మరదలు
మాబాబు నవలలో ముఖ్యవ్యక్తుల పేర్లనుగాని యూర్ల పేర్లనుగాని రచయిత పేర్కొనలేదు. పేర్లులేకపోవుటవలన కథా సూత్రమునకెట్టి భంగము కలుగకపోవుటయేగాక కథానాయకుడు వ్యక్తులను బంధుత్వముతో వ్యవహరించుటచేత చదువరికూడ నాకథతో తాదాత్మమునుందుట కవకాశము కలిగినది. కథానాయకుని స్వామియని పేర్కొనుట జరిగినది.
కథానాయిక స్వామికి మరదలు. స్వామి చిన్నతనమున తల్లిదండ్రులను కోల్పోయి కొ పాములివాని చేతిలోపడి మాబాబు అనునొక ధర్మాత్ముఇనికి పెద్దకొడుకై వ్యవహారములు చూచుచుండెను. ఒకసంవత్సరము తరువాత మా బాబు చనిపోగా స్వామి మరల దిక్కులేనివాడై యూళ్ళు తిరుగుచు విధవశమున తనమేనత్తయింటికి చేరుకొనెను. ఈ మేనత్త కుమర్తెయే మరదలు. స్వామికి మరదలన్నచో ప్రేమ, అభిమానుమ, ఆమెకు కూడ స్వామియన్నచో గౌరవము అభిమానము కాని అతనిని పెండ్లియాడుటకు మాత్రము ఆమె మనస్సంగీకరించెడిది కాదు. విధికూడ అందుల కంగీకరించినట్లుగ లేదని స్వామి యనుకొనెడివాడు. తిరుపతి వెళ్ళినప్పుడు పాపనాశనమువద్ద మరదలు కాలుజారిపడిపోబోయినప్పుడు యామెను పట్టుకొని కౌగలించుకొనెను. అచటనే ఉన్న ఒక కోతి స్వామి మీదపడి రక్కబోయినది. మామరదల్ని నేనెప్పుడూ ముట్టుకోలేదు. నామనస్సులో ఎందుకో అది నాకు భార్యఅయ్యే గీతలేదనిపిస్తుంది. ఆపత్తు వేళనే నామెను కౌగలించుకోటం భగవంతుడికిష్టంలేదని పిస్తుంది. ఇట్లు రెండుమూడుమార్లు అడ్డంకులు కలిగినవి. ముహుర్తము పెట్టుకొన వలెనన్నప్పుడుకూడ నాటంకములుకలిగినది. తరువాత మరదలు తల్లి చనిపోవుటతో వారిని పెండ్లి చేసికొనుమని చెప్పెడివారు లేకపోయిరి.
కొంతకాలమునకు స్వామితననాదరించిన మాబాబు పిల్లలు మేనమామ దగ్గర అష్టకష్టములు పడుచుండగా వారిని తనమేనత్త యింటికి తీసికొనివచ్చి వారినికూడ తానేసాకసాగెను. స్వామిని సాకిన మాబాబు పెద్దకొడుకు స్వామికి తమ్ముడు. ఈ మరదలు ఈ తమ్ముడనినచో నభిమానము చూపసాగిదని. తమ్ముడు తెలివిగలవాడు సంపన్న కుటుంబములో పుట్టి ప్రేమ, ఆప్యాయతలకు నోచుకొన్నవాడు. పట్నము వెళ్ళి చదువుసాములతో శరీరమును తీర్చిదిద్దుకొనినవాడు. అందుచేత మరదలు అతని వంక కాకర్షింపబడి యుండవచ్చును. స్వామి మరదలు దృష్టిలో మొదట పడినప్పుడు పరమ వికృతాకృతితోనుండెను. నేను స్నానంచేసి పన్నెండు రోజులయింది. తలంతా మాసివుంది. గుడ్డలు ఎంత మురికిగా వుండాలో అంతమురికిగా వున్నాయి. స్వామిని యీరూపులో చూచిన మరదలికి ఆ రూపమే మదిలో ముద్రింపబడి యుండవచ్చును. మరియు స్వామికి పాములవాడిని ఒక అపప్రథకూడా కలిగినది.
తమ్ముడు ప్రోద్భలమువలన మరదలుకూడ గుంటూరులో చదువుకొందునని పట్టుపట్టి వెళ్ళినది. మరదలు తమ్ముని ప్రేమించుట మొదలు పెట్టినది. కాని అది యాకర్షణయని ఆమెకు మొదట తెలియలేదు. కొద్ది రోజులకు ఆమె తన పొరపాటును గ్రహించుకొన్నది. ఆమెకు స్వామిలోనున్న త్యాగ గుణము తమ్మునిలోనున్న స్వార్థగుణము ద్యోతకమైనవి. తనకుటుంబమును, తమ్ముని కుటుంబమును, చిన్నవాడైన స్వామి బహుసమర్థతతో కాచుచుండగా తమ్ముడు కృతష్నుతనుచూసి స్వామికి భార్యను కావలసిన తనను దగ్గరకు తీసెనని కోపించినది. తాన పెండ్లాడకపోయినచో స్వామి మోడువలెనుండును గాని యింకొక పిల్లను పెండ్లియాడడని మరదలికి తెలిసినది.
