91
 

విమ‌ల‌

త‌ల్లిదండ్రుల‌నుండి బిడ్డ‌ల‌కు రూప‌రేఖ‌లేగాక గుణ‌ముల‌కూడ ప‌రంప‌ర‌గ‌వ‌చ్చునని తెలియ‌జేయుట‌కు ర‌చింప‌బ‌డిన న‌వ‌ల జేబుదొంగ‌లు. చిల్ల‌ర‌డ‌బ్బుల‌ను త‌మ‌యింటికి వ‌చ్చిన‌వారి జేబుల‌నుండి త‌స్క‌రించుట అవధాని య‌న్న వానికి య‌ల‌వాటైన‌ది. ఇత‌నికి బ‌దులు శిక్ష‌న‌నుభ‌వించుట  అవ‌ధాని సేవ‌కుడైన అప్ప‌నికి త‌ప్ప‌దు. ఇట్లు మ‌ర‌ల అవ‌ధాని కొడుకును అప్ప‌ని కొడుకును త‌మ‌త‌మ తండ్రుల‌లో స్ఫుట‌ముగ‌నున్న నీగుణ‌మును పుణికి పుచ్చుకొందురు.

అవ‌ధాని చెల్లెలైన విమ‌ల తన సోద‌ర ప్రేమ‌తో అన్న‌ను మంచి మార్గ‌మున పెట్టుట‌కు ప్ర‌య‌త్నించిన‌ది. ఆమెలోనున్న సోద‌ర ప్రేమ వ‌య‌సును మించి యుండుట చేత‌నామె ప్రేమ అవధానికి వ‌య‌స్సు వ‌చ్చిన త‌దుప‌రిగ‌నాని య‌ర్థ‌ముకాదు. అవధాని విమ‌ల‌ల మ‌ధ్య నిరూపింప‌బ‌డిన సోద‌ర ప్రేమ ప్ర‌విమ‌ల‌మై సోద‌రుల‌కు మార్గ‌ద‌ర్శ‌క మ‌గుచుండున‌ని చెప్ప‌వ‌లెను.

విమ‌ల‌కు త‌న‌క‌న్న వ‌య‌సులో పెద్ద‌వాడైన సోద‌రుని చూపుల‌తోడ‌నే వియ‌మింప‌గ‌ల‌శ‌క్తి చిన్న‌త‌న‌మునుండియు న‌ల‌వ‌డిన‌విద్య ఈ విద్య‌నామె య‌న్న‌య‌డ‌ల‌గ‌ల ప్రేమ‌చేత సంపాదించుకొనిన‌దే. సోద‌రున‌కుకూడ విమ‌ల య‌న్న‌చో ప్రాణ‌ము. అవ‌ధానికి విమ‌ల‌య‌భిరుచికి విరుద్ధ‌ముగ సంచ‌రింప‌గ‌ల ధైర్య‌ములేదు. ఇందుల‌కు కార‌ణ‌మ‌త‌నిలోనున్న యొక‌య‌వ‌గుణ‌ము. త‌మ‌యింటికివ‌చ్చిన య‌తిధుల జేబుల‌నుండి చిల్ల‌ర డ‌బ్బుల‌ను అప్ప‌డ‌ను ప‌నివాని సాయ‌మున దొంగ‌లించుచుండెడివాడు. విమ‌ల కీవిష‌య‌ము తెలిసి యేవ‌గించుకొన్న‌ది. చిన్న‌వ‌య‌సులో నొక‌దుర్గుణ‌ము నేవ‌గించుకొనుట య‌న్న సుగుణ‌మామెకు స‌హ‌జ‌ముగ‌నున్న‌ది. ఈ సుగుణ‌ముతోడ‌నే అవ‌ధానిని నియ‌మించ‌ప‌గ‌ల‌శ‌క్తి విమ‌ల‌కేర్ప‌డిన‌ది. అవ‌ధానికి కూడ త‌న‌లోనున్న‌ది దుర్గుణ‌మ‌ని తెలియును. కాని తండ్రిపీనాసి య‌గుట‌చే చిన్న చిన్న య‌వ‌స‌ర‌ముల కొర‌కు దొంగ‌లింప‌వ‌ల‌సి వ‌చ్చిన‌ది. విమ‌ల‌కు జ్వ‌ర‌ము వ‌చ్చిన‌పుడు తండ్రి క‌షాయ వైద్య‌ముతో స‌రిపెట్టి స‌రియ‌గు  మందిప్పించ నందున అవ‌ధాని త‌న సంపాద‌న నుండి అయిదురూపాయ‌ల‌ను వైద్యునికిచ్చి విమ‌ల జ్వ‌ర‌మును న‌య‌ముచేయించెను. విమ‌ల త‌న‌య‌న్న కాధ‌న‌మెచ్చ‌టి నుండి వ‌చ్చిన‌దాయ‌ని యాశ్చ‌ర్య‌పోయిన‌ది. అన్నను డ‌బ్బుయెక్క‌డ‌నుండి వ‌చ్చిన‌ద‌ని నిల‌దీసి య‌డిగిన‌ది. ఇంటికి వ‌చ్చిన బంధువుల జేబుల‌నుండి దొంగ‌లించిన‌ద‌ని య‌వ‌ధాని చెప్ప‌గా విమ‌ల మొగ‌ము వివ‌ర్ణ‌మైన‌ది. అన్న‌నుచూచి తూష్ణింభావ‌ముతో మొగ‌ము త్రిప్పుకొనిన‌ది. అవ‌ధాని ప్రాణ‌ము గిల‌గిల‌లాడిన‌ది. ఆమె మాట‌లాడిన‌చో న‌త‌నికి క్ష‌ణ‌ము గ‌డ‌వ‌దు.

