61
 

 

మీనాక్షి

 

ఏక‌వీర న‌వ‌ల‌యందున్న రెండ‌వ స్త్రీపాత్ర మీనాక్షి. మీనాక్షి కూడ ఏక‌వీర వ‌లెనే ఒక‌న‌ని ప్రేమించి మ‌రియొక‌రిని పెండ్లాడిన‌ది. ఏక‌వీర య‌ను భ‌వించినంత మాన‌సిక క్షోభ మీనాక్షి య‌నుభ‌వింప‌దు. స‌మ‌స్య యిరువురుకును స‌మాన‌మైన‌ప్ప‌టికిని మాన‌సిక వైవిధ్య‌ము స్ఫుట‌ముగ నుండున‌టుల నీ రెండు పాత్ర‌లు చిత్రీక‌రింప‌బ‌డిన‌వి.

మీనాక్షి సామ‌న్య గృహ‌స్థు కుమార్తె. రాజ‌కుమారుడైన కుట్టానును ప్రేమించి కార‌ణాంత‌ర‌ములచేత వీర‌భూప‌తిని పెండ్లియాడిన‌ది. ఆమెను పెండ్లియాడిన వీర‌భూప‌తి యేక‌వీర‌ను ప్రేమించెను.

కుట్టాను ఏక‌వీర‌నెట్లు ప‌ర‌స్త్రీవ‌లెజూచెనో మీనాక్షి వీర‌భూప‌తిన‌ట్లు ప‌ర‌పురుషునిగ భావించిన‌ది. మీనాక్షి తాన ప్రేమించిన‌ది భ‌ర్త స్నేహితుడైన కుట్టానున‌ని తెలిసికొనిది. కుట్టాను తాను ప్రేమించిన మీనాక్షి మిత్రుని భార్య‌యైన‌దని గ్ర‌హించి యామెను సోద‌ర‌తుల్య‌నుగ భావింప‌మొద‌లిడినాడు. ఆ విష‌య‌మును గ్ర‌హించి మీనాక్షి తానుకూడ కుట్టానును సోద‌రునిగ‌నునంత‌వ‌ర‌కు ప‌ర‌పురుషునిగ భావించిన భ‌ర్త‌ను భ‌ర్త‌గ‌ను భావింప‌మొద‌లిడిన‌ది. ఈమెలో సంభ‌వించిన నీత్వ‌రిత‌మైన మార్పును గుణ‌ముగ‌ను లోప‌ముగ‌ను కూడ‌భావింప‌వ‌ల‌యును. బాల‌క్రీడ‌ల‌లో బొమ్మ‌ల‌ను మార్చినంత సుల‌భ‌ముగ మీనాక్షి హృద‌య కుహ‌ర‌మున పురుషుల‌ను మార్చ‌గ‌ల్గిన‌ది.  ఇందువ‌ల‌న నామె హృద‌య‌మున‌కు లోతులేద‌నునొక విమ‌ర్శ ఇంత‌సుల‌భ‌ముగా నామెయెట్లు మారిపోయిన‌ది ?  కార‌ణ‌మొక్క‌టే తోచుచున్న‌ది ఆమె హృద‌య‌మున‌కులోతులేదు. కానియీభావ‌ము స‌రికాదు. ఆమెహృద‌య‌మునకున్నలోతు ఆమెకు తెలియును. అన‌గా హృద‌య‌మునామె త‌న యాధీన‌ము నందుంచుకొన‌గ‌ల్గిన‌ది. ఆమెత‌న‌స్థితిని తాను తెలిసికొనిన‌ది. మ‌న‌సునందు కుట్టానునుంచుకొని వీర‌భూప‌తితోడ సంసార‌ము చేయుట‌కూడ దోష‌మే. దీనిని మాన‌సిక వ్య‌భిచార‌ముగ ప‌రిగ‌ణింప‌వ‌ల‌సివ‌చ్చును. మీనాక్షి భ‌ర్త నంగీక‌రింప‌లేద‌నుట గుణ‌ముగ పేర్కొన‌వ‌చ్చును. అగ్నిసాక్షిగా వివాహ‌మాడిన వీర‌భూప‌తిని దూర‌ముగ‌నుంచుట ధ‌ర్మముకాదుగ‌నుక లోప‌మున‌వ‌చ్చును. ఇందుల‌కు సామాజికార్థిక ప‌రిస్థితుల‌ను కూడ పేర్కొన‌వ‌లెను. తాను వ‌ల‌చిన పురుషుని ప‌రిణ‌య‌మాడుట‌కు క‌న్య‌ల‌కుగాని య‌వివాహితులైన పురుషుల‌కుగానిలేదు. ఈ కార‌ణ‌ముల‌చేత యువ‌తీయువ‌కుల‌ను మ‌న‌స్సులు ప‌రాధీన‌ముల‌గాక‌మాన‌వు. మీనాక్షికి తానువ‌ల‌చిన వానిని పెండ్లియాడ‌గ‌ల యార్థిక‌స్తోమ‌త‌లేదు.

