ఐదవ ప్రకరణము
అమాయకత్వము
అడవిలో జంతువులతోపాటుగ జీవించుమనుజులుకు కొన్ని జంతువుల యలవాట్లు అబ్బుననుట సహజము. శ్మశానమున మనిషిపొడయోరుగని సంజీవకరణి లోని పంచమియొక్క అమాయకత్వము వర్ణింపబడినది. ఇట్లు పులిమ్రుగ్గులోని పద్మరాణి తనామాయకత్వముచే భర్త ప్రేరణమున ఆడుపులియై తుదకు మరణించినది.
ప్రేమ - కృతజ్ఞత
తనకొకవ్యక్తి మీదనున్నది ప్రేమయో కృతజ్ఞతయో తెలిసికొనలేని మరదలు జీవితమును దుఃఖప్రాయముచేసి కొనుటను ఇచట చర్చించుటయైనది.
సోదర ప్రేమ
జేబుదొంగలు లోనివిమల పరీక్ష నవలలోని శ్యామల దంతపు దువ్వెనలోని లలిత లెంతగాఢమైన సోదరప్రేమను గలిగియుండిలో ఇచట చర్చించబడినది. కవలలు లోనిరూపలత చెల్లెలి మీద ప్రేమతో పెక్కు కష్టములననుభవించినది.
పంచమి
పంచమి తండ్రి కుట్టి శ్మశానవాసి, ఇతడు చెప్పులు కుట్టి జీవించు పంచముడు. చిన్నతనముననే తల్లిని కోల్పోయిన పంచమి ,తండ్రి బాధ్యతవహింపనందున గాలికి పెరిగినట్లు పెరిగినది. ఎప్పుడో తోచినప్పుడు అప్పుడప్పుడు పాలుతేనే పట్టుచుండెడివాడు. మిగిలినసమయములో నాకలివేసి యేడ్చియేడ్చినిదురపోయేడిది. ఆమె బ్రతికినదనగానామె యాయుర్ధాయ భాగ్యమేగాని పెంపకముచేతకాదు.
పంచమికి ప్రాకుటవచ్చిన దగ్గరనుండి బయటకు ప్రాకుకొనుచుపోయి చేతికందినది. నోటిలో పెట్టుకొనుట నేర్చుకొని క్షుధార్తిని బావుకొనుచు పక్షివలె తనపోషణమును పసితనమునుండియు తానేచేసికొన్నది. శ్శశానములో వేయబలులను సంగ్రహించితినుట సమాధులపైనుంచిన యాహారమును తినుటయును చేసెడిది. ఈమెకు తండ్రి తప్ప మరొక జీవితెలయదు. పగలంతయు గుడిసెలో నిదురించి రాత్రులందు మాత్రమే ఆహారమును సంపాదించుకొనెడిది. తండ్రి పగలంతయు నెక్కడనోతిగిరి రాత్రులందు మాత్రమే గుడిసెకు చేరుకొనెడివాడు. మాటలు నేర్పడివారులేరు. మానవులతో పరిచయములేక మానవలక్షణములేవియు నబ్బక జంతువువలెనుండెడిది. నడచుట వచ్చినను కుక్కలను నక్కలను జూచివానివలె చేతులు నేలపై నానించి పశువువలె నడచుటకలవాటు పడినది. ఆమె కుక్కయని భావించినది తోడేళ్ళున్నవి. అవసరమును బట్టి పంచమికి రాత్రులందు కనులుకన్పించుచుండెడివి. ఈమె ప్రాకికొనుచు పోవుటనుజూచిన కొందరు కుక్కయనుకొనెడి వారు. శ్మశానములయందు బొమికెలపోవులకై కుక్కలు పంచమితో స్పర్థ వహించలేవు. చతుష్పాత్తువలె ముందరచేతుల మీదనాని నిలబడును. అట్లే నడుచును. ఆమెనెవ్వరు మానిసియనుకొనరు. ఆమెయొక నల్లనిదుప్పటి కప్పుకొనును శుకకాకృతి మరియు సిధ్దించును. ఎండిపోయిన కుక్కముట్టె యొక్క యొముకయుండును. ఆమెదానిని నోటికితగిలించుకొనుట యలవాటు చేసెను. ఈ ఆకారముతో పంచమి చతుష్పాత్తువలె నుండెడిది.
పంచమికి వయస్సువచ్చిన కొలది తండ్రి వృత్తిని స్వీకరించుట మొదలిడినది. శవమును దహించునపుడు చితిలోబంగారు నాణెములను వేయుదురు అవి కరిగి ముద్దయగును. ఆబంగారమును తీసికొనిపోయి తండ్రికిచ్చును. గోతులలోనడుగుననున్న నాణెములను సహితము పెకలించెడిది. గోతుల ప్రక్క నుండి కుక్కలు నక్కలు బొరియలు చేసినట్లు చేసి నాణెములను తెచ్చి తండ్రికిచ్చెడిది. ఇట్లు పంచమి ధనార్జనము చేయుటకూడ నేర్చినది. పంచమి తాను ధరించు దుస్తులను కూడ శవములపైననే యాధారపడి యుండవలెను. శవములమీది గుడ్డలను పంచమి తెచ్చుకొనుచుండెడిది.
