13
 

ఎంత చ‌దివినా ....?

స్వ‌ప్న‌కి ఎమ్‌.ఎలో సీటురాలేదు. చాలా తెలివైన అమ్మాయి. క‌ష్ట‌ప‌డి చ‌దివింది. ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ బాగారాశాననే అనుకుంది. ఇలాంటి అమ్మాయికి సీటు రాక‌పోవ‌డ‌మేమిటి అని మేమంతా బాధ‌ప‌డ‌టంతోపాటు ఆశ్చ‌ర్య‌పోయాం కూడా !  అప్ప‌ట్నించీ స్వ‌ప్న చాలా నిరుత్సాహంగా దిగాలుపడి వుంటోంది. ఆ అమ్మాయికి ధైర్యం చెప్ప‌డం కోసం బెంగుళూర్ నుంచి వాళ్ళ అత్త‌య్య‌ను పిలిపించారుట !  ఆమె బెంగుళూర్‌లో సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్యుటీ డైర‌క్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ఆమె స్వ‌ప్న‌కు ధైర్యం చెప్పేట‌ప్పుడు నేను కూడా అక్క‌డే ఉన్నాను. ఇంత చ‌దువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ ఇలా మాట్లాడుతుందేమిటా అని విస్తుపోయాను. ఏమేప‌ప్పీ ఇప్పుడే చ‌దివేసి, ఉద్యోగం చేసెయ్యాల‌నే ఆత్రం దేనికే, హాయిగా ఈ సంవ‌త్స‌ర‌మంతా రెస్టు తీసుకో. ఈ ఏడు కాక‌పోతే వచ్చేఏడు సీటొస్తుంది. నువ్వేమ‌న్నా తెలివిత‌క్కువ దద్ద‌మ్మ‌వా ?  సీటుకాక‌పోతే ప్ర‌పంచ‌మంతా తల్ల‌కిందులౌతున్న‌ట్లుగా ఆ ఏడు పేమిటి ?  ఆ వాల‌క‌మేమిటి ?  అని మంద‌లించింది.