మీనాక్షి యందు యేకవీర యందున్నంత అంత‌స్సంఘ‌క‌ర్ష‌ణ‌లేదు. ఇందుల‌కు వీర‌భూప‌తి సాయ‌ప‌డెన‌న‌వ‌చ్చును. ఏక‌వీర‌ను కుట్టాన్ తిర‌స్క‌రించెను గ‌నుక‌నామె హృద‌య‌ము ప‌రిపరివిధ‌ముల ప‌రిత‌పించిన‌ది. ధ‌ర్మాధ‌ర్మివిచార సంజ‌నిత యుద్ధ‌ములోనామె హృద‌య‌ము న‌లిగిపోయిన‌ది. మీనాక్షిక‌ట్టి ద్వైధీభావ‌ము లేదు.

వీర‌భూప‌తి మీనాక్షిని తాకిన‌చో మీనాక్షి గోధుమ‌వ‌న్నె త్రాచువ‌లె బుస‌గొట్టెడిది. మీనాక్షి ప్రియుని మ‌రువ లేద‌నువిష‌య‌మిట రూఢ‌ము. మీనాక్షి శ‌రీర‌ము మ‌న‌సు నొకేబాట‌ను న‌డిచిన‌వి. వీర‌భూప‌తి బ‌ల‌వంత‌ము చేసియున్న‌చో నామెకూడ‌నంత‌ర్యుధ్ధ‌మ‌నుభ‌వింప వ‌ల‌సియుండెడిది. ఇచ‌టి స‌మ‌స్య వీర‌భూప‌తిది కాని మీనాక్షిదికాదు.

మీనాక్షి ప్రేమ‌కు ప‌ట్ట‌ముగ‌ట్టి దాంప‌త్య‌ధ‌ర్మ‌మున‌కు తిలోద‌క‌ము లీయ త‌ల‌పెట్టిన‌ది. ఏక‌వీర దాంప‌త్య‌ధ‌ర్మము నెర‌ప‌ద‌ల‌చి ప్రేమ‌కు ద్వితీయ స్ధాన‌మీయ‌ద‌ల‌చిన‌ది. ఇరువురి భ‌ర్త‌లు వీనికి వ్య‌తిరేక భావ‌ముల‌ను క‌లిగియున్నారు.

ఏక‌వీర హృద‌య‌మును జోకొట్టి ధ‌ర్మమును నెర‌ప‌ద‌ల‌చిన‌ది. ఈమె హృద‌య‌మును శ‌రీర‌మునుండి వేరుప‌ర‌చి నందువ‌ల‌న వేద‌న‌కు గురియైన‌ది. మీనాక్షికి శ‌రీర‌మునంటియే హృద‌య‌మున్న‌ది. ఈమెకు హృద‌య‌మంగీక‌రించిన గాని శ‌రీర‌మంగీక‌రింప‌దు. కుట్టాన్ సేతుప‌తి తాను ప్రేమించిన క‌న్య‌ను మిత్రుడు పెండ్లియాడెను గావున నామెను మ‌రిప్రియురాలిగా హృద‌య‌మున భావించుట మిత్రునియెడ దోష‌ము చేయుట‌యేయ‌నిభావించి నిద్రాహార‌ములుమాని యోచించి మీనాక్షిని సోద‌రినిగ రూపొందించుకొనెను. ఇట్ల‌త‌ను నిర్ణ‌యించుకొనుట‌కు రెండు దిన‌ములుప‌ట్టిన‌ది.

కుట్టాన్ మీనాక్షిని ప‌సుపు కుంకుమ ప‌ట్టుచీర తీసికొని వీర‌భూప‌తి యింటికి వచ్చెను. మీనాక్షిప్రియుని గుర్తించి స్త‌బ్ధ‌యైన‌ది. క‌న్నీరు విడిచిన‌ది. సేతుప‌తి యామె హృద‌య‌ము న‌వ‌గ‌త‌ము చేసికొని మీనాక్షిని అమ్మా య‌ని సంభోధించి నీవునాకు సోద‌రి వ‌నెను. నీవు వ‌డ్డించ‌గా భోజ‌న‌ము చేయ‌వ‌లెన‌నిపించిన‌ది అనెను. మీనాక్షివెను వెంట‌నే య‌న్నా య‌ని పిలువ‌ల‌గ‌ల‌గిన‌ది. ఇందువ‌ల‌న మీనాక్షికెంత‌టి హృద‌య‌గాంభీర్య‌మున్న‌దో, ఆహృద‌య‌ము నామె యెంత‌గా క‌ళ్ళెమువేసి బిగింప‌గ‌ల్గిన‌దో తెలియుచున్న‌ది. ఇదియింద్ర‌జాల విద్య‌కాదు. మ‌నఃక‌పినివ‌శ‌ము చేసికొనుట యందొక సామాన్య క‌న్య‌కెంత య‌ధికార‌మున్న‌దో వెల్ల‌డియ‌గుచున్న‌ది.