పంచమిలో శవములను దహించిన తరువాత నేయస్థికలు ఏశరీర భాగమునకు చెందినవో గ్రహింపగల శక్తి యలవడినది. ఆయస్థికల నామె ప్రోగుచేసి వారి బంధువుల కందజేసి ధనము సంపాదించి తండ్రికిచ్చెడది. ఇట్లు అస్థికల సేకరణచేయుట నేర్చినది. శవదహనమైన తరువాత కొందరితో వారి వెంటపోయివారి యిండ్లను గుర్తుపెట్టుకొని వచ్చి మరల యస్థికలను వారలకందజేసెడిది. ఈ వయస్సు వచ్చుసరికి మనుష్యులను గూర్చి వారి యలవాట్లను గూర్చి పంచమికి తెలిసినను, ఆమెకు వచ్చినవి అయిదారు మాటలు. అవికూడ తమవృత్తికి సంబంధించినవి. మనుజులన్నచో నామెకు భయము తీరలేదు.
శకుంతల పక్షులచే పోషింపబడినట్లుగ పంచమి పిశాచములచే నాదరింపబడుచుండెడిది. తల్లిలేని పంచమికి దయ్యములు సహకరించుచుండెడివి. భూతప్రేత పిశాచములీమెకు మిత్రతుల్యలు. ఒకనాడు పంచమి తండ్రి పంచమికొంతధనము దాచుకొనుచుండెనని యనుమానించి బాధించు చుండగా రాత్రి రెండుఝాములకు వచ్చిన దాచుకొన్నధనము నిచ్చెదనని పంచమి చెప్పనది. ఆమెయిట్లు చెప్పినది. నేను నాధనమును పాతిపెట్టలేదు. రాత్రులందచటికి ఒక స్త్రీ వచ్చును. ఆమె ఆర్ధరాత్రి నా వద్దకు వచ్చును. నాధనము నామెదగ్గర దాచుకొందును అనగానారాత్రి కుట్టిశ్మశానము వెళ్ళి యా స్త్రీ యిచ్చిన నాణెములను కొంగున మూటగట్టుకొని యింటికి వచ్చి మరునాడు విప్పగా మూట మూటగా నున్నను నొక్క నాణెమైనలేదు. నాటినుండియు కుట్టికి పంచమి యనినచో భయము.
ఒకనాడొకమనిషిని ఖండఖండముగా నరకుట పంచమిచూచినది. వారలతోనున్న వ్యక్తితో పంచమికంతకు ముందుపరిచయమున్నది. పంచమి ఆఖండములను హోమము గావించి వారు వెడలిపోగా నాపరిచిత వ్యక్తి దగ్గరకా ఖండాస్థికలను తీసికొనిపోయినది. ఆ వ్యక్తి దిల్హా. దిల్హా పంచమితో రాత్రి ఈమె దగ్గరకొక పురుషుడు వచ్చుననియు. నా పురుషుడొక తావునకు తీసికొని వెళ్ళుననియు అచటి వారికాయస్థికలనిమ్మని చెప్పినది. అట్లేయా పురుషుడు రాగా నారాత్రి పంచమివాని వెంట వెడలినది. ఆ పురుషుడు సంధిమంతుని యొద్దకేగి నాయస్థికలు అతని భార్యవనియు కర్మచేయుమనియు చెప్పెను. సంధిమంతుడు తనదగ్గర ధనములేదు గావుననవి మరియొక స్త్రీకిమ్మనెను. పంచమి యట్లేనాయస్థికలను కల్హారమాలికకిచ్చినది. కల్హారమాలిక ఆస్థికలను తీసికొని పదిదీనారములు నిచ్చినది.
ఇట్లు పంచమి నిత్యకృత్యములన్నియు శ్మశానమున జరుగు కార్యముల తోడనే ముడపడియుండును. అచట మృతులనుద్దేశించి పెట్టిన యాహారమున్న చోతినును. లేనిచోలేదు. దుస్తులు పన్నేండేళ్ళు పిల్ల చనిపోయినచో నామెబంధువులామెను దుస్తులతో ఖననము చేసినచో నామెకు దుస్తులు లేనిచో మాసి చిరిగి, జీర్ణించినవే ధరించును. దుప్పట్లు సహితమట్టివే మృతనష్టములే. శ్మశానములో నేరాత్రి శవదహనముండదో ఖననముండదో ఆ రాత్రి యామె నిదురపోవును ఒక్కొక్కప్పుడామెనిదురించు చుండగా దుప్పటిని తోడెళ్ళు లాగుచుండెడివి. ఇట్టామె జీవితము భయావహమైనప్పటికిని భయమన్న పదార్ధము పంచమిదరికిరాలేదు.
