66
 

బాద‌మ్మ‌

బ‌ద్ద‌న్న సేనాని న‌వ‌ల బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌ల ప్ర‌ణ‌య వృత్తాంత‌మును చారిత్ర‌క ఘ‌ట్ట‌ముల‌తో జోడించి య‌ల్ల‌బ‌డిన‌ట్టిది. బాద‌మ్మ త‌న‌క‌న్న వ‌య‌సున చిన్న‌వాడైన బాద‌న్న‌ను ప్రేమించి యాత్మార్ప‌ణ‌ము గావించుకొనిన యువ‌తి.

విశ్వ‌నాథ వారిపై నున్న రెండు విమ‌ర్శ‌ల కీ నవ‌ల‌లో స‌మాధాన‌ము దొర‌కును. ఒక విమ‌ర్శ‌, వారు నాయిక‌ల‌ను చిన్న‌వారిని గ‌ను నాయ‌కుల‌ను వ‌య‌సు ముదిరిన వారిన‌గ‌ను చిత్రించెద‌ర‌ని ప‌లువురందురు. మ‌రియు విశ్వ‌నాథ ప్ర‌థ‌మ వ‌ర్ణ‌ప‌క్ష‌పాత‌ము గ‌ల వారని రెండ‌వ విమ‌ర్శ‌. ఈ న‌వ‌ల ల‌న్నింటిలోను పురుషుడు పెద్ద‌వాడు. స్త్రీ చిన్న‌ది. దేశ‌మున క‌థ‌లు వ్రాయుట‌కు స‌మాన వ‌య‌స్కులు లేరా ?  అను విమ‌ర్శ క‌ల‌దు.

పంచ‌మ వ‌ర్ణ సంజాతులైన బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌ల యొక్క గుణగుణ‌ములే యుత్త‌మ కుల‌స్థుల గుణ‌గ‌ణ‌ముల‌క‌న్న తీసిపోవున‌ట్ట‌వికావు. ఇచ‌ట వీరి వ‌ర్ణ‌మును గుణ‌క‌ర్మ‌ల‌ను బ‌ట్టి చూచిన‌చో గుణ‌మును బట్టి బ్రాహ్మ‌ణుడ‌ను క‌ర్మ‌ను బ‌ట్టి క్ష‌త్రియుడును న‌యిన బాద‌న్న‌యందెట్టి హీన‌గుణ‌ములు లేవు. కాని విన‌య‌మును జూపి పంచ‌మునిగ నిల‌చిపోయెను. బాద‌మ్మ బ‌ద్ద‌న్న‌కు క‌త్తివిద్య‌ను నేర్పి గురుతుల్యురాలైన‌ది. క‌ర‌వాల భైర‌వుడ‌ను తీవ్ర‌మ‌తాభిమానిని బ‌ద్ద‌న్న చేత ఖండింప‌చేసిన‌ది బాద‌మ్మ‌. క‌ర‌వాల భైర‌వుడు తీవ్ర శైవ‌మ‌త‌స్థుడు. అత‌ని దుర‌శిత‌య‌ముచేత చాల‌మంది వీరులు అవ‌మాన‌ము పాలై ప్రాణ‌ముల‌ను కోల్పోవ‌ల‌సి వ‌చ్చుచుండెను. బాదమ్మ బ‌ద్ద‌న్న‌కు గుఱ్ఱ‌పు ముంగాళ్ళు న‌ర‌కుట‌లో నొక నైపుణ్య‌మును నేర్పిన‌ది. గుఱ్ఱ‌మున‌కు న‌ర‌కిన త‌రువాత బ‌ద్ద‌న్నకు క‌ర‌వాల భైర‌వుని న‌ర‌కుట తేలిక‌యైనది.

క‌ర‌వాల భైర‌వుని ఖండించివ‌చ్చిన బ‌ద్ద‌న్న కుప‌చ‌ర్య‌లు చేయుట‌కై బాద‌మ్మ నాటి రాత్రంత‌యు న‌త‌ని యింట‌నే గ‌డిపిన‌ది. వైద్యుని బ్ర‌తిమాలియు, నిష్టురోక్తులాడియు తీసికొనివ‌చ్చి వైద్య‌ము చేయించిన‌ది. త‌రువాత బాద‌మ్మ భ‌ర్త తిప్ప‌న్న బాద‌మ్మ ననుమానించి క్షోభ‌పెట్టెను. కొట్టెను. శారీర‌క‌ముగ బాధించుచుట‌యేగాక మాన‌సిక‌ముగ కూడ నామెను బాధించెను. అతడామెను యింటి నుండి త‌రిమి వేయ‌గా గ‌తిలేక బ‌ద్ద‌న్న యింటికి వ‌చ్చిన‌ది. ఆమె బ‌ద్ద‌న్న ఇంటికి వెళ్ళిన‌చో మ‌ర‌ల త‌న యింటికి రానీయ‌న‌ని తిప్ప‌న్న య‌న‌గా నామె య‌ట్లే రానీయ‌వద్ద‌నిన‌ది.