మరదలు గర్భవతి యగుటతో స్వామికి ఆమెను తమ్మునికిచ్చి పెండ్లి చేయకతప్పలేదు. మరదలికి తనపై తనకు ఏహ్యతకలగ సాగినది. తమ్మునిపై యసర్యాత పెచ్చు పెరగిపోయిని. స్వామిని చూడలేకపోయినది. బావయ్యా ! నేను తప్పుచేశాను నన్ను క్షమించు. నువ్వు నన్ను పెళ్ళి చేసుకో. అది వరకు జరిగిందేమిటో జరిగింది. నేనూ మరచిపోతాను. నువ్వూమరచిపో అని అన్నది. కాని తమ్ముడు ఆమెకొరకు పిచ్చివాడు కవాచ్చుననియు, వారు ప్రేమించుకొనిరిగావున వారీ పెండ్లి యాడువలెనని భావించిన స్వామితమ్ముడికి మరదలికి పెండ్లిచేసెను. ఆమె పెండ్లి జరిగినంతసేపు అపరాధభావముతో క్రుంగిపోయినది. మంచివానిని కష్ట పెట్టుచుంటినన్న దుగ్థతో పెండ్లిలోని ప్రతిపనిని వ్యతిరేక భావముతో చేసినది. ఆమెకు శరీరము మీద రోతకలిగి తాను చనిపోయెదనని పదేపదే చెప్పగా స్వామి ఓదార్చి తమ్ముని సుఖపెట్టవలసిన బాధ్యతను గుర్తుచేసి వారద్దరుసుఖంసంతోషములతో కాలముగడుపుట యేతనకు కవాలసినది బ్రతిమాలగా మిన్నకున్నది. ఈమె భర్తనుకూడ ద్వేషించు స్థితికి వచ్చినది. నీమూలంగా బావయ్య సుఖం పాడుచేసాను. నువ్వూ నీ మేనమామ నాకు తెలియని రోజుల్లో నన్ను మోసంచేశారు. మా బావయ్య అట్లామెడల్లే తిరుగుతున్నాడు. నేనూమెడల్లే వుంటాను అని మరదలు మొండిపట్టు పట్టి భర్త ను అసహ్యించుకొన సాగినది. ఆమెఇటు స్వామికి అటు తమ్మునికికాక తానూ సౌఖ్యముగ నుండలేక ముగ్గురిజీవితములను దుఃఖభూయిష్టములను చేసినది. ఒకనాడు మరదలికి పిల్లవాడుపుట్టుట తమ్ముడు రైలుక్రిందపడి మరణించెనని వార్త వచ్చుట ఒక్కసారి జరిగినవి.
తమ్ముడు మరదలి యేహ్యతకు జీవితము మీదరోసి యత్మహత్య చేసికొనెనా యనునూహస్వామికికలిగినది. అతడు తెలివిగలవాడు రైలుక్రిందపడునంతటి యమాయకుడుగాడని స్వామి భావించెను. మరదలుచేసిన పొరపాటువలనే అందరిజీవితములు దుఃఖప్రాయములైనవి. మొదట ఆమెకు కృతజ్ఞతకు ప్రేమకుగల బేధము అవగతముకాలేదు. ఆమెకసలు ప్రేమింపగల హృదయములేదనుట రెండవకారణము. ప్రేమింపగల్గినచో సద్గుణసంపన్నుడైన స్వామినే ప్రేమించియుండెడిది. తరువాత తమ్మునితో జరిపిన పొరపాటులోని దోషమామెకు కూడనన్నది. తమ్ముని దూషించుట ఆమె తెలివిలేనితనమును చూపెట్టుచున్నది. పెండ్లి జరిగిన తరువతనయిన ధర్మమును సమర్ధింప లేకపోయినది. స్వామిపైనామెకు ప్రేమలేదు. అతనికి తనఅస్తినంతటిని యిచ్చివేయినన్నది. కాని పెండ్లియాడనని పట్టుపట్టినది. స్వామియామెపై చేయివేసినప్పుడు కెవ్వునకేకపట్టినది. తమ్ముని దగ్గరకు రానిచ్చినది. స్వామిపై ఆమెకున్నది కృతజ్ఞత మాత్రమే. నిన్ను పెళ్ళి చేసుకొక పోవడమంటే నేను పాపంచెయ్యడమే...నీవు మాకుచేసిన ఉపకారానికి నేనునీకపకారమే చేసాను. ఇట్లు మరదలి తెలివితక్కువ వలన తమ్ముడు మరణింప వలసి వచ్చినది. ఆమె కోరుకొన నట్లుగ బామయ్యతో పాటుగ తానుకూడ మ్రోడువలెనుండి పోయినది.
|