64
 

వాసంతి తండ్రిని నాన్న‌గారూ నాకు పెండ్లియేల‌చేయ‌ద‌ని ప్ర‌శ్న‌వైచిన‌ది. తాను ముందుమ‌ర‌ణించిన బాధ‌లేదు. తండ్రిముందు మ‌ర‌ణించిన‌చో త‌న బ్ర‌తుకెట్లు గ‌డువ‌వ‌లెన‌ని య‌డిగిన‌ది. అయిన‌ప్ప‌టికిని శిరీషున‌కు ఆమెకు వివాహ‌ము చేతున‌న‌లేదు. ఋషుల‌కు దేహ‌ము కంటే నాత్మ బ‌ల‌వ‌త్త‌ర‌ము కాని మాన‌వుల కాత్మ‌కంటె దేహ‌ము బ‌ల‌వ‌త్త‌ర‌మ‌ని సిగ్గువిడిచి చెప్పిన‌ది. త‌ల్లిలేనిపిల్ల తండ్రితో నంత‌క‌న్న చెప్ప‌జాల‌దు.

సార‌ధి యోగ‌ము మోక్ష సాధ‌న‌ము కూడ న‌ట‌న‌మేగాన న‌ట‌న‌ము నాధార‌ముగ జేసికొని స్త్రీవాంఛ‌ను మాయ‌ను జ‌యింప త‌ల‌పెట్టెను. కామ భావ‌మును బ‌హు విధ‌ములుగ పెంచి దానినొకేసారి ఖండింప వ‌ల‌యున‌ని త‌ల‌చెను. ఈత‌ని యీనూత్న‌ప్ర‌యోగ‌మున‌కు వాసంతిబ‌లియైన‌ది. ఆమెకు బ‌హుభంగిమ‌లునేర్పి నాట‌క‌మునాడువేళ దాను వానిని భావించి తిన జీవునిలోనున్న యావాంఛ నంత‌యు నామెయందు పున‌ర్జీవింప‌జేసి జ్ఞాన‌ఖ‌డ్గ‌ముతో నొక్క‌సారి న‌ర‌క‌వ‌లెన‌ని య‌త‌ని సంక‌ల్ప‌ము. న‌లుబ‌దియైదేండ్లుగ‌ల్గి బ‌హుస్త్రీ గ‌తుడైన సార‌ధి రంగ‌స్థ‌ల‌మున కామ‌భావ‌నాశ‌న‌ము చేయుదున‌ని యెట్లుభావించెనోగాని వాసంతిలో వ్య‌క్తా వ్య‌క్త‌మ‌గునున్న దేహ‌బుద్ధిని బ‌హువిధ‌ములుగ రెచ్చ‌గొట్టెను. ఆమెను రెచ్చ‌గెట్టుచు తాను మాత్ర‌ము మ‌న‌స్సుచేత నామెయందు గామ‌భావ‌మును పెంచుకొనెన‌ట‌. అతాడీ ప్ర‌యత్న‌ములో నామెబాహుమూల‌ముల‌ను క‌పోల‌ముల నూరువుల‌ను స్పృశించుచు నామెలో సంచ‌ల‌న‌మును రేకెత్తించెను. ఇట్లామెను వివ‌శురాలిని చేయ‌వ‌లెన‌ని సార‌ధి భావింప‌లేదు. ఆమెను చిన్న‌పిల్ల‌గ త‌ల‌చి య‌ట్లుచేసెనంతియే సార‌ధి మ‌రుదిన‌మున కూడ‌నిట్లేకాంత‌మున చేయుట‌లో వాసంతి తూలి సార‌ధిపైబ‌డి కౌగ‌లించుకొన్న‌ది. అత‌డించు మించుగా న‌ట్లేకౌగ‌లించుకొనెను. త‌న‌యందంత‌ర్నిఢ‌మై దాగికొనియున్న యొకానొక జీవ ల‌క్ష‌ణ‌మైన స్త్రీ వాంఛ యొక్క సంపూర్ణ స్వ‌రూప‌మున‌కు స‌మావిష్కృతి ప‌ర‌మ‌యోగ్య‌స్థాన‌ము వాసంతి య‌గుట చేత‌నోయేమో వాసంతి త‌న‌మెడ కౌగ‌లించుకొన‌గా అత‌డించుమించుగా నామెను మ‌ర‌ల‌గౌగ‌లించుకొనెను.

