62
 

వాసంతి

తెర‌చిరాజు న‌వ‌ల‌లోని వాసంతి పాత్ర త్వ‌గింద్రియ‌స్ప‌ర్శ సిద్థాంత‌నిరూప‌ణ‌మున క‌నువైన‌ది. వాసంతిలో నొక ఆపూర‌మైన ప‌ర‌మ‌సుకుమార త్వ‌గింద్రియ‌జ్ఞాన ల‌క్ష‌ణ‌మున్న‌ది. ఈ అతిశ‌య ల‌క్ష‌ణ‌ములోని అద్భుత‌మైన విశేష‌ము ఈ న‌వ‌లకు ప్రాణ‌తుల్య‌ము. వాసంతికి సార‌ధియ‌ను నొక య‌భిన‌య‌వేత్త యొక్క స్ప‌ర్శ‌యే సుఖ‌దాయ‌క‌ముగ నుండుట‌యును ఇత‌రులైన మ‌రి యే పురుష స్ప‌ర్శ‌యైన‌ను ఒడ‌లును మండించుట‌య‌ను ఈ న‌వ‌ల‌యందు ప్ర‌ధాన విష‌య‌ములు. ఏక‌వీర‌లోని త్వ‌గింద్రియ‌స్ప‌ర్శ ల‌క్ష‌ణ‌మును తెర‌చి రాజులో మ‌ర‌ల‌నెత్తుకొని వ్రాశాను. అని శ్రీ విశ్వ‌నాథ వ్రాసియున్నారు. కావున నీల‌క్ష‌ణ‌ములో ఏక‌వీర వాసంతికి సోద‌రి వంటిద‌న‌వ‌లెను. స‌హ‌జ‌ముగ పెద్ద‌వారికంటె చిన్న‌వారు గ‌డుసు గ‌నున్న‌ట్లీ వాసంతి యేక‌వీర‌క‌న్న ధైర్య‌స్థురాలు. నిర్భీకురాలు మొండిత‌నము అనుకున్న‌ది సాధింప‌వ‌లెన‌న్న ప‌ట్టుద‌ల‌క‌లిగిన యువ‌తి. ఏక‌వీర సుకుమారి చంచ‌ల‌గుణ మెక్కువ‌కాగా సంఘ‌ర్ష‌ణ‌మున‌కు ల‌నైన య‌బ‌ల‌. ఇరువురిలో సంక్ర‌మించిన త్వ‌గింద్రియ స్ప‌ర్శ ల‌క్ష‌ణ‌ముల‌లో మూల‌మొక‌టియేయైన‌ను గుణ‌ములోను అనుభ‌వ‌ములోను భేద‌ములున్న‌వి. ఇరువురికిని ప్రియునిస్ప‌ర్శ‌యే అంతిమ అనుభ‌వ‌ద‌శ‌యైన‌ది. ఈ మార్గ‌మును శ్రీ సుద‌ర్శ‌నంగారు ర‌స‌మార్గ‌మ‌ని పేర్కొనిరి. ఏక‌వీర‌లోని ర‌స‌సిద్ధి వైపు పున‌కేత‌ర‌చిరాజులో మ‌ళ్ళీ మ‌ర‌లిన‌ట్లు తెలుస్తోంది...సార‌ధిమార్గ‌ము ర‌స‌మార్గ అనిరి వీర‌నిన‌ట్లుగ‌నిది యోగ‌సిద్ధియే య‌న‌వ‌లెను.