అంత‌వ‌ర‌కును భ‌ర్త స్పృశించిన‌చో త్రాచువ‌లె బుస‌కొట్టు మీనాక్షి భ‌ర్త‌పాద‌ముల‌ను ప్రేమ‌తో నిమ‌ర‌గ‌ల్గిన‌ది. న‌మ‌స్కృతిలో మీనాక్షి వీర‌భూప‌తి పాదముల‌ను జ‌క్క‌గా నిమిరెను. ఇట్లు చేయుట‌లో నామె మ‌న‌స్సేగాక శ‌రీర‌మును కూడ త‌న‌చెప్పుచేత‌ల‌లో నుంచుకొన‌గ‌ల్గిన‌ద‌నుట తెల్ల‌ము. ప‌తిస్ప‌ర్శ‌కు తాళ‌లేని మీనాక్షీ త‌న‌హృద‌య‌మందున్న ప్రేమ‌ను, క్ష‌మాభిక్షార్ధ‌మును సూచించుచు ప‌తిపాదముల‌ను చ‌క్క‌గా నిమ‌రిన‌దిజ ర‌చయిత మీనాక్షిపాత్ర‌లోకూడ సూక్ష్మముగ స్ప‌ర్శ‌సిద్ధాంత‌మును సూచించియున్నారు. త‌న మ‌నస్సంగీక‌రింప‌ని పురుషుని భ‌ర్త‌గ భ‌రించుట క‌ష్ట‌మ‌ని మీనాక్షి చ‌ర్య‌స్ప‌ష్ట‌ముచేయుచుండ‌గా నొక‌విధ‌ముగ ఏక‌వీర‌క‌న్న మీనాక్షియే విజాతీయ స్ప‌ర్శ‌కు తాశుకొన‌నంత‌టి సుకుమారి య‌న‌వ‌చ్చును. ఏక‌వీర త్వ‌గింద్రియాతిశ‌య జ్ఞాన‌మువ‌ల‌న గాలినికొలుచు యంత్ర‌ము వంటిదైన‌ది. మీనాక్షి మ‌న‌సు కోర‌క పోయిన‌చో స్త్రీ శ‌రీర‌ము పురుష శ‌రీర స్ప‌ర్శ కెంత వ్య‌తిరేకానుభూతి నంద‌గ‌ల‌దో తెలియ‌జేయు వాక్య‌మే త్రాచువ‌లె లేచును అన్న‌ది. ఎప్పుడై తేమ‌న‌స్సు సేతుప‌తినుండి మ‌ర‌ల వీర‌భూప‌తి చెంత‌కు వ‌చ్చిన‌దో నాక్ష‌ణ‌మే నామె శ‌రీర‌ము వీర‌భూప‌తి స్ప‌ర్శ‌కు వ్య‌తిరేకానుభూతినిచ్చుట మానివైచిన‌ది. ఇచ‌ట మీనాక్షి మ‌న‌శ్శ‌రీర‌ముల ప‌ర‌స్ప‌ర సంబంధ‌మును చ‌క్క‌గ నిరూపించ గ‌లిగి పాతివ్ర‌త్య‌మున‌నేమో తెలియ‌జేసిన‌ట్లైన‌ది. కావున మీనాక్షియందు క‌లిగిన మార్పు పై పైన‌మాత్ర‌ముగాక హృద‌య‌పూర్వ‌క‌ముగ జ‌రిగెన‌నియే చెప్ప‌వ‌లెను.