అయినా వ‌దినా దీని చేత ఉద్యోగం చేయించ‌క‌పోతే మ‌న‌కు గ‌డ‌వ‌దా !  నువ్వు నేనూ చేస్తున్నాం చాల‌దూ ఎన్ని క‌ష్టాలు అనుభ‌విస్తున్నామో ! దీన్ని కూడా అప్పుడే ఆ న‌ర‌కంలో తోసెయ్యాల‌నే మీరిద్ద‌రూ క‌ల్సి దానికి బాగా నూరిసోసిన‌ట్లున్నారు. అందుకే అంత ఇదైపోతోంది అంది. స్వ‌ప్న కూడా వాళ్ళ అత్త‌య్య మాట‌ల‌కు తెల్ల‌బోయింది. అదేమిట‌త్త‌య్య నువ్వే ఇలా మాట్లాడుతున్నావ్ ఏమీ చ‌దువుకోని అప్ప‌ల‌మ్మ‌లా, ఉద్యోగం చెయ్య‌డం అంద‌రికీ త‌ప్ప‌నిస‌రి క‌దా !  అంది. నీకు తెలీదే అమ్మ‌డూ ఇప్ప‌డు మ‌ళ్ళీ కొంత‌మంది స్త్రీలు ఎందుకొచ్చిన ఉద్యోగాలురా భ‌గ‌వంతుడా అని ఒకటే ఇద‌యిపోతున్నారు. అందులో బాధ్య‌తాయుత‌మైన ఉద్యోగాలు చెయ్య‌డానికి సంశ‌యిస్తున్నారు కూడా. ఎందుక‌నుకున్నావ్ ?   శ‌క్తి లేక కాదు తెలివిలేకకాదు. అస‌క్తిలేక కాదు. ఉత్సాహంలేక కాదు. కానీ వాళ్ళ‌కి ఓవ‌ర్ బ‌ర్డెన్‌ని భ‌రించే ఓర్పులేక ! ఇంకా ఎందుకంటావా మ‌గ‌వాళ్ళ‌కంటే మ‌హిళ‌ల‌కి శారీర‌కంగా బ‌లం త‌క్కువని ఒప్పుకోక త‌ప్ప‌దు క‌దా !  నెల పిల్లాడు తాగిన‌న్ని పాలు అర్నెల్లు ఆడ‌పిల్ల తాగ‌లేదు. ఆడ‌బ్రెయిను ఆడ లీవ‌రు అని పేర‌న‌క‌పోయినా మ‌గ లివ‌రూ మ‌గ‌బ్రెయిన్ క‌న్నా బ‌రువులోను ప‌నిచేసే విధానంలోను తేడాలున్నాయి. క‌దా. ఇంకోటి చూడు నాల్గుగంట‌ల పాటు మ‌గ‌వాళ్ళనీ ఆడ‌వాళ్ళ‌నీ వ‌ర్క్ చేయిస్తే స్త్రీ ఇట్టే నీర‌సించిపోతుంది. అల‌సిపోతుంది. ఇది శారీర‌క కార‌ణం అయితే మాన‌సికంగా మ‌రింకొన్ని కార‌ణాలున్నాయి. అమ్మాయి ఆఫీసు కొచ్చింద‌నుకో ఇంటిదగ్గ‌ర ఆయామీద వ‌ద‌లి వ‌చ్చిన బిడ్డ‌మీదే ఆమె మ‌న‌స్సు వుంటుంది. పురుషుడు ఇంతి ప‌రిస్థితుల్ని మ‌ర‌చిపోయినంత తేలిగ్గా గృహిణి మ‌ర్చిపోదు. ఆమె ఎంత బాధ్య‌త‌గ‌ల ఉద్యోగాన్ని నిర్వ‌హిండ‌నీ ఎంత‌మంది నౌక‌ర్లు చాక‌ర్లు ఉండనీ. ఇంటిబాధ్య‌త  త‌నే నిర్వ‌హించాలి అనే అభిలాష‌తో అన్ని బాధ్య‌త‌ల్నీ స్వ‌యంగా భుజాల‌మీద కెక్కించుకుంటుంది. నిజానికి ఈ ప‌నులు మ‌నం చేయ‌గ‌ల్గినంత నేర్పుగా మగాళ్ళు చేయ‌లేరు. కూర‌గాయ‌ల‌మ్మి ద‌ర్గ‌ర్నించి, ప‌నిమ‌నిషి ద‌ర్గ‌ర్నించీ ఆఫీసులో ఆయాదాకా అంద‌రూ మ‌గ‌ళ్ళ‌న్ని ఇట్టే బోల్తా కొట్టించేస్తారు. కుటుంబ శ్రేయ‌స్సుకీ ఉన్న‌తికీ అంకితం చేసుకునే మ‌న‌స్సు హృద‌యం పురుషుడికి ఉండ‌దు. అన‌కూడ‌దు కాని స్త్రీలా అదే లోకంగా భావిస్తాడ‌నలేం కుంటుంబం కోసం ఆడ‌ది ఎన్ని త్యాగాల‌న్నా సంతోషంతో చేస్తుంది. ఈ ల‌క్ష‌ణం జ‌న్మ‌తః వచ్చిందే. సాకుమార్యంతో పాటు సౌజ‌న్యంకూడా ప‌డ‌తికి పుడుతూనే వెంట‌తెచ్చుకునే ఆభ‌రణాలే. కొంత‌మంది అటూ ఇటూ వుండ‌ర‌ని కాదు. స‌ర్వ‌స‌మాన్యంగా ఉండే ల‌క్ష‌ణాలే ఇవి. ఇలా కొన్ని ర‌కాలైన మాన‌సిక శారీర‌క ఒత్తిడుల‌ను త‌ట్టుకొని ఉద్యోగినిగా స్త్రీ నిల‌బ‌డాలంటే క‌ష్ట‌త‌ర‌మైపోతోంది. ఉద్యోగినులంద‌రికీ ఉద్యోగం చెయ్యకుండా హాయిగా ఇంట్లోకూర్చునే ఇల్లాళ్ళ‌ని చూస్తూంటే ఎంతో జెల‌సీగా ఉంటోంది. స్వెట్ట‌ర్లు అల్లుకుంటూ వార‌ప‌త్రిక‌లు చ‌దువుకుంటూ ఇంటిని శుభ్రంగా తీర్చిదిద్దుకుంటూ పిల్ల‌ల‌కోసం పిండివంట‌లు చేసుకుంటూ వుంటార‌ని వాళ్ళ‌ని చూసి మేం కుళ్ళు కుంటాం. మా పిల్ల‌ల్ని చూస్తూంటే మాకే ఏడుపొస్తుంది వాళ్ళ‌కి మేం చేస్తున్నాం ?  త‌ల్లి అనే చ‌క్క‌ని ప‌దానికి త‌గినంత‌  న్యాయం చెయ్య‌లేక పోతున్నాం ఆఫీసులో చచ్చినంత ప‌ని చేసి ఇంటికి వ‌చ్చి ఏదో భోజ‌నం లాంటిది చేసి మ‌ళ్ళీ పొద్దున్నే ఆఫీసుకు ప‌రుగు. ఇంత చేసినా మళ్ళీ పురుషుడికి ఆనందం క‌ల్గించ‌డంవాళ్ళ‌ని సంతృప్తి ప‌ర‌చ‌డం కార్యేషు దాసీ అంటూ అన్ని ర‌కాలుగా సేవ‌లు చెయ్య‌డం ఎటూ త‌ప్ప‌దు క‌దా ! ఇటు చూడు నాకు న‌ల‌భై ఏళ్లు కూడా నిండ‌లేదు క‌దా ! నేను అర‌వై ఏళ్ళ దాన్నిలా క‌న్పిస్తున్నానా లేదా ఈ విష‌న్ చేత ఓవ‌ర్ వ‌ర్క్ చేయించేస్తున్నాను. రొటీన్‌గా బండి న‌డుస్తోంది. ఎప్పుడో త‌ప్పున మూల‌ప‌డుతుంది. అప్పుడు చూసే వాళ్ళుండ‌రు. ఎవ‌రిదారిన‌వాళ్ళు అంద‌రూ త‌లో మూల‌కి ప‌రుగు.ఈ ప‌రుగు ఎక్క‌డికి ఎందుకు ?  ఏం సాధించ‌డానికి ఒక్క క్ష‌ణం వెనుదిరిగి ఆలోచించ‌డానికి టైం లేకుండా ఎమిటీ ఈ బిజీ లైఫ్ అన్పిస్తుంది. ఇప్పుడు మ‌నిషి ప్రాణ‌మే అన్నిటిక‌న్నా విలువ త‌క్కువైపోయిందేమో జ‌బ్బుపడ్డావ‌చ్చి పోయినా  ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతెందుకు స్వ‌యంగా తోబుట్టువులు పోయినా కంట‌త‌డి పెట్టేందుకు టైం లేకుండా పోతుందంటే నిజంగా అతిశ‌యోక్తేంకాదు. ఆమె క‌ళ్ళ‌వెంట క‌న్నీరు ఆమెలో ఎంతో వేద‌న ఒక్క‌సారిగా ఉబికి వచ్చింది.

