65
 

శ్యామ‌ల‌

అంత‌రాత్మ య‌ను నీ న‌వ‌ల‌లో భ‌ర్త‌కు న‌చ్చ‌ని ప‌నిచేసి భార్య భ‌ర్త‌ను క‌ష్ట‌పెట్ట‌గా నా క‌ష్ట‌ము క్ష‌ణిక మాత్ర‌మేకాగా ఆమె పుట్టినింటిలో నుండి యిరువుర‌కు క‌లియుట క‌వ‌కాశ‌ము లేక‌పోయిన‌ది. ఒక పెండ్లి స‌మ‌య‌మున క‌లిసికొనిన‌ప్పుడు స‌హిత‌ము వారిద్ద‌రును ప‌ట్టుద‌ల‌తో దూర‌మ‌గుట‌యును ద‌గ్గిర‌యిన స‌మ‌య‌మున బెట్టు పొవుట‌యును చేసి విర‌హావ‌స్థ‌, ముఖ్య‌విష‌య‌ము. ఇంత‌కు నా భ‌ర్త‌ను క‌ష్ట‌పెట్టిన‌, ఆ భ్యార చేసిన ప‌ని, ప‌తి దేవున‌కు లేఖ వ్రాయుట‌. ఆ భార్య పేరు శ్యామ‌ల‌.

శ్యామ‌ల సుగుణ భూష‌ణ‌రావు భార్య. శ్యామ‌ల పుట్టింటిలో ఆధునిక వాతావ‌ర‌ణ‌ము హెచ్చు. భ‌ర్త పూర్తిగ పూర్వాచార ప‌రాయ‌ణుడు. చదువుచున్న‌దాంగ్ల విద్య‌యైన‌ను గోష్పాద‌మంత‌పిల‌క‌తో నుండు స‌నాత‌న మ‌త‌స్థుడు.

క‌థ ప్రారంభ‌మ‌గుస‌రికి శ్యామ‌ల పుట్టింటిలో అమ‌రావ‌తి య‌న్న ఊరిలోనుండ‌గా సుగుణుడు బంద‌రులో నుండెను. ఇందుకు ప్ర‌త్యేక‌మైన కార‌ణ‌మేమియు లేకుండినప్ప‌టికిని ఇరువురు దూర‌ముగా నుండిరి.

ఒక న‌వ‌ల‌యందు గాని క‌థ‌యందు గాని సంఘ‌ర్ష‌ణ మ‌వ‌స‌ర‌ము. లేకున్న దిన‌చ‌ర్య ప‌ట్టిక‌వ‌లె నుండి యితివృత్త‌ము ర‌స‌హీన‌ముగ నుండును. కావున నీ అంత‌రాత్మ లో శ్యామ‌ల భ‌ర్త‌కు వ్రాసిన లేఖ సంఘ‌ర్ష‌ణ‌మున‌కు ప‌రిక‌ర‌మైన‌ది. సంఘ‌ర్ష‌ణ‌మున‌కు ప‌రిక‌ర‌మైన కార‌ణ‌మింత సున్నిత మ‌గుట‌చే నా సంఘ‌ర్ష‌ణ‌ము న‌ను భ‌వించిన వ్య‌క్తుల హృద‌య‌ములు కూడ మ‌రింత సున్నిత‌ములైన వ‌ని చెప్ప‌వ‌లెను.

భార్య లేఖ‌వ‌ల‌న భ‌ర్త‌లో కించిదాగ్ర‌హము క‌లిగిన‌ది. అట్లు లేఖ త‌ప్పునిస‌రియై వ్రాయ‌వ‌ల‌సి వ‌చ్చిన‌దనియు వ‌దిన‌గారి బ‌ల‌వంత‌ము వ‌ల‌న వ్రాసితిన‌నియు త‌న న‌పార్ధ‌ము చేసికొన‌వ‌ద్ద‌నియు ప్రార్థించుచు శ్యామ‌ల మ‌రియొక జాబు వ్రాసిన‌ది. ఒక ఉత్త‌ర‌ము వ్రాసినందుల‌కే ప‌తి కోపించున‌ని తెలిసిన శ్యామ‌ల మ‌రియొక జాబు వ్రాయుట‌లో కొంత జాణ‌త‌న‌ము చూపిన‌ది. కాని యామెకు త‌న నిర్థోషిత్వ‌మును నిరూపించుకొనుట‌కు గాని, భ‌ర్త‌కు త‌న‌పైగ‌ల యాగ్ర‌హ‌మును త‌గ్గించుట‌కు త‌న  ప్ర‌య‌త్న‌ము చేయుట‌కొర‌కుగాని, మ‌రియొక లేఖ వ్రాయుట ద‌క్క మార్గ‌ములేదు.