బాద‌మ్మ కొప్పాక య‌ను గ్రామ‌మున పంచ‌మ కుల‌స్తుల యింట పుట్టిన‌ది. ఆ యూర పంచ‌ముల‌లోక‌త్తి విద్య ప్ర‌ఖ్యాత‌ము. అచ‌టి స్త్రీ పురుషులిరువురు నా విద్య‌లో నిష్టాతులై యుందురు. ఈ నిష్టాతుల‌లో బాద‌మ్మ త‌న విద్యా వైభ‌వ‌ముతో మ‌రింత ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకొనిన‌ది. బాద‌మ్మ బ‌ద్ద‌న్న శౌర్య‌మును గ‌మ‌నించి తాను నేర్చిన యొడుపుల‌న్నియు నాత‌నికి నేర్పి క‌ర‌వాల భైర‌వుని పైకి యుధ్ద‌మున‌కు పొమ్మ‌ని ప్రోత్స‌హించిన‌ది. క‌ర‌వాల భైర‌వుడు బ‌ల‌మ‌దముతో మ‌త‌మ‌ద‌ముతో న‌నేకుల‌ను త‌న క‌త్తికాహుతి చేసినాడు. బ‌ద్ద‌మ్మ‌కు క‌ర‌వాల భ‌యంక‌రుని శ‌క్తి యెట్టిదో బ‌ద్ద‌న్న శౌర్య‌మెట్టిదో తెలియును. లేకున్న‌చో యాబోతు వంటి భైర‌వుని పైకి లేగ‌దూడ‌వంటి బ‌ద్ద‌న్న‌ను యుద్ధ‌మున‌కు పంప‌దు.

ఇందువ‌ల‌న బ‌ద్ద‌న్న యొక్క శ‌రీర‌సంబంధ‌ముల‌గు శ‌క్తి సామ‌ర్థ్య‌ముల పైన‌ను హృద‌య సంబంధ‌ముల‌గు మ‌త విశ్వాస‌ముల పైన‌ను బాద‌మ్మ గురుత్వ‌ము వ‌హించి వాని మ‌న‌సుపైనొక య‌ధికార‌మును సంపాదించె న‌నుట యుక్త‌ము. బాద‌మ్మ మ‌త‌స్థురాలు.

బాద‌మ్మ క‌నుల ముందు పెరిగిన‌పిల్ల‌వాడు బ‌ద్ద‌న్న‌. అత‌నికి ప‌దేండ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టినుండి ఆమె అత‌ని నెరింగి యున్న‌ది. ఇట్టి బాలునిపై బ‌ద్ద‌మ్మ‌కేల శృంగారాభిప్రాయ‌ము క‌ల్గిన‌దో య‌నూహ్య‌ము.

