దిల్హా
దిలహరి కాశ్మీర పురాధీసున కంగరక్షకురాలు కాశ్మీర రాజునకు సంతానము లేనందున రాజ్యముకొరకు నిరువురుస్త్రీలు చేసిన పలు ప్రయత్నముల నీమె వమ్ము చేసిరాజ్యమును సంధిమంతుడను యోగీశ్వరునకు వచ్చుట పాటుపడి న్యాయ పక్షమున నిలచినది. దిల్హా కూడ యోగసాధనలు చేయుచు మంత్ర తంత్రములను నేర్చినది. పురుషులకన్న బలవంతురాలు తన బాధ్యతను నిర్వర్తించు సమయమున రాణులనైన లెక్కచేయదు. ఈమె మాటలాడుట యెవరికిని తెలియదు. అందరు మూగదియని భావించెడివారు. దిల్హా వంటి భవన రక్షణచేయు స్త్రీలు మరి పదిమంది కలరు. వీరిని హెగ్గడి కత్తెలందురు. హెగ్గడి కత్తెలు మహా బలవంతురైన పురుషులకన్న కూడ యుద్ధ విద్యాధికురాండ్రై యుందురు. వీరు పన్నెండ్రేండ్లు వయస్సున్నపుడు ఎంచబడి తీసుకొని రాబడుదురు. వీరినిగూర్చి ప్రతీ సూక్ష్మ విషయమును విచారించి తీసుకొని వత్తరు. వీరందరిలో తప్పని సరిగ కొన్ని లక్షణము లుండవలెను. వారు పొడుగువారు కవావలెను. పుష్టీగల విగ్రహములు కవలయును. వాని ప్రకృతులు ధూర్తముగా నుండవలయును. వారు సౌందర్యవతులు కాగూడదు. పురుషాభిజ్ఞత నుండవలయును. వారు బాలికలనెన్నుకొనితెత్తురు. ఇన్ని లక్షణములున్న తరువాత వీరికి మాటుకూడ రాకూడదు. ఒక వేళ మూగలు కానిచో కృత్రిమముగా మూగలునుగ చేతురు. స్వతంత్రముగ నేపనియు చేయరాదు. విధినిర్వహాణమున నాలోచనలేక యుండ వలయును. ఆలోచన చేసి నచో ఫలితములాలస్యము గావచ్చును కాన హెగ్గెడి కత్తెలు మరమనుషుల వలె నుండవలెను. ఇట్టి స్త్రీలు నల్వురు రాజభవన ప్రాంగణమును పాగ్థక్షిణ ద్వారములను కాపలా కాచెదరు. ఒక్కొక్కరు పదిమంది కటారీ కాండ్రనైన నెదుర్కొనగల శక్తి కల్గియుందురు. మహారాజ సన్నిధానమునకు రావలెనన కోరినచో దక్షణ ద్వారమందుండు స్త్రీ యంగీకరింపనిచో రాజైన నేమియు చేయలేడు. ఇంతటి యధికారము వీరి కున్నది. వీరిలో ముఖ్యమైనవారు దిల్హా, తేజలాదీన, ఉద్దా, సుగ్గల శక్తిలో సామర్థ్యములో నొకరినొకరు తీసిపోరు కాని దిల్హామాత్రము కొన్ని ప్రత్యేక కారణములచేత, యోగాభ్యాసము నందారితేరి యుండుటచేత మిగిలిన మువ్వురికన్న నధికురాలై నవల యందు కీలక స్థానమునుంచ బడినది. రాజునకీమెపైగల ప్రత్యేకాభిమానము చేత కూడ నీమెది ప్రత్యేక స్థానమనవలయును.
ఒకరోజు అర్థరాత్రివేళ వ్యాధిగ్రస్తుడై మంచము పట్టిన రాజును తీసికొని దిల్హా చడిచి వచ్చు చుండెను భవంతి నుండి వెలికి వచ్చి రాజభవనముల నడిమి గుండా నడచి దుర్గ ద్వారము ముందు ప్రవహించు జీలా నదిని పడవలో దాటుచుండెను. కొన్ని రాజకీయ కారణములచేత రాజు వ్యాధిగ్రస్తునివలె నటించుచుండెను. లేకున్న నెట్లు నడవగలడు. అర్థరాత్రి సమయమున రహస్యముగ వెళ్ళుటలోనేదో ముఖ్యమైన కార్యము కావలయును. దిల్హా రాజునకు తనకేమైన జరిగిన గాని లెక్కచేయక ప్రాణములను తెగించి రక్షింప సమర్ధురాలు. అందుచేత రాజునకామెపై ప్రత్యేకాభిమానము.
దిల్హా పడవ నడుపుచున్నది. దిల్హాచేత నిరంతరము నుండ వలసిన కత్తి బదులు పడవ తెడ్డుయున్నది. ఆ క్షణమున తన కేమైన అపకారము జరుగునేమో నిత్యవ్యగ్రమున నుండవలసిన దిల్హా కత్తిని ప్రక్కన పెట్టినది అని రాజునకూహ కల్గినది. అ భావన రాజు మదిలో కదలాడు చుండగా నసంకల్పితమైన నొక బాధా సూచకమైన ధ్వనిని చేసెను. ఇట్లు రాజునకీ భావన మదిలో మెదలు చున్నదని దిల్హా గ్రహించి వెంటనే భయము లేదన్నట్లుగ తన కత్తిని రాజుచుట్టును మెరుపువలె చక్రాకారమున త్రిప్పినది. దిల్హా చేతిలోని ఖడ్గము చంద్రుడు గుడి కట్టినట్లు రాజు చుట్టును కైవారముగా తిరిగినది. మరల పడవ దాని దారిలో నది పోవుచునేయున్నది.
