19
 

 

స‌భ‌లు  -  స‌మావేశాలు

ఇటీవ‌ల హైదరాబాదులో జ‌రుగుతున్న స్త్రీ మేళాకి ఆహ్వానం వ‌చ్చింది. అందులో చాలామంది ప్ర‌ముఖులు అనేకానేక రాష్ట్రాల‌నుండి వ‌చ్చి వారివారి అభిప్రాయాల‌ను చెప్తార‌ట‌. నాకు తెల్సిన వాళ్ళంద‌రినీ అడిగాను స్త్రీ మేళాకి వ‌స్తారా ?  అని చాలామంది న‌వ్వారు. ఇదేం మేళ మండీ అంటూ. మేళం అనేది తెలుగు వారికి కొంచెం హాస్యం పుట్టించే మాటే. కానీ ఋణ‌మేళా, శిశుమేళా, స్త్రీ మేళా, అన్న ప‌దాలు ఉత్త‌రాది వారికి న్వు తెప్పించ‌వు.

ఆ ! అక్క‌డ ఏమేమీ ఉంటాయో ఇక్క‌డ నేను చెప్ప‌గ‌ల‌ను అబ‌ద్ద‌మ‌యితే అయిదు రూపాయు పుచ్చుకుంటాను. అన్నాడు మా త‌మ్ముడు ఇచ్చుకుంటాడు అన‌కుండా మా అన్న‌య్య నీతెలివి నా ద‌గ్గ‌ర‌కాదు అని పాప బ‌ల‌వంతం పెట్టింది. అయితే చెప్పు అక్క‌డ ఏం ఉంటాయి.

వాడు కొంత‌సేపు ఆలోచించాడు. ఆ, అప్ప‌డాలూ, వ‌డియాలూ, చెగోడీలూ, జంతిక‌లూ ఇవి త‌ప్ప ఆడ మ‌ళ‌యాళం  ఇంకేం చేస్తుందీ అన్నాడు నవ్వుతూ ఓరి వెధ‌వానీ వేలెడంత లేవు నీకూ మేం లోక‌వ‌య్యాముట్రా అని మెత్త‌గా ఓ మెట్టికాయ వేశాను. అక్క‌య్యోయ్ మ‌రీ వైర్ బుట్ట‌లూ పూస‌ల‌తో అల్లిన బొమ్మ‌లూ కూడా వుంటాయేవ్‌....అన్నాడు. పిండి రుబ్బ‌డం ఎలా ?  పిల్ల‌ల్ని క‌ని పెంచ‌డం ఎలా అన్న‌ది కూడా మీ స్త్రీ మేళాలో ముఖ్య స‌మ‌స్య‌గా చిత్రీక‌రిస్తారండోయ్ అని మా మ‌గ‌రాయుడు ఉవాచ‌. అవును. మా స్త్రీమేళానే. నువ్వు స్త్రీవి కావ‌ని నువ్వే ఒప్పుకున్నావ్‌గా సుంద‌రీ అన్నాడు. స్త్రీనో కానో గాని ఇలాంటి మేళాల‌కి మాత్రంరాను. ఇది ఉత్త‌షో అంది. షో కాదు. ఢిల్లినుంచి కూడా ఎంద‌రో పెద్దలు వ‌చ్చారు. వ‌స్తే వ‌చ్చారు కాని ఇది ఓట్లు దండుకోడానికి ప్లానే బుల్లెమా అంది సుంద‌రి.

మ‌ర్నాఉ మా సుంద‌రి వ‌చ్చి అక్క‌డ ప‌చ్చిమిర‌ప‌కాయ బ‌జ్జీలు అయిస్‌క్రీములూ క‌డా అమ్ముతున్నార‌నే వార్త మోసుకొచ్చింది. మా మ‌గ‌రాయుడు మ‌రీ కుండ‌ప‌గ‌ల‌గొట్టిన‌ట్లుగా మాట్లాడుతుంది. చీర‌ల కోసం అయితే త‌ప్ప‌కుండా వెళ్ళండి. అక్క‌డ మంచి మంచి డిజైన్ల‌తో గాజులు కూడా ఉన్నాయ‌ట‌. పాపా నువ్వు కొనుక్కోవే నీకు గాజుల పిచ్చిగ‌దా !  అంటూ ఆడ‌వాళ్ళ‌కి కావ‌ల్సింది చీరెలూ గాజ‌లూ మాత్ర‌మే అన్న‌ట్లుగా ఫోజుపెట్టింది.

