86
 

ప‌ద్మ‌రాణి

పులిమ్రుగ్గు న‌వ‌ల‌లోని ప‌ద్మ‌రాణి ఆంధ్ర‌రాజ‌వంశ‌పుటాడ‌బ‌డుచు. సుశ‌ర్మ మ‌హారాజుయొద్ద‌కు తండ్రిచే పంప‌బ‌డినది. సుశ‌ర్మ మ‌హారాజు కాముకుడు. ఎంత‌టికాము డ‌న‌గ‌నాతనికీ ప్ర‌పంచ‌మున కామ‌వాంఛాప‌రిపూర్తి త‌ప్ప మ‌రియొక విష‌య‌ముప‌ట్ట‌దు. అత‌డు తాను స‌ర్వ‌సంగ‌ప‌రిత్యాగికాని కామ‌మొక్క‌టే తానువ‌ద‌ల‌న‌లేని  వాంఛ‌య‌నుకొను చుండెడివాడు.

ప‌ద్మ‌రాణిమ‌హాపండితురాలు. ఖ‌డ్గ‌విద్యానిపుణురాలు. రాజకీయ చ‌తురురాలు, మ‌హాధానుష్కురాలు. మ‌హాసౌంద‌ర్య‌వ‌తి. ఈమె తండ్రిగంగాధ‌ర‌శాత‌క‌ర్ణికిని సుశ‌ర్మ యొక్క సేనాధిప‌తియైన శ్రీ‌ముఖ‌శాత‌క‌ర్ణికిని విరోధ‌మున్న‌ది. శ్రీ‌ముఖ‌శాత‌క‌ర్ణియే కాబోలు చ‌క్ర‌వ‌ర్తి య‌న్న‌ప‌లువురి య‌భిప్రాయ‌ముల‌ను విన్న‌గంగాధ‌రుడు శ్రీ‌ముఖుని ప్ర‌తిభ‌ను ఖండింప‌గ‌ల‌శ‌క్తి త‌న‌కుమార్తెకున్న‌ద‌ని భావించి ఆమెనుసుశ‌ర్మ‌వ‌ద్ద‌కు పంపెను. గంగాధ‌రుడు కొంద‌రు బ్రాహ్మ‌ణులు నియోగించి, త‌న‌కుమార్తె సౌంద‌ర్య‌మును రాజు ద‌గ్గ‌ర పొగ‌డున‌ట్లు చేసెను.

ప‌ద్మ‌రాణి య‌త‌నిని జూచుస‌మ‌య‌మున సుశ‌ర్మ యొక్క సౌంద‌ర్య‌దీప్తివ‌లె ప్ర‌కాశించును. వీణావాద‌ము చేయుచుండెను. అతనియందున్న యొకానొక విల‌క్ష‌ణ‌మున‌కామెత‌న్ను తాన‌ర్పించుకొన్న‌ది. అత‌డు ప‌ద్మ‌రాణి సౌంద‌ర్య‌మున రాగ‌మున‌మేళ‌వింప‌జేసి విపంచీ తంత్రుల‌పై స్వ‌ర‌గ‌త‌ము గావించి యామె సౌంద‌ర్య‌ముపై త‌న‌డున్న యారాధ‌న‌ను వీణావాద‌న రూప‌మున ప్ర‌క‌టించెను. ప‌ద్మ‌రాణిస‌ర్వ‌మును మ‌ర‌చియ‌తినికి దాసోహ‌మ‌న్న‌టులైన‌ది. అత‌నిని వ‌శ‌ప‌ర‌చుకొనుట‌కు వ‌చ్చిన ప‌ద్మ‌రాణి తానేయ‌త‌నికి వ‌శ‌మైన‌ది.