భార్య‌పై ప్రేమ‌గ‌ల భూష‌ణుడు శ్యామ‌ల ప‌రిస్థితి న‌ర్థ‌ము చేసికొని మిన్న‌కుండును. నిన్ను క్షమించితిన‌ని గాని నీవ‌ల‌న దోష‌ములేద‌నిగాని శ్యామ‌ల‌కుత్త‌ర‌ము వ్రాయడు. ఎట్లు వ్రాయును. జాబులు వ్రాసికొనుట పాశ్చాత్య నాగ‌రిక‌త‌య‌ని నుగుణ భూష‌ణుడు భావించునుగ‌దా !  శ్యామ‌ల త‌న లేఖ‌ల ప్ర‌భావ‌ము భ‌ర్త‌పై నెట్లుండెనో తెలియ‌క కొట్టుమిట్టాడ వ‌ల‌సిన య‌గ‌త్య‌ము సుగుణుని మేన‌ము వ‌ల‌న క‌లిగిన‌ది.

ఇంత‌కు విధి శ్యామ‌ల క‌నుకూల‌ముగ నున్న‌ట్లుండెను. సుగుణుని మేన‌త్త కుమార్తె పెండ్లివ‌చ్చిన‌ది. పెండ్లికి బంద‌రునుండి సుగుణుడు అమ‌రావ‌తి నుండి శ్యామ‌ల‌యును వ‌చ్చిరి. వీరిరువురుకు ఒక‌రికొక‌రు చూచుకొన‌వ‌లెన‌ని ప‌ల‌క‌రించుకొన‌వ‌లెన‌ని గాఢ‌ముగ‌నున్న‌ది. కాని ఒక‌రినొక‌ర చూచుకొనుట‌కు కూడా వీలుకాని ప‌రిస్థితులు.గృహ‌మంత‌యు జ‌న‌స‌మ్మ‌ర్థ‌ము. శ్యామ‌ల‌కు త‌గని ల‌జ్జ‌. నుగుణున‌కు వ‌ధిలేని బిడియ‌ము. ఒక‌రి క‌నుల యొదుట నొక‌రున్న‌ను నిరువురి మ‌ధ్య నేల‌నో క‌డుదూర‌ము. ఇరువురును విర‌హమున రాధాకృష్ణులైరి. ఒక  తావున రాధ గోపాలునికై వెదుక‌గా మ‌రియొక చో రాధ‌కై గోవిందుడు క‌నులు కాయ‌ల‌ను కాయించుకొనెను. శ్యామ‌ల‌కు సుగుణ‌భూష‌ణుడ‌న్న మిక్కిలి భ‌య‌ము. తాన‌మి చేసిన అత‌డేమి భావించునోయ‌న్న బెర‌కు.

పెండ్లిలో పాట‌పాడ‌మ‌ని బంధువులు శ్యామ‌ల‌ను బ్ర‌తిమాలిరి. శ్యామ‌ల భ‌ర్త యంగీకార‌మున‌కై యాత‌ని క‌నుల‌లోనికి చూచిన‌ది. సుగుణుడు ప్ర‌సన్న‌వ‌ద‌నుడై యున్నాడు. శ్యామ‌ల మ‌ధుర‌ముగ పాడిన‌ది. ఇయంగేహే ల‌క్ష్మీ య‌నుకొని త‌న యిల్లాలిని చూచుకొని సుగుణుడు మురిసిపోయినాడు. ఇంత జ‌రిగిన‌ది. ఇరువురకు మాట‌లింక‌ను క‌లియ‌లేదు.

