పంచమి తనతండ్రి కుట్టిని చెప్పులను తనకిమ్మని యడిగినది. సంధిమంతుడు రాజగునని ఈశానుడు చెప్పును. అపుడు పంచమి రాజు యీ చెప్పులు తొడిగికొనునా యనియడుగగా ఈశానుడు పంచమి కోదినది. తన తండ్రి కుట్టిన చెప్పులను తొడుగుకొన్న రాజును చూడవలెనన్న యాశ యమాయకతతో కూడినట్టిదై యున్నది. తండ్రి కుట్టిన చెప్పులు అందమైనవి. రాజును అందముగనే యుండును. అందమైన రాజు తొడుగుకొను అందమైనచెప్పులు తన తండ్రికుట్టినవే. అంతచిన్నపిల్లలో తండ్రియన్న ప్రేమ, అందము చూడవలెనన్న వాంఛ వ్యక్తములగుచున్నవి. మరలనంతలోనే పంచమికి ఆర్థికసూత్రములోని సూక్ష్మజ్ఞానము స్ఫురించినది. తనతండ్రికి మంత్రి వెల చెల్లిపంలేదు. వెలచిల్లింపనప్పుడా చెప్పులు సంధిమంతుని వెట్లగును ? అని ప్రశ్నించినది. నిజముగా నీచెప్పులుమావి. వెలచెల్లించినప్పుడు గదా మంత్రివి అని పంచమి పలుకుటలో నెంత యార్థిక న్యాయమున్నదో నంత తార్కిక శక్తి యున్నది. బీదవాడయ్యెను. గాన డబ్బుయిచ్చియుండనంత తార్కిక శక్తియున్నది. బీదవాడయ్యెను. గాన డబ్బుయిచ్చి యుండడను నూహపంచమిలో పొడమినది. ధర్మవిచక్షణ కూడనిందిమిడియున్నది.
వేయిదీనారముల నిప్పింతు నేమిచేయుదువనగా పంచమి తనకొక్క దీనారము చాలునన్నది. అంతటియల్ప సంతుష్టి. పదిదీనారములు తిరిగి యిచ్చివేసిన పంచమికి వేయిదీనారములెందుకు ? రత్నకంబశులను విలువైన వస్తువును కొలదిగ చూచుటచేత వాని వివరణ జ్ఞానమేర్పడినది.
పంచమి మాటాడినను శ్మశాన పరిభాషయే ప్రయోగించును. ఒక స్త్రీని బొమికల రంగులోనున్నదని యుపమించును. వేయిపడగలు లో గణాచారి కాలస్వరూపము కాగా సంజీవకరణి లోని పంచమి కర్మస్వరూపమనవలెను. భారతభూమి, కర్మభూమి ఒకవ్యక్తి మరణాంతరము అపరకర్మలు చేయుట వైదికాచారము. శరీరము ప్రాణము జీవుడు ఆత్మయును నాల్గునొకటితోనొకటి సంబంధము కలిగియుండి గొలుసువలె నొకదానికొకటి లంకెపడియుండుట హిందూమత సిద్ధాంతములోని కీలకమైన యంశము. ఇట్టి కర్మస్వరూపమును నిరాటకముగ నిరాడంబరముగ సాగించుటలో పంచమి పరికరమైనది. లయాత్మకుడును భూపతియును, శ్మశానవాసియునగు పరమేశ్వరుని కీమెప్రీతిపాత్రురాలగుట గౌణార్థము. శరీరము నుండి జీవుడు వెడలిపోవును. శరీరమునందున్నన్ని దినములు మమకారముతో నుండును. ఆమమకారమే జీవలక్షణము. ఆ మమకారమే జీవునిచేయు చున్నది. జీవుడు శరీరమును వదలిపోలేడు. ఇదిజీవునియవస్థ. అ జీవుని యాశ యస్థికలను బట్టుకొని వేలాడుననుట సమంత్రకముగా గంగలోనిమజ్జనముచేయుట యాచారము. గంగలోనిమజ్జనముచేయుటవలననాజీవునకాశావిముక్తి లభించును. ఇదియే కర్మస్వరూపములోని రహస్యము.
పంచమికి ప్రపంచజ్ఞానము వచ్చినది. ఆవచ్చుట పదునెనిమిది సంవత్సరములు కట్టుబడిననది యొక్క మారుగా కట్లుత్రెంచుకొని యురవడుల పరవడులతో నురకలెత్తుకు వచ్చునదివలె పొంగుకువచ్చినది. దిల్హావంటి విజ్ఞాని పంచమి జ్ఞానమును గూర్చియచ్చెరు వందినది. సాంఖ్యము పంచమికి తనంతగ వశమైనది. ప్రపంచమంతయు లెక్కల మీదనాధారపడి యున్నదని పంచమి దిల్హాకు మహాసాంఖ్యము బోధించినది.