బ‌ద్ద‌న్న‌కు బాద‌మ్మ‌పైన‌ను బాద‌మ్మ‌కు బ‌ద్ద‌న్న పైన‌ను ఒకానొక య‌స్ప‌ష్ట‌మైన య‌భిమాన‌ము క‌ల‌దు. ఈ య‌భిమాన‌ము మంచి గురువుపైన శిష్యుల‌న‌కు గ‌ల భ‌క్తిగ‌ను, మంచి శిష్యునిపైన గురువునకు గ‌ల వాత్స‌త్య‌ముగ‌ను ప్రారంభించి, ఆ య‌భిమాన‌ము ప్రేమ‌గ ప‌ర్య‌వ‌సాన‌మందిన‌ది. స్త్రీ పురుషుల మ‌ధ్య‌గ‌ల య‌భిమాన‌ము ఇట్లు దారితీయుట క‌వ‌కాశ ముండెన‌ని బాద‌మ్మ ప్ర‌ణ‌య‌ము తెలియ‌జేయుచున్న‌ది. ఒక్కొక్క‌ప్పు డొక్కొక్క కామ‌భావ‌న క‌ల‌దు. లేద‌న్న‌ట్లుండును. ఒక‌చోట వ్య‌క్తి యందు గౌర‌ముగా భాసించును. ఒక‌చోట జాలిగా భాసించును. ఒక‌చోట ముద్దుగా భాసించును. ఆ వ్య‌క్తి యొక్క వివేకాదుల‌ను ప్ర‌శంసించుట‌గా భాసించును. ఈ యి భావ‌ములు యోగ్య‌స‌న్నివేశ స‌న్నిక‌ర్ష జ‌రిగిన‌పుడు కామ‌ముగా ప‌ర్య‌వ‌సించును. బ‌ద్ద‌న్న బాద‌మ్మ‌ల యందీ వాక్య‌ములు య‌థార్థ‌ములైన‌వి. వారి మ‌ధ్య‌నున్న గురుశిష్య‌సంబంధ‌ము ప్ర‌ణ‌య బంధ‌ముగ మారుట‌కు తిప్ప‌న్న కొంత కార‌ణ‌మై యుండెన‌ని చెప్ప‌వ‌లెను. తిప్ప‌న్న బాద‌మ్మ న‌నుమానింప‌క ముందు బాద‌మ్మ బ‌ద్ద‌న్న‌ల మ‌ధ్య నెట్టి సంబంధ‌మునులేదు. మ‌న‌సుల‌లోనే లేశ‌మైన య‌ట్టి య‌భిప్రాయ‌ము వారికున్న‌ను అది వారికే బోధ‌ప‌డ‌నంత సూక్ష్మ‌స్థితిలో నున్న‌ది. తిప్ప‌న్న బాద‌మ్మ‌ను శారీర‌కముగ హింసించి వెడ‌ల‌గొట్టినప్పుడు ఆమె త‌ప్ప‌నిస‌రిగ బ‌ద్ద‌న్న ద‌గ్గ‌ర‌కు వెళ్ళ‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. ఆమెలో భ‌ర్త పై నొక ప్ర‌తీకార వాంఛ చెల‌రేగి బ‌ద్ద‌న్న‌కు త‌న‌కు మ‌ధ్య లేని సంబంధ‌ము న‌త‌డంట‌క‌ట్టెను కావున భ‌ర్త య‌ను మాన‌మును నిజ‌ము చేయ‌వ‌లెన‌న్న నొక కోరిక గ‌లిగి యుండ వచ్చును. ఇట్లు తిప్ప‌న్న బాద‌మ్మ‌ను శారీర‌క‌ముగ మాత్ర‌మేగాక  నాతంరంగిక‌ముగ కూడ బ‌ద్ద‌న్న చెంత‌కు త‌రిమిన‌ట్ల‌యిన‌ది. బ‌ద్ద‌న్న కూడ బాద‌మ్మ‌పై త‌న క‌ధికార‌మున్న‌టుల ప‌లికెను. కొంత త‌డ‌వాల‌స్య‌ముగ త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన బాద‌మ్మ‌ను వ‌చ్చుట మానివేయ‌మ‌నెను. నీకు తిప్ప‌న్న‌యే కావ‌లెను నేన‌క్క‌ర‌లేద‌న్న‌ట్లు నిష్ఠుర‌ముగ ప‌లికెను. అన‌గా తిప్ప‌న్న‌కు త‌న‌కును మ‌ధ్య పోటీ యున్న‌ట్లును తిప్ప‌న్న స్థాన‌మును తానాక్ర‌మింప జాల‌నాయ‌ను క్రోష‌ముతోడ‌ను బాద‌మ్మ‌కు తిప్ప‌న్న‌యే క‌వాల‌సిన‌చో త‌న ద‌గ్గ‌ర‌కు రావ‌ద్ద‌నిన‌ట్లుగ ప‌ల్కెను. ఆ స‌మ‌య‌మున బ‌ద్ద‌న్న‌కు బాద‌మ్మ‌పై నున్న కొర్కెయ‌సంక‌ల్పిత‌ముగ వెలికివ‌చ్చిన‌ది. యుద్ద‌మున త‌గిలిన గాయ‌ములు ఇంక‌ను మాన‌లేదు. ఆ స‌మ‌య‌మున బ‌ద్ద‌న్న‌లోని ర‌క్త మంత‌యు క‌ళ‌విళ‌మ‌ని యుడికిన‌ది. ఆ ర‌క్త ప్రసార‌వేగ‌మున‌కు బ‌ద్ద‌న్న బుగ్గ‌మీద‌నున్న గాయ‌మునుండి ర‌క్త‌ము చిమ్మిన‌ది. బుగ్గ‌మీద గాయ‌ము వెంట‌నే మ‌ర‌ల ప‌గిలి ప‌ట్టీ యెగిరిపోయి నెత్తురు స్ర‌వించెను. బ‌ద్ద‌న్న‌లో త‌న‌పైనున్న వాంఛాతీవ్ర‌త్వ‌మున‌కు బాద‌మ్మ నిర్ఘాంత‌పోయిన‌ది. ఆమెకు ప‌రిష‌త్తులు గుర్తుకు వ‌చ్చిన‌వి. బ‌ద్ద‌న్న భ‌విష్య‌త్తు మ‌దిలో మెదిలిన‌ది. తాన‌త‌నిని ప్రేమించ రాద‌నుకొనిన‌ది. చిన్న వాడు పైకి రావ‌ల‌సిన‌వాడు. సేనానాయ‌కుడు కాగ‌ల ధైర్య‌సాహ‌స‌ములున్న‌వాడు త‌న‌తోటి కూట‌మి య‌త‌నిలో మ‌చ్చ‌ను క‌లుగ‌జేయున‌ని, బ‌ద్ద‌న్న‌తో సంబంధ‌ము పెట్టుకొనుట వాంఛ‌నీయ‌ము కాద‌ని భావించి మిన్న‌కున్న‌ది.