విమ‌ల‌కు వ‌య‌సును మించిన తెలివ‌తేట‌లు. ఆమెకారేండ్ల‌ప్ప‌టి నుండియు నొక‌విచిత్ర‌మైన వివేచ‌నాశ‌క్తి క‌న‌బ‌డిన‌ది. ఈనాటికిప్పుడే ప‌రిణిత‌ముఖ‌మై బాల్య‌స‌మాక్రాంత‌మ‌గుట‌లో విస్ప‌ష్ట‌ముగా క్రియారూప‌మున య‌దిశ‌క్తి చాల‌క విద్య‌పూర్తియై య‌నుభ‌వ‌ద‌శ‌నంద‌లి లోటుమాత్ర‌మే మిగిలి ప్ర‌యోగాభియుఖ‌మైయున్న స్నాత‌కుని ప్ర‌త‌భ‌వ‌లెనుండెను. ఆమె తెలివి య‌నుభ‌వ ద‌శ‌గ ప‌య‌నించుట‌కు వ‌య‌సుచాల‌నందున య‌ణ‌గియున్న‌ది. త‌ల్లిదండ్రుల‌న్న‌ను గురించి ప‌ట్టించుకొన‌ర‌ని యామె గ్రహించిన‌ది. విమ‌లకున్న యీవివేచ‌న‌యే అన్నను దుర్గుణ‌మునుండి క్ర‌మ‌క్ర‌మ‌ముగ మార్చుట‌కు తోడ్ప‌డిన‌ది.

విమ‌ల య‌వ‌ధాని ద‌గ్గ‌ర‌నున్న ధ‌న‌మునుచూచిన త‌రువాత ప‌దిరోజుల‌త‌నితో మాట‌లాడ‌లేదు. అవధానికి చెల్లెల‌న్న నెంత‌యోప్రేమ‌. త‌ల్లి తండ్రుల యోదాసీన్య‌ము వ‌ల‌న‌త‌ని య‌నురాగ‌మంత‌యు విమ‌ల‌తోడ‌నే ముడిప‌డియున్న‌ది. ఈ కార‌ణ‌ముచేత విమ‌ల త‌న‌తోప‌లుకకుండుట య‌త‌నికి మ‌హాక‌ష్టముగా నుండెను. విమ‌ల త‌న‌కున్న వివేక‌ముతో గృహాధికార‌మును వ‌శ‌ము చేసిఒక‌న‌గ‌ల్గిన‌ది. స‌ర్వ‌విష‌య‌ములు నామె మాట‌పైనే న‌డుచుచున్న‌ది.