సుశ‌ర్మ ప‌ద్మ‌రాణి సౌంద‌ర్య‌మును క‌నుల‌తోగ్రోలుచు, ఆమెకు వీణావాదుమును నేర్పుచు, వివిధ‌భంగుల‌లో నామెసౌంద‌ర్య విన్యాస‌ముల‌ను వీక్షించుచు సౌంద‌ర్యోపాస‌న‌ము చేయు చుండెనుగాని యామెన‌నుభ‌వింప‌లేదు. అతనికి స్త్రీ య‌న్న‌చో నాట‌వ‌స్తువేగాని యీల‌భ్య‌మైన య‌ఖండ‌సౌంద‌ర్య సంప‌ద‌నెట్ల‌నుభ‌వించిన య‌ప‌రిమితానంద‌ము ల‌భించునో య‌న్న యాలోచ‌న‌తో త‌ల‌మున‌క‌లిడుచుండెను. ప‌ద్మ‌రాణి సౌంద‌ర్య‌మ‌త‌నిని పిచ్చివానినిచేసి మ‌రింత‌ప‌శువాంఛ‌ల‌ను రేకెత్తించిన‌ది. ఈ ప‌శువాంఛ య‌త‌నిని నిలువ‌నీయ‌లేదు. ప‌ద్మ‌రాణికూడ ప‌శువుకావలెన‌ని య‌త‌డుభావించెను. మాప‌ద్మరాణి యాడు పులికావ‌ల‌యును. ఆమెయంద‌ప్పుడు నేనుర‌మింప‌వ‌ల‌యును. అపుడు నాకున్న‌యీస్త్రీ మోహ‌మంత‌యు పెడ‌బాయు న‌నుకొందును. ప‌ద్మ‌రాణి పులియైన త‌రువాత న‌త‌డాపులితో ర‌మించి శ‌రీర‌సౌఖ్య‌మున క‌వ‌ధుల‌ను ప‌రిశోధించి, ప‌ట్టుకొన వ‌ల‌యున‌నుకొనెను. మ‌ర‌ల‌త‌నుమ‌గ‌పులికారాదు అత‌డు అత‌డుగ‌నే నుండ‌వ‌ల‌యున‌ట‌. అస‌హ‌జ‌మైన‌దాని యదుంతృప్తి ఎక్కువ‌గ భాసించును అని త‌న‌కుగ‌ల స‌ర్వ‌కాముమ‌ను పులిననుభ‌వించుట‌తో నొక్క మారుగ ఖండించి కామాదుల‌ను జ‌యించి స‌ర్వ‌సంగ ప‌దిత్యాగి కావ‌లెన‌ని భావించినాడు. ఇట్టియ‌స‌హ‌జ‌మైన కోరిక‌గ‌ల విప‌రీత‌బుద్ధిని న‌మ్ముకొనివ‌చ్చిన ప‌ద్మ‌రాణిదుర‌దృష్ట‌ము అన‌వ‌లెను. ఇట్టిదిపొస‌గున‌ది కాదనియు, మ‌ర‌ణ‌ముసంభ‌వింప‌వ‌చ్చున‌నియు నా రాజున‌కు తెలియ‌కపోలేదు. కాని య‌త‌ని కామ‌వ్యాధి మ‌ర‌ణ‌మున‌కైన సిద్ధ‌పెట్టి, వాంఛాపూర్తికై త్వ‌ర‌పెట్టిన‌ది.

నాస్తిక చూడామ‌ణియైన జ‌య‌ద్ర‌ధుడీ న‌వ‌ల‌లో మ‌నిషి పులియ‌గుట యెట్లో క‌నుగొనెను. కొన్ని విధ‌ములైన వ‌ర్ణ‌ముల క‌ల‌యిక‌గ‌ల ధూళుల‌లో మ‌నిషి పులియ‌గుట నీత‌డు క‌నిపెట్టెను. జ‌య‌ద్ర‌ధుని చూచిన వెంట‌నే రాజున‌క‌త‌నిచేత ప‌ద్మ‌రాణిని పులిగ మార్పుచేయించ‌వ‌లెన‌న్న యాశ‌పుట్టిన‌ది. ఇదియొక బ‌ల‌హీన‌త‌. మాన‌సిక‌వ్యాధి మాన‌సిక‌శాస్త్ర‌జ్ఞులిట్టి జంతు సంగ‌మ వాంఛ‌ను బెస్టియాలిటి అందురు. ఇట్టి తుచ్ఛ‌మైన వాంఛ‌ను రాజులో గ‌మ‌నించిన ప‌ద్మరాణి రాజున‌కు వైద్య‌ము చేయించిన‌చో ఫ‌లిత‌ముండెడిది. కాని ఆమె తానొక మ‌హానురాగ ప్ర‌వాహ‌మున‌కొట్టుకొని పోవుచున్న‌ది. రాజేమిచేయ‌మ‌న్న‌చో న‌ది చేసెడి స్థితిలోనున్న‌ది. విష‌ము త్రాగుమ‌ని రాజు చెప్పిన‌చో న‌ట్లు త్రాగెడిది దానివ‌లె ప‌ద్మ‌రాణి యున్న‌ది.