బ‌ద్ద‌న్న గాయ‌ములు మానిన త‌రువాత ప‌నిలేక కాల‌ము గడుపుచున్న స‌మ‌య‌మున మ‌న‌స్సు బాద‌మ్మ‌పైకి మ‌ళ్ళిన‌ది. తాను బాద‌మ్మ‌ను కామించుట య‌నువిష‌య‌మ‌త‌నికే విచిత్ర‌మ‌నిపించిన‌ది. ఆ కామ‌మును దేవ‌త‌లు మెచ్చ‌రు, మ‌నుష్యులు మెచ్చ‌రు కాని బాద‌మ్మ యొక‌తె మెచ్చిన చాల‌నుకొనినాడు. బ‌ద్ద‌న్న‌కు ముందుగ కావ‌ల‌సిన‌ది దేశ స్వాతంత్ర్య‌ము. త‌న శౌర్య‌ము, వ్యూహ‌ములు యుధ్ధ‌ములు సేన‌ల‌ను స‌మ‌కూర్చుట ! ఇవి యున్నంత‌వ‌ర‌కు బాద‌మ్మ హృద‌య‌ములో నొక‌మూల నొదిగి యుండును. నిర్వ్య‌వ‌సాయుడైన వెంట‌నే మ‌నోయ‌వ‌నిక పై బాద‌మ్మ ప్ర‌త్య‌క్ష‌మ‌గును.

నాల్గునెల‌ల తదుప‌రి యొక వేస‌వి క‌ల మ‌ధ్యాహ్న స‌మ‌యమున త‌న య‌ర‌టి తోట‌కు వెళ్ళెను. అప్పుడ‌త‌నికి పుచ్చ‌కాయ తిన‌వ‌లెన‌నిపించిన‌ది. పుచ్చ‌కాయ త‌మ పొల‌ములోలేదు. తిప్ప‌న్న పొల‌ములోనున్న‌ది. కాని తిప్ప‌న్న పొల‌ములోని కాయ కోసికొనితినుట దొంగిలించుట య‌గునేమో య‌నిపించిన‌ది. కాని మ‌న‌సు మాత్ర‌ము ప్ర‌లోభ‌ప‌ర‌చిన‌ది. తిప్ప‌న్న పొల‌ములోనికి వెళ్ళెను. తిప్ప‌న్న సొమ్మును దొంగిలించుట య‌న‌గా బాద‌మ్మ‌ను త‌న సొత్తును చేసికొనుట‌, ఇచ‌ట ధ్వ‌నించుచున్న‌ది. బాద‌మ్మ కూడా పుచ్చ‌కాయ‌వ‌లె య‌నుభ‌వింప‌బ‌డుట‌కు విచ‌క్ష‌ణార‌హిత‌ముగ నంగీక‌రించిన‌ది. ఇరువుర‌కు విచ‌క్ష‌ణ లోపింప‌గా వ్యామోహ‌మున‌కులోనయి రాబోవు ప‌రిణామ‌మూహింప జాల‌రైరి. బాద‌మ్మ త‌న మూల‌ముగా బ‌ద్ద‌న్న క‌ప‌ఖ్యాతి వ‌చ్చున‌ని భావించిన‌ప్ప‌టికి న‌త‌ని ప్రేమ యొర‌వ‌డిలో నామె కొట్టుకొని పోయిన‌ది.

