సరస్వతి
సరస్వతి సీతారామయ్య, రంగారావుల సోదరి. ఆమెకు సీతారామయ్య అన్నయును, రంగడు తమ్ముడును నయియుండిరి. చిన్నతనములోనే భర్తను కోల్పోయి, చంటిబిడ్డతో అన్నగారి పంచన తలదాచుకొనవలసిన దురవస్థ యీమెకు కలిగినది.
చెలియకట్ట నవలలో నూతనత్వమునుకోరుచు, వ్యవస్థనుకాదన్న స్త్రీ రత్నావళియైన నందులకు వ్యతిరేకముగ సంప్రదాయమును నమ్ముచు, పెద్దలు చెప్పిన బాటను నడుచుచు యథాప్రాప్తమైన దానిని అనుభవించుచు తృప్తికరమైన జీవితమును గడుపుచుండెడిది. సంప్రదాయమందు విశ్వనాథ వారికిగల విశ్వాసమును సరస్వతి నోటపలికించి వారి సంప్రదాయ విశ్వాసమునకీపాత్ర యొక ప్రతీక యనవచ్చును.
సరస్వతి వంటిస్త్రీయే గ్రామమునందైనను కులాచారమునుమన్నించు కుటుంబమున నగపడగలదు. ఈమె సాధారణముగ మన సమాజమున కన్పించు స్త్రీయే. అన్నగారైన సీతారామయ్యవలె సంప్రదాయ పాల మన్న నీమెకు ప్రాణము. విద్యావంతురాలు గాకపోయినను. కుటుంబాచారముల యొక్క లోతుపాతులను, బాగోగులను నర్థము చేసికొనగల్గిన సామర్థ్యము సరస్వతికి గలదు. నాగరికతయనుచు వేయువెర్రి వేషములేమెకు నచ్చవు.
సరస్వతికి కష్టపడి సంసారథము నీడ్చుచున్న యన్న యన్ననధిక ప్రేమ, తమ్మునియప్రాచ్యపు పనులకువిసుగు, తమ్ముని యూహలను సమర్థించుచున్నందున తల్లియన్న కినుకయు కలవు. ఈమె గట్టి మనసు కలది. తన నమ్మకములనెట్టి పరిస్థితులలోను మార్చుకొన నిచ్చగింపదు. ప్రపంచము నర్థము చేసికొనగల్గుశక్తి యామెకున్నది. ఆమెకున్న పరిధిలో నర్థశాస్త్రమును సామ్యవాద సిద్ధాంతమును గూర్చి వాదింపగలదు.
రంగడు పంపిన పుస్తకములను చదివిన రత్నావళఙ కుండి, ద్రౌపది వంటివారు పతివ్రతలు కారని మనసు మార్చుకొన్నది. కాని, సరస్వతిలో నిట్టి మార్పు కలుగదు. ఆమె స్థిరచిత్త ధర్మం చదువుకుంటే తెలుస్తుంది అది తెలియకపోయినా సంప్రదాయములో ఉంటే, ధర్మమే యాచరింపబడుతూ వుంటుంది అని రత్నావళి కడకు భావించినది. సరస్వతి సంప్రదాయములో నుండి ధర్మము తెలిసికొన్న స్త్రీ. కాగా, రత్నావళి చదువుకొని ధర్మమును తెలిసికొనినస్త్రీ. రత్నావళి ఆడవాళ్ళు బానిసల వలె పనులు చేయుట యేమిటి ? అనుకొననది. సరస్వతి శ్రమ విభాగము ఆననేమో తెలిసిన స్త్రీ. భర్త కరణికము చేయవలె. భార్యవంట చేయవలెనన్నది. స్త్రీలు పనులు చేయరాదన్న వారు పనిమనుషుల నేత పెట్టుకొనవలె ? వారు మాత్రము స్త్రీలు కారా యని వాదించినది సరస్వతి. మగావారు మాత్రము కొన్నినాళ్ళు పనులుచేసి వారు మాత్రము మేమే పనులేల చేయవలెనని యాందోళనలను లేవదీయరాయని సరస్వతి భావించినది. సరస్వతిలో నింత బుద్ధి నైశిత్యమున్నది.
