89
 

సెల్యూక‌స్ భార‌త‌దేశ చ‌క్ర‌వ‌ర్తి నోడించుట‌కు ప్ర‌య‌త్నించుచుండునే గాని త‌న ప్రాణ‌ములో ప్రాణ‌మైన హెలీనా నాత‌నికి స‌మ‌ర్పించుట‌కు సిధ్ధ‌ముగ‌నుండ‌డ‌ని పినాకికి తెలియును. హెలీనాలో స‌ముద్ర‌గుప్తుని గూర్చిన‌య‌భిప్రాయ‌మిద‌మిత్థ‌మ‌ని తెలిసిన త‌రువాత నామెయొక యూహామూర్తిని భావింప‌సాగిన‌ది. ఆజానుబాహుడు దృఢ‌కాయుడు సుంద‌ర‌వ‌ద‌నార‌విందుడుగ నామె క‌నుల‌కు క‌న్ప‌డ‌సాగెను. తామంత‌కుముందు కాన‌కున్న‌ను త‌మ‌మ‌న‌సుల నంకితము గావించుకొనిన రుక్మిణీ ద‌మ‌యంతుల‌వ‌లె హెలీనా యొక్క పరిస్థితి యిచ‌ట వ‌ర్ణిత‌మైన‌ది.

సెల్యూక‌స్ సైన్య‌ము భార‌త‌భూమిలోకి ప్ర‌వేశించిన‌ది. వారిరాక‌కు సామంతులెట్టి యాటంక‌మును క‌లిగింప‌క‌వారు తిరిగివెళ్ళుట‌కు వీలులేకుండ‌నే చేయుట‌కై వారు ప్ర‌వేశించిన త‌రువాత తిరుగు మార్గ‌మును త‌మ సైన్య‌ముల‌తో నింపి క‌ట్టుదిట్ట‌ముచేసిరి. స‌ముద్ర‌గుప్తుడు స్వ‌య‌ముగ సైనాధిప‌త్య‌ము వ‌హించి యుధ్ద‌మున‌కు వ‌చ్చెను. కొల‌దికాల‌మున‌కే గ్రీకు సైన్య‌మున మూడువంతులు న‌శించిపోయిన‌ది. సెల్యూక‌స్ ఓట‌మినంగీక‌రించి శాంతిరాయ‌బార‌మున‌కై స‌ముద్ర‌గుప్తుని క‌డ‌కేగెను. వారంద‌రు భార‌తీయ‌సైన్య‌మును క‌ధీనులై యుండిరి.

గ్రీకు అంతఃపుర‌ము స‌ముద్ర‌గుప్తుని వ‌శ‌ముకాగా భార‌త‌సైన్య‌మా ద‌ళ‌మును ర‌క్షించుచున్న‌ది. హెలీనా స‌ముద్ర‌గుప్తుని వ‌శ‌ములోనున్న‌ట్లే. ఇచ‌ట హెలీనా యొక్క పాత్ర పోష‌ణములో కొంత‌లోప‌ము జరిగిన‌ద‌న‌వ‌లెను. ఆమె క‌త్తి విద్య నేర్చిన‌ది. ఇంచుమించుగ నీపాలికున్నంత‌శ‌క్తి యామెకు నున్న‌ది. నీపాలి మ‌హాశ‌క్తిమంతుడై, ఖ‌డ్గ‌విద్యావిశారుదుడైన యోన‌స్‌ను నిలువ‌బెట్ట‌గ‌ల నిష్ణాతురాలు. నీపాలిగాని హెలీనాగాని స‌ముద్ర‌గుప్తుని  సైన్య‌మును ఆత్మ‌ర‌క్ష‌ణార్థ‌మైన‌ను ఎదిరింప‌క‌పోవుట‌వ‌ల‌న వారి విద్య నిష్ట్ర‌యెజ‌న‌మైన‌ది. హెలీనా త‌న శౌర్య‌ము జూపి చ‌క్ర‌వర్తి హృద‌య‌మును గెలువ‌ద‌గిన‌య‌వ‌కాశ‌ముండికూడ నుప‌యోగించుకొన‌లేక‌పోయిన‌ది. త‌న తండ్రి సైన్య‌ము తునాతిన‌క‌లుగ న‌రుక‌బ‌డుచుండుట చూచికూడ తండ్రికి సాయ‌మురాదు. ఆమె ఆత్మాభిమాన‌మునిచ‌ట ప్ర‌ద‌ర్శించ‌లేదు. రాజ‌మాల్యాదా యోగ్య‌మైన న‌ర్భంధ‌ముతో గ్రీకులు పాట‌లీపుత్రుమున‌కు జేర్ప‌బ‌డిరి.