డ‌బ్బు సంపాదించ‌కపోతే ఆర్థిక‌స్వాతంత్ర్యంలేదు. మ‌నుగ‌డ‌కు హామీలేదు. దాసీ క‌న్నా బానిస‌క‌న్నా మ‌రీ క‌నాక‌ష్ట‌మైన బ్ర‌తుకు నీడ్వాల్సిందే. ఉద్యోగం చేసి సంపాయించుకుని హాయిగా బ్ర‌తుకుదామంటే ఈ జీవితంలో క‌ష్టాలు మ‌రీ ఎక్కువైపోతున్నాయి. ఏమిటో ఈ ఆడ‌బ్ర‌తుకు, ఆడ‌దైపుట్టేక‌న్నా అడ‌విలో మానై పుట్ట‌డం మేల‌నే సామెత నిత్య‌నూత‌నంగా ఉంది క‌దా అని ఆమె వాపోయింది.

అత్త‌య్యా నాకు ధైర్యం చెప్పాల‌ని మ‌రీ భూత‌ద్దంలోంచి చూపించ‌కు. నేను కూడా ఉద్యోగినుల‌ను చూస్తూనే ఉన్నాను అంది స్వ‌ప్న‌. మీ అత్త‌య్య మాట‌లు నూటికి నూరుపాళ్ళూ నిజాలేకానీ స‌మ‌స్య‌లువ‌స్తాయి క‌దా అని ముందే ప్ర‌య‌త్నం చెయ్య‌కుండా మాన‌టం ఉత్త‌మ‌ల‌క్ష‌ణం కాదు.  నువ్వు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వు త‌ప్ప‌కుండా సెల‌క్ట్ అవుతావు అని ధైర్యం చెప్పి ఇంటికి వ‌చ్చేశాను.