సార‌ధి వాసంతికి చేసిన‌య‌న‌కార‌మిది. రంగ‌స్థ‌ల‌మున‌యోగ మ‌వ‌లంబించి ప‌ర‌మ‌శివుడై మ‌న్మ‌ధుని ద‌గ్థ‌ముచేసెను. సార‌ధి న‌టించుట‌య‌న‌గా న‌ట‌న‌కాదు. అనుభ‌వించుట‌యే. ఇత్త‌రిసార‌ధి క్రింద‌ప‌డిపోయెను. దీనిని స‌మాధియ‌న‌వ‌చ్చును. స‌మాధియైన‌ప్ప‌టికిని కాన‌ప్ప‌టికిని పెద్ద‌విశేష‌మువారి భావిజీవిత‌మున జ‌రుగ‌లేదు. ప‌రిస్థితులు య‌థాత‌థ‌ముగ నున్న‌వి. సార‌ధి కామ‌మును జయించుట‌కై చేసిన ప్ర‌య‌త్న‌స‌మ‌య‌మున సంభ‌వించిన‌వారి యాలింగ‌మువ‌ల‌న వాసంతిక‌దివ‌ర‌కిద‌మిద్ధ‌ముకాని శ‌రీర‌ల‌క్ష‌ణ‌ము పూర్తిగ భాసించిన‌ది. సార‌ధితోదానిని గూర్చితెలిపిన‌ది. భ‌ర్త స్పృశించిన సుఖ‌మా ? ఎవ‌డుస్పృశించిన‌చో సుఖ‌మోవాడుభ‌ర్త‌యా ? ఈ భార్యాభ‌ర్త‌త్వ‌భావ‌ము మ‌నుష్య‌క‌ల్పిత‌మా ప‌ర‌మేశ్వ‌ర క‌ల్పిత‌మా ?  ఈవిష‌య‌ములు గ్ర‌హించుట‌కు తానెంత‌యోశ్ర‌ప‌మ‌డితిన‌ని చెప్పిన‌ది. ఇట్టి స్ప‌ర్శ‌గుణ నిర్ణ‌య‌ము చేయుట‌కు వాసంతికి మూడుసంవ‌త్స‌ర‌ములు ప‌ట్టిన‌ది. ఒక‌నాడు సార‌ధిని కౌద‌లించుకొనిన‌ది. ఆస‌మ‌య‌మున సార‌ధి శ‌రీర‌మునుండి త‌న శ‌రీర‌మున‌కు సౌఖ్య‌త‌రంగ‌ములు ప్ర‌వేశించుట గుర్త‌ప‌ట్టిన‌ది. అటువంటి సుఖానుభూతి సార‌ధి శ‌రీర‌స్ప‌ర్శ‌లోనేక‌ల‌ద‌ని చెప్పిన‌ది. నన్ను ద‌క్క‌నే నెవ్వ‌రిని దాకిన‌ను నాశ‌రీర‌ము మండును. అని ప‌లికి అత‌డేత‌న‌కు దైవ‌మిచ్చిన భ‌ర్త‌య‌న్న‌ది. సార‌ధినిస్త‌బ్దుడై ఆమెయొక ప్ర‌త్యేక‌సృష్టియ‌ను సృష్టించిన సీత‌వంటిది. తాను ద‌రిద్రుడు. ఆమెసంప‌న్నురాలు. మ‌రియు మిత్రుని కుమార్తె అత‌డు త‌న‌ను గూర్చి ఏమ‌నుకొనెను. వాసంతి త‌న‌పాల‌ప‌డ‌రాద‌నుకొనెను. వాసంతి ప‌ట్టుద‌ల సార‌ధికి తెలియును. ఆమెవాంఛించిన‌ది ల‌భించువ‌ర‌కు నూరుకొన‌దు. సాధించియేతీరును. ఇట్లు సార‌ధి వాసంతిని నిరాక‌రించుట‌కు సంసిద్ధుడ‌య్యెన‌న‌గా సార‌ధికికూడ‌కనామెపైన ప్రేమ‌యుండుట‌చేత‌నే ప్రేమ‌లేకున్న‌చో వాసంతిని స్వీక‌రించెడివాడే సార‌ధి మ‌న‌స్సులో నొక‌యూహ‌తోచిన‌ది. కిరీటియ‌న్న కుర్ర‌వాడాతిన మ‌దిలో మెదిలినాడు. కిరీటి స‌హృద‌యుడు వాసంతియందు బ్రీతిక‌ల‌వాడు. య‌ధార్ధ‌మంత‌యు న‌త‌నితో చెప్పినాడు. ఇప్పట్టున కిరీటియు వాసంతియు సార‌ధి న‌ట‌న‌య‌న్న ప్రీతి. ఈ ర‌క‌మైన ఏక‌భావ‌మును సాకుగ తీసికొని సార‌ధి వారిరువుర‌నేక‌ము చేయ‌త‌లంచెను.

