20
 

స్త్రీలు  -   క‌ళ‌లు

 

త్యాగ‌రాజు ఆరాధ‌నోత్స‌వాలు జ‌రుగుతున్నాయి. రేడియోలో చ‌క్క‌ని ప్రోగ్రాములు పెట్టారు. స‌భ‌ల్లో సామూహిక గాన క‌ళారాధ‌న‌లు చాలా చోట్ల జ‌రిగాయి. మా ఫ్రెండ్సంద‌ర‌మూ ఒక స‌భ‌లో క‌ల్సుకున్నప్పుడు క‌ళాకారుల‌ను గురించి చ‌ర్చించుకుంటున్నాము.

ఒకామె న‌వ్వుతూ ఇలా అంది వీళ్ళిద్ద‌రూ మ‌ళ్ళీ క‌ల్సుకున్నట్లున్నారే అని మోచేత్తో న‌న్ను పొడిచింది. ఎవ‌రిద్ద‌రూ ?  తెల్ల‌బోతూ అడిగాను. స్టేజీమీద ఉన్న ఇద్దిరివైపు చూపించింది. ఏం ఎప్పుడూ క‌లిసే పాడ‌తారుగా !  అన్నాను. ఈ మ‌ధ్య విడిపోయారులే అంది. నీకేం తెలీదు ఉత్త‌మొద్దువి అన్న‌ట్లు నన్ను చూస్తూ.

అత‌డూ ఆమె ఇద్ద‌రూ అర్టిస్టులు. ఆర్గ‌నైజ‌ర్స్ ఇద్ద‌ర్నీ పిలిస్తే ఇద్ద‌రూ వెడ‌తారు. ఒక్క‌ర్ని పిలిస్తే ఒక్క‌రే వెడ‌తారు. ఇందులో క‌ల‌వ‌డానికి విడిపోడానికి వాళ్ళేమైనా భార్యాభ‌ర్త‌లా ?  అంది మాల‌లిత‌. ఓసే ప‌ల్లెటూరి గ‌బ్బిలాయీ మా బ‌స్తీ గోల నీకేం తెలుసే అంది స‌రోజ‌. త‌ల్లీ నువ్వేం చెప్ప‌ద‌ల్చుకున్న‌వాఓ నాకు తెలుసు వాళ్ళిద్ద‌రికీ ఏదో సంబంధం ఉంద‌నీ, మ‌ధ్య‌లో అభిప్రాయ భేదాలు వ‌చ్చి వ‌డిపోయార‌నీ ఇప్పుడు మ‌ళ్ళీ క‌లిసారనీ... అంతేనా అంది ల‌లిత‌.

