సారధిపై వాసంతికిగల ప్రేమకు కారణము స్పర్శామాధురుని బట్టియేగాని మరి యితర కారణములచేతకూడ జనించినదనుట కవకాశమున్నది. ఆమె తండ్రి సారధితప్ప మరియొక పురుషుడామె చెంతకు రాకుండ కట్టుదిట్టముచేసెను. ఇట్టియష్టదిగ్భంధన సమయమున వాసంతికి కనబడినది. ఒక్క సారదియే.
శిరీషుడు సారధి యొక్క నటనాకౌశలమును వాసంతి దగ్గర పొగడు చుండెడివాడు. అతనికి సారధిపైనున్న సదభిప్రాయము వాసంతిహృదయమునుకూడ ప్రభావిత మొనర్చుటయేగాక నాతనికొక శుభ్రస్థానమును ప్రక్షిప్తపరచినట్లుఅయినది. అందులకే వాసంతి సారధిని గూర్చియిట్లు తండ్రితో వాదించినది. సారధియన్నచో నంతయభిమాన మెదుంలకని తండ్రి ప్రశ్నించగా అతడు గొప్పనటుడన్న విషయము నాకు జెప్పినదిమీరే. అతడన్నచో నాకు గౌరవము కలుగజేసినదిమీరే అనినది. సారధిపైగల ప్రేమ. అతని ప్రజ్ఞాపాటవములపైయున్న యభిమానము అతనిలోనున్న దుశ్శీలమును లోపమునుకూడ గణింపనంత ప్రగాఢమై యామె హృదయ మతని యెడనంత విశాలమైనది సారధితనకు బీడీలు కాల్చుయలవాటును గూర్చియు ఆకలివేసినచో విశాలాక్షివంటి స్త్రీ యున్నదనియు చెప్పి తనకుగల వ్యసనములనామెకడనేకరువు పెట్టినను ఆమెకభిమానము క్షీణించలేదు. సారధిదుర్గుణములను సహింపగల యోర్పామెకు ప్రేమవలన కలిగినది. ఇట్లుశిరీషుడామె హృదయమును సారధివైపునకాకర్షితమగునట్లు చేయగా శరీరమును జాగృతమును చేసినవాడు సారధియే యనవలెను.
నాటకమునుప్రదర్శించుటకై అభ్యాసముచేయు సమయమున ఆమెతో మాటలాడుచుపదేపదే వాసంతి శరీరమునుతాకి భుజముపై కంటిపై చిలిపి దెబ్బలను కొట్టుచునుండెడివాడు. ఇదియతడు కావలెనని చేయకపోయినను చిన్నపిల్లయగు వాసంతి
శరీరమున నొకకదలిక మొదలిడినది. ఇట్లతడు చేయుట వాసంతికి సుఖదాయకముగనున్నది. అట్టి చర్యలకై అతని స్పర్శకు తానానందము పొందుచుండుట గ్రహించినంతనే ఆయానందము యొక్క స్వరూప స్వభావాదులను గురించి విచికిత్స చేసినది. అతడునన్ను తాకుట యెందుకు ? అతడుతాకవలయునని నేనభిలషించు చున్నానన్నమాట తనతో సరాగములాడ వద్దనియు తాను చిన్నపిల్లను కాదనయు సారధితోచెప్పినది. వాసంతి ప్రేమ క్రమక్రమముగ నభివృద్ధిచెందదొడగినది. అతని పరిచమయు వలన తనలోజ్ఞానమధికమగుచున్నదని తలచినది. లోకమునకు శీలములేని వాడుకాని తనకు మహాపురుషుడనుకొన్నది. అతడొక మహాపురుషుడు. లోకముయొక్క దృష్టిలో శీలములేనివాడు, నాదృష్టిలోనతడు జీవితము యొక్క రహస్యమంతయు మూటకట్టినవాడు... అతనిని జూచుచు కూర్చున్న చోజాలును. వాసంతి సారధి నెంతగప్రేమించుచున్న దనగా లోకమును కూడ కాదనగలిగినంత ప్రేమించినది.
గ్రాముములోని జనులనతని శృంగారరసమును పోషింపలేడనిరని మోహినీరుక్మాంగద నాటకమావలెనని పట్టుబట్టినది. సారధికి మాత్రమామెపై ప్రేమలేదనరాదు. ఆమెపట్టు పట్టుటయునతడంగీకరించుటయు జరిగినది. తమకిష్టమైనవారికిష్టము కలుగజేయుట మానవనైజము. ప్రజల తనని గూర్చి తక్కువగభావించిన తనకేమి శృంగారమభినయింపక పోయిన తనకేమి ? కాగాసారధి శృంగారరస పోషణమత్యంత ప్రతిభావంతముగ పోషింపగలడని వాసంతి యభిప్రాయము. ఊరిజనులకన్నమిన్నగ వాసంతికే సారధిచేరుక్మాంగద వేషము వేయించవలెనని కోరికయున్నది. రుక్మాంగద వేషములో సారధియెట్లుండునో చూడవలెననియునన్నది. తనకోసమావేషము వేయవలెనన్నది. అతడు శృంగారరసమును పోషించవలెననియు నతని శృంగార అబినయమునకు తానవలంబనము కావలెననియు నభిలషించినది. కావున సారధిపట్ల వాసంతికొక శృంగారభావమున్నదనుటలో సందేహము లేదు. మరియు సారధి భావించినట్లుగ వాసంతికి రుక్మాంగద నాటకసమయమున కల్గిన శృంగారరసానుభూతియు, సాత్వికభావోదయము, శృంగారాభినయమును హటాత్సంజవిత ప్రతిభావిశేషములుకావు. సారధితోని శృంగారాభినివేశమునువాసంతి ఆనాటకమునాడుటకు మున్నే గ్రహించినది. హిరణ్యకళిపు పాత్రమీరు ధరించి లీలావతితోనొక యొయ్యారమైన శృంగారాభినయముచేసితిరి అనివాసంతి సారధితోపల్కినది. హిరణ్యకశిపుడు లీలావతితోజరుపు శృంగార సన్నివేశము బహుస్వల్పకాలముండెను. ఆస్వల్ప కాలములోనే మెరుపువలె వాసంతి హృదయము సారధి యొక్క శృంగారాభినయచాతురుని గ్రహించినదనగా వాసంతిని పసిపిల్లయనతగునా ? ఆమెలోనీ భావబీజము లంతకుముందు నుండి నిక్షిప్తములయ్యెననుట యతిశయోక్తి కాదు. మరియు రుక్మాంగద నాటకమునుకూడ మోహినీరుక్మాంగదను కోరినదిగాని వ్రతదీక్షాపరుడైన భక్తరుక్మాంగదను కోరలేదు.
వాసంతి సారధిని ప్రేమించినదనుట దృష్టాంతములున్నవి. ఆ గ్రామమునకు అర్జునరావను మరొకనూత్ననటుడు వచ్చినటింపగా ప్రజలాతనిని ప్రశ్నించుటను వాసంతి సహింపలేకపొయినది. అర్జునరావనిన వాసంతికి కారణకోపము మాత్సర్యము కలుగుటకు కారణమతడు సారధినిమించిన పేరు తెచ్చికొనునేమోయన్న యీర్ష్య ఇందలిస్వార్థము సారధితనవాడని నిరూపించుట. అర్జునరావెట్లు నటించునో చూడక మున్నే అతడు సారధిని మించి నటింపలేడని తండ్రితో పలికినది. సారధిని మించిన నటుడుండడని ఆమెవాక్కు ఉండరాదను యామెయంతరంగము ఉండెనేమోయన్న యీశు ఇన్ని యూహలామె యెదలోజేరి కలవరపెట్టినవి. రంగనాధ కవి ద్వంద్వార్థమును సూచించు నవ్వును నవ్వెను. ఆనవ్వున కర్ధమిది. దీనితో మీ సారధి యెందుకను బనికిరాడు, శిరీషునకాయర్ధము తెలియదు. వాసంతికి దెలియును. ఆమెకొడలు మండి పోయినది. సారధిని మించిన నటుడా గ్రామమున నుండరాదని వాసంతి యభిమతము. ఇందులకు సారధిపై వాసంతికున్న ప్రేమయే కారణము. రంగనాధము వాసంతి ముఖకవళికలను బట్టి యొక విషయమును గ్రహించెను. సారధిని పొగడిన నామె సంతసించుననియు కించపరిచిన కోపగించుననియు. కావున వాసంతికి సారధిపైగల ప్రేమను వాసంతి తండ్రికంటె సారధికంటె వాసంతి కంటె కూడరంగనాధము ముందు గ్రహించె ననవలెను. ఇతనికన్నముందు ఉమాపతియను విమర్శకుడు గ్రహించెను. తరువాత నామె తండ్రిగ్రహించి యులికిపడి సారధియన్న నీకెందుకిత యభిమానమని ప్రశ్నించి, సారధి యింటికి ఒంటరిగా పోరాదనియు హితవుచెప్పెను. అర్జునరావుపై సారధికి కోపము రాలేదని వాసంతికి కోపము వచ్చినది. అర్జునరావు నాగ్రామములోనికి తెచ్చినదెందులకో సారధినా తోటలోనుండినిత్తురో లేదోయనిన భయము వాసంతికి కల్గినది. ఇట్టితరి వాసంతికి కావలసినది. సారధియేగాని సారధి నటన కాదనుట స్పష్టము.
స్త్రీ పురుషుల నడుమ ప్రేమజనించుటకు కారణమైననొక గుణము ప్రేమ మరింత పాతుకొనిపోయిన తరువాత రూపుకోల్పోయి వ్యక్తి యందు పర్యవసించును. అనగా వాసంతి సారధి నటనను చూచి యతనిని ప్రేమించుట మొదలుపెట్టినది. ప్రేమ భావము స్పష్టమైన తోడనే యానాటకకళ నిమిత్త మాత్రమైపోయి శరీర ధర్మముఉ కాశ్రయమై మిగిలినది. వారిరువురు పెండ్లియాడినచో తరువాతనైనను వాసంతికాకళపై నారాధన మిగిలియుండునాయన్న విషయము సంశయాస్పదమే. ఇట్టి భావమునే చలం గారు కూడ వ్యక్తపరచియున్నారు. నీగుణాల్నా అయితే ఏగుణాలవి ? నాకు తెలుసా ! ఆగుణాలు ఎక్కడవున్నా ప్రేమిస్తానా నాకు యిష్టంలేని గుణాలువున్నాయి నీలోచాలా...మరినీ ఆత్మనా ? ఆత్మనేదేవుంటే దానికి రూపం గుణం వుండవుకద ఏ ఆత్మ అయినా ఒకటే ప్రేమించటానికి అని ప్రేమించుటకు గల కారణమలును ఉత్తరదక్షిణ ధృవములంత భేదభావములున్న విశ్వనాథ, చలం, యిరువురును సూక్ష్మాతి సూక్ష్మముగా విమర్శించియున్నారు.
వాసంతి కూడ సారధిలోని నటునిచూచి ప్రేమింపమొదలిడినచో సారధికన్న మంచినటుడెదురైనచో మరలమనసు నాతనివైపునకు మళ్ళింపలేదుకదా ఇట్టితావుననే భారతీయుల హృదయవాదము, కర్మసిద్ధాంతము జన్మాంతరసౌహృదయము మొదలైన వెన్నియో ప్రేమవెనుక నుండుననుట ఏదియోనొక గుణమునుచూచి ప్రేమించుట యన్నది ప్రేమకు ప్రథమ కారణమేగాని ప్రధానకారణముకాదు.
సారధిపై వాసంతికున్న మహోన్నతమైన ప్రేమయొక్కనాడు పుట్టుకొనివచ్చినది. కాదని నిరూపించుటకు ఆమె బహిర్వ్యాపారమును పరిశీలింపవలెను. శిరీషుని యతిజాగ్రత్త సారధిపై శిరీషునకున్న మైత్రి నమ్మకుము సారధి వాసంతి దగ్గరకు వచ్చునట్లుచేసినవి. సారధివినా ఆమెకు చేరువకురాగల పురుషుడు లేనందున చిన్నతనమునుండి అతని నెత్తిన ఎక్కి తొక్కియాడుకొనిన చనువు గల్గినందున అతని విద్యనారాధించుట నతనిని కూడ నారాధింప మొదలిడినది.
సారధి వాసంతికి వేషము వేయుటలో, తీయుటలో సాయపడెడివాడు హాస్యముగనెత్తిని మొట్టెడివాడు. భుజముపై చేయి వేసెడివాడు. ఇరువురు నతిసన్నిహితముగ కూర్చుండెడివారు. జంతువులయందు యౌవనోదయమైనంతనే స్త్రీ పురుష భావన యంకురించును. ఈ భావనకు సంఘము నియమములు మేరలు కల్పించును. సర్వజంతు సహజమైన కామము వాసంతి యందుకూడ పొడనూపుట ప్రకృతి సహజమేగాని దోషముకాదు. నిరంతర సన్నిహితవర్తియైన వానిమీద తానభిమానించు వానిమీద నా కామము ప్రసరించుటలో వింతలేదు. ఆమెకతనిపై ప్రేమతోపాడు వాంఛకూడ కల్గుటతో నా ప్రేమయును కామమును కలిసి ప్రణయమైనవి. సారధి లోని లోపములు లోపములు కావని యామెతండరి యామెకుచెప్పెను. కళాకారులకు చిన్నచిన్న దోషములున్నను పట్టించుకొన రాదని శిరీషుని వాదము. వాసంతికికూడ నాతని దోషములు దోషములనిపించలేదు.
వాసంతి ముగ్థ. అమాయక. కావుననే తనలోసంకురించిన శృంగార భావమలు కామె భాష్యము చెప్పుకొనలేకపోయినది. స్త్రీ పురుషులట్లుందురని కూడ నామెకు తెలియదు. సారధి ఆమెలోని భావసంచలనమును గుర్తింపక చిన్నపిల్లను చూచినట్లు చూచెను. మానవప్రకృతిలో స్త్రీ పురుష భావన యెప్పుడెచ్చట నెట్లుండునో చెప్పుటకు వీలులేద. ఇంద్రియములు చేయు నింద్రజాలమును గ్రహింప నశక్యమని ఇచటి భావము.
ఇంతవరకును వాసంతికి సారధిపైనున్న ప్రణయము నిరూపింపబడినది. ఆమెవ్యక్తిత్వములో నొక ప్రత్యేకతగ వర్ణింపబడిన త్వగింద్రియ స్పర్శతిశయమును చర్చింపవలసియున్నది. ఆమె సారధిలో నొక స్పర్శామాధురిని భావించుటలో గల కారణమేమి ? అతనిలోనేదైన ప్రత్యేకత యున్నదా ? ఉన్నచో నొక్కవాసంతికే యేలగ్రాహ్యమైనది ? ఇది యొక రకమైన పరిస్థితి. ఇచట సారధిలో మహాత్మ్యమున్నదనుట నిశ్చయము. మరియును రంగనాధమునుగాని జమీందారునికాని వాసంతి తాకినచో నామె యొడలు మండుటయేల ? ఇచట వాసంతిలో మహాత్మ్యమున్న దనవలెను. సారధిలోని ప్రత్యేకత అతడొక యోగమునభ్యసించుటయును నాటకములో నభినయించుటకూడ నేకాగ్రతతో నదికూడ యెగమనుటయు జరిగినది. వాసంతి యేయోగము నభ్యసింపలేదు. కానియోమెలోనున్న తీవ్రభావనయు, ప్రణయాతిశయము ప్రత్యేకతయనవలయును. ఆమెహృదయము సువిశాలము. సాత్త్విక భావములకు నిలయము తన ప్రేమనంతయు రాశీభూతము చేసి సారధి పాదముల చెంతనిడిన ప్రణయైకజీవి. సారధి దుష్ప్రవర్తన కలవాడేగాని దుష్టుడుకాడు. నీచస్త్రీసంగమాదు లొనరించినను ఋజువర్తనుడు. భరతాచార్యుడు. నాట్యవేదమునకు వ్యాఖ్యాత నటనమును ఆరాధనా విశేషముగనో యోగముగనో భావించి తాదాత్మ్యమును పొందగల్గినవాడు. అతని మొగములో మధురసృష్టినేయు ప్రజాపతియొక్క యొక సమాధి స్థితికనిపించెను. అతడు నిత్యయోగాభ్యాసివలె గనుగ్రుడ్లు నాసాగ్రమునందలి యిరుప్రక్కలకు మలచి భూనిహిత దృష్టియై నిశ్చలముగానొక లిప్తకాలము నిలుచుండెను. సారధి యొక్క యీస్థితి వలన నతదేదియో నొకయోగమభ్యసించు చుండెనని విదితము. సారధి కూడ వాసంతిలోని రాగోదయముచు కొంతవరకు గమనించియే యుండెను. అతనిలోకూడ వాసంతియన్ననొక విలక్షణ భావమేర్పడినది. తానురుక్మాంగదుడుగానంతసేపు మోహినీభావమును జింతించలేదు. వాసంతిని జింతింనెను. ఇచట శృంగారాభినయము భావము వాసంతియందు పర్యవసించినది. ఇందువలన తేలినదేమనగా వాసంతికి సారధికి నొకరిపై నొకరికి ప్రేమయంతకు ముందే కలదనియు. రుక్మాంగద ప్రదర్శన సమయమున కాని వారి భావప్రదర్శనమున కవకాశము కలుగలేదనియు ఆభావము వారికే తెలియనంత సూక్ష్మరూపమున నుండెననియు భావింపనగును.
|