భోజ‌న‌ముల వేళ శ్యామ‌ల భ‌ర్త‌కు నేయి వ‌డ్డించ‌పోయిన‌ది. సుగుణుడు చేయిప‌ట్టెను. ఆమె ఒక్క చుక్క రాల్చివెడ‌లిపోయి మ‌ర‌ల వ‌డ్డింప వ‌చ్చిన‌ది. సుగుణుడు చేయి జాప‌లేదు. ఆమె నేతిగిన్నె న‌చ‌ట పెట్టి వెడ‌లిపోయిన‌ది. ఇట్లు శ్యామ‌ల నేయి కొద్దిగా వ‌డ్డించుట‌లో నామె యుద్దేశ‌మొక‌టి ! భ‌ర్త నేయి మ‌రికొంచెము వేయ‌మ‌న‌వ‌చ్చును. అంత‌లో వారి మ‌ధ్య‌నున్న మేన రాక్ష‌సి తొల‌గిపొగ‌ల‌దు లేదా భ‌ర్త‌కు సాధ్య‌మైన‌న్ని ఎక్కువ‌సార్లు ద‌గ్గ‌ర‌కు రావ‌చ్చున‌న్న స్నిగ్థ భావ‌ముచేత న‌ట్లు చేసియుండును. సుగుణుడు భార్య హృద‌య‌ము గ్ర‌హింప‌లేక మూర్ఖ‌త‌త‌తో రెండ‌వ‌మారు చేయి జాప‌కూర‌కుండెను. భ‌ర్త‌యొక్క నిర్లిప్త‌త‌కు కినుక వ‌హించిన శ్యామ‌ల వెడ‌లిపోయిన‌ది. సుగుణుడు తాంబూల‌ము సేవించుచు జాజికాయ జాప‌త్రి కొర‌కు బావ‌మ‌రిదిని భార్య ద‌గ్గ‌ర‌కు పంపెను. శ్యామ‌ల వాటినీయ‌క పెట్టి తాళ‌ము చెవుల‌నిచ్చి పంపెను. ఈ సంకేత‌ము కూడ సుగుణుని క‌ర్థ‌ముకాలేదు. తాన‌డిగిన దీయ‌లేద‌ని మ‌రింత క్రుధ్ద‌డ‌యినాడు. త‌న యుత్త‌రీయ‌ము శ్యామ‌ల పెట్టిలో నున్న‌ది తీసి యీయ‌మ‌ని శ్యామ‌ల వ‌దిన‌గారి న‌డిగినాడు. ఆమె నేల య‌డ‌గెవ‌లె త‌న న‌డ‌గ‌రాధాయ‌ని భావించిన శ్యామ‌ల ఉత్త‌రీయ‌ము త‌న పెట్టెలో లేద‌ని క‌బురు పంపిన‌ది. సుగుణుడు వానిన‌స‌లు ధ‌రించ‌న‌ని  నిర్ణ‌యించుకొనినాడు. ఇట్లు వారిరువురి సామ‌ర‌స్య ప్ర‌య‌త్న‌ములు వ్య‌ర్థ‌ముకాగా ఇరువురి విర‌హ‌ములు వ‌ర్ణ‌నాతీత‌ములు.

