నివేదిత
నివేదిత నవలలోని నివేదిత జ్యోతిశ్శాస్త్రవేత్త్రి. ఆమె తనయునికిని రహస్యముగ నుంచవలసినదిగ తనభర్త నుకోరినది. ఆమెయవనస్త్రీ. శాలవతినగరమహామాత్యుని కుమారుడొక యవనస్త్రీతోడిరహస్య సంబంధము కలిగియున్నాడని, ఆ నగరమున పేరుపడినది. ఆసంబంధమొకరహస్యమనియు వ్యూహమువంటిదనియు చంద్రకళాధరుడు రాజునకుచెప్పెను. ఆరాజు శాలివాహనుడు. శాలివాహనుడు శకకర్తయగుననియు అతనిశకము పదునారువందల సంవత్సరములునిలుచుననియు నివేదిత చంద్రశేఖరునితో చెప్పినది. నివేదిత పండితురాలేగాక పూర్వజన్మజ్ఞానముకలదికూడనై యున్నది. పూర్వజన్మలలో కూడ చంద్రశేఖరుడామెభర్తయట ఈ జన్మము మాత్రము వారిద్దరును పెండ్లియాడలేదు.
నివేదిత శాలివాహనునికి లక్షమంది సైనికులు వ్యయమైనగాని భారతదేశము మొత్తము తనయధీనములోనికిరాదని తెలిపినది. మనకులక్షసైన్యము వ్యయమైనగాని మనకుగెలుపురాదట. అప్పుడుగానితమరు చక్రవర్తులుకారట అని చంద్రకళాధరుడు రాజుతో చెప్పెను.
భారతదేశముననున్న పదునెనమండుగురురాజులను శాలివాహనుని వశులైరి. ఇదియంతయు నివేదిత ముందుచూపుతో ఏపనులు ఎట్లుచేయవలయునో తెలియజేయుటవలన సంతసులభముగజరిగినది. ఏయుద్ధమెట్లుచేయవలయును ఎప్పుడుచేయవలెనన్న విషయములామె చెప్పినటుల రాజుపాటించును.అతనిఆమెవిద్యమీద నంతనమ్మకము. లక్షసైన్యమునాశనముకావలెననియోమెచెప్పుటచే ధీరులైన సైనికులుగాక యమాయకప్రజలు సైన్యమున జేర్చుకొనబడి నాశనముకాబడిరి. ఆమెయట్లుచెప్పకపోయినచో బలవంతమైన సైన్యము నాశనమయియుండెడిది. చనిపోయినవారందరును యవనభావధూషితముకావలసినది. శాలివాహనుడును చంద్రకళాధరుడును నివేదితయున్న సౌధమునకు వెళ్ళిరి. ఆమె తెల్లనియుడుపులుదాల్చికూర్చుండెను. చంద్రకళాధరుడు తాము వృషద్వతీరమునకు పోయియవసులతో యుద్ధయుచేయవచ్చునాయని ప్రశ్నించెను. ఈ ప్రశ్నతో సర్వరాజ్యకార్యములకును సలహా చెప్పుచుండెనని తెలియుచున్నది. లక్ష సైన్యమేలచావలెననగా నామె, శాలివాహనుడు చిన్నతనమున కుమ్మరివారియింట ఆటలో లక్ష సైనికులను తయారుచేసెడివాడనియువానిసాయమున యవనులను నాశనముచేసెదననియుననుచుండెడివాడు. ఆ మట్టి బొమ్మల సైన్యము ఎండలకెండి వానలకుతడిసి కరిగిపోయినది. అనిచెప్పినది. ఆ భ్రాంతిప్రభువులకీరీతిగదీరవలయును. తీరినది. తరువాత విజయమే. కరగిపోయెడి సైన్యమును దీసికొనియినచో విజయమెక్కడిది శాలివాహనుడు యవననాశనముచేయననియు మరలవేయిసంవత్సరములవరకు యవలనులాఛాయు కూడరారనియు నివేదిత తెలిపినది.
పూర్వ జన్మలో నివేదిత పతివ్రత. కాని యామె మానసిక వ్యభిచారము చేసినందున యవనులలో పుట్టినదట గత జన్మలలో కూడనీమె మంత్రికుమారుని భార్యయే. ఆమెతపస్సునకు ఫలితముగ పూర్వజన్మ జ్ఞానముకలిగినది. వర్తమాన భవిష్యజ్ఞానమేగాక దేశముయొక్క స్థితిగతులెట్లుండునో నీమెకు తెలియును. ఒక్కజ్యోతిశ్శాస్త్రమేయైనచో నీమెకింత ప్రాముఖ్యమువచ్చెడిదికాదు. వట్టి పూర్వజన్మ జ్ఞానమేకాదు. అనంతదేశగతమైనవర్తమానజ్ఞానమున్నది. భవిష్యత్కాలజ్ఞానమున్నది అని శాలివాహననుడామెను ప్రస్తుతించెను. ఈ జ్ఞానమునకు కారణము పాతివ్రత్యమేగాక ఏకాగ్రతకూడనని నివేదిత తెల్పినది. ఇట్లుజ్ఞానమార్గము నవలంబించినది కనుకనే శాలివాహనుని సర్వభారతదేశమునకు చక్రవర్తి ని చేయుటకు శకకర్తను చేయుటకు, యవననిర్మూలనమును గావించుటకును, తనతపఃఫలమును ధారపోసి కారకురాలైనది.
నివేదిత తనపుణ్యఫలమును తపఃఫలమును జీవితమును లోకకళ్యాణముకొరకు వేదమతరక్షణకొరకు ధర్మసంస్థాపనకొరకు నైవేద్యమిడినది గావున స్వయంనివేదితయై నివేదితయన్న నామమును సార్థకముచేసికొనినది.
|