ఏక‌వీర‌కున్న‌ట్లుగ మీనాక్షికి ఆత్మ‌న్యూన‌త భావ‌ములేదు. మ‌రియును ఆత్మ‌విశ్వాస‌ము త‌న‌యందు త‌న‌కు ధృఢ‌మ‌గు నమ్మిక‌కూడ గ‌ల‌దు. భవిష్య‌త్తుపైనాశ‌య‌ను విధివిలాస‌మును నిర్లిప్తంగ స్వీక‌రించు నిస్సంగ‌త్వ‌ముకూడ మీనాక్షియందుగ‌ల‌వు. అందుచేత‌నే కుట్టాన్ వీర‌భూప‌తికి త‌న ప్ర‌ణ‌య‌మునుగూర్చి చెప్పిన‌ప్ప‌టికిన భ‌ర్త‌కు త‌న‌ప్రేమ వ్య‌వ‌హార‌ము తెలిసినందువ‌ల‌న బెగ్గ‌టిల్లిపోక నిశ్చ‌ల‌ముగ‌నున్న‌ది. వీర‌భూప‌తియొక్క తూష్ణీంభావ‌ముగాని నిర్లిప్త‌త‌నుగాని నిర‌భిమాన‌మునుగాని ప‌ట్టించుకొన‌లేదు. అత‌ని చ‌ర్య‌లామెకు దుఃఖ‌హేతువులుకాలేదు. అంత‌కంత‌కామె ప్రేమ‌వృధ్ధియ‌గుచునే యుండెను. పొంగివ‌చ్చునా ప్రేమ ప్ర‌వాహ‌మును వీర‌భూప‌తి తాళుకొన‌లేక‌పోయినాడు.

నాయిక‌యందుండ‌వ‌ల‌సిన ల‌క్ష‌ణ‌ముల‌న్నియు మీనాక్షియందున్న‌వి. అమాయ‌క హృద‌య వీర‌భూప‌తి స్వీక‌రించియున్న‌చో కుట్టాన్ యేక‌వీర‌ల క‌న్న మీనాక్షి వీర‌భూప‌తుల‌ది యాద‌ర్శ‌దాంప‌త్య‌మై యుండెడిది. ఇచ‌ట వీర‌భూప‌తి మీనాక్షిని స‌హృద‌య‌ముతో స్వీక‌రింప‌కపోవుట‌తో పురుష స‌హ‌జ‌మైన యీర్ష్యాస్వ‌భావ‌ము వెల్ల‌డియైన‌ది. తానుయేక‌వీర‌ను ప్రేమించికూడ మీనాక్షి పెండ్లియాడి యామెతో సంసార‌ము చేయుట‌కు సంసిద్ధ‌త‌ను వ్య‌క్త‌ప‌ర‌చినాడు ఎప్పుడైతే త‌న‌భార్య‌యైన మీనాక్షి యింకొక‌ని ప్రేమించిన‌దని గ్ర‌హింప‌యిన‌దో నాక్ష‌ణ‌మునుండి యాత‌నికి మీనాక్షి య‌న్న‌చో విరక్తి జ‌నించిన‌ది. మీనాక్షి హృద‌య‌పు మొగ్గ కుట్టాను వాస‌న చూచినాడ‌ను కొనెను. తానుయేక‌వీర హృద‌య‌పు మొగ్గ వాస‌న చూచిన‌ప్ప‌టికి మీనాక్షితో దాపంత్య ధ‌ర్మము నెర‌పుట క‌డ్డురాలేదు. సంయోగ‌ము లేక‌పోయిన‌ను మీనాక్షి కుట్టానులే భార్యాభ‌ర్త‌ల‌నుకొనినాడు.

మీనాక్షి భ‌ర్త చివ‌ర‌కు స‌న్యాసియై మీనాక్షిన‌న్యాయ‌ము చేసెను. కుట్టాన్ మీనాక్షిని సోద‌రిగ భావింప‌గ‌ల్గిన‌ప్ప‌టికిని యేక‌వీర‌తో భావ‌మును పంచుకొనుట‌కు చాలాకాల‌మును వ్య‌ర్థ‌ము చేయుట‌ల‌తో ఏక‌వీర‌జీవిత‌మ‌న్యాయ‌మైపోయెను. ఇట్లీరెండు జంట‌ల‌న్యాయ‌మై పోవుట‌కు కార‌ణ‌మెక్కువ‌గ పురుష‌పాత్ర‌ల‌దే య‌న‌వ‌లెను.

మీనాక్షి భ‌ర్త‌పై మ‌హాప్రేమ‌ను నెల్ల‌డించుచున్న‌ది. కాని య‌త‌డు భార్య యొక్క యునికియే స‌హింప‌జాల‌కుండెను. భ‌ర్త త‌న‌ను ప్రేమించుచుండెనా ద్వేషించుచుండెనాయ‌న్న యోచ‌న కూడ మీనాక్షిలో క‌లుగ‌లేదు. అత‌డు త‌న‌ను ప్రేమించుట‌లేద‌న్న భావ‌ముకూడ నీమెలో క‌లుగ‌లేదు. వేరొక పెండ్లి చేసికొన‌మ‌ని వీర‌భూప‌తికి తానుచెప్పిన‌దికూడ మ‌ర‌చిన‌ది మీనాక్షి. అత‌నిని తాను వేధించినందుకీమెలో ప‌శ్చాత్తాప‌ముకూడ లేదు. ఏభావ‌ము జ‌నింప‌ని మ‌ర‌మ‌నిషివ‌లె క‌నుపించిన‌ను మీనాక్షిది, ప‌సిమ‌న‌సువ‌లె విష్క‌ల్మ‌ష‌మైన‌దిగ‌ను, అమాయ‌క‌మైన‌ట్టిదిగ‌నుక‌న్పించును. తానున‌మ్మిన దానినాచించునేగాని ఫ‌లిత‌మాసింప‌దు.