సార‌ధి కిరీటిని స‌ముద్ర‌తీర‌మున‌కు తీసికొని పోయి య‌చ‌ట న‌త‌నిని గాఢ‌ముగ కౌగ‌లించుకొనెను. కిరీటియు సార‌ధిని కౌగ‌లించుకొనెను. ఇరువురి శ‌రీర‌ములు ప‌ర‌మ స‌న్నికృష్ట‌ముల‌య్యెను. ఆ కౌగిలింత‌లో సార‌ధిలోని శ‌రీర గ‌త‌మైన యొక స్ప‌ర్మేంద్రియాంత‌ర్నిహితానిర్వాచ్య‌మైన యొక శ‌క్తి కొండ మీద నుండి సెల‌యేరు ప‌డ‌బోసికొనిన‌ట్లు కిరీటి శ‌రీర‌ము లోనికి ప్ర‌వ‌హించెను. సార‌ధి శ‌రీర‌ము నుండి కిరీటిలోనికి స్ప‌ర్శ‌ను సార‌ధి త‌న సంక‌ల్ప‌శ‌క్తి చేత ప్ర‌వ‌హింపజేసెను. ఆ శ‌క్తి య‌త‌ని నుండి పోయినందువ‌ల‌న సార‌ధి వెనుక‌కు ప‌డిపోయెను. యోగ‌ము వ‌ల‌న మ‌న‌వుల‌క‌నేక‌ములైన శ‌క్తులు గ‌లుగ‌వ‌చ్చును. జీవుని సంస్కార విశేష‌ముచేత కూడ‌నిట్టి విశేష‌ములు జ‌రుగుచుండును. త‌న‌లోనున్న శ‌క్తిని మ‌రియొక‌రి లోనికి ప్ర‌వ‌హింప‌జేయుట సాధ్య‌మేయ‌ని యోగాభ్యాస‌త‌త్ప‌రులై స‌హ‌స్ర‌యోగ్య‌తాప‌త్ర‌విభూపితులైన శ్రీ న‌ల్ల‌కొండ రామ‌చంద్రారావుగారిట్లు నుడివియున్నారు. ఆత్మ‌శ‌క్తి స్ప‌ర్శ‌వ‌ల్ల‌ను, చూపువ‌ల్ల‌ను జ‌ప‌ధ్యాన‌ముల వ‌ల్ల‌ను ఉప‌దేశ‌ము చేయుట‌వ‌ల్ను విభూతి కుంకుమ‌ల‌వ‌ల్ల‌ను ఆత్మ‌శ‌క్తిని త‌రుల‌కు సంక్ర‌మింప‌చేయ‌వ‌చ్చు అని త‌మ య‌నుభ‌వ‌ముద్వారా చెప్పియున్నారు. ఇచ‌ట సార‌ధి త‌న‌శ‌క్తిని స్ప‌ర్శ ద్వారా అన‌గా కౌగ‌లించు కొనుట ద్వారా కిరీటి లోనికి సంక్ర‌మించున‌ట్లుగ జేసెను. స్ప‌ర్శ‌లో నేమైన విశేష ల‌క్ష‌ణ‌మున్న‌చోన‌ది య‌నుభూత మ‌గుట‌కు ఇరువురి యందును ప్రేర‌ణ యుండ‌వ‌లెను. మ‌హాత్మా గాంధీ స్ప‌ర్శ‌లోనుండి ప్ర‌శాంత‌త త‌న శ‌రీర‌ములోనికి ప్ర‌వ‌హించిన‌ద‌ని