ఒక‌నాడు నీపాలిపినాకితోకల‌సి చ‌క్ర‌వర్తి స‌న్నిధాన‌మున‌కువ‌చ్చి హెలీనా సంస్కృతి మాగ‌ధీభాష‌ల‌ను నేర్చిన విధ‌మును తెలియ‌జేయుచుండ‌గా అచ‌ట‌నేయున్న నామెప్రియుడు దుష్యంతుడుమూర్ఛ‌నొందెను. నీపాలిత‌న ప్రియునియీరూప‌మున క‌లిసికొన‌గ‌ల్గిన‌ది. పినాకి హెలీనా రచించిన సంస్కృత శ్లోక‌ముల‌ను చ‌క్ర‌వ‌ర్తికి స‌మ‌ర్పించెను. చ‌క్ర‌వ‌ర్తి యాశ్లోక‌ముల‌ను స్వ‌హ‌స్త‌ముల‌తో గ్ర‌హించి త‌న శ‌య‌న‌మందిర‌మున భ‌ద్ర‌ప‌ర‌చుకొనెను. ఆశ్లోక‌ముల‌లో దోష‌ములున్న‌ప్ప‌టికిని చ‌క్ర‌వ‌ర్తి హృద‌య‌ము క్షీర‌సాగ‌ర‌మైన‌ది. హెలీనాకై చ‌క్ర‌వ‌ర్తి కూడ త‌హ‌త‌హ‌లాడ‌జొచ్చెను. స‌ముద్ర‌గుప్తుని హృద‌య‌ము తెలిసిన హెలీనా మ‌హోత్సాహ‌ప‌డిన‌ది. ఆమెకుటీర‌మంత‌యు భార‌త‌దేశ‌పు క‌ళాఖండ‌ముల‌తో న‌లంకరింప‌బ‌డుట‌గాక ఒకేమ‌హార‌త్న‌మున మ‌ల‌చ‌బ‌నడి చ‌క్ర‌వ‌ర్తి యొక్క జాన‌డెత్తువిగ్ర‌హ‌ము, హెలీనా య‌లంకార‌ములు చేసికొను బ‌ల్ల‌మీద న‌మ‌ర్చ‌బ‌డినది.