మీనాక్షికి ఏక‌వీర‌యొక్క సంసార ర‌హ‌స్య మంత‌యు తెలియును. కుట్టాన్ యేక‌వీర‌ను స‌మాద‌రించుట లేద‌నికూడ తెలియును. ఇంతియేగాని త‌న‌భ‌ర్త‌యే యేక‌వీర యొక్క ప్రియుడ‌ని యామెయెరుగ‌దు. ఏక‌వీర‌ను చూచిన‌ప్పుడేదో యొవ సంభ్ర‌మ‌ము జెందునేగాని య‌ది యిద‌మిత్థ‌మ‌ని తేల్చుకొన‌లేక‌పోయిన‌ది. ఏక‌వీర వివాహాత్పూర్వ‌మొక విధ‌ముగ‌ను వివాహానంత మొక‌విధ‌ముగ‌ను అలంక‌ర‌ణ‌మును చేసికొనెడిది. పెండ్లికి ముందు తెలిప‌ట్టుచీర‌లు. జుట్టుపొడిగా నుంచుకొనుట‌, స్వ‌ల్ప‌ముగ నాభ‌ర‌ణ‌ములు ధ‌రించుట చేసెడిది. త‌రువాత యొడ‌లెల్ల బంగారు ర‌త్నాల యాభ‌ర‌ణ‌ములు, రంగుప‌ట్టుచీర‌లు ధ‌రించుట పైన శాలువా ధ‌రించుట చేసెడిది. వీర‌భూప‌తిగీసిన చిత్ర‌లేఖ‌న‌మున‌కును తాను చూచెడి ఏక‌వీర‌కును సామ్య‌ము లేక‌పోవుట‌చే మీనాక్షి ఏక‌వీర‌సుత‌న‌భ‌ర్త యొక్క ప్రియురాల‌ని గుర్తింప‌జాల‌దు.

ఏక‌వీర యొక్క సాంసారిక ర‌హస్య‌ము తెలియుట‌చేత మీనాక్షికి ఏక‌వీర‌య‌న్న‌నొక లోకువ‌భావ‌ము జ‌నించిన‌ది. కానియామెయ‌న్న‌చోన‌గౌర‌వ‌ము మాత్ర‌ములేదు. భ‌ర్త‌ప్రేమ‌కు నోచుకొన‌ని యొక‌య‌భాగిని య‌నుసానుభూతిమ‌త్ర‌మే.

ఒకానొక సంధ్యాస‌మ‌య‌మున నేక‌వీర గృహ‌మున‌కు మీనాక్షి వెడ‌లిన‌ది. ఆస‌మ‌య‌మున చిరువ‌ర్ష‌ము కురియుచున్న‌ది. విసురుగ‌నొక‌గాలి తెర‌వీయుట‌లో నిరువురి శాలువ‌లు తొల‌గిన‌వి. అంత‌వ‌ర‌కును ఏక‌వీర‌ను చూచిన‌చో మీనాక్షికి ఎచ్చ‌ట‌నో నామెను చూచిన‌ట్లే యుండెడిది. ఎక్క‌డ చూచితినా య‌న్న‌య‌నుమాన‌ము క‌ల్గుచుండెడిది. శాలువ తొల‌గిన‌ప్పుడు మెరుపువ‌లె ఏక‌వీర యెవ్వ‌రో మీనాక్షికి బోధ‌ప‌డిన‌ది. అట్టిత‌రి మీనాక్షి హృద‌య‌మొక భావ‌సంచ‌ల‌న‌మున‌కు లోనైన‌ది. మెరుపువ‌లె మెర‌సిన యా భావ‌ము మ‌ర‌ల మెరుపువ‌లనే య‌దృశ్య‌మైన‌ది. ఏక‌వీర యానాడు కేశ‌ముల‌ను పొడిగ‌నుంచుకొని తెలిప‌ట్టుచీర గ‌ట్టుకొని పెండ్లికి ముందున్న‌ట్లేయండుట‌యే గాక వీర‌భూప‌తి గీచిన చిత్ర‌మువ‌లెకూడ‌నున్న‌ది. ఏక‌వీర‌ను గుర్తించిన మీనాక్షి యులికిప‌డిన‌ది. ప‌రిక్షాళిత‌మైన యొక‌పాపవాంఛాస్మృతి యామె మ‌న‌సు లోతుల‌లో సంగ‌త మ‌య్యెను. మీనాక్షి యేక‌వీర వ‌లెగాక మ‌న‌స్సు న‌దుపులో పెట్టుకొన గ‌ల్గిన‌ది. అయిన‌ప్ప‌టికిని నామెలోపాప‌వాంఛ రేగి వెనువెంట‌నే ప్ర‌క్షాళిత‌మైన‌దామె క‌వ‌గ‌త‌మైన‌ది. అన‌గానొక యూహ‌పుట్టుచున్న స‌మ‌య‌మున‌నేదానిని మ‌ట్టుపెట్ట‌గ‌ల స‌మ‌ర్థ‌త మీనాక్షిలో నున్న‌ద‌నుట పాప‌పూరిత‌మైన వాంఛ‌యేదైయుండ వ‌ల‌యును. కుట్టాన్ శ‌య్య‌యందు ఏక‌వీర‌ను చూచి త‌న‌కుద‌క్క‌వ‌ల‌సిన స్థాన‌మామెకు ద‌క్కిన‌ద‌నుకొనిన‌దా య‌న్న‌చో నీవిష‌య‌మును మాత్స‌ర్య పూరిత‌మ‌న‌వ‌లెనేగాని పాపాభావ‌మన‌రాదు. మ‌రియు నేక‌వీర‌ను త‌న‌భ‌ర్త ప్రేమించెను. కుట్టాన్ త‌న‌ను ప్రేమించెను. ఇదివిధివిలాస‌ము.