ఫెర్న‌ర్ బ్రాక్‌మే వ్రాసిరి. ఫెర్న‌ర్ బ్రాక్‌వే అస్వ‌స్థ‌త‌లో మ‌ద్రాసులో ఉన్న‌ప్పుడు గాంధీజీ ఆయ‌న‌ను చూచుట‌కు వ‌చ్చెడి వాడు. ఒక‌నాడు గాంధీజీ మౌన‌వ్ర‌తం పాటిస్తుండి బ్రాక్‌వేని కుశ‌ల ప్ర‌శ్న‌ల‌ను వ్రాత మూల‌క‌ముగ వేయ‌గా, నీయ‌న త‌న‌కు మందులు వాడ‌క‌పోయిన‌చో నిద్ర ప‌ట్టుట‌లేద‌ని తెలియ‌జేసెను. గాంధీజీ ధ్యాన‌ముతో క‌నులు మూసుకొనిత‌న చేత‌ని బ్రాక్ వే చేతిపై న‌దిమి ప‌ట్టెను. అప్ప‌డు బ్రాక్‌వే గాంధీజీ చేతినుండి త‌న శ‌రీర‌ము లోని కేదో యొక సాకార‌మైన శ‌క్తి శ‌రీర వేగ‌మున ప్ర‌వేసించి న‌ట్లుగ తోచిన‌ది. అదే స‌మ‌య‌మున అధిక‌మైన ప్ర‌శాంత‌త ఆయ‌న మ‌న‌సును న‌రాలను అవ‌రించిన‌దిన వ్రాసెను.

కావున కొన్ని చిత్ర‌మైన శ‌క్తుల‌ను వ్యాఖ్యానించుట‌కు సామాన్యుల శ‌క్తుల‌న‌వ‌లెను. న‌మ్మిన‌వారు న‌మ్ముదురు న‌మ్మ‌ని వారు న‌మ్మ‌కుందురుగాక ! సార‌ధిలో నీ స్ప‌ర్శ మాధుర్య‌ము వాసంతిని ప్రేమించుట చేత క‌లిగి ధారాద‌త్త‌ము చేసెనో ఆ స్ప‌ర్శ వాసంతి స్ప‌ర్శ‌కై య‌ల్లల్లాడి పోయిన‌ది. కిరీటి వాసంతిని కౌగ‌లించుకొన‌క పోయిన‌చో బ్ర‌తుకులేన‌ని భావించున‌ట్లు చేసిన‌ది. వాసంతికి కూడా సార‌ధి స్ప‌ర్శ మ‌ధుర‌ముగ నుండుట‌కు కార‌ణ‌మ‌త‌నిని గాఢ‌ముగ ప్రేమించుట చేత‌నే క‌లిగిన‌ది. అందువ‌ల‌న‌నే రంగ‌నాధ‌ము, జమిందారుల స్ప‌ర్శ య‌గ్ని తుల్య‌మైన‌ది. ఆమెకు సార‌ధి స్వ పురుషుడు. రంగనాధులు ప‌ర పురుషులు. సామాన్య హిగికి స‌హిత‌ము ప‌ర‌ప‌రుష స్ప‌ర్శ‌త‌గిలిన‌చో నొడ‌లు గొంగృప‌రుగులు పాకిన‌ట్లు జ‌ల‌దరించును. అట్టి త‌రి తీవ్ర స్వ‌భావ‌మ‌యైన వాసంతి మరింత స్వ ప‌ర పురుష స్వాభావ‌మును తీవ్ర‌ముగ నూహించి యుండ‌వ‌చ్చును. కావున వాసంతియు సార‌ధియు నొక‌రినొక‌రెంత ప్రేమించుకొనిరో తెలియ చున్న‌ది. సార‌ధి ఆమె హృద‌య‌మున నుండ‌గా మ‌రియొక పురుషుని స్ప‌ర్శ‌కామె తాళలేక‌పోయిన‌ది. వాసంతి కిరీటిలోకి సంత‌రింప బ‌డిన సార‌ధి స్ప‌ర్శ‌లోని సుఖానుభూతికి లోనై య‌త‌నితో సంసార‌ము చేయుట యారంభించిన‌ది. వాసంతిని కిరీటికి ధారాద‌త్త‌ము చేయుట‌కు సార‌ధిగ‌ల య‌ర్హ‌త యెట్టిది ?  