సెల్యూక‌స్ ఈ మార్పున‌కు విభ్రాంతుడ‌య్యెను. యోచించిన‌త‌రువాత హెలీనాకు స‌ముద్ర‌గుప్తునిపైగ‌ల య‌భిమాన‌మంత‌యు క‌నుల‌కు గట్టిన‌ట్లైన‌ది. ఆమెపై కోప‌ముకల్గి యామెను శిక్షింప‌నెంచెను. చ‌క్ర‌వ‌ర్తి కిట్లురాయ‌బార‌మంపెను. సెల్యూక‌స్ త‌న‌కుమార్తెను హెలీనాను స‌ముద్ర‌గుప్తున‌కు భార్య‌గానిచ్చును. వివాహ‌మునిచ్చ‌ట‌నేచేయును ఇది రాయ‌బార‌ము. సెల్యూక‌స్ చ‌క్ర‌వ‌ర్తి కీయ‌ద‌ల‌చిన ధ‌న‌ము, అశ్వ‌ముల‌తోబాటు త‌నకుమార్తెను కూడ‌నీయ‌ద‌ల‌చినాడు. మ‌హిళాస్వాతంత్ర్యోద్య‌మ నాయికామ‌ణులీతావును విమ‌ర్శింతురుగాక స్త్రీ తిర్య‌గ్జ‌డ‌ముల‌ను విశ్వ‌నాథ ఒకే స్తంభ‌మున‌కుముడివేసి నందురుగాక ! హెలీనా మ‌న‌సార‌కోరిన‌దిదియే ! స‌ముద్ర‌గుప్తుని హృద‌య‌మాశించిన‌దిదియే ! త‌మ కుమార్తెల నిచ్చుట‌కు తండ్రుల‌కొక సాంఘిక‌మైన నైతిక‌మైన బాధ్య‌త‌యేగాక‌, అధికార‌ము కూడ‌నున్న‌ది. దేశ‌ముల‌నేలురాజు లీయ‌ధికార‌మును వారివారి రాజ‌కీయ ప్ర‌యోజ‌న‌ముల‌కై ఉప‌యోగించుకొనుట కూడ చరిత్ర‌కు క్రొత్త‌కాదు. స్త్రీల‌కై యుద్ధ‌ములు జ‌రుగుట‌యేకాగ స్త్రీల‌చే యుద్ధ‌ములాప‌బ‌డుట‌కూడ కొన్ని చోట‌ల జ‌రుగున‌న్న విష‌య‌ము నిరూపింప‌బ‌డిన‌ది. హెలీనా స‌ముద్ర‌గుప్తుల యంత‌ర్జాతీయ‌మై ప్రేముడి యీవిధ‌ముగ నిబంధింప‌బ‌డిన‌ది. సముద్ర‌గుప్తుడు హెలీనాను తండ్రిచే దాన‌ముచేయ‌బ‌డున‌ట్లుగ‌గాక‌, తాన‌మె నివసించు స్థ‌ల‌మున‌కు ఆమెర‌చించిన‌శ్లోక‌ముల‌ను చేత‌బట్టుకొని వెళ్ళెను. హెలీనా చ‌క్ర‌వ‌ర్తిని గుర్తించి హేలాప‌యోధియైన‌ది. ఆమె హృద‌య‌ధ‌రిత్రిపై స‌హ‌స్ర‌సూర్య‌లొక్క‌సారి యుద‌యించిన‌ట్లుగ‌దోచి పుల‌కిత‌యైన‌ది. హెలీనా స‌ముద్ర‌గుప్తుని వ‌రించి అర‌ణ్య‌ముల‌లు, ప‌ర్వ‌త‌ముల‌ను, న‌దుల‌ను దాటి వ‌చ్చిత‌న ప్ర‌ణ‌య‌మును పండించుకొనిన‌ది.

ఆలెగ్జాండ‌రు హిందూదేశ‌ముపై జ‌రిపిన‌దండ‌యాత్ర విజ‌య‌వంత‌ము కాలేద‌నియు. అత‌డు వ‌చ్చిన‌దిగ్రీకు చ‌రిత్ర‌కారులు చెప్పిన‌ట్లుగ మౌర్యుల కాల‌మున‌గాక‌, గుప్తుల‌కాల‌మున‌నియు విశ్వ‌నాథ హెలీనా న‌వ‌ల‌లో చెప్ప‌బూనిరి. చ‌రిత్ర ప్ర‌కార‌ము సెల్యూక‌స్ నికెట‌ర్ స‌ముద్ర‌గుప్తుని కాల‌మున‌గాక చంద్ర‌గుప్తు మౌర్యుని కాల‌మున భార‌త‌భాగ‌ముపైకి దండెత్తివ‌చ్చిన‌ట్లున్న‌ది. మ‌రియు ఆలెగ్జాండ‌రు మ‌ర‌ణించిన త‌రువాత సెల్యూక‌స్ గ్రీకురాజ్యాధిప‌తియై, ఆలెగ్జాండ‌రు జయించి, వ‌ద‌లివేసిన‌భార‌త భూభాగ‌మును తిరిగివ‌శ మొన‌ర్చుట‌కు వ‌చ్చెన‌ని చరిత్ర‌. సెల్యూక‌స్ ప‌రాజ‌య‌ము పొందుట‌గాక‌, కుమార్తెను చంద్ర‌గుప్తునికిచ్చెను. హెలీనా న‌వ‌ల‌లోని హెలీనా ప్ర‌ణ‌య‌ము వ‌ల‌న జ‌డ‌ప‌దార్ధ‌మువ‌లె తండ్రిచేనివ్వ‌బ‌డ‌క‌, త‌నంత‌తానుగ చ‌క్ర‌వ‌ర్తిని వ‌ల‌చి, ప్రేమ‌సామ్రాజ్య‌మున‌కు ప‌ట్ట‌మ‌హిషియైన‌ది.