దిల్హా యొక్క వేగరితనమే సంఘటనము వలవి ప్రస్సుష్టమగుచున్నది. ఆమెకు రాఘవమే గాక మనస్సుల నెరుగు శక్తి కూడనున్నది. రాజు చేసిన చిన్న నిట్టూర్పు వంటి యభినయమును గ్రహింపలేదు. రాజునకు తానున్నానని దైర్య సూచకముగా కరవాల చక్రమును నిర్మింపలేదు. దిల్హాకు గల దృష్టి సామాన్యమైనది కాదు. దిల్హా దృష్టి పంచ భూతాత్మమై పృధినీ పదార్థమైన వస్తువులతో బాటు వాయు వికారములైన రూపములను గూడా చూచుటకు నలవాటు పడిన దృష్టి. దిల్హా యొక్క మతీంద్రియ శక్తి యామెచేసిన యుపాసనా ఫలము.
బప్పట మంత్రి భార్యయైన కల్హారమాలికకకు ఖడ్గ విద్య నేర్పినది. కల్హారమాలిక దిల్హాను గురించి తెలిసికొనవలెనని ప్రయత్నించి విఫలమైనప్పుడు దిల్హాయభేద్యురాలనియు నొక రాజ్యమునకు సేనాధిపతిగానో మంత్రిగానో యుండతగినంత రాజ్యాంగవేత్త యనియు భావించినది. కల్హారమాలిక గురువు యొక్క ప్రతిభకు మాత్సర్యపడి యంతటి శక్తిమంతురాలు ప్రాణముతో నుండుట తనకు శ్రేయస్కరముకాదని భావించి వధింప జూచినది. దిల్హా ఆమె ప్రయత్నములను వమ్ముచేయుటేగాక శిష్యురాలైనప్పటికిని ఆమెను వధించుటకు జంకనక్కరలేదని పల్కినది. ఎప్పుడైనను నిన్ను నేను వధింపవలసి వచ్చినచో నేను నేర్పిన విద్యను నేనే నాశనము చేయవలసిన యవసరము వచ్చును కదా యన్న యడ్డంకి నా మనస్సులో నుండెడిది. నీవు గురుద్రోహము చేయుటకు సన్నద్ధురాలవైనప్పుడు నేను శిష్యవాత్సల్యము చూపింపనవసరము లేదు అనినది. ఇటువంటి యుత్కంఠను రేపు తావులలో రచయిత నేర్పు మిక్కిలి యాశ్చర్యకరముగ నుండును. దిల్హా సర్వమును గ్రహించి తాను మూడు వందల యోధులకు సమానమని పల్కినపుడు కల్హారమాలిక యనుభూతులెట్టున్నవో యెట్టి భావములామెలో కదలాడెనో ముఖకవళిక లెట్లు నల్లనగునో కనుబొమలెట్లు ముడుచుకున్నవో పెదవులెట్లు బంధింపబడినవో చదువరియూహకే వదలి కల్హారమాలిక నోట నొక్కమాటను పలికింపరు. ఇట్టి యుత్కంఠనాకంఠముగ పోషించుటలో కడు సమర్థులు శ్రీ విశ్వనాథ.
దిల్హా తనను చంపించుటకు మంత్రి భార్యయైన కల్హారమాలిక సైన్యమును తెప్పించునని గ్రహించినది. తానానాడు అచటి నుండి బయలుదేరి వెళ్ళక అందే యుండుటకు నిశ్చయించుకొనినది.
రాజును, దిల్హాయును శ్శశానమునకు నడచిరి. వెంటనొక పల్లకీలో నొక స్త్రీని తెచ్చిరి. ఆ స్త్రీ త్రాళ్ళతో బంధింపబడియున్నది. నోటిలో గ్రుడ్డలు క్రుక్కబడి యున్నవి. ఆమె నూటికి నూరుపాళ్ళు శవమువలె నున్నది. రాజు సందేహ నివారణముకై దూరమున మండుచున్న చితినుండి మండుచున్న కట్టెను తెప్పించి యా స్త్రీ శరీరముపై అనేక తావులయందు ముట్టింపజేసెను. ఆమె కదలలేదు. రాజామె మరణించినదిని భావించెను. కాని పలుకరించి చూడవలెనని తలచి దిల్హా నక్కడనుండి వెళ్ళిపొమ్మనెను. దిల్హా కదలలేదు. మిగిలిన పరివారము వెళ్ళిపోయినది. ఆమెపై రాజునకు కూడ నధికారము లేదనరాదు కాని రాజాజ్ఞకన్న నామెకు రాజు క్షేమమే ముఖ్యము. శ్శశానములో రాజు నొంటరిగ విడిచి వెళ్ళరాదన్న దిల్హా నిర్ణయము రాజభక్తి పూర్వకమై సముచితమై యున్నది. ఏమైనను, లోకములు ముంచుకు వచ్చినను ముందు వెనుకలు చూడకుండ నత విధిని తానెవ్వడు చేయునో బాడు సాహసుడు. వాడు తీవ్రవ్రతుడు. దిల్హా ప్రవృత్తి యట్టిది. ఆమె రాజును రక్షించు నెడ తీవ్రవ్రతురాలు.
|