21
 

విర‌గ‌బాటు

 

త‌న‌కి రావ‌ల‌సిన హక్కుల‌క‌న్న త‌ను నెర‌వేర్చ‌వ‌ల‌సిన బాధ్య‌త‌ల‌పై దృష్టి నిల‌పాలి స్త్రీ. ఇలా అన్న‌ది ఏ ఛాంద‌స‌వాడో, ఏ స‌నాత‌న సంప్ర‌దాయ ఆచార రాయ‌ణుడోకాదు. స్త్రీల స్వేచ్ఛావ‌ర్త‌న‌కీ విశృంఖ‌ల ప్ర‌ణ‌య‌వాదానికి త‌న శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించి అందుకు అనువైన సాహిత్యాన్నే సృష్టించి గుడిపాటి వెంక‌టాచ‌లం !
ధ‌ర్మ‌బ‌ద్ధంగా క‌ట్టుకున్న భ‌ర్త‌తోటి సంసారం న‌చ్చ‌క‌పోతే త‌నకిన‌చ్చిన ఏ మ‌గాడితోనైనా స‌రే వెళ్ళిపోయి సుఖం సంపాదించుకోమ‌ని ప్రోత్స‌మించే ర‌చ‌న‌లు చేసిన మైదాన కార‌కుడికి త‌న స్వేచ్ఛా వాదంలో ఏదో తిర‌కాసుఉన్న‌ట్లు గోచ‌రించింది. క‌థ‌లోకాకుండా నిజ‌జీవితంలోనే ఆధునిక యువ‌తి వెర్రిపోక‌డ‌ల‌తో అలంక‌రించుకుని ఇష్టంవ‌చ్చిన‌ట్లుగా ఒక వ‌ర‌సావ‌యీ లేకుండా సంచరించ‌డం త‌న‌క‌ళ్లారా చూసిన చ‌లం ఖంగుతిన్నాడు.

అందుకే త‌న‌లోని మార్పును ఆపై వాక్యంద్వారా వ్య‌క్తంచేశాడు. నిజ‌మే ఆయ‌న చ‌లం ! అందుకే మార్పు ! ఆ చ‌లం కాదుక‌దా ! తాను కోరుకున్న‌ట్లే వివాహానికి వ్య‌వ‌స్థ అంత‌కుముందున్న కొన్ని ధ‌ర్మాలు పోయాయి. దాని స్థానే సంఘాన్నిపురోగ‌మ‌న పథానికి తీసుకువెళ్ళ‌గ‌ల నూత్న మార్గం ఏం క‌న్పించ‌టంలేదు. అందుకే తెగిన గాలిప‌టానికి స్వేచ్ఛ ఉంటే ఎంత లేకుంటే ఎంత ఏముళ్ళ‌పొద‌ల్లోనో చిక్కుకుపోవ‌ల్సిందే క‌దా ! పూర్వం పెళ్ళి ధ‌ర్మార్థ‌మోక్ష సాధ‌న‌కు ఆలంబ‌నం ఎన్నో జ‌న్మ‌ల బంధం. ఇప్పుడు ఒక ఒప్పందం, ఒక స‌ర్దుబాటు, ఒక కాల‌క్షేపం ఒక నాట‌కం, ఇలా చ‌లం వ్య‌ధ‌చెండాడ‌ని చాలామందికి తెలీదు.

భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ ఒప్పుకుంటే పెళ్ళి ర‌ద్దుచేసుకోవ‌చ్చు.విడాకులు తీసుకున్న స్త్రీ పురుషులు త‌మ‌కిష్ట‌మైన మ‌రో పెళ్ళితో త‌మ జీవితాన్ని ముడేసుకోవ‌చ్చు. కాని పిల్ల‌ల సంగ‌తి ఏమిటి ?  ఎంద‌రో ధ‌ర్మాలూ నీతులూ న్యాయాలు న‌శించిపోతున్నా యా అని గోల పెడ్తున్నా ఒక్క నీతి మాత్రం ఆశాతార‌కంగా మెరుస్తూనే ఉంది. అవినీతి ధ్రువ‌తార‌గా వెలుగుతూనేఉంది. అదే మాతృత్వం. పురుషుడు త‌న‌కు స్త్రీగాని బిడ్డలుగాని అక్క‌ర్లేద‌ని పోయినా స్త్రీలు విడిచిపెట్టిపోవ‌డంలేదు. బిడ్డ‌ల‌పై ప్రేమ‌కూ మ‌మ‌కారానికి వాత్స‌ల్యానికి స్త్రీ హృద‌యం సంపూర్ణంగా విక‌సిత‌మ‌య్యే ఉంది. అమృత‌ధార‌ల‌ను కురిపిస్తూనే ఉంది. కాని స్వేచ్ఛాపేరుతో విరగ‌బ‌డిబోతున్న యువ‌తను ర‌వ్వంత ఆప‌గ‌ల‌శ‌క్తి ఏ ర‌చయిత‌కి ఉంది ?  యువ‌త‌లో చోటుచేసుకుంటున్న అసంతృప్తి, ఏదోకావాల‌న్న త‌ప‌నా ఏమీ సాధించ‌లేమోన‌న్న నిస్పృహ‌, నిస్స‌హాయ‌తా వీట‌న్నింటినీ ఒక్క చిరున‌వ్వుతో పార‌ద్రోల‌గ‌ల మ‌హాత్ములు ఎక్క‌డున్నారు ?  ఆశ‌య‌వాదులు కుప్ప‌లు తిప్ప‌లుగా పెరిగి పోతూ ఆద‌ర్శ‌వాదుల‌ను సైతం న‌గుబాట్ల పాలు చేయ‌గ‌లిగిన నాగ‌రిక‌త మ‌న‌దేశానికి ఎక్కడ్నించి దాపురించింది ?  యువ‌కుల హృద‌యాల్లో నిర్బ‌ర‌తాపాన్ని ర‌గిలించే హింసాత్మ‌క‌మైన చిత్రాలూ న‌వ‌ల‌లే నేటి దౌర్భాగ్యానికి హేతువ‌ని మా శాంతిని చూస్తుంటే అనిపిస్తోంది. ఆది అవ‌స‌ర‌మైన ఆవేశంతో దాని బ్ర‌తుకును అదే నాశ‌నం చేసుకుంది. శాంత పేరుకేగాని అది వుత్తి ఫైర‌బ్రాండ్ దాని ఉచ్ఛ్వాస  నిశ్వాసాల్లో తిరుగుబాటు అనే అగ్నిమంట‌లు భుగ‌భుగ‌లు క‌క్కుతాయి. ఎంత ధైర్య‌స్థురాలు. అంత‌టి శాంత జీవిత‌ము కుక్క‌లు చింపిన విస్త‌ర‌యింది. న‌న్ను చూడ‌గానే ఒక క‌న్నీటి బొట్టు రాల్చింది. అదీ చాలావేడిగా సెగ‌లు క‌క్కుతూనేఉంది. ఏమిటీ ఈ  దుర్గ‌తి. అని నా గుండె అవిసిపోయింది. ఛీ పిరికి దానిలా నన్ను చూసి ఏడ‌వ‌కు.

నువ్వు శాంత ఫ్రెండ్‌ని న‌న్ను గురించి నీకెవ‌రో చెడుగా చెప్పారు. నేను రాజాలా బ్ర‌తుకుతున్నాను అంది. అవును నీ ఆరోగ్యం పూర్తిగా పాడ‌యింద‌ట మందులు వాడినా త‌గ్గ‌ని జ‌బ్బులు అంటించుకున్నావుట న‌న్ను పూర్తిగా మాట్లాడ‌నీయ‌కుండా ప‌గ‌ల‌బ‌డిన‌వ్వింది.

ఎన్నాళ్ళు బ్ర‌తికితే ఏం వుంది. మ‌డిక‌ట్టుకుని ఉన్నా వ‌చ్చే జ‌బ్బులు ఎలాగూ వ‌స్తాయి ?   కాని నేను మ‌గ‌జాతిమీద క‌సితీర్చుకునేందుకు ఇంత‌క‌న్నా మంచి అవ‌కాశంలేదు. నేను క్రీగంట చూశానంటే కుక్క‌ల్లా  నా వెంట‌ప‌డ‌తారు...అంటూ ఎంతో అస‌భ్యంగా మాట్లాడింది. ఇలాంటి శాంత‌ల‌ను ఎంత మందిని చూసి ఆ మాట రాశాడో  చ‌లం అనుకున్నాను.

అయ్యో శాంతా అని నేను దానికోసం ఎంతో వేద‌న‌చెందాను. అది ఎంతోమంచి పిల్ల‌! ఏదో చెయ్యాల‌నే త‌ప‌న ! ఎందుకో తిరుగుబాటు చెయ్యాల‌నే వేడి ! ఏమిటో ఎందుకో తెలీని ఈ ఆవేశంతో దాని జీవితాన్ని అది నాశ‌నం చేసుకుంది. ఓ గ‌మ్యం ఓ ఆశ‌యంలేకుండా వేడివేడి ఉప‌న్యాసాలిస్తూ తిరిగిన శాంత ఈ ర‌కంగా ఎందుకైపోయిందా అని ఆలోచిస్తే నాక ఒక్క‌టే తోస్తుంది. శాంత నిల‌క‌డ‌గా ఆలోచించ‌దు. అంతా తొంద‌ర త‌న‌క తెల్సిందే రైట‌నే వితండ‌వాది. ఇంకోరు చెప్పింది చ‌చ్చినా విన్పించుకోదు. విన్పించుకుంటే గాని తిరుగుబాటు త‌త్వానికే అవ‌మానం ! ఇలా శాంత‌లా ఏదో చేస్తున్నామ‌నుకుని హ‌డావుడిగా అటూ ఇటూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి విర‌గ‌బడిపోయే యువ‌త‌లకు శాంత జీవితం ఒక చ‌క్క‌ని గుణ‌పాఠం కావాలి !  ఓ యువ‌తా ! ఒక్క క్ష‌ణం ఆగి నింపాదిగా వెన‌కాముందూ ఆలోచించండి మీకే తెలుస్తుంది. తిర‌గ‌బ‌డుతున్నారో విర‌గ‌బ‌డ్తున్నారో, ఓయువ‌తా జాగ్త‌త్త‌.