ఇందుల‌కామె చ‌కిత‌య‌గుట‌యేగాక మ‌న‌సులో నూమ‌ల‌నంత‌టితో యాప‌క మ‌రికొంత సాగ‌నిచ్చుట‌తో పాప‌వాంఛ‌రేగిన‌ది. ఈ సంప్ర‌దాయ‌మును ధర్మ‌మును త్రోసిపుచ్చి తానును, ఏక‌వీర‌యును త‌మ త‌మ ప్రియుల‌తో గూడిసుఖింప‌రాదా యేల‌యీరెండు జంట‌లు భ‌గ్న ప్రేమ‌లోపడి దుఃఖ‌ముతో న‌శింప‌వ‌లెన‌న్న యూహ‌యే మీనాక్షిలో క‌లిగిన‌పాప‌వాంఛ కావచ్చును. ఇట్టి వాంఛ జ‌నించి జ‌నింప‌క‌మున్నే మీనాక్షి ప‌సిగ‌ట్టి దానిని తృంచి వేసిన‌ది. మీనాక్షి ఏక‌వీర యొక్క భోగ‌భాగ్య‌ముల‌కు చ‌లింప‌లేదు. అప్ప‌టికామె చాలాసార్లు వ‌చ్చినది. ఇట్టివికార‌మామెకు ముందుక‌లుగ‌లేదు. కేవ‌ల‌ము ఏక‌వీర త‌న భ‌ర్త యొక్క ప్రియురాలు అనితెలిసికొన్న త‌రువాతనే క‌లిగిన‌ది. ఈదురూహ తొల‌గిన త‌రువాత మీనాక్షికి చెర‌సాల‌ను వీడిన యనుభూతి క‌లిగిన‌ది. అన‌గా నామె పాప‌పుటూహ మీనాక్షి నుక్కిరిబిక్కిరి చేసి చేర‌సాల నున్న‌ట్లు చేసిన‌ద‌నుట పెద్ద‌యాప‌ద రాబోయి త‌ప్పిన‌ట్లుగ మీనాక్షి విశ్వ‌సించిన‌ది.

మీనాక్షి ఏక‌వీర‌ను గుర్తించిన‌ప్ప‌టికి నావిష‌య‌ము గుంభ‌న‌ముగ నుంచిన‌ది. భ‌ర్త‌కు తెలిపిన‌చో న‌త‌డు యేక‌వీర‌ను చూడ‌గోర‌వ‌చ్చును. మాట్లాడ‌వ‌ల‌యున‌ని త‌లంప‌వ‌చ్చును. లేదామ‌రింత హృద‌య‌వేద‌న జెంద‌వ‌చ్చున‌ని మీనాక్షి చ‌మ‌త్కార‌ముగ ప్ర‌వ‌ర్తించిన‌ది. మ‌రియు నేక‌వీర యంతఃపుర‌కాంత త‌న ర‌హ‌స్య మింకొక‌రికి తెలిసెన‌న్న భావ‌న‌మేయువ‌తికి క‌ల్గిన‌ను, ఆత్మ‌న్యూన‌త క‌లుగ‌వ‌చ్చును. చివ‌ర‌కి యాత్మ‌హ‌త్య‌కు కూడ త‌ల‌ప‌డ‌వ‌చ్చున‌ని మీనాక్షి మిన్న‌కున్న‌ది.