పేప‌ర్లో రోజూ స్త్రీ మేళాలో ఏం జ‌రుగుతుందో వార్తలు వ‌స్తూనే ఉన్నాయి. మొత్తం ప‌దిహేను రోజుల‌ట‌. నాకు సాయం ఎవ్వ‌రూ రావటంలేదు. వెళ్ళాల‌ని రోజూ అనుకుంటున్నాను. మా తమ్ముడ్ని అడిగితే బాబోయ్  న‌న్ను స్త్రీని చేసేయ్య‌కు అన్నాడు. అక్క‌డికి వెళ్ళేస‌రికి మ‌గ‌పిల్లాడు కాస్తా ఆడ‌పిల్ల అయిపోడు ర‌మ్మ‌ని బ్ర‌తిమాలాను అయినా విన్పించుకోలేదు.

నాగోల‌ప‌డ‌లేక మా శ్రీ‌వారే తీసికెళ్ళారు. అక్క‌డ్నించి చీక‌టి ప‌డితే ఆడ‌వాళ్ళు ఒక్క‌ళ్ళూ రాకూడ‌దు. ఆటోల‌వాళ్ళు మోసం చేస్తారు అని భ‌యం. బ‌య‌లుదేరానే గాని నా గురించి మా వారిని ఇబ్బంది పెడుతున్నాను. స్త్రీ మేళాకి మ‌గాడు వ‌చ్చాడ‌ని అంతా న‌వ్వుతారేమోన‌ని ఒక‌టే ఆలోచ‌న‌. ఏం ఫ‌ర్వాలేదు ఇవ్వాళ వ‌క్త‌ల్లో ఒక పురుషుడు కూడా ఉన్నాడు. అన్నారు.

 లోప‌లికి ప్ర‌వేశించాక మామూలు ఎగ్జిబిష‌న్‌లో ఉన్న‌ట్లే ర‌క‌ర‌కాల స్టాల్సు క‌న్పించాయి. మా పని మ‌నిషి అచ్చ‌మ్మ చెప్పిన మాట‌లు గుర్తుకొచ్చింది. బాస‌న్లుతోమేందుకు మంచి పొగ‌డ్రు అమ్ముతున్నార‌ట కొనుక్కురా అమ్మా అని.

మ‌ల్లాది సుబ్బ‌మ్మ‌గారి ర‌చ‌న‌లు ఉన్న స్టాలులోకి వెళ్ళాను. డిస్కౌంటు కూడా ఉంది. ఒక పుస్త‌కం వెళ్ళెట‌ప్పుడు కొనుక్కెళ్దామ‌నుకుని ముందుకే న‌డిచాను. మా తమ్ముడు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజ‌మే. అయిదు రూపాయ‌లు ఇచ్చుకోవాల్సిందే.

తీర స‌భ జ‌రిగేచోట‌కి వ‌చ్చాం. మేము కాక మ‌రి న‌ల్గురు మాత్ర‌మే ఉన్నారు. ఒక నిముషం త‌రువాత ఆ న‌ల్గురూ స్టేజి ఎక్కేసి మ‌మ్మ‌ల్ని ఎక్కువ బాధ పెట్ట‌కుండా ఇర‌వై నిముషాల్లో అయిపోయింద‌నిపిస్తున్నారు. ఇంత‌లో టి.వి. వాళ్ళు వ‌చ్చేస‌ర‌కి స్టాల్సు ద‌గ్గ‌ర ఉన్న జనంవ‌చ్చి కుర్చీల్లో కూర్చున్నారు. అందులో ఒక వ‌క్త స్త్రీ స‌భ‌ల‌కి స్త్రీల‌కంటే పురుషులే ఎక్కువ వ‌స్తార‌ని చెప్పంది. క్ర‌మ‌క్ర‌మంగా మా వారికి సాయంగా కొంద‌రు మ‌గాళ్ళు వ‌చ్చేస‌రికి బెరుకు తీరి  ద‌ర్జాగా కూర్చున్నారు.

నిజ‌మే స్త్రీ స‌భ‌లకి స్త్రీలెందుకురారు. ఆలోచించండి ఎలా అయితే వ‌స్తారో అలా చేసి ఆక‌ర్షించాల్సిన అవ‌స‌రం నిర్వాహ‌కుల‌కి లేదా ?  ఒక‌టి రెండు రోజుల‌యితే వ‌స్తారుగాని ప‌దిహేనురోజులు సాగ‌దీస్తే ఎలా ?... ఇదీ మా ముందు వారి వ్యాఖ్యానం. నిజానికి ఈనాడు ప్ర‌జ‌ల‌కు ఎవ‌రు ఏం చెప్తారో ముందే తెలుసు !  గాంధీగారే వ‌చ్చినా లారీల్లో జనాన్ని తీసికెళ్ళాలేత‌ప్ప వారంత‌ట వారు రారు. అంతగా తెలివి మీరిపోయారు.