ఒక‌ర‌క‌ముగ సార‌ధి వాసంతిని అన్యాయ‌ము చేసెను. అతనికి వాసంతి తెలియ‌జెప్పుట‌కు త‌న శ‌రీర‌ములో గ‌ల శ‌క్తి యెట్టిదో తెలియ‌దు. ఈ శ‌క్తిని ప్రేమ శ‌క్తి అన‌వ‌చ్చును. అన‌గా సార‌ధి చిన్న‌పిల్ల‌యైన వాసంతిని ప్రేమించుట త‌న‌కు తెలియ‌క‌నే జ‌రిగిపోయిన‌ది. దానినింక భావిజీవిత‌ము సుఖ‌మ‌య‌ము కావ‌లెన‌న్న‌దే యున్న‌ది. కాని వాసంతికి  తానులేక సుఖ‌ములేదని గ్ర‌హింప‌లేదు. ఇచ‌ట కూడా సార‌ధి వాసంతిని చిన్న పిల్ల వ‌లెనే భావించెను. మిఠాయి చేత‌బ‌ట్టి పిల్ల‌ల‌ను మ‌రిపంచున‌ట్లుగ కిరీటిని చూపితాను త‌ప్పుకొనెను. సార‌ధికి త‌న స్ప‌ర్శ కిరీటిలో నెంత కాల‌ముండునో తెలియ‌దు. అది య‌చ‌ట శాశ్వ‌త‌ముగ నుండునో వాసంతి నొక‌టి రెండు ప‌ర్యాయ‌ములు కౌగలించుకొన‌గ‌నే నిశ్శేష‌మ‌గునా య‌ని యోచింప‌లేదు. కేవ‌ల‌ము సంక‌ల్ప బ‌ల‌మున్న మాట‌తో విని నన్నిటిని అధిగ‌మించినాడు. కిరీటి స్ప‌ర్శ‌కు వాసంతి య‌ల‌వ‌టు ప‌డి యూర‌కుండున‌నుకొనెను.

అస‌లు వాసంతికి త‌న స్ప‌ర్శ వాంఛ నీయ‌మా ?  తానే క‌వాలెనా యున్న‌ది తెలియ‌క పోలేదు. కానీ కిరీటి సుఖ‌స్ప‌ర్శ‌చే నామెను బ్ర‌మ‌లో ప‌డ‌వైచెను వాసంతి ఆ స‌మ‌య‌మున‌కు మిక్కిలి య‌ల‌సిపోయినిది. మూడు సంవ‌త్స‌ర‌ములు శ్ర‌మ‌ప‌డి విష‌య‌మును గ్ర‌హించు కొనిన‌ను శారీర‌కముగ నామె సారధిని యాహ్వానించు స్థితిలో నుండెను. తండ్రి యొక్క శృంగార చేష్ట‌ల‌కు మాఎ స్ప‌దించిన‌ది. క‌మ‌ల య‌ను బాలిక‌తో తండ్రియాడు స‌ర‌స‌ముల‌కా యామె త‌న‌ను కూడా య‌ట్లు ఎవ‌రైనా చేసిన‌చో బాగుండున‌ని భావించిన‌ది. ఆమెలో కోర్కెల‌ను రేపుట‌గు తండ్రి కూడా ప‌రోక్ష కార‌కుడు. వ‌య‌సు వ‌చ్చిన పిల్ల‌ల‌ముందు త‌ల్లి దండ్రుల ప్ర‌వ‌ర్త‌న వ‌ల‌న పిల్ల‌ల‌లో చెల‌రేగు భావ‌ము లెట్లుండునో వాసంతి తెలియ‌జేయుచున్న‌ది. ఆమెకు దాని రహ‌స్య‌ము తోచెను. త‌న్ను కూడా న‌ట్టేవ‌రైనా