కుట్టాన్ ఏక‌వీర‌యందు సుముఖుడ‌గు చుండెన‌నియు ఆమెను చూచుట కుత్సాహ ప‌డుచుండెన‌నియు మీనాక్షికి తెలియును. అత‌నికి రాచ‌కార్య‌ముల విష‌య‌ము స్నేహితురాలైన ఏక‌వీర‌కెందుకు తెలియ‌జేయ‌దు అని విమ‌ర్శ‌. మీనాక్షి ఏక‌వీర‌కు కుట్టాన్ మ‌న‌సు మారిన విధాన‌ము చెప్పి ఆమెనూర‌డింప వ‌చ్చును గదా... మీనాక్షిలోనిట్టి స్వ‌భావ‌మున‌కు కార‌ణ‌ము క‌నిపించుట‌లేదు. మీనాక్షి పాత్ర‌త‌దిత‌ర పాత్ర‌ల‌వలె స్ప‌ష్టముగా గోచ‌రించుట‌లేదు. మీనాక్షి కుట్టాన్ మ‌న‌సుమారిన‌ట్లు తెలియ‌జేయ‌వ‌ల‌సిన వ్య‌క్తికాదు. భ‌ర్త యొక్క అంత‌రంగ‌ము త‌న‌కుగాక వేరొక‌రికి తెలిసిన‌ద‌నుకొనుట‌కే స్త్రీయు నిచ్చ‌గింప‌దు. మ‌రియు నావ్య‌క్తి స్త్రీ య‌గుట‌యు. భ‌ర్త ప్రేమించిన యువతియే య‌గుట‌యు మ‌రింత నిప‌ద్ధ‌మైన విష‌య‌ములు అదియునుగాక భార్య‌ను ప్రేమించుచుంటిన‌న్న స‌త్య‌ము తెలియ‌చేయు స‌మ‌య‌మా భార్య భ‌ర్త‌లిరువుర‌కును ఒకానొక మ‌ధుర‌మ‌నోహ‌ర ఘ‌ట్ట‌ము. అది య‌నిర్వ‌చ‌నీయ‌ము. వారివ్య‌క్తిగ‌త విష‌య‌ముల‌లో క‌ల్పించుకొను యావ‌శ్య‌క‌ము మీనాక్షికిలేదు. ఒక‌వేళ మీనాక్షియ‌ట్లు చెప్పిన‌చో వాచాల‌త‌యున్న స్త్రీ వ‌లెగోచ‌రించును. ఏక‌వీర‌ను క‌ల‌సికొని యామెవ్యాకుల‌త పోవున‌ట్లుగా చేయుట మాత్ర‌మే మీనాక్షిత‌న భాద్య‌త‌గ నెంచుకొనిన‌ది. అదియేస‌రియైన‌ప‌ని. అందుచేత‌నే త‌మ‌వాకిట ప్ర‌ద‌ర్శించు కూచిపూడి భాగ‌వ‌త‌మును చూపించుట‌కు ఏక‌వీర‌ను త‌మ‌యింటికి తీసికొనివెళ్ళిన‌ది. కాని మీనాక్షి యోచ‌న‌యిచ‌ట విక‌టించిన‌ది. త‌న‌భ‌ర్త‌య‌గు వీర‌భూప‌తియును మీనాక్షియును క‌ల‌సికుంద‌రేమోయ‌న్న యోచ‌న మీనాక్షికి క‌లుగ‌లేదు. లేదా ప‌ర‌స్ప‌ర‌ము చూచికొనిన‌ను త‌న‌వ‌లెనే ఏక‌వీర‌ను స‌మాధాన‌ప‌డున‌ని భావించి యుండ‌వ‌చ్చును. ఇది మీనాక్షి దోష‌ముకాదు. ర‌చయిత ఘ‌ట‌నకిచ్చ‌ట ప‌రాకాష్ట ద‌శ‌కు తీసికొనిపోయిరి.

ఏక‌వీర క‌లాప‌ము చూచుచునందులో తాదాత్మ్య‌మునందిన‌ది. ఏక‌వీర విర‌హముగా రంగ‌స్థ‌ల నాయిక యుద్ధ‌ముపట్టిన‌ది. స‌మ‌య‌ముగ‌డుచుకొల‌ది వాస‌క‌స‌జ్జిక‌యై ప్రియున‌కై నిరీక్షించుచు వీర‌భూప‌తిప‌ట‌మున్న యాత‌ని గ‌దిలోనికేగిన‌ది. కాక‌తాళీయ‌ముగ వీర‌భూప‌తి  య‌చ్చ‌టికివ‌చ్చెను. త‌మక‌ముతో ప్రియుని కౌగిలించుకొనిన‌ది. ఆమెకాక్ష‌ణ‌మున వీర‌భూప‌తియు, తానును వివాహితుల మ‌న్న యోచ‌న‌లేదు. వీర‌భూప‌తికౌగిలింత‌లో భావావేగ‌మున‌కు లోనైస్పృహ‌కోల్పోయిన‌ది.