వాసంతి ప‌ద‌హారు సంవత్స‌ర‌ముల క‌న్య‌. ఈమె సంగీత స‌ర‌స్వ‌తి తండ్రి యొక్క స్నేహితుడైన సార‌ధి అనున‌త‌ని న‌ట‌న మ‌న్న‌చో నీమెకు పంచ‌ప్రాణ‌ములు. అందుచేత తానుకూడ సార‌ధితో క‌లిసి నాట‌క‌ములందు వేష‌ములు వేయుట ప్రారంభించిన‌ది. ఒకానొక సంద‌ర్భ‌ములో వాసంతి సార‌ధిని స్పృశించిన‌ప్పుడొక మ‌ధురిమ‌న‌నుభ‌వించిన‌ది. అట్టి మ‌ధురిమ ప్ర‌తిపురుషుని స్ప‌ర్శ‌లోనుండునా సార‌ధిలోన‌ది ప్ర‌త్యేక‌మా య‌నిత‌ల‌చి తండ్రిని రంగ‌నాథ‌మ‌నుక‌విని జ‌మిందారుని కౌగ‌లించి ప‌రీక్షించిన‌ది. కాని వారి శ‌రీర‌ములామె శ‌రీర‌మును సోక‌గానే వాసంతి యొడ‌లు అగ్నిని స్పృశించిన‌ట్లుగ మండ‌జొచ్చిన‌ది. ఇందుచేత సార‌ధియే త‌న‌కుదైవ‌మిచ్చిన భ‌ర్త య‌నియు, అత‌న‌ని వివాహ‌మాడుట‌యే త‌న‌కు సుఖ‌దాయ‌క మ‌నియు భావించిన‌ది. సార‌ధి తాను వ‌య‌సుచేత పెద్ద‌వాడ‌గుట‌చేత దుర‌భ్యాస‌ములున్నందు వ‌ల‌న‌ను వాసంతికి దూర‌ముగ నుండ‌వ‌ల‌యున‌ని త‌ల‌చి త‌న‌స్ప‌ర్శ‌లోని మాధుర్య‌మును కిరీటియ‌న్న యువ‌కుని శ‌రీర‌ములోనికి యోగ‌సాధ‌నచే ప్ర‌వేశింప‌జేసి తాను గ్రామ‌మును వీడిపోయెను. కిరీటి వాసంతులు సుఖ‌ముగ సంసార‌ము చేసికొనుచుండ‌గా నొక‌ప‌ర్యాయ‌ము సార‌ధి యాగ్రామ‌మున‌కు వ‌చ్చి మోహినీరుక్మాంగ‌ద నాట‌క‌ము వేయ‌సంక‌ల్పించెను.

ఏమోహినీరుక్మాంగద నాట‌క స‌మ‌య‌మున వాసంతి తాను సార‌ధిశ‌రీర‌ము సౌఖ్యదాయ‌క మ‌ని గ్ర‌హించిన‌దో నామోహినీరుక్మాంగ‌ద నాట‌క స‌మ‌య‌మున వాసంతి తానుకూడ వేష‌ము ధ‌రించి మోహినీ రూప‌మున రంగ‌స్థ‌లాన త‌ర‌ణ‌మును గావించిన‌ది. సార‌థీ వాసంతులొక శృంగార ర‌స సన్నివేశ‌మున గాఢాలింగ‌న‌మున మ‌ర‌ణింతురు. సార‌ధి స్ప‌ర్శ వాసంతికేల సుఖ‌దాయ‌క‌మైన‌ది.  ఇట్టి శ‌క్తి వాసంతి శ‌రీర‌ములోనున్న‌దా సార‌ధిశ‌రీర‌ములోనున్న‌దా ?   అని యెచింప‌వ‌ల‌యును. సార‌ధిలోనున్న‌చో న‌త‌నితోసంబంధ‌మున్న ఇత‌ర స్త్రీ లికేల‌నీమ‌ధురిమ య‌నుభూత‌ముకాలేదు ?  అని ప్ర‌శ్న వ‌చ్చును. వాసంతిలో త్వ‌గింద్రియ‌జ్ఞాన‌మ‌నెడి విశేష‌మున్న‌ది. ఆమె శ‌రీర‌ము వ్య‌క్తుల‌లోనున్న గుణ‌మునుకొలుచు యంత్ర‌మువ‌లె నుప‌యోగించిన‌ది. సార‌ధిలో నొక మ‌ధ‌రిమ యుండిన‌గ‌దానీమెకు తెలియుట ?  ఇదియొక విచిత్ర‌మైన ప‌రిస్థితి. ఇరువురిలోన‌నొక ప్ర‌త్యేక‌త‌యుండుట‌యు నాప్ర‌త్యేక‌త‌వ‌ల‌న విచిత్రానుభూతి క‌లుగుట‌యుజ‌రిగిన‌ది.