ఒక ప్రక్క మహావిషయములను ముచ్చటించుచునే మరియొకప్రక్క చిన్నపిల్లివలె, బూర్జపత్రగ్రంథములనుజూచి, పట్టుకుంబళులు చూచియు కనులు పెద్దవిచేసికొని చూడకమానదు. ఇట్టిస్థితి మరియు రమణీయము. ఈశానయెగికి తానొకమహా విచిత్రమైన వస్తువును చూపింతునని తీసికొని వెళ్ళి ఖడ్గము, కంబళి వంటి వస్తువులను చూపినది. ఆ వస్తువులామెకు విచిత్రమును పుట్టించునే కానివానికి పుట్టింపలేదు. ఆతడు మిన్న కుండుటచే నిరుత్సాహపడినది. ఇచ్చట పంచమి యొక్క యమాయకత బాల్యచేష్టకనులకు కట్టినట్లున్నది.
కల్హారమాలిక పంచమిని తనకొక దుప్పటియీయమని యడిగినది. పంచమికున్నది శవము మీద దుప్పటియే. శవములమీద కప్పనిదుప్పటి లేదాయని ప్రశ్నింపగా అట్టిగుడ్డలు కూడ నుండునాయని తిరిగి ప్రశ్నించినది. దీనివలన పంచమి యొక్క ప్రపంచజ్ఞానమెంత పరిమితమోయనిగాక, యే వాతావరణము లోనున్నవారి కావాతావరణము సంబంధమైన జ్ఞానమే పట్టుబడుననియు, నిదియే వంశపారంపర్యముగా వచ్చువృత్తిని విషయమనియు వెల్లడియగుచున్నది.
శ్మశానములో పొర్లియొడలంతయు బూతినంటించికొని చతుష్పాత్తు వలెసంచరించు పంచమి కడజాతిబాలయయ్యు, యోగులను ఈశానుడు దిల్హా వంటి వారలతోను సంధిమంతుని రాజును చేయుటలో సమమైన బాధ్యతను వహింపచేసినారు రచయిత.
ఒకరకముగ పంచమికిచ్చినంత ప్రాముఖ్యము సంధిమంతున కీయలేదనవలెను. పసరిక పాత్రవిశ్వనాథ వారిమేధాసంపత్తికి ప్రతీకయని బహుభంగుల పొగడబడినది. నిజమునకు పసరికకన్న కూడ పంచమిపాత్ర మరింత సహజత్వముతో మరింత శోభావహముగ పోషింపబడినది. సస్యలక్ష్మికి ప్రతీక పసరికి భూతనాధుడైన శివునకు ప్రీతికరమైనది పంచమి. అందుచేతనే సర్పభూషణుడై నందున సర్పముచేతను భూతనాధుడయినందువలన పంచభూతములచేతను నామెకాపదరాలేదు.
భగవదాదేశము ప్రకారము సంధిమతి జీవునితోకూడిన సంధిమంతుడు రాజ్య సింహాసన మలంకిరంచు సమయమున ఈశానుడు పంచమిచేత కుట్టి చెప్పులను రాజునకు తొడిగించెను. రచయిత ఈకుట్టిచెప్పులకు నవరత్నఖచితమైనకిరీటమున కిచ్చినంత విలువనిచ్చెను. రాజు పంచమికిపదివేల దీనారములనిచ్చి ఆధనముతో దిల్హా పంచమి కిల్లుకట్టించి పెండ్లిచేయవలెననెను. సంధిమంతుడు రాజై నతవరువాత భవంతికి వచ్చినప్పుడు పంచమి రాజుపాదరక్షలను తీయసాగెను. ఆమెతనకు పదివేలదీనారములు ఇల్లు పెండ్లి ఏమీవద్దు బ్రతికినన్ని నాళ్ళాయుద్యోగమునే చేతునన్నది. సంధిమంతుడు సర్వదేవతలకు ప్రీతిపాత్రుడని గ్రహించినది. ఆమెలోసాంఖ్యశాస్త్రము జ్ఞానమును పండించినది. సంధిమంతుని సేవ పదివేల దీనారముల కన్నపెండ్లి పిల్లలకన్న నెక్కువయని గ్రహించినది. భగవంతుని కిష్టుడైన సంధిమంతుని పాదసేవ అదియును తనకు కులాగతమైన సేవను పంచమి యెన్నుకొనినది. నీపాదకనులసేవయు నీపాదార్చకులతోడి నెయ్యము అని భాగవతమున చెప్పబడినట్లు పంచమిభూతనాథుని సేవకుడైన సంధిమంతుని చేత భూతనాధుని సేవగ భావించినది.
పంచమి విభూతియోగమునకు ప్రతీక ప్రపంచ సాహిత్యసృష్టిలో పంచమిపాత్ర విశిష్టమైనదని చెప్పకతప్పదు. కుట్టిచెప్పులకు భరతుడు రాముని పాదుకల కిచ్చినదంత విలువనిచ్చుటలో రచయితది వస్తుప్రధాన దృష్టియన వలెను. మహాకాయముతోనున్న ఏనుగునకు చిన్న చీమయగుపడినట్లుగ నీమహాకవి దృష్టిలో పడుటచే కుట్టిచెప్పులు సుస్థిరమైనవి. ఎవరు నీవు ? నేను పంచమిని. అనగానెవ్వరు ? శ్మశానములో నుందును. ఇదిపంచమియొక్క యునికి. శ్రీషోడశాక్షరమంత్ర పాలికయగు లలితాదేవికి పర్యాయనామము పంచమి.
|