విమ‌లకు కోప‌మువ‌చ్చున‌ని తెలిసిన‌చో అవ‌ధాని యారోజు ప‌స్తుండును. వారితండ్రి సోమ‌సుంద‌ర‌ము చ‌నిపోవుచు ఇరువ‌దివేల రూప్య‌ములు విమ‌ల‌కు చెంద‌వ‌లెన‌నియు త‌న స్నేహితుడైన రామారావు గురుమూర్తి య‌నువార‌ల య‌నుమ‌తితో విమ‌ల వివాహ‌ము వెంట‌నే జ‌రుప‌బ‌డ‌వ‌లెన‌నియు విల్లు వ్రాసెను. విమ‌ల గురుమూర్తి తెచ్చిన సంబంధ‌మును మాట్లాడ‌కుండ చేసికొన్న‌ది. గురుమూర్తి గారికున్న మ‌నోగ్రాహ‌శ‌క్తిపై నామెకెంత‌యో న‌మ్మిక‌యున్న‌ది. విమ‌ల‌కు కాబోవుభ‌ర్త‌యైన మోహ‌న‌రావు యొక్క గుణ‌ముల‌ను గురుమూర్తి గ్ర‌హింప‌గ‌ల‌డ‌ని విశ్వ‌సించిన‌ది. ఆమె భావించిన‌ట్లె మోహ‌న‌రావు యోగ్యుడు. ఆమె జీవిత‌మున లోట‌న్న‌దిలేకుండ చూచుకొనుచుండెను. గృహ‌సంబంధ‌మై బాధ‌లేవియు విమ‌ల‌కులేవు.

కాగాతాను సోద‌ర ప్రేమ‌తో పాలింప‌వ‌ల‌సిన‌ది అవ‌ధానిని. అత‌డు త‌న‌పై నాధార‌ప‌డియున్నాడు. అత‌నికి విమ‌ల యొక‌దేవ‌త తానొక‌యారాధ‌కుడు. త‌న‌య‌దృష్ట‌మామె ప్ర‌స‌న్న‌తాధీన‌ము. ఆమె భ్రూభంగ‌రేఖ త‌వ‌కు శిక్షావ‌థ‌ము. గాలిగా బెరిగిన‌యుచ్ఛృంఛ‌ల‌త‌కు నామెక‌ట్టుకొయ్య. అవ‌ధానికి విమ‌ల‌య‌న్న నెంత ప్రేమ‌యో విమ‌ల‌క‌వ‌ధాని య‌న్నంత ప్రేమ‌యే.

అవ‌ధానికీయారాధ‌న విమ‌ల‌కున్న సుగుణ‌ము లాధార‌ముగా న‌ల్లుకొన్న‌ట్టిది. కేవ‌ల‌ము ర‌క్త సంబంధ‌ముచేత జ‌నించిన‌ట్టిదికాదు. ఆమెకున్న సంయ‌మ‌న‌ము దుర్గుణ‌ముల‌యెడ‌నున్న యేహ్యభావ‌ము. అన్న‌గారిదోష‌మును చూచి క‌నుచూపు మాత్ర‌మున న‌ద్ద‌రిని విలుప‌గ‌ల య‌ధికార‌మున‌న వ‌చ్చును. ఇట్టి ల‌క్ష‌ణ‌ము మ‌నుజుల‌లో స‌హ‌జ‌మ‌న‌వ‌చ్చును. ఒక దోష‌మును దోష‌ముగ గ్ర‌హించిన‌ను ఆదోష‌మున‌నేక కార‌ణ‌ముల‌చేత చేయ‌కుండ‌నుండ‌లేరు. అట్టి ప‌రిస్థితిలో య‌వ‌ధానియుండెను. అది దోష‌మ‌ని అవ‌ధానికి తెలియును గ‌నుక విమ‌ల మాన్పుట‌కు ప్ర‌య‌త్న‌ముచేసి అత‌నితో మాటాడ‌క బ‌ట్టువేసి అప్ప‌టికి మాన‌క‌పోయిన‌ను త‌రువాత‌నైన దోష‌ర‌హిత‌ముగ నుండుట‌కు దోహ‌ద‌ము చేసిన‌ది కనుక విమ‌ల య‌న్న‌న‌త‌నికొక గుర‌భావ‌ము మ‌ర్యాద భావ‌ము నేర్ప‌డిన‌ది. ఆమెకు క‌ష్ట‌ముక‌ల్గించ‌రాదు కోప‌ము తెప్పించ‌రాదు అన్న నిర్ణ‌య‌మున‌త‌డు చేసికొనెను. తండ్రియందున త‌న‌యందున‌నున్న దోష‌ముల‌క‌నుక‌ప్పిపుచ్చి యింటికి దుష్కీర్తి రాకుండ కాపాడిన‌ది. విమ‌ల య‌ని అవ‌ధాని చెల్లెల‌ను గౌర‌వించును.