కూలంక‌ష‌ముగ యోచించిన‌చో వాసంతి యొకానొక ఆమోమ‌యావ‌స్థ‌లోనుండి త‌న‌కు కావ‌ల‌సిన దేదియో తెలిసికొన‌లేక‌పోయిన‌ది. త‌న‌కు సార‌ధిపైగ‌ల ప్రేమ‌కు, మెహ‌మున‌కు, ఆప్యాయ‌త‌క‌కు గ‌ల స్వ‌రూప తార‌త‌మ్య‌మును గాలించుకొన‌లేక‌పోయిన‌ది. న‌వ‌నిక‌సిత కుసుమ ముషోద‌య‌మున చిందిన తుషార బిందుస్ప‌ర్శ‌కు ఉలికిప‌డి గ‌గుర్పొడిచి త‌ల‌యూప‌న‌ట్లు న‌వ‌యౌవ‌న స‌మ‌య‌మున సార‌ధిస్ప‌ర్శ వాసంతి నాటాడించిన‌ది. వాసంతి సార‌ధినంత‌కు ముందునుండి య‌భిమానించుచున్న‌ది. కాని అది ప్రేమ‌గ ప‌రిణామ మందున‌నిగాని, ప‌రిణామ‌ము చెంద‌నిద‌నిగాని ఆమెకు తెలియ‌లేదు. తెలియ‌క‌పోవుట‌కు కార‌ణ‌ముగ వారి మ‌ధ్య‌నున్న వ‌యోభేద‌మును చెప్ప‌వ‌లెను. సార‌థి వాసంతి తండ్రియీడువాడు. అత‌డు ధ‌న‌హీనుడు, దుర‌ల‌వాటులున్న‌వాడు. ఈ విష‌య‌ములు కూడ వాసంతికి తెలియును. అయినప్ప‌టికి వాసంతికి సార‌ధియ‌న్న‌చో న‌భిమాన‌మే. అతిన నిస్సంగ‌త్వమున‌కును నిరాడంర‌త్వ‌మున‌కును, ఈర్ష్యా, ద్వేష గుణ‌రాహిత్య‌మున‌కును నాట్య‌ర‌స యోగాధికార‌మున‌కునామె యాక‌ర్షింప‌డ‌బ‌డింది. అత‌నిలోని న‌ట‌నాకౌశ‌ల్య‌మున‌కామె ర‌స‌హృద‌య‌ము ఆమెకు తెలియ‌కుండానే య‌ర్పిత‌మైన‌ది. సార‌ధిలోని లోటుపాట్ల‌చేత‌, అతడామెను బిడ్డ‌వ‌లెచూచుచుండుట‌చేత నామెప్రేమ‌బ‌హిర్గ‌త‌మ‌గుట క‌వ‌కాశ‌ము లేక‌యంత‌ర్గ‌త‌ముగ నుండిపోయిన‌ది. వాసంతి సార‌ధిని ప్రేమించిన‌ది. కాని యీ ప్రేమ యామె మ‌న‌సున‌కూడ గ్రాహ్య‌ము కాలేదు. ఈ ప్రేమ మ‌న‌సునుండికాక యాత్మ‌నుండి యుద్భ‌వించిన‌టుల వ‌ర్ణిత‌మ‌గుట‌చేత నా ప్రేమ‌లోని గాఢ‌త్వ‌ము వెల్ల‌డియ‌గుచుండెను. కాని మ‌రియొక స‌మ‌స్య త‌ల‌యెత్తును. ఏల‌న‌న‌గా స్త్రీ పురుషులిరువురి క‌ల‌యిక‌చేత మాత్ర‌మే వ్య‌క్తి ప‌రిపూర్ణుడ‌యిన‌ట్లు శాస్త్ర‌ము. ఇట ప్రేమ‌యాత్మ‌లో సంభ‌వించిన‌దునుట‌లో నాత్మ‌కు రాగ‌ద్వేషాది గుణ‌ముల నాపాదించున‌ట్లు దోచును. ఆత్మ‌లోని ప్రేమ యాత్మ‌తోడి సంయోగ‌ము కొరునా ?  ఈ సంయోగ‌ముల‌కు మాన‌సిక సంయోగ‌ముగాని శారీర‌క సంయోగ‌ముగాని యుండ‌వ‌లెనా ఇదిలింగాతీత ప్ర‌వృత్తియా ?  అన్న ప్ర‌శ్న‌లు బ‌య‌లుదేరును. వాసంతి విష‌య‌మున నిట్టి ప్ర‌శ్న‌ల‌కు తావులేదు. వాసంతి కేవ‌ల‌ము సామాన్య స్త్రీ. ఈమెలోనెట్టి శ‌క్తులు గాని ప్ర‌త్యేక‌త‌గానిలేవు. కాని సార‌ధి యంద‌పార‌మైన ప్రేమ‌మాత్ర‌ము క‌లిగి యున్న‌ది. ఈ ప్రేమ ఏకాగ్ర భావ‌న‌యై మ‌న‌శ్శ‌రీరాత్మ‌ల నొక‌టిని గావించిన‌ది. అన‌గా మ‌న‌స్సు శ‌రీర‌ము హృద‌య‌ము సార‌ధినిద‌క్క య‌న్యునిద‌ర‌కి చేర‌నీయ‌వు ఇట్టి భావ‌న‌యే వివాహ‌వ్య‌వ‌స్థాబ‌ద్ధ‌మైన‌పుడు పాతివ్ర‌త్య‌మ‌న‌వ‌చ్చును. వాసంతికి సార‌ధి ప‌తికాడు గావున నీమెది మాన‌సిక వ్ర‌త‌మ‌న‌వ‌లెను.