ఆమెకు రోజులు గడుచుచున్నవని తెలియదు. ప్రొద్దుయెక్కుట తెలియదు. పంచమికి కల్హారమాలిక పదిదీనారములనిచ్చినది. ఆసంగతి పంచమికి స్వప్నమువలె తోచినది. అదీనారములను చూచి వానినేమి చేయవలెనో తెలియక కొట్టుమిట్టాడి పోయినది. తండ్రి తానెచటినుండైన దొంగిలించి తెచ్చితినను కొనునేమో ? లేదా తనదగ్గరనుండి యెవరైన హరింతురేమోయని యోచించి మరల కల్హారమాలికకే వానినంద జేయవలెనను కొన్నది. పంచమి కల్హారమాలికభవంతికి వెళ్ళగా నచటి పరిచారికలామెను చూచి నవ్విరి. అంతవరకు పంచమి నవ్వు అననేమో తెలియదు. తానును నవ్వుచు పారిపోయినది పంచమి.
పంచమి చూచుచుండునన్నియు భయంకర దృశ్యములు. భీభత్సములైన సంఘటనములు హృదయ విదారకమైన రోదనలు వినుట, బ్రతుకుటకు కడుపుమంట తీర్చుకొనుటకు ఆహోరాత్రములు శవములకై వెంటాడుట బట్టకట్టుకొనుటకై పాతిపెట్టిన శవములను పెళ్ళగించుట వంటి కృత్యములు చేయు పంచమికి ఆనందకారములుగాని సంతోషకారకములగాని యగు సన్నివేశములులేవు. అందుచేతనే పంచమికి నవ్వుట యన్నకార్యము విచిత్రము. ఆమె అధమ పక్షము నవ్వుచున్న వారినైన చూచి యెరుగదు. శ్మశానమునకువచ్చు జనము ఆత్మీయులను కోల్పోయి పుట్టెడుదుఃఖములో నుండు మహాశోకులు. ఇట్టి పరిసరములలో నుండు పంచమికి నవ్వుయనెడి పదార్ధము వింతయనుట చాలా సమంజసముగను పాత్రోచితముగను నుండి సహజత్వము వన్నెకెక్కినదనిపించును.
కల్హారమాలిక కొరకు పట్నము వచ్చుటతో పంచమికి కొంతలోక జ్ఞానము కలిగినది. దీనారములు లభించుట అందువలన లాభనష్టములనూహించుట మొదలిడినది. ఆదీనారములకన్న నీబొమికలు విలువ యెక్కు వాయనుకొనినది. ఆధనమును కల్హారమాలికను తీసికొమ్మన్నది. లేకున్నచో నాధనము కొరకు తననెవరైన చంపుదురేమోయనినది. తనకు ధనముతో ప్రయోజనము లేదన్నది. పదిరాగి డబ్బులు గాని పాతబట్టలుగాని యిచ్చిన చాలునన్నది. అంతటి యాశలేని హృదయము పంచమి కల్హారమాలికకు ఈశానుడన్న యోగిని చూపినది.
పంమమికున్న జ్ఞానమంతయు శ్మశాన పరిధినిదాటిపోదు. ఆమె జీవన మచ్చట ఆమె పీల్చుయూపిరియచ్చటిది. కుట్టిచెప్పులను చూచితివాయని ఈ శానుడను యోగి పంచమినడిగెను.
పంమమికున్న జ్ఞానమంతయు శ్మశాన పరిధినిదాటిపోదు. ఆమె జీవన మచ్చట ఆమె పీల్చుయూపిరియచ్చటిది. కుట్టిచెప్పులను చూచితివాయని ఈ శానుడను యోగి పంచమినడిగెను. ఒకప్పుడు గొప్పయింటి శవమునుతగులబెట్టుటకెవరో వచ్చినారు. వీరిలోనొకాయన వెలగలచెప్పులు తొడిగి కొన్నాడు. ప్రక్కనున్నాయన యివికుట్టిచెప్పులాయని యడిగినాడు అని చెప్పినది. అట్లుగొప్పధనవంతుడు చనిపోవుటచే కుట్టిచెప్పులననే మోపంచమికి తెలిసినది. పంచమకి తెలిసిన సర్వవిషయములకును మూలాధారప్రదేశము శ్శశాసనము. ఆమెకురాత్రులందు కన్నులు బాగుగా కన్పించును. రాత్రులందు సంచరించు దృష్టిని తీవ్రముగ కేంద్రీకరింపచేయుట వలన నామెకే శక్తికల్గినది.
పంచమి నగరములో నవిసించువారితోడను యోగుల తోడను సంభాషించుటవలన క్రమక్రమముగ లౌకికజ్ఞానము పెరుగసాగినది. తన తండ్రియైన కుట్టి చెప్పులుకుట్టటలో ప్రసిద్ధుడు సంధిమంతుడు మంత్రిగ నున్నరోజులలో కుట్టి యొకచెప్పులజతను కుట్టి సంధిమంతునిక్చిచెను. సంధిమంతుడు మంత్రిత్వమును కోల్పోవుటచే నాచెప్పులను ధరింపలేదు. సంధిమంతుని గురువగు ఈశానుడా చెప్పులను దాచియుంచెను.
|