్ర‌స్ఫుటుమ‌గ దోచు ఏకైక విష‌య‌ము. అరువ‌ది న‌వ‌ల‌లు రచించిన‌ర‌న‌గా వారిలోనున్న త‌ప‌న‌నావ‌ల‌లో గ్ర‌క్కి మ‌న‌శ్శాంతి కొర‌కు ప్ర‌య‌త్నించిర‌నుట‌యే.

ర‌త్నావ‌ళిలోని సంస్కారము, జ్ఞాన‌ము, ధ‌ర్మాభిర‌తి యివియ‌న్నియును ర‌త్న‌ములు వంటిగుణ‌ములు. మ‌లిక‌క్షాళ‌నానంత‌ర‌ము ర‌త్నావ‌ళి ర‌త్న‌మాల‌వలె ప్ర‌కాశించి సార్థ‌క‌నామ‌ధేయురాలై యొప్పిన‌ది.