అంతే అయ్యుంటుంది అన్నాన్నేను. ఇంతోటి దానికి ప‌ల్లెటూరు గ‌బ్బిలాయి లెందుకూ బ‌స్తీబ‌డాయి లెందుకు ?  ఈ స్త్రీ పురుష సంబంధానికి ప‌ల్లెటూరు బ‌స్తీ అనే భేదం ఏం ఉండ‌దు. అమాట‌కొస్తే ఏ ప‌ట్టింపులూ ఉండ‌వు. అంద‌మూ, డ‌బ్బూ మొద‌లైన విచ‌క్ష‌ణా ఉండ‌దు. పేదాగొప్పా తార‌త‌మ్య‌మూ ఉండ‌దు. నిజానికి స‌ర్వ స‌మాన‌త్వం ఈ ఒక్క విష‌యంలోనే అమ‌లు జ‌రుగుతోంద‌నుకుంటాను అంది ఆవేశంగా. అవును మ‌రి దీన్ని గ‌బ్బిలాయి అంటే ఆమాత్రం కోపం రావ‌డం స‌హ‌జ‌మే ! ఈలోగా గాన‌ప్రియులంతా మావైపు ఆగ్ర‌హంగా చూస్తూండ‌టంతో మెల్ల‌గా బైటికి వ‌చ్చేసాము. మా స‌రోజ ఆ పాడే ఆమెని గురించి చాలాహీనంగా మాట్లాడుతోంది. ఆమెని కూడా పాట‌క‌చ్చేరీకి పిల‌వ‌క‌పోతే అత‌డు పాడ‌డుట‌. రేడియోలో గాని టి.విలోగాని ఆమె ప‌క్క‌నుండాల్సిందేట‌. ఓసారి సోలో అంటే అత‌డు ఒక్క‌డే టి.వి లో పాడాల్సి వ‌చ్చిన‌పుడు అత‌ను ఆమెను ప‌క్క‌నే కూర్చోపెట్టుకుని తంబురా వాయించేలా ఆరేంజ్ చేసుకున్నాడుట‌. మ‌గవాడు ఎన్ని వెధ‌వ వేషాల‌యినా వెయ్య‌చ్చు ఆడదానికి బుద్ధుండ‌ద్దూ. అని ఆమె మీద విరుచుకుప‌డింది. అంతీ వాళ్ళిద్ద‌ర్నీ స్టేజీ మీద చూడ‌ట‌మేనా వ్య‌క్తిగ‌తంగా మీకు ప‌రిచ‌యం ఉందా అంది మా హేమ కోపంతో. మీ క‌ళ్ళ‌తో మీరు చూడందే ఎలాంటి వ్యాఖ్యానాలూ చెయ్య‌కూడ‌ద‌ని మీకు తెలీదా ?   అంది మళ్ళీ త‌నే. ఉష్ చిన్న‌పిల్ల‌వి నువ్వు మాట్లాడ‌కు. అని హేమ‌ను వారించ‌బోయాను. కాని హేమ విన‌లేదు. ఇలాంటి వెద‌వ మాటు మూలంగానే మా ఫ్రెండ్ ర‌జ‌ని చ‌నిపోయింద‌ని మీకు తెలుసా అంటీ !  అంది. చూడు హేమా ప్ర‌తివిష‌యానికి సాక్ష్యాలూ ఆధారాలు ఉండ‌వు. నిప్పులేందే పొగ‌పుట్ట‌దు క‌దా !

అందుక న‌లుగురూ అనుకునే దాన్లో నిజంలేకుండా ఉండ‌దు అంది స‌రోజ‌. ఇద్ద‌రూ తారాస్థాయికి గొంతును పెంచారు. రోడ్డుమీద వెళ్ళే అంద‌రూ ఆగి మా వైపు చూడ్డం మొద‌లుపెట్టేస‌రికి మెల్ల‌గా ఎవ‌రిళ్ళ‌కు వారం చేరుకున్నాం. ఇంటికి వెళ్ళినా ఈ వాదంలోని అంశాలు నా ఆలోచ‌న‌లోంచి త‌ప్పుకోలేదు. ర‌జ‌ని ఎలా చ‌నిపోయిందీ గుర్తుకు వ‌చ్చింది. ర‌జ‌ని పాడితే తేనెలు కురుస్తాయి మ‌ల్లెపూల సువాస‌న‌లు గుబాళిస్తాయి. వెన్నెల వాగులా ప్ర‌వ‌హిస్తుంది. ఇంత చ‌క్క‌ని గొంతురావ‌డానికి ఆమె ఎన్ని జ‌న్మ‌లు త‌ప‌స్సు చేసుకుందో అని నేను ఎన్నో సార్లు అనుకున్నాను. ఆమె గొంతువిని కానీ క‌ట్నం లేకుండా ఓ ఆఫీస‌రు పెళ్ళిచేసుకున్నాడు. మొద‌ట్లో మా ఆవిడ సంగీతం బాగా పాడ్తుంద‌ని అడిగిన వారికీ ఆడ‌గ‌ని వారికీ గ‌ర్వంగా చెప్పుకున్నాడు. ఆమెపాట రేడియోలోన‌లో టి.విలోనో వ‌స్తుంటే ఆఫీసంతా టాంటాం  చేసేవాడు. త‌రువాత ఏంగురూ ఆమె ఫ‌లానావాడి మ్యూజిక్ డైర‌క్ష‌న్ లో పాడుతుందేమిటి ?  అని ఎవ‌డో కుసంస్కారి అడిగేస‌రికి ఇత‌నిలో అనుమాన‌పు పిశాచం ప్ర‌వేశించింది. ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో ర‌జ‌నిని వేధించేవాడు. ఆమెకు తెలియ‌కుండా ఆమె ఎక్క‌డికి వెడుతోందో అని వెంట‌వెళ్ళ‌డం సూటిపోటి మాట‌ల‌న‌డం చేసేవాడు. దీంతో ర‌జ‌ని పాడ‌టం మానుకుంది. ఆ డైర‌క్ట‌ర్‌కి ర‌జ‌నిపాట అంటే ఇష్టం. ఎందుకు మానేశావ‌మ్మా అని అడ‌గానికి ఇంటికి వ‌చ్చాడు. ఆమె భ‌ర్త‌కు కూడా ర‌జ‌ని గాయనిగా పైకి వ‌స్తుందో న‌చ్చ‌చెప్ప‌బోయాడు. త‌న‌కు తెలిసిన సినిమా డైర‌క్ట‌రుకు ర‌జ‌నిని గురించి చెప్పాన‌ని కూడా చెప్పాడు. ఆ రాత్రి ఆమెత‌న‌డు దుర్భాష‌ల‌తో వేధించాడు. త‌గ‌కూడ‌ని చోట ర‌జ‌ని హృద‌యంలో పెద్ద దెబ్బ త‌గిలింది. త‌ట్టుకోలేక పిచ్చిపిల్ల త‌నువు చాలించుకుంది.