త‌ల్లిదండ్రులు మ‌ర‌ణించిన త‌దుప‌రి అవధాని విదేశ‌ములు వెళ్ళి విద్యాధికుడై వ‌చ్చెను. విమ‌ల‌కు భార‌తీయ క‌ర్మ‌సిద్ధాంత‌ములందు న‌మ్మ‌క‌ము గ‌ల‌దు. అన్నచేత త‌ల్లి దండ్రుల‌కు మూడుసంవ‌త్స‌ర‌ముల త‌రువాత సాంవ‌త్స‌రిక‌ములు పెట్టించిన‌ది. అవధాని అట్టివానిపై త‌న‌కు న‌మ్మ‌క‌ము లేదు పెట్ట‌మ‌న్న‌చో పెట్టెద‌ని విమ‌ల యంగీకార‌మున‌కు ప్రాముఖ్య‌మిచ్చినాడు. విమ‌ల‌కున్న ఓర్పు, శాంత‌స్వ‌భావ‌ము, ప్రాప్త‌మై న‌దానిని య‌థాత‌థ‌ముగ స్వీకరించుగుణ‌ము అవ‌ధానిని ముచ్చ‌ట‌గొలిపిన‌ది.చెల్లిలితో నిట్ల‌నినాడు. నీవుప్ర‌స‌న్నురాల‌వై న‌న్ను చూచి సోద‌ర ప్రేమ‌తోన వ్వితివా నాక‌దియొక‌ర‌క్ష నాయందు కోప‌భావ‌ముతో నీవు మొగ‌ము దిప్పుకొంటివా నాక‌దియొక‌శిక్ష అనెను. ఇట్ల‌నుట‌లో విమ‌ల‌కు ధైర్య‌మువ‌చ్చినది. అన్న‌గారి యానాచార‌ము ల‌ను కొన్నింటిని మార్చిన‌ది. య‌జ్ఞోప‌వీత‌ము, ధోవ‌తుల‌ను ధ‌రింప‌జేసిన‌ది. విమ‌ల‌లోనున్న య‌ధికార‌శ‌క్తి యాజ్ఞాపింప‌గ‌ల‌శ‌క్తి చెప్పిన‌ట్లువిని ప్ర‌వ‌ర్తించు స్వ‌భావ‌ముగ‌ల సోద‌రుని రాక‌తోబ‌హిర్గ‌త‌మైన‌ది.

అవధాని సుఖ‌సంతోష‌ములు చూచుబాధ్య‌త‌కూడ విమ‌ల త‌నపైవేసికొన్న‌ది. త‌న‌మేమ‌మాయ‌కుమార్తెయైన సీత అవ‌ధానికి త‌గిన‌యిల్లాలుగ విమ‌ల భావించిన‌ది. త‌ల్లితండ్రులు గ‌తింప‌గా పెద‌తండ్రియొద్ద బ్ర‌తును దుర్భర‌ముగ నీడ్చుచున్న‌ది. ఇట్టి సీత‌పై జాలి చూపుట విమ‌ల సుగుణ‌ముల‌కు త‌గిన‌ట్లుగ నున్న‌డి. సీత‌ను త‌న‌ద‌గ్గ‌ర‌కు పంపించ‌మ‌ని పెద్ద‌మేన‌మామ‌కు లేఖ వ్రాసిన‌ది. ఆ వ్రాయుట‌లో సీత‌నొక్క‌దానినే పంప‌నున్న‌చో భేధాభిప్రాయ‌ములు వ‌చ్చునుగ‌నుక మేన‌మామ కుమార్తెయైన శార‌ద‌ను కూడ సీత‌తోక‌లిపి పంపిన‌చో కొన్ని నాళ్ళు త‌న‌తో గ‌డుపుదుర‌ని వ్రాసిన‌ది. ఇట్లు వ్రాయుట సీత యొక్క గుణ‌గ‌ణ‌ముల‌ను అవ‌గ‌త‌ము చేసికొనుట‌కే ఆమె త‌న య‌న్న‌గారికి త‌గిన‌దోకాదో వంశ‌ప్ర‌తిష్ట‌ను నిలుప‌గ‌ల శ‌క్తి యున్న‌దో లేదోతెలియ‌గోరిన‌ది.