రాజు మ‌న‌సు మ‌ళ్ళించుట‌కు కొంత‌వ‌ర‌కు ప‌ద్మ‌రాణి ప్ర‌య‌త్నించి విఫ‌లురాలైన‌ది. అతాడ‌మెకు నిత్య‌ము సంగీత‌ముతోపాటు వైరాగ్య‌మును కూడ నూరిపోసెను. సుశ‌ర్మ త‌న‌కు వంటప‌ట్ట‌ని వైరాగ్య‌ము నామెకు నూరిపోయుట‌లో కృత‌క్న‌త్యుడ‌య్యెను. ఈవైరాగ్య విష‌య‌మామెకంత‌కు ముందు తెలిసిన‌ది కాక‌పోవుట‌చే క్రొత్త చ‌దువు యొక్క ప్ర‌భావ‌మామెపై నెక్కువ‌గ ప్ర‌స‌రించిన‌ది. రాజును గురుస్థాన‌మున న‌ధిష్టింప‌జేసి త‌న ప్రాణ‌మున‌త‌నికి గురుద‌క్షిణ‌ముగ స‌మ‌ర్పించిన‌ది.
సుశ‌ర్మ‌పై ప‌ద్మ‌రాణికున్న ప‌త్నీత్వ‌ము, ప్రేముడి గౌర‌వ‌మ‌న్నా భావ‌ముల ముప్పేట‌ల త్రాడామెకే గాక న‌త‌నికికూడ నురిత్రాడ‌యిన‌ది. చెలికత్తె చంద్ర‌లేఖ హెచ్చ‌రించిన‌ను రాజుయిష్ట‌మున‌కు వ్య‌తిరేక‌ముగ చేయుట‌కిష్ట‌ప‌డ‌లేదు.

జ‌య‌ద్ర‌ధుని విద్య‌వ‌ల‌న ప‌ద్మ‌రాణి యాడుపులియై సుశ‌ర్మ‌గ‌ది లోనికి వెళ్ళిన‌ది. జ‌య‌ద్ర‌ధుడా పులి రాజును చంపున‌నుకొనెను. గాని సుశ‌ర్మ‌పై ప‌ద్మ‌రాణికిగ‌ల ప్రేమ యెంత‌యున్న‌త‌మో, క్రూర‌జంతువై కూడ రాజునేమిచేయ‌క‌పోవుట‌లో తెలియుచున్న‌ది. ర‌మించెద‌న‌న్న రాజుభార్య‌యాడుపులియై గ్రాండు మ‌న్నంత‌నే గ‌డ‌గ‌డ‌వ‌ణుకుచుస్త‌బ్దుడ‌య్యెను. ప‌ద్మ‌రాణి రాజును చంప‌నందున జ‌య‌ద్ర‌ధుడు తాను పులియైరాజును చంపెను. పులియైన‌వాడు మ‌ర‌ల మనిషి య‌గుట‌కు వేసిన మ్రుగ్గును జ‌య‌ద్ర‌ధుని కొడుకు తుడిచివేసెను. ప‌ద్మ‌రాణియును జ‌య‌ద్రధుడును పులుల రూప‌ముల‌నుండి ఘెర‌సంగ్రామ‌ముచేసి మ‌ర‌ణించిరి.

ప‌ద్మ‌రాణిలోనున్న వైరాగ్య‌మే మాయెనావిధ‌ముగ పులిగ‌మారుట కంగీక‌రింప‌చేసిన‌ది. తాను సుశ‌ర్మ వ‌ద్ద‌కు స్త్రీ వ్యాజ‌మున‌వ‌చ్చి పురుష‌వృత్త‌మును మ‌ర‌చిపోయిది, స్త్రీవృత్త‌మునేయ‌వ‌లంబించిన‌ది. కానితుద‌కు స్త్రీ వృత్త‌ము కూడ‌మ‌ర‌చిలింగాతీత‌మైన‌స్థితికిలోనైన శ్రీ‌ముఖునిపై వైర‌మును పాటించుట‌కు వ‌చ్చుట పురుష‌వృత్తి. త‌న సౌంద‌ర్య‌ముతో రాజునులొంగ‌దీయ‌వ‌లెన‌నుట స్త్రీ వ్యాజ‌ము. వ‌చ్చిన త‌రువాత  రాజు ప్రేమ‌లో బ‌డుటస్త్రీవృత్తి. వారిరువురు జ‌రిపెడి చ‌ర్చ‌ల‌ప‌ర్య‌వ‌సాన‌ముగ నామెలో వైరాగ్య‌ము భాసించిన‌ది. ఇదిలింగాతీత‌వృత్తి. రాజుకైప్రాణ‌ము న‌ర్పించిన ప‌ద్మ‌రాణి ప్ర‌ణ‌య‌మ‌పాత్ర‌దాన‌మైన‌ది.