ఈమె కామేచ్ఛను గూర్చి రత్నావళికి చెప్పినది. సౌందర్యము శరీర మాత్రాధికాదు. అది కూడ మనస్సునుబట్టియే యుండును. తనకు చిన్న తనముననే భర్త గతించెను. తనకుమాత్రము కామముండదా ? అని ప్రశ్నించినది. నీ భర్తను కాని వానిని నీవపేక్షించినచో నీవు శిక్షాపాత్రురాలవగుదువు అని రత్నావళి మంచి హితవుచెప్పినది. సౌందర్యము శాశ్వతముకాదన్నది. ధనము, అధికారము కూడనట్లేవశింపవచ్చును. కాని ధర్మమునకు మాత్రము నశింపులేదని రత్నావళి భోధించినది. ఇంతటితార్కికజ్ఞానము కలది సరస్వతి. రంగడే రత్నావళిని తప్పుదారుల పట్టించుచుండెనని గ్రహించి యాగ్రహించినది. పనిచేయక విశ్రాంతిగ కూర్చుండిన మనుసుపరిపరివిధముల చరించుననియు అనారోగ్యకరములైన ఆలోచనలు వచ్చుచుండుననియు రత్నావళిని దండించి పనిచేయింపగల్గిన మనస్తత్వజ్ఞురాలు. సీతారామయ్యయన్నచో రత్నావళికిగల నిర్లక్ష్యమునకు చింతించినది. సరస్వతికి అన్నగారు సాక్షాత్తు శ్రీరామునివంటివాడు. అతడన్నచో ప్రేమ, కృతజ్ఞత అతని క్షేమమందు కాంక్షయు సరస్వతికి మిక్కుటముగనున్నది. ఆమెకు అన్నతరువాతనే తల్లి.
సీతారామయ్య కుమారుని మరణమునకు చింతించు సమయమున సరస్వతియే అతనినోదార్చినది. కర్తవ్యబోధచేసినది. రత్నావళినిదండించియు దూషించియు పనులు చేయించియు బోధించియు నొకదారికి తేగల్గినది. కాని విధి వక్రించి సీతారామయ్య రత్నావళియన్న మరింత రాసక్తత నేర్పరచుకొనినాడు. వారిమధ్య పెరుగుచున్న దూరమునుచూచి సరస్వతి విచారించినది. రత్నావళి రంగారావులమదిలో చెలరేగు భావములనామె యాకళింపు చేసికొన్నది.
రత్నావళి రంగనితో సంబంధము పెట్టుకొనుటలో రంగనిదే బాధ్యత యని సరస్వతి భావించి రంగని పక్షవాతము వచ్చినదని తెలిసియునొక్కయాదరుపు పలుకాడ లేదు. తనకుమారుడైన నీలాంబరమును తమ్ముని యింటికి వెళ్ళవద్దనిచెప్పి చదువుకోసము మద్రాసు పంపించినది. కాని నీలాంబరము వెళ్ళకమానలేదు.
ప్రళయమువంటి ఉప్పెననుండి సీతారామయ్య కుటుంబముతో మరియొకయెత్తైన ప్రదేశమునకు బయలుదేరుచుండగా పశ్చాత్తప్త హృదయముతో పతిభిక్షకై రత్నావళి వచ్చును. ఆపరిస్థితిలో రత్నావళి గుర్తుపట్టలేని స్థితిలోనున్నది. సరస్వతి మొదట రత్నావళిని గుర్తుపట్టినను రత్నావళియని చెప్పుటకిష్టపడలేదు. ఇందువలన రత్నావళియన్ననెంత యసహ్యము సరస్వతిలోనున్నదో గ్రహింపవచ్చును. సనాతనమతస్థురాలగు సరస్వతి యిట్లు చేయుటయే సహజముగనున్నది. అట్లుగాక రత్నావళిని పలుకరించి కుశల ప్రశ్నలడుగుట కృతకముగను పాత్రపోషణకొక లోపముగను కన్పించును. అన్నగారినంత క్షోభపెట్టిన స్త్రీని పలుకరించుట సరస్వతి వంటి పట్టుదల గల చేయుపనిగాదు.
సోదర ప్రేమ సిద్ధాంతము
సహోదరులపై యత్యధికమైన ప్రేమను హృదయము నిండుగ కలిగియున్న స్త్రీ పాత్రలు ఈ సిద్ధాంతములో విశ్లేషింపబడినవి. జేబుదొంగలు అను నవలలోని విమల. పరీక్ష నవలలోని శ్యామల, దంతపు దువ్వెనలోని లలితపాత్ర చిత్రీకరణవిధానములను సమగ్రముగ విమర్శింపబడినవి.
సోదర ప్రేమయన్నపుడు సోదరుడేగాక సోదరికూడ కావచ్చును. కవలలు అను నవలలో రూపలతయను వనిత తన కవల చెల్లిలిపైగల ప్రేమతో నామె చేయి నాగడములన్నియు సహించి ఆమె కొరకు తన జీవితమును తనభర్త జీవితమునుకూడ సందిగ్థ పరిస్థితిలో పడునట్లు చేసికొన్నది. రూపలత చెల్లెలికై యవమానముల పాలగుటకు గూడ జంకలేదు. అందువలన రూపలతకు కూడ ఈతావుననే స్థానము కల్పింపబడినది.
|