ఊరేగింపులో పెండ్లికుమారుని ప్ర‌వ‌ర్త‌న‌కు సంత‌సించి విశాల హృద‌యుడైన సుగుణుడు మ‌ర‌ల భ్యార‌కై వెనుక‌కు తిరిగి చూచెను. పనియున్న‌ట్లు స్త్రీల వెనుక‌కు వెళ్ళి దీప‌ము వెలుతురు స‌రిగా ప‌డ‌ని క్రీనీడ‌ను ఆగినాడు. శ్యామ‌ల కీ సంగ‌తి తెలిసిన‌ది. కాని వెంట‌నున్న యాడబిడ్డ యేమ‌నుకొనునో త‌న‌ను చూచువారంద‌రు న‌వ్వెరేమో య‌న్న భావ‌ముతో భ‌ర్త‌చెంత‌కు వెళ్ళ‌వ‌లెన‌ని గాఢ‌ముగా వాంఛించుచున్న‌ను న‌ల్గురు చూతుర‌న్న భ‌యముతో ముందుకు సాగిపోయిన‌ది. కొంత‌సేప‌టికి శ్యామ‌ల న‌డువ‌లేక వ‌దిన‌గారితో క‌లిసి వెనుక‌కు తిగిరి వ‌చ్చిన‌ది. వ‌దిన‌గారు త్వ‌ర‌త్వ‌ర‌గా న‌డుచుచుండ‌గా శ్యామ‌ల కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా న‌డుచుచుండెను. నూత్న గ‌ర్భిణి య‌గుట‌చే శ్యామ‌ల క‌ల‌స‌ట క‌లుగునేమో య‌ని భావించెన సుగుణుడు మెల్ల‌గ న‌డువ‌మ‌ని యామె కొంగు పట్టుకొని లాగెను. మ‌ర‌ల నెవ‌రో వ‌చ్చుట‌వ‌ల‌న శ్యామ‌ల నిర్వాక్కై లోనికి బోవుట జ‌రిగిన‌ది.

శ్యామ‌ల సుగుణుడు నిదురించు గ‌దిలోనిక వ‌చ్చి దేనికొర‌కో వెద‌కుచున్న‌ట్లు న‌టించుచుండెను. సుగుణుడు కూడ నిదుర న‌భిన‌యించుచుండెను. భ‌ర్త త‌నంత లేచున‌ని శ్యామ‌ల‌. శ్యామ‌ల లేప‌వ‌లెన‌ని సుగుణుడు. స్త్రీ స‌హ‌జ‌మైన ల‌జ్జ యామెను సుగుణుని లేవ‌నీయ‌లేదు. తాను లేఖ వ్రాయుట త‌ప్పేయైన‌ను నంత ప‌ట్టింపెందుల‌కో య‌ని శ్యామ‌ల భావించెను. జాజిపూవున‌కై క‌బురంపిన‌పుడు తాళ‌ము చెవులెందుకు పుచ్చుకొన‌లేదు. ఉత్త‌రీయ‌ము న‌న్న‌డుగ రాదా య‌నుకొన్న‌ది. ఈ భావ‌ము లామెను త‌నంత తానుగా దిగివచ్చుట క‌డ్డ‌రాగా సుగుణుడింద‌లుకు

భిన్న‌ముగ యోచించెను. నేయి వ‌డ్డించ‌కుడ‌నేల‌పోవ‌లె పాట పాడున‌పుడు నాకు ద‌న‌మ‌నోహ‌ర‌లావ‌ణ్య ర‌సాంబుధిలో మున‌క‌లు వేయుట‌క‌న్న నింకొక స్వ‌ర్గ‌ము లేద‌ని తెలియ‌జేసితిని క‌దా జాజిపూవున‌కై క‌బురంపితిని. ఉత్త‌రీయ‌ములు లేవ‌నిన‌ది. ఆమెతో మాట‌లాడుట కెంత త్వ‌ర‌ప‌డుచుంటినో తెలియ‌కున్న‌ది. అని త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకొనెను. ఇరువురి మ‌ధ్య నీ యోచ‌న సాగుచుండెను. ఎవ‌రైన వ‌త్తుర‌న్న తొంద‌ర‌లో శ్యామ‌ల అటు వెళ్ళ‌లేక ఇటు రాలేక మ‌న‌సులో వేద‌న జెందిన‌ది. చిట్ట‌చివ‌ర‌కు శ్యామ‌ల పాదము గ‌డ‌ప‌దాటి బ‌య‌టికి వైచిన‌ది. ఇరువుర‌కు న‌వ‌కాశ‌ము పోయిన త‌రువాత త‌మ యొడ‌ళ్ళు త‌మ‌కు తెలియ‌నంత వ్య‌ధ చెందిరి.