బ‌ద్ద‌న్న‌యు బాద‌మ్మ‌యు నొక చోట సంకేత‌మేర్ప‌ర‌చుకొని య‌చ్చ‌ట క‌లుసుకొనుట కేర్పాటు చేసికొనిరి. కాని బ‌ద్ద‌న్న యుద్ధ విష‌య‌ములు స్నేహితుల‌తో ముచ్చ‌టించుచు న‌చ్చ‌టికి పోలేదు. బాద‌మ్మ తెల్ల‌వార్ల‌చ్చ‌ట నిద్రు దూర‌మై బ‌ద్ద‌న్న కొర‌కు వేచి యున్న‌ది. తెల్ల‌వారిన తరువాత నిద్ర‌లేని క‌ళ్ళ‌తో నింటికి వ‌చ్చిన బాద‌మ్మ‌ను తిప్ప‌న్న గొడ్డును బాదిన‌ట్లు బాది వెళ్ళగెట్టెను.

బాద‌మ్మ కెచ్చ‌టికి పోవుట‌కును పాలు పోలేదు. తెల్ల‌వారులత‌నికై వేచియ‌త‌డు రాక‌పోయిన‌ను బాద‌మ్మ ప్రాణ‌మంత‌యు బ‌ద్ద‌న్న‌గ గ‌నుపించెను. తిప్ప‌న్ త‌న‌కు త‌గిన‌వాడు కాద‌నుకొనిన‌ది. త‌న తండ్రి త‌న‌ను డ‌బ్బు కొర‌కు తిప్ప‌న్న కిచ్చెనే గాని తిప్ప‌న్న పురుషుడే కాడ‌నుకొనిన‌ది. ప‌రిప‌రి విధముల దుఃఖించుచు బాద‌మ్మ బ‌ద్ద‌న్న ఇంటికి వెళ్ళ‌న‌ది. ఆ స‌మ‌య‌మున బాద‌మ్మ ప‌రిస్థితి హృద‌య‌విదార‌ముగ నున్న‌ది. ఒడ‌లెల్ల దెబ్బ‌ల‌తో కండెలు గ‌ట్టి తెల్ల‌వారులు నిద్ర‌లేని క‌నులుబ్బియుండ‌గా భ‌ర్త కొట్టిన దెబ్బ‌ల కేడ్చుట‌చే మ‌రింత‌గ వాచి ఎర్ర‌నై చిన్న‌వికాగా, చిన్న చిన్న గాయ‌ముల‌తో చీకిరి బాకిరి త‌ల‌తో వ‌చ్చిన‌ది. ఒడ‌లెల్ల నాత్మ హ‌త్యాభిముఖ‌ముగా నున్న బాద‌మ్మ‌ను బ‌ద్ద‌న్న చూచెను. ఆమె ధ‌ర్మము నుండి చ్యుత‌ము కాబోవుచున్న‌ది. బ‌ద్ద‌న్న‌తో నివ‌సించుట‌కెప్పుడు నిర్ణ‌యించుకొన్న‌దో అప్పుడే బాద‌మ్మ ఆత్మ హ‌త్యాభిముఖ‌ముగ‌నైన‌ది. బాద‌మ్మ ఆత్మ‌ను ధ‌ర్మ‌మును గూర్చి హెచ్చ‌రింప‌నీయ‌క త్రొక్కిప‌ట్టి మృత ప్రాయ‌ము చేసిన‌ది కావున నిది యాత్మ‌హత్య య‌ని భావము. నిజ‌ము శ‌రీర త్యాగ‌ము నాత్మ‌హ‌త్య య‌న‌రాదు. ఆత్మ‌హ‌త‌ము కాన‌ట్టిది. పంచ‌భూతుమ‌ల‌క‌తీత‌మైన‌ది. ఇచ‌ట ధర్మ‌ము న‌తిక్ర‌మించుట‌చే ధ‌ర్మ‌హ‌త్య‌యే ఆత్మ‌హ‌త్య‌. చిన్న‌వాడైన బ‌ద్ద‌న్న‌ను మాతృభావ‌ముతో చూడ‌లేదు. బాద‌మ్మ‌లోని సంస్కార‌హైన్య‌మిచ‌ట వెల్ల‌డింప బ‌డిన‌ది.