మీనాక్షియ‌ట్టిస్థితిలో భ‌ర్త‌ను యేక‌వీర‌ను చూచిన‌ను యెట్టిసంచ‌ల‌న‌మున‌కు లోనుకాలేదు. ఏక‌వీర‌కు య‌దార్ధ‌మును బోధించిన‌ది. ఏక‌వీర యొక్క యుద్వేగ‌ప్ర‌ణ‌య‌మును గ్ర‌హించి మెచ్చికొనిన‌ట్లుగ‌ను మంద‌లించిన‌ట్లుగ‌ను మాట్లాడిన‌ది. ప‌ల్లెత్తుమాట‌యైన‌ను ఏక‌వీర‌పై దోషారోప‌ర‌ణ‌ము  చేయుచున్న‌ట్లుగ ప‌లుక‌లేదు. విధివిచిత్ర‌ము, ఎవ్వ‌ర‌ము నేమియుచేయలేమ‌న్న‌ట్లుగ దోష‌మునంత‌టిని విధిపైకి నెట్టిన‌ది. ఏక‌వీర దోష‌ర‌హిత‌మ‌ని యూర‌డించిన‌ది. నీయంతఃపుర‌వ‌ర్త‌న‌ను వీర‌భూప‌తికి నీద‌గు కూట్టాన్ భార్యాత్య‌ము తెలియ‌నీయ లేదిన్న సంవ‌త్స‌ర‌ములు. నేటిరాత్రి యీవిచిత్ర సంయోగ‌ము నీవింత యుద్వేగ ప్ర‌ణ‌యినివి. ఇట్టి మాట‌లు యెంత‌లోతు గుండెగ‌ల‌వారుగాని ప‌లుక‌లేరు. మీనాక్షి తేలిక‌గుండెగ‌ల‌ద‌నిగాని హృద‌య గాంభీర్య‌ములేనిద‌ని గాని ప‌లుకుట‌స‌రికాదు. మీనాక్షి యేక‌వీర‌కన్న ధృఢ మ‌న‌స్కురాలు. ఏక‌వీర‌క‌న్న ధ‌ర్మ‌ప‌ధ‌వ‌ర్ణ‌న‌ము చేయ‌గ‌ల‌శ‌క్తి మంతురాలు ఏక‌వీర ధ‌న‌వంతురాలు మీనాక్షి లేమినుండివ‌చ్చిన‌ది. క‌ష్ట‌సుఖ‌ము లీమెకు తెలిసినంత‌గ సుకుమారముగ పెరిగిన యేక‌వీర‌కు తెలియ‌వు.

మీనాక్షియ‌న్న పేరీమెకు సార్థ‌క‌ము, మీనాక్షియ‌న్న పార్వ‌తీదేవి, ఏక‌వీర య‌న్న‌చో ల‌క్ష్మి.

ఒకరిని ప్రేమించి మ‌రియొక‌రిని పెండ్లియాడుట‌లో మీనాక్షి యేక‌వీర లొక్క‌టియేగాని న‌వ‌ల‌కు యేక‌వీర పేరుంచ‌బ‌డిన‌ది. ఏక‌వీర ధ‌ర్మాతిక్ర‌మ‌ణ చేయుట‌కు మ‌దిలోనైన‌నెంచిన‌ది. విశ్వ‌నాథ‌వారు ఆచ‌రింప‌వ‌ల‌సిన‌ధ‌ర్మ‌మును క‌న్న ధ‌ర్మాతిక్ర‌మ‌ణ‌ము జ‌రిగిన తావున‌కే ప్రాథాన్య‌మునిచ్చి న‌వ‌ల‌ల‌కు కూడ పేర్ల‌న‌ట్టేపెట్టిరి. కావున ఏక‌వీర పేరిట స‌మ‌కూడిన‌ది. ఇట్లే చెలియ‌లిక‌ట్ట య‌ను న‌వ‌ల హ‌ద్దుసూచింప బ‌డుచున్న‌ది. వేయిప‌డ‌గ‌లు చ్యుతి జెందిన‌వి తొమ్మ‌దివంద‌ల తొంబ‌దితొమ్మిది మిగిలిన‌వి రెండు చ్యుతి జెందిన వేయిప‌డ‌గ‌ల‌కిచ‌ట నామ‌ధేయ భాగ్య‌మ‌బ్బిన‌ది.