వాసంతి సార‌థిని ప్రేమించిన‌ది. సార‌ధినేయేల ప్రేమింప‌వ‌ల‌యును ?  అత‌నిలోని స్ప‌ర్శ‌సుఖ‌మును గ‌మ‌నించియా న‌ట‌నానుభ‌వ‌మును చూచియా య‌నిన‌చో స్ప‌ర్శ సుఖ‌మును చూచి మాత్ర‌ము కాద‌నుట స్ప‌ష్ట‌ము. ఆమె య‌త‌నిని ప్రేమించిన‌ది గావున‌నే య‌త‌ని స్ప‌ర్శ యామెకు సుఖ‌దాయ‌క‌మైన‌ది. తండ్రిగాక యామెకు తెలిసిన పురుషుడిత‌డే. తండ్రివ‌లె సార‌ధికూడ ఆమెను చిన్న‌త‌నమునుండి ముద్దుచేసెను. నెత్తినెక్కించుకొనెను. చిన్న‌త‌న‌ములో సార‌ధి స్ప‌ర్శ‌లోలేని సుఖ‌ము వాసంతికి ప‌దునారేండ్లు వ‌చ్చిన త‌దుప‌రి క‌ల్గిన‌దునుట‌లో వాసంతి వ‌య‌సులోని మ‌హిమ‌య‌న‌వ‌లెను.