విమ‌ల జాబువ్రాయుస‌మ‌య‌మున‌కు అవ‌ధానికి సీత‌ను చూచుట ఆమెను త‌న‌దానినిగ చేసికొన‌వ‌లెన‌ని నిర్ణ‌యించుకొనుట కూడ జ‌రిగిన‌ది. విమ‌ల సీత‌కు బంగారుగొలుపు గాజులు చేయించియిచ్చిన‌ది. సీత‌తో ఛాయా చిత్ర‌ములు తీయించుకొనుట‌యేగాక సీత‌కు ప్ర‌త్యేక‌ముగ నొక‌టి తీయించిన‌ది. ఆ చిత్ర‌మును సీత అవధానికి పంపిన‌ది. చిత్ర‌ముల‌లోపాటు హృద‌య‌ముకూడ న‌వ‌ధాని ద‌రిజేరిన‌ది. ఇట్లు సీత‌ను అన్న కుత‌గిన‌దానినిగ నిర్ణ‌యించిన త‌రువాత సీత‌చ‌దువున క‌య్యెడి ధ‌న‌మును విమ‌ల తానుభ‌రింప‌మొద‌లిడిన‌ది.

అవ‌ధాని పూదండ‌లు మార్చుకొని సీత‌పై న‌ధికార‌మును పొందిన త‌రువాత సీత గ‌ర్భిణియైన‌ది. ఇట్లువారు గాంధ‌ర్వ‌వివాహ‌ము చేసికొనుట పెద్ద‌ల‌కు తెలియ‌క సీత‌న హింస‌లు పెట్ట‌సాగిరి. ఆమె ప‌రిస్థితి దైన్య‌ముగ మార‌గా అవధాని సీత‌ను విమ ద‌గ్గ‌ర‌కు పంపెను. విమ‌ల పూర్వాచార‌ప‌రాయ‌ణ దోష‌ముల‌న‌స‌హ్యించు కొనెడిది. వివాహాత్పూర్వ‌మే గ‌ర్భ‌మును ధ‌రించిన సీత‌ని నిరాద‌రించుసేమోయ‌ను అవ‌ధానికి భ‌య‌మ‌వ‌ధానికి క‌లిగిన‌ది. అయిన‌ను విమ‌ల క‌రుణార్ద్ర హృద‌యురాలు కోప‌మువ‌చ్చిన సోద‌రునిపై వ‌చ్చునుగాని సాటి స్త్రీయైన సీత‌ను ద‌య‌గ జుచున‌ని భావించెను. విమ‌ల‌పైనంత‌టి యున్న‌త‌భావ‌ము అవ‌ధాని కూర‌క క‌లుగ‌లేదు. ఆమె యాభావ‌మున కర్హ ప్రాయురాలు.