ఒక్క ర‌జనికే ఏమిటి క‌ళాకారిణియైన ఏ స్త్రీకైనా ఇలాంటి ఇబ్బంది ఎప్పుడో క‌ప్పుడు రాక‌త‌ప్ప‌దు. కొంద‌రు ధూర్తులు మిమ్మ‌ల్ని పైకి తీసుకువ‌స్తామ‌ని మోసం చేసిన సంఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాఏరకంగానైనా మాన‌సికంగా శారీర‌కంగా న‌ష్ట‌పోయేది పోతోందీ పోబోతున్న‌దీ స్త్రీనే. పిల్ల‌ల్ని  ల‌లిత‌క‌ళల్లో జేర్పించ‌వ‌ద్దు అని  ఇలా దెబ్బ‌తిన్న ఓ ఆత్మీయురాలు మాకు స‌ల‌హా చెప్పిందంటే స‌మాజంలో ల‌లితక‌ళాపీఠంలో స్త్రీల కెలాంటి గౌర‌వం ల‌భిస్తోందో తెలియ‌క‌పోదు. పాట‌ల సంగ‌తి అలా ఉంటే ఒక నాట‌కాల సంగ‌తి మ‌రీ క‌నీక‌ష్టంగా ఉంది. అవ‌ర‌స‌ర‌మైన దానికి అన‌వ‌స‌ర‌మైన దానికీ స్త్రీ పురుషులు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా రావ‌డం ఏదో బ‌ల‌హీన‌మైన క్ష‌ణాల్లో ప్ర‌కృతికి లోబ‌డి పోవ‌డం. ఆ తరువాత మ‌గ‌వాడు మ‌హార‌జులా ఠీవిగా స‌మాజంలో చెలామ‌ణ‌ఙ అయిపోతే, ఆమెను చూచి మాత్రం వెన‌క న‌వ్వ‌క‌మాన‌రు. చిన్న చూపు చూడ‌కమాన‌రు. ఇలా అని టాలెంట్ ఉన్న వాళ్ళ‌ని నిరుత్సాహ ప‌ర‌చ‌కూడ‌దు. చిన్న పిల్ల‌లైతే ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. గోతికాడి న‌క్క‌ల్లాంటి కుక్క బుద్ధులున్న కుసంస్కారుల‌కి దూరంగా మ‌స‌లుకోవాలి. అథ‌వా ఎవ‌రికైనా  ఇలాంటి చెడ్డ‌పేరు వ‌చ్చినా ధైర్యంగా నిల‌బడి స‌మాధానం చెప్ప‌గ‌ల‌గాలి కాని కృంగిపోకూడ‌దు.

నిజాయితీ ఎప్ప‌టికైనా గుర్తింప‌బ‌డ‌క మాన‌దు. ఇప్పుడు సంగీతం నాట్యం చిత్ర‌క‌ళ‌వంటి వాటిలో బి.ఏ. చ‌దువుకోవ‌చ్చు. అభిలాష ఉండేవారు చ‌క్క‌గా నిష్ఠాతుల‌వడంలో శిక్ష‌ణ‌ను పొంద‌డ‌మే గాకుండా త‌మ‌నుతాము ర‌క్షించుకోడంలో కూడా కొంత ముందు చూపును అల‌ప‌ర‌చ‌కోడం మంచిది.