వాసంతి తండ్రి యామెకు లోక‌మెరుగ‌కుండ పెంచెను. ఆమెతో నేపురుషుడును మాట‌లాండ‌కుండ స్నేహ‌ము చేయ‌కుండ చూచెను. వాసంతి సంగీత‌మ‌న్న‌చో తండ్రికి మిక్కుట‌మైన ప్రేమ‌. ఆమె పెండ్లియాడి సామాన్య మ‌హిళ‌ల‌వ‌లె పిల్ల‌ల‌గ‌న‌రాదు. పెద్ద‌సంగీత విద్వాంసురాలై పేరు ప్ర‌ఖ్యాతుల‌నొంద‌వ‌ల‌యును. ఆమెగాక స‌ర‌స్వ‌తీ దేవాల‌య‌ములో పూజారిణి. పెండ్లి చేసికొనిన‌చో స‌ర‌స్వ‌తీ ద్రోహ‌ము చేయుట‌యే. ఇట్టి భావ‌ముల‌ను ఆమె తండ్రి చెవిలోనిల్లుక‌ట్టుకొని పోరుపెట్టెడివాడు. క‌ళ‌ముఖ్య‌మా ?  జీవిత‌ము ముఖ్య‌మా ?  ఒక మ‌హావిద్య చేతిలోనుండి దానిని వృద్ధిచేసికొని లోక‌ములో బ్ర‌తిష్ట‌పొందుట కంటె బెండ్లియాడి పిల్ల‌ల‌నుగ‌ని, క‌ట్టి, తినుట మంచిదియ‌నుకొంటివా అని శిరీషుడు త‌న‌భావ‌ముల నామెపైరుద్ది సంగీత‌ములో పైకి తేవ‌లెన‌ని చూచెనుగాని కుమార్తెకు కావ‌ల‌సిన దేదియో గ్ర‌హింప‌లేదు. కుమార్తె వాంఛ‌ల‌ను ప‌ట్టించుకొన‌లేదు.

శ‌రీర ధ‌ర్మ‌ము వాసంతిని మేలుకొలిపిన‌ది. సార‌ధి యొక్క స్ప‌ర్శ సుఖ‌ముగ‌నుండుట నామె శ‌రీర‌ము గ్ర‌హించిన‌ది. తండ్రి లోక‌జ్ఞాన‌ము తెలియ‌కుండ ఋష్య‌శృంగునివలె పెంచెను, గాని ప్ర‌తిచిన్న విష‌య‌మును వాసంతి స్వ‌య‌ముగ యోచించి విమ‌ర్శించి నిర్ణ‌యించుకొన్న‌ది. అందుచేత‌నే మాధ‌ర్య‌మొక్క సార‌ధియందే యుండెనా పురుషులంద‌రి యందుండునా య‌ని వాసంతి ప్ర‌శ్నించుకొని త‌నంత తాను తెలిసికొనుట‌యై ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిశోధ‌న‌ను గావించుకొని నిర్ణ‌యించుకొన్న‌ది. భ‌గ‌వ‌త్కృప వ‌ల‌న వాసంతికి పురుషులంద‌రి స్ప‌ర్శ‌యు నానంద‌దాయ‌క‌ము కాజాల‌ద‌ని తెలిసికొనిన‌ది. లేకున్న‌చో మ‌ర్మ‌ముల‌లో మ‌ర్మ‌ముల‌ను వెద‌కికొనుచు చ‌లంగారు సృష్టించిన పెక్కుస్త్రీ పాత్ర‌ల‌లోని విఝృంభ‌ణ‌ము నీమెకూడ చేసెడిదే. ఇట్టితావుల‌యందే ర‌చ‌యిత యొక్క వ్య‌క్తిత్వ‌ము, ఆద‌ర్శ‌ము వెల్ల‌డియ‌గుచుండును. వాసంతికిట్టి సూక్ష్మ‌విచార జ్ఞాన‌ము క‌లుగుట‌కుకూడ సార‌ధియందుగ‌ల ప్రేమ‌యే కార‌ణ‌ము.