అవ‌ధాని దోష‌మిచ్చ‌ట‌కూడ విమ‌ల కాపాడిన‌ది. అత‌డు భార‌త‌దేశ‌మున‌కు రాక‌పూర్వ‌ము విదేశ‌ముల‌లో నొక‌పాశ్చాత్య‌వ‌నిత‌ను పెండ్లియాడి వ‌చ్చెను. ఆమె  భార‌త‌దేశ‌మున‌కు వ‌చ్చి అవ‌ధానిని  ఇబ్బందుపాలు జేయ‌ద‌ల‌చిన‌ది. అప్పుడు కొన్ని కార‌ణ‌ముల‌చేత అవ‌ధానిచే శిక్షింప‌బ‌డి చెర‌సాల యందుంచ‌బ‌డెను. ఒక‌నాడు అవ‌ధాని అప్పుడున్న చెర‌సాల‌కు వెళ్ళి తాను కూడ న‌చ‌ట కొంత‌సేవుండి త‌న‌కుతానే శిక్ష‌విధించుకొటిన‌ని భావించెను. ఇట్లుచేసితిన‌ని అవ‌ధాని విమ‌ల‌కు చెప్ప‌గా విమ‌ల నివ్వెర‌బోయిన‌ది. దుర్గుణ‌మునింత నిర్భ‌య‌ముగా బ‌హిర్గ‌త‌ము గావించుట‌కు గూడ సంస్కార‌ము కావ‌లెన‌నిత‌ల‌చిన‌ది. త‌న‌సోద‌రునిలోనున్న యీగుణ‌మును మెచ్చి విమ‌ల నీక‌న్న నీతిమ‌తిన‌ని శాంతిమ‌తిన‌నుకొని హీన‌మ‌తినైతిని. నీలోనింత‌టి సంస్కార‌మెట్లు క‌లిగిన‌ది...యీ విచిత్ర సంస్కార‌ము నీకెచ్చ‌ట నుండి వ‌చ్చిన‌ది అని య‌న్న‌దోష‌ముల‌న్నిటిని స‌హించుట‌యేగాక ప్ర‌శంసించిన‌ది. విమ‌ల‌క‌వ‌ధానిలోనున్న యీసుగుణ‌ము దుర్గుణ‌మునెన్న‌టికైన య‌ధిగ‌మింప‌గ‌ల‌ద‌ని ధైర్య‌ము వ‌చ్చినిది. త‌రువాత నిరువురి జీవిత‌ములు సుఖ‌ముగ గ‌డిచిపోవుచున్న‌ది. ఇట్లు విమ‌ల సోద‌రుని జీవిత‌మును పాలించి ప్రేమ‌తోన‌త‌నిని స‌న్మార్గ‌వ‌ర్త‌మ‌ని చేసిన‌ది. నాశ‌న‌ములేని చెల్లెల‌ను నీకు అని విమ‌ల య‌వ‌ధానితో ప‌ల్కిన‌ది. అవ‌ధానియు విమ‌యునొకే కొమ్మ‌ను పుట్టిన రెండుపూవులు. వీర‌య‌న్యోన్య‌ప్రేమ శాశ్వ‌త‌మైన‌దని విమ‌ల సూచించుచున్న‌ది. విమ‌ల‌ది స్వ‌చ్ఛ‌మైన ప్ర‌విమ‌ల హృద‌య‌ము దోష‌ముల‌ను కూడ‌త‌న‌స‌ద్గుణ‌ముల‌చేత హ‌రించుట‌లో మ‌నిన‌మును ప‌డియ గ‌ట్ట‌యిందుప‌గింజ‌న గింజ‌వంటిది.

సార్థ‌క‌నామ‌ధేయ విమ‌ల‌. పాశ్చాత్య‌వ‌నిత‌ను ధ‌న‌మిచ్చి వ‌ద‌లించుకొనిన త‌రువాత అవ‌ధాని  సీత‌తో సుఖ‌ముల‌నుభ‌వించుచుండెను. అవ‌ధాని కొడుకుకూడ అవ‌ధానివ‌లెనే చిన్న‌దోషమును చేయుట‌యేకా తండ్రివ‌లె నా దోష‌మున‌కు శిక్ష‌కూడ‌తానే విధించుకొని చేయుట‌యేకాక తండ్రివ‌లె నాదోష‌మున‌కు శిక్ష‌కూడ‌తానే విధించుకొని య‌నుభ‌వంచెను. అప్పనికొడుకు అవ‌ధాని కొడుకు యొక్క దోష‌భాగ‌మును తానుభ‌ద‌రింతున‌నును. ఇట్లీ గుణ‌ములు వంశ‌పారంప‌ర్య‌ముగా వ‌చ్చున‌ని జేబుదొంగ‌లు న‌వ‌ల‌లో నిరూపింప‌బ‌డిన‌ది. నాశ‌న‌ములేని చెల్లెల‌ను నీకు అని విమ‌ల య‌నుట‌లో సోద‌రీ ప్రేమ‌లోని గాఢ‌త్వ‌ము వెల్ల‌డియ‌గుచున్న‌ది.