నీలమ్మ
చందవోలు రాణి యను నవలలో నీలమ్మయను మహిళను జ్యోతిశ్శాస్త్రవేత్తగ చిత్రించుట జరిగినది. ఆమె పాండత్యమునకు మహా పండితులమనుకొనినవారు తలలు వంచుట జరిగినది.
నీలమ్మ జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడైన మల్లికార్జునభట్ట కుమార్తె ఈమె తండ్రి దగ్గరనే శాస్త్రమును నేర్చుకొనినది. ధూర్జటి యన్నవానిని పెండ్లియాడినది. చదువుకొనినను ధూర్జటి యెందుకును పనికిరాని యాగమ్మ కాకివలె యూరివెంట బడి తిరుగుటయేగాని ప్రయోజకుడుకాదు. నీలమ్మ భర్త కట్టి స్థితి కొద్ది సంవత్సరములేయనియు తరువాత ప్రధానమైన రాజోద్యోగమేదియో చేయుననియు చెప్పు చుండెడిది.
నీలమ్మ పెండ్లి అయి అత్తవారింటికి వచ్చునప్పుడు తన తండ్రి నడిగి రాజు జాతకమును తనవెంట తెచ్చుకొనినది. ఆమె ఎవరైన అడిగినను అడుగకున్నను రాజు జాతకమును పరిశీలించు చుండెడిది.
తెలుంగాధీశుడు సరొజలోచనను ప్రేమించెననియువారి వివాహము జరుగునాయని రాజు స్నేహితుడైన డుంఠిశర్మ నీలమ్మను ప్రశ్నించెను. డుంఠిశర్మ తన యిరువురు మిత్రులు ధూర్జటి, నీలమ్మలు కలసి సరోజలోచన యింటికి వెళ్ళి యామెను కొన్ని ప్రశ్నలడిగిరి. రాజు జాతకమును చూచిన నీలమ్మ సరోజలోచన జాతకము కూడ చూడవలెనన్నది. నష్టజాతకముగ ప్రశ్న వేయించుకొన్నది. అప్పుడా ప్రశ్నలకు నీలమ్మకు రెండు సంగతులాశ్చర్యజనకములుగకాగా నాహేతువులను గూర్చి నిజానిజములను గ్రహించుటకు వారి యింటికి వెళ్ళినది. వారు చెప్పు సమాధానములను బట్టి చందవోలువాణి రాజునకు లభించునో లభింపదో తెలిపెదనన్నది. నీలమ్మ వేసిన ప్రశ్నలకు సరోజలోచన తల్లి అసత్యమును పలుకగా సరోజలోచన వెంటనే తల్లిని ఖండించి యధార్ధము తెలిపినది. అప్పుడ నీలమ్మ సరోజలోచన రాజునకు లభించునని చెప్పినది. ఈమె బ్రతికియున్పప్పుడు రాణియగును. అనగారాణి యన్నచో నీమెయే యింకొకరు కాదన్న ప్రతిష్ఠ కలుగును అనినది. అనగా రాణియొక్క ప్రతిష్ఠ శాశ్వతమైనదని భావము. రాణిని యెవరైన కోరితిరా యనునదియును. బహుమతులిచ్చిరా యన్నదియును, నీలమ్మ తెలిసికొనగోరిన విషయములు.
రాజునకు సరోజలోచనను పెండ్లియాడవలెనన్నచో కొంతకాలమాగవలెనన్నది. అంతవరకు రాజును సరోజలోచనయు నంతఃపురమున కలిసి కొనుచునే యుండిరి. తరువాత కొన్ని నెలలకు రాజు సరోజలోచననను పెండ్లియాడుటకు ముహూర్తము నిర్ణయము చేసినది. ఆ ముహూర్తములో కొన్ని దోషములుండెనని సిద్ధాంతులు అనినప్పుడు దోషములు లేకుండా నుండవలెనన్నచో రాజు మరియైదు సంవత్సరములాగ వలెనన్నది నీలమ్మ.
నీలమ్మ యొక్క జ్యోతిశ్శాస్త్ర వైదుష్యము రాజునకు కోటకు రాబోవు ప్రమాదమును గూర్చి ముందుగనే హెచ్చరించుటలో వెల్లడియైనది. నీలమ్మ యువరాజుతో నిట్లనినది. మనకోట ముట్టడి జరుగును. అది ప్రాగ్ధిశయందాగ్నేయ భాగమందు జరుగును. అని నీలమ్మ చెప్పిన జ్యోతిషమబద్దము కాలేదు కోట ముట్టడించబడినది. యువరాజు తీసికొనిన ముందుజాగ్రత్తల వలన నష్టమెక్కువ లేకున్నను రాజు క్షతగాత్రుడుగాక తప్పలేదు. ఈమెకున్న శాస్త్రపరిజ్ఞానముపై పరిపూర్ణ విశ్వాసము నుంచిన రాజు తాను మరణించు సమయమున యువరాజునకు పట్టాభిషేకము చేయుటకు గూడ నీలమ్మచేత ముహుర్తమును పెట్టెను. ఆ ముహూర్తమున మూర్థాభిషిక్తుడైన రాజు ఎనుబది సంవత్సరములు పాలించునని చెప్పినది. రాజామె మాటలపై నమ్మకముంచి తన కుమారుడు పెక్కు సంవత్సరములు దేశము నేలునని సంతృప్తిగ మరణించెను. చందవోలు రాణికూడ ఎక్కువ సంవత్సరములు బ్రతుకదనియు ముప్పదియైదు సంవత్సరములు మాత్రము జీవించుననియు నామెకీర్తిప్రతిష్టలు మాత్రము శాశ్వతములగు ననియుచెప్పెను.
ఇట్లీనీలమ్మ వాక్కుపై రాజు యొక్క రాజ్యముయొక్కయు భవితవ్య మాధారపడి యుండుటలో నామెయెంత విదుషీమణియో వెల్లడించి నట్లైనది.
నీలమ్మ నివేదిత నవలలోని నివేదితవలె రాజ్యమును తనజ్యోతిష వైదుష్యముచే ముందునకు నడిపినది. విక్రమార్క చక్రవర్తి వలెనే చందవోలు ప్రభువుకూడ శాస్త్రవేత్త్రి నాదరించి ఆమెచెప్పినట్లుగ నడిచినాడు.
|