ఆమెస‌మ‌స్య‌నుగూర్చి క‌డ‌దాక యోచించి నిగ్గుతేల్చిగాని వ‌ద‌ల‌నంత ప‌ట్టుద‌ల క‌లిగిన‌ది. ఆమెలోనున్న నీ తీవ్ర‌స్వ‌భావ‌మే సార‌ధినికూడ న‌తితీవ్ర‌ముగ ప్రేమించున‌ట్లు చేసిన‌ది. ఇదిస్వభావ‌ములోని గాఢ‌త్వ‌ము. ప్రేమ‌ల‌లోన‌నేక విధ‌ములున్న‌ట్లు స్ప‌ర్శ‌ల‌లోకూడ న‌నేక విధ‌ములుండును. భ‌ర్త‌పై ప్రేమ భ‌క్తితోగూడిన‌ప్పుడిది పాతివ్ర‌త్య‌ము, బిడ్డ‌యంద‌లి ప్రేమ ర‌క్త‌సంబంధ‌ముతో క‌లిసి వాత్స‌ల్య‌ము భ‌గవంతునిపై ప్రేమ‌భక్తి, దీనుల‌పై ప్రేమ‌జాలి. ఇట్లు ప్రేమ య‌నేక విధ‌ములు. బిడ్డ‌లు త‌ల్లిదండ్రుల‌ను కౌగ‌లించుకొనుట‌లో, భార్య‌భ‌ర్త‌ల స్ప‌ర్శ‌లో ప్రేయ‌సీ ప్రియుల యాలింగ‌న‌ములో స్నేహితుల సౌహార్ధ స్ప‌ర్శ‌లో వివిధ‌ములైన విభిన్న సుఖానుభూతులుగా వ‌చ్చును. అన్నిటికిని ప‌ర్య‌వ‌సాన‌ము ఆనంద ర‌సాస్వాద‌న‌మే యైన‌ప్ప‌టికిని ఆలంబ‌న‌ము వేర‌న‌క త‌ప్ప‌దు. త‌న‌వారు త‌న‌కిష్ట‌మైన‌వారు అన్న భావ‌ములోనున్న మాధుర్య‌ము శరీర స‌న్నిక‌ర్ష‌చేన‌దిక‌త‌ర‌మై మాధుర్య‌దాయ‌క మ‌గుచున్న‌ది. ర‌సోవైసః అత‌దేర‌స‌ము అన్న‌ట్లుగ త‌మ‌లోనున్న ఆనంద‌మే త‌మ‌కు ల‌భ్య‌మ‌గుచున్న‌ది. కాని ఆలంబ‌న‌ము మాత్ర‌మ‌న్య‌ము కాక‌త‌ప్ప‌దు. అందువ‌ల‌న‌నే కొంద‌రు నిత్య‌తృప్తులుగ‌ను కొంద‌రు నిత్య అతృప్తులుగ‌ను నుండుట జ‌రుగును. వీరికి సంప‌ద మొద‌లైన‌వి ఉండుట‌యును లేకుండుట‌ను బట్టికాక స్వ‌భావ స‌హ‌జ‌మైన తృప్తిని పొందుట సంభ‌వించుచుండును.

భార‌త‌మున కుమారుడైన భ‌ర‌తుని వెంట‌నిడుకొన దుష్యంతుని క‌డ‌కువ‌చ్చిన శ‌కుంత‌ల భ‌ర్త‌తోనిట్ల‌నెను. ఈపుత్ర‌గాత్ర ప‌రిష్వంగ సుభ‌మ్ముచేకొనుము అని ప‌లికిన‌ది. ఆప‌రిష్వంగ‌ములో సుఖ‌మున్న‌దో కాదు ల‌ని నిశ్చయించుకొన‌నుమ‌న్న సూచ‌న యిచ‌ట శ‌కుంత‌ల చేసిన‌ది. చంద‌న‌ము, చంద్ర‌జ్యోత్న‌ము, ముక్తాహార‌ములు మొద‌లైన‌వానికంటె పుత్రుని కౌగ‌లింత‌లోనెంత చ‌ల్ల‌ద‌న‌మున్న‌దో, యెంత‌హృద‌యంగ‌మ‌త్వమున్న‌దో తెలిసికొనుము అని ప‌లికిన‌ది. స్ప‌ర్శ చేత‌నే కుమారుడోకాడో నిర్ణ‌యింప‌వ‌చ్చున‌నుట పురాణ‌గ‌త విశ్వాస‌ము. పుత్రునితో త‌న‌ర‌క్త‌ము ప్ర‌వ‌హించును గ‌నుక సౌఖ్య‌ము క‌లుగ‌వచ్చును. కాని పురుషునివిష‌య‌మున నిర్ణ‌చించుట‌యెట్లు. ఇందుల‌కు జ‌న్మాంత‌రముల‌కు పోవ‌ల‌సివ‌చ్చును. పూర్వ‌జ‌న్మ‌మున‌నే సంబంధ‌ములేక ప్ర‌స్తుత‌జ‌న్మ‌మున భార్యాభ‌ర్త‌లుకార‌నుట లోక‌మున వాడుక‌. అందుచేత‌నే జ‌న్మాంత‌ర సౌహృద‌య‌ములు తెలియుట క‌ష్టము.

వాసంతిలో వ‌య‌సువ‌చ్చిన త‌రువాత సార‌ధితోడి సంబంధ‌మామెను సార‌ధిని ప్రేమించిన‌ట్లు చేసిన‌ది. ఆమెలోని శ‌రీర‌గ‌త వాంఛ‌లుకూడ నీ స‌మ‌య‌మున జాగృత‌మైన‌వి. స‌ర్వ‌జంతుస‌హ‌జ‌మైన కామమునుండి వాసంతిని ర‌క్షింప‌వ‌లెన‌న్న ఆమెతండ్రి శిరీషుని కోరిక‌వాసంతిని మ‌రింత సంసార‌ము వైపున‌కు ఆక‌ర్షించిన‌వి. ఏసంగీత‌మును కార‌ణ‌ముగ పేర్కొని తండ్రి వాసంతిని వివాహ‌ముఖురాలిని గావింప‌బోయెనో, ఆసంగీత‌మ‌న్న‌చో వాసంతికి ఆస‌క్తిలేదు. భ‌క్తిలేదు. వాంఛ‌లేదు. కాని మంచి స్వ‌ర‌మాధురియున్న‌ది. త‌త్క‌ళ‌యందామెకు నిష్ణాతురాలుకాదు స్వ‌యంప్ర‌తిభ‌లేదు.

ప‌ల్ల‌విపాడుదును. స్వ‌ర‌మువేయులేను. స్వ‌ర‌మును నాస్వ‌యం బుద్ధితో పెంచ‌లేను...నేను త‌న్మ‌య‌త పొందిన‌దిలేదు. అని వాసంతి త‌న‌కు సంగీత‌మ‌న్న‌చో ప్రీతిలేద‌ని తెలియ‌జేసిన‌ది. సార‌థితోగూడి వేష‌ములువేయును. నాట‌క‌ములైన బాగుగా నాడునాయ‌న్న‌చో నిదియును లేదు. అభిన‌య‌ముచేత‌కాదు. ఆమె పాడు పాట‌ల‌కు స్వ‌ర‌మాధుర్య‌మున‌కు జ‌నులాకర్షితుల‌గుచుందురు. సార‌ధితో నటించుయ‌న్న వాసంతికి ప్రీతిదాయ‌క‌మైన విష‌య‌ము. నాట‌క‌ములాడుట‌కామె యుత్సాహ‌ప‌డున‌న‌గా కేవ‌ల‌ము సార‌థితో జ‌రుగునుత్సాహ‌పూరిత కాల‌క్షేప‌ముల‌కు మాత్ర‌మే అట్టి వాంఛ వ‌యఃప్ర‌భావ‌ముచేత తీవ్ర‌రూప‌మును దాల్చిన‌ది.

మోహినీరుక్మాంగ‌ద నాట‌కాభిన‌య‌స‌మ‌య‌మున శృంగార‌మూర్తియ‌గు మోహినిరుక్మాంగ‌దుని వ‌శ‌వ‌ర్తుని గావించుకొని స‌మ‌య‌మున వాసంతితానేమోమినియై శృంగార‌భావ మ‌భియించుట‌గాక య‌నుభ‌వించిన‌ది. ఆమెముకుళిత హృద‌య క‌మ‌ల‌ము సార‌ధిని రుక్మాంగ‌దునివ‌లె చూచుట తోడ‌నే సూర్య‌రస్మి సోకిన ప‌ద్మ‌మువ‌లె విక‌సిత‌మైన‌ది. బాహ్య‌కార‌ణ‌ముల యొత్తిడిచేత దానిని గుర్తించుట జ‌రుగ‌లేదు.