సుగుణ భూష‌ణున‌కీప‌రిస్థితి దుర్భ‌ర‌ము కాగా ప్ర‌క్క‌యూరైన వ‌సంత వాడ‌లోనున్న మిత్రునికై వెడ‌లెను. శ్యామ‌ల క‌నులు సుగుణునికై గాలించుచున్న‌వి. రాత్రియెంత పొద్ద్రుపోయిన‌ను భ‌ర్త జాడ కాన‌రాని శ్యామ‌ల త‌ల్ల‌డిల్లి అత‌ని అక్క న‌డిగిన‌ది. వ‌సంత‌వాడ వెళ్ళి సాయంత్ర‌ము వ‌చ్చున‌ని ఆమె చెప్పిన‌ది. భ‌ర్త రాక ఆల‌స్య‌మ‌యిన‌ది. ఆల‌స్య‌మైన‌కొల‌ది శ్యామ‌ల‌లో విర‌హ‌మెక్కువ కాసాగిన‌ది. త‌నకు తాను నిందించుకొన్న‌ది. ఈ సారి భ‌ర్త క‌నిపించి నంత‌నే అత‌ని పాదముల‌పైబ‌డి క్ష‌మింపుమ‌ని వేడెద న‌నుకొన్న‌ది. త‌న్ను చూడ‌కుండ నిముస‌మేనియు నుండ‌లేడ‌ని త‌ను దెలిసిన భ‌ర్త తానింట నుండ‌గా నింకొక యూరు మ‌న‌శ్శాంతికై యరుగుట‌కు కార‌ణ‌ము తానే క‌దా అని శ్యామ‌ల భ‌ర్త వ‌సంత‌వాడ వెళ్ళుట‌కు కార‌ణ‌ము త‌న ప‌ట్టుద‌ల‌యే న‌ని గ్ర‌హించిన‌ది. ఆమెకు భ‌ర్త ద‌గ్గ‌ర నుండ‌వ‌లెన‌ని యున్న‌దేగాని పుట్టినింట కొల‌ది కాల‌మైన‌ను స‌రే యుండుట కిచ్చ‌గించుట లేదు. ఆమె యంత‌, భ‌ర్తృప్ర‌ణ‌యైన జీవిని ఎదుట‌నుండియు మాట‌లాడుకొనని త‌మ దుస్థితి కామె విచారించిన‌ది. భ‌ర్త కంఠ‌సీమ‌ను కౌగ‌లించుకొని యేడ్చిన‌గాని నామె వ్య‌ధ తీరున‌ట్లులేదు.

అత‌డు కొంగు ప‌ట్టి లాగినప్పుడేల నిలువ‌నైతిని ?  నేనెంత క‌ఠిన‌ను అని నిందించుకొనిన‌ది. ఆమె పెట్టెతీసి సుగుణుడు బ‌హుక‌రించిన యొక బొమ్మ‌తీసి హృద‌య‌మున‌కు హ‌త్తుకొనిన‌ది. అందులో రాధ‌కు  కృష్ణుడు జ‌డ‌వేయుచున్న‌ట్లు చిత్ర‌ము గీయ‌బ‌డిన‌ది. అందున సుగుణుని హృద‌య‌ము ప్ర‌తిబింబించిన‌ది. సుగుణున‌కు శ్యామ‌ల‌కు జ‌డ‌వేయ‌వ‌లెన‌న్న కోరిక యున్న‌ది. ఒక‌నాడు శ్యామ‌ల త‌ల దువ్వుకొనుచు భ‌ర్త ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ది. అద్ద‌ము కొర‌కు వ‌చ్చిన‌ట్లు న‌టించిన‌ది. సుగుణుడు త‌న కోర్కెను తీర్చు కొనినాడు. వచ్చీరాన‌ట్లు వేసిన యా జ‌డ‌ను అత్త‌గారు చూచి న‌వ్విన‌ను శ్యామ‌ల‌య‌ట్లే యుంచుకొనిన‌ది. శ్యామ‌ల ఆ గుర్తుల‌న‌న్నిటిని త‌ల‌చుకొని త‌ల‌చుకొని యా బొమ్మ‌ను హృద‌య‌మున క‌ద్దుకొనిన‌ది.

శ్యామ‌ల‌కారాత్రి భ‌ర్త రాకుండుట‌చే నిదుర దూర‌మైన‌ది. పెట్టెలో దాచిన సుగుణుని యుత్త‌రీయ‌ము తీసి యెద‌నంత చుట్ట‌బెట్టుకొన్న‌ది. ఆమె విర‌హ‌మున‌కు వెన్నెల మ‌రింత‌తోడై ద‌హించివైచిన‌ది. భ‌ర్త త‌న‌చేత కట్టింప వ‌లెన‌ని ప‌ట్టుబ‌ట్టిన తెల్ల‌చీర క‌ట్టిన‌ది. ఆమె ప్ర‌తి క్ష‌ణ‌ము భ‌ర్త‌కై ఎదురుతెన్నులు చూడ‌సాగిన‌ది. సామి ఎంత‌కు రాడాయెను గోపిక‌లు గోపాల దేవుని ద‌ర్శ‌న‌మున‌కే వ‌గ‌ర్చుచుందురు. రాధిక యాత‌నిగాఢ ప‌రిష్వంగ‌మున‌కు వాంఛ‌గూరును. శ్యామ‌ల విర‌హ‌ములో వేగి పోవుచుండెను. ఆ వేద‌న చ‌ల్లార్చుట కామెకు ప్రియుని ప‌రిష్వంగ‌మే కావ‌లెను. గాని మ‌రి యొక‌టి కాదు. శ్యామ‌ల‌లో నున్న విర‌హ‌వేద‌న వేయి ప‌డ‌గ‌లులోని గిరికాదేవి కృష్ణ‌విర‌హ‌మున‌కు సౌమ్య‌మున్ది. పెండ్లియైన త‌రువాత భార్య వంట చేసిపెట్టుట‌, చిన్న‌చిన్న ఆర్థిక బాధ‌లు, అత్త‌పోరులు గాక శ్యామ‌ల వ‌లె మంజుల హృద‌య‌ముతో విర‌హ‌వేద‌న చెందుట న‌వ‌లా సాహిత్య‌ములో న‌పురూప‌ము. న‌వ‌ల అంత‌రాత్మ శ్యామ‌లా సుగుణ భూష‌ణుల యంత‌రంగ సంద్ర‌త‌రంగ‌ములిచ‌ట వ్యాఖ్యానిత‌ములు. ఒక‌ర‌క‌ముగ చూచిన‌చో అంత‌రాత్మ న‌వ‌ల పాఠ‌కునికి పాత్ర‌ల యొక్క బాహ్య‌రూప‌ముక‌న్న అంత‌రంగ రూప‌ము స్ప‌ష్టముగ దోచున‌ట్లు పాత్ర నిర్మాణ‌ము జరిగిన‌ది. మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల‌ను తెలియ‌చేయు న‌వ‌ల‌లో నంత‌రాత్మ మొద‌టి నాలుగైదు న‌వ‌ల‌లో నొక‌టి. ఇంద‌లి ప్ర‌క‌ర‌ణ‌ముల‌ను రేకుల‌ని పేరు పెట్టుట‌తో వీరి యంత‌రంగ‌మును పూరేకుల‌తో పొల్చిన‌ట్ల‌యిన‌ది.

సుగుణ భూష‌ణుడు మ‌ర‌ల శ్యామ‌ల‌ను క‌లుసు కొన‌క‌యే బంద‌రు వెళ్ళిపోయెను. శ్యామ‌ల చేయున‌దిలేక మ‌రియొక లేఖ వ్రాసిన‌ది. ఇందులో నేమున్న‌దో తెలియ‌జెప్ప‌క ర‌చ‌యిత పాఠ‌కుల యూహ‌కు వ‌ద‌లి వైచినారు. న‌వ‌ల‌లో నుత్కంఠ ప్ర‌తి పాదింప బ‌డుట‌లో కూడ అంత‌రాత్మ పైచేయి. 

ఉత్త‌ర‌ములన్న గిట్ట‌ని సుగుణ‌కీ యుత్త‌ర‌ముల ప‌రంప‌ర తప్ప‌లేదు. కాని శ్యామ‌ల త‌న ప‌రిస్థితుల‌ను భావ‌ముల‌ను తెల్పుట‌కింత‌కంటె గ‌త్యంత‌ర‌ము లేదు. సుగుణుని ప‌రిస్థితికి ప‌ఠితుల‌కు చిరుహాసము క‌లుగ‌క త‌ప్ప‌దు.