కౌగ‌లించు కొనిన‌చో త‌న‌క‌ది యిష్ట‌ముగా నుండున‌ని దాని య‌ర్ద‌మ‌ని ఆమె య‌నుకొన్న‌ది. ఆమెలో గామభావమెంత యున్న‌ను త‌నువు మ‌న‌సు హృద‌య‌ము సార‌ధినే కోరును గాని య‌న్యుల బొడ స‌రిప‌డ‌దు. ఇది మ‌నోభావ సంబంధి. అనుకూల మ‌నోభావ‌ల‌మున్న‌పుడు దుఃఖ‌ముగా నుండును. సార‌ధి యంద‌నుకూల భావ‌మున్న‌ది అని వాసంతియే గ్ర‌హించుకొన్న‌ది. కావున వాసంతి కున్న‌దియు ప‌ర‌మేశ్వ‌ర ద‌త్త‌మైన‌దియు స్ప‌ర్శ‌ను గ్ర‌హించు గుణ‌ము క‌న్న ప్రేమించు హృద‌య‌మ‌న‌వ‌లెను. కాముడామెను ద‌హించుచున్నాడు గావున కామ‌ద‌హన‌ము నామె స‌మ‌ర్థింప లేక పొయిన‌ది. కిరీటిని తండ్రియొదుట‌నే నిర్భీతిగ గ‌దిలోనికి కొనిపోయి త‌లుపులు వేసుకొన్న‌ది. ఈ యుర‌వ‌డి కొద్ది కాల‌మే. త‌రువాత సార‌ధి యెచ్చ‌ట నుండెనో యెప్ప‌టి క‌ప్పుడు క‌నుగొనుచునే యున్న‌ది. సార‌ధ‌ఙ అనేక మ‌త‌ముల‌ను మార్చుచు పెండ్లిండ్లు చేసికొనుచు వాసంతిని మ‌రువ జూచినాడు. సార‌ధి వ‌ల‌ర మెహినీ రుక్ముంగ‌ద నాట‌క‌ము నాడుట‌కు వాసంతి యున్న గ్రామ‌మున‌కే రాగా వాసంతి మెహినీ రూప‌మును ధ‌రింప వాంఛించిన‌ది. ఇరువురును శృంగార ర‌స‌ప‌యోదిలో తేలియాడిర‌న‌వ‌ల‌ను. హృద‌య‌ములు త‌నువులు కౌగిలిలో నేక‌ముకాగా ఇరువురును స్ప‌ర్శా మాధురి వేయ‌మ‌డుంగు లెక్కువ‌కాగా ప్రాణ‌ముల‌ను కోల్పోయిరి. సార‌ధియు వాసంతియుఒండొరుల‌ను గాఢ‌ముగ త్రిక‌ర‌ణ శుద్ధిగా ప్రేమించుకొనిర‌నుట‌కు వారిరువురును ప‌రిరంభ‌ణ‌మున మ‌ర‌ణించుట య‌న్న‌ది ధృవీక‌రించుచున్న‌ది. ఇట్లే న‌వ‌ల యాద్యంత‌ము స్ప‌ర్శా మాధురియ‌న్న నొకానొక విచిత్ర‌శ‌క్తిని వాసంతి కాపాదించి ర‌చ‌యిత వాసంతి పాత్ర‌న‌త్య‌ద్భుత‌ముగ చిత్రించినాడు. వాసంతిలోని శిశుప్ర‌కృతి మొండిత‌నము, విష‌య‌ము గ్ర‌హించుట‌లో క‌న‌బ‌రచిన ప‌ట్టుద‌ల‌, ఆస‌క్తితో నీ స్ప‌ర్శా మాధురికి మ‌రింత సంజీవ నీత్వ‌మును